PHP-and-MySQL/C2/POST-Variable/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 10:49, 27 March 2017 by Yogananda.india (Talk | contribs)
Time | Narration |
00:00 | పోస్ట్ వేరియబుల్ పై స్పోకెన్ టుటోరియల్ కు మీకు స్వాగతం. నేనిక్కడ get.php పేజ్ లో ఉపయోగించిన కోడ్ నే వాడుతాను. గెట్ వేరియబుల్ టుటోరియల్ లో చేసినట్టుగా అన్నమాట. |
00:10 | మీరు ఇంతకు ముందు వాటిని చూడనట్లైతే , దయచేసి వాటిని చూసి తరువాత ఈ టుటోరియల్ ని చూడండి.. అప్పుడు మీకు ఈ కోడ్స్ గురించి అంతా తెలుస్తుంది. |
00:16 | ఒకవేళ , మీకు ఈ కోడ్స్ గురించి అంతా తెలిసుంటే, మీరు గెట్ ట్యుటోరియల్ ను ఇంకా చూడకుండా ఉంటే, ఇపుడు ఈ ట్యుటోరియల్ కి స్వాగతం. |
00:19 | మునుపటి లాగానే, నా గెట్పేజీ వచ్చింది. |
00:22 | post.php అనే కొత్త ఫైల్ నా వద్ద ఉంది. |
00:25 | నిజానికి నేను ఏం చేయాలనుకున్నానంటే, దీన్ని పోస్ట్ వేరియబుల్ లాగా మార్చాలనుకున్నాను.. |
00:34 | నేను దీన్ని సరళంగా మరియు తార్కికంగా చదివి, మార్చి చూపించదలచుకున్నాను. |
00:38 | మరియు దీన్ని, ఇక్కడ గెట్ కు బదులుగా పోస్ట్ అని పిలుస్తాము, ఇది పనిచేస్తుంది. |
00:44 | మీకు నా పోస్ట్ పేజి ని చూపిస్తాను. |
00:50 | ఇక్కడ యేమీ లేదు., ప్రశ్నార్థకము (question mark) కూడా లేదు. |
00:53 | నన్ను అలెక్స్ అని టైప్ చేసి, క్లిక్ చేయనివ్వండి. కానీ ఏమీ రాలేదు. |
00:59 | అందు చేతనే మీరు వేరే ఇతర ఫైల్ తో పని చెయ్యాలంటే, ముందు ఈ చర్యని మార్చాల్సిన అవసరం ఉందని గుర్తుంచుకోండి. |
01:06 | దీన్ని రెఫ్రెష్ చేద్దాం. |
01:12 | నేను అలెక్స్ ను చూస్తున్నాను. నన్నిక్కడ క్లిక్ చేసి హెలో అలెక్స్ చెప్పనివ్వండి. |
01:16 | తరువాత మనం post.php ఫాంట్ లో ఉన్నాము. మరియు ప్రశ్నార్థకము లేదు. |
01:20 | పని కాకుండా ఏదో ఆటంకం కలుగుతోంది. ఒక పోస్ట్ వేరియబుల్ లో నిలువ చేయబడింది. |
01:29 | కానీ, అది ఇద్దరు యూజర్స్ ను ఎందుకు చూపించడం లేదు |
01:34 | మనమొక పాస్ వర్డ్, చెబితే, ఇది చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని పాస్ వర్డ్ అని పిలుద్దాం. |
01:44 | ఇక్కడ, thanks for your passwordఅని చెప్పాక, మనం తిరిగి వెనక్కి వెళ్దాం |
01:58 | ఇపుడు, ఇక్కడ కనపడేదే పాస్ వర్డ్ ఫీల్డ్ అన్నమాట |
02:03 | నా పాస్ వర్డ్ ను 123 గా టైప్ చేసి, క్లిక్ చేస్తాను |
02:09 | అది, ఈ చర్యకు ధన్యవాదములు చెబుతుంది |
02:11 | అది నిల్వ చేయబడింది. కాబట్టి దాన్ని ఉపయోగించవచ్చు. నేను కావాలనుకుంటే దాన్ని వాడగలను. |
02:16 | నేను దాన్ని మార్చేయడం సబబుగా ఉంటుంది. |
02:24 | రిఫ్రెష్ చేసి సమాచారాన్ని తిరిగి పంపుదాం |
02:29 | 123, ఇక్కడ క్లిక్ చేయండి, అది కనబడుటలేదు. అందుచేత, |
02:38 | మీరు వీటిని ఒకసారి పరీక్షించాలి. తప్పులు చేయడం సులభం |
02:46 | 123 అని టైప్ చేస్తాను. ఇక్కడ క్లిక్ చేస్తాను, అది, thanks for your passwordఅని చెబుతుంది. అది నా పాస్ వర్డ్ ను అంగీకరించింది. |
02:52 | అది నా పాస్ వర్డ్ ను పోస్ట్ వేరియబుల్ లో నిల్వ ఉంచిందని ఋజువయ్యింది |
02:59 | కానీ, అది యూజర్ ను చూపించలేదు, అది సబబు గానే ఉంది |
03:01 | ఎందుకంటే, వీటిని బ్లాక్స్ గా కలిగి ఉండటంలో అర్ధం లేదు. ఇవి ఏ విధంగా చదవటానికి వీలుగా లేవు. |
03:07 | మరియు దీనిని కలిగి ఉండటంలో అర్ధం లేదు, ఎందుకంటే మీ పాస్ వర్డ్ ను అందరూ చదవగలరు. |
03:11 | మీ ఇంటర్నెట్ చరిత్ర లోనికి, అందరూ అతి సులభంగా చూడగలరు |
03:18 | మరియు చూడండి, మీరు మీ పాస్ వర్డ్ టైప్ చేసారు, కానీ దానితో మిగతా వారు మీ ఖాతాను వినియోగించవచ్చు |
03:23 | మీరు దీన్ని చూడవచ్చు. వీటిని ఫంక్షన్స్ కొరకు మరియు దీని ద్వారా పంపే మొత్తం కొరకు కూడా ఉపయోగించవచ్చును. |
03:29 | కాబట్టి, ఉదాహరణకు, ుంది. |
03:36 | కానీ, గెట్ వేరియబుల్ లో మీకు వంద అక్షరాల వరకు పరిమితి ఉంది. |
03:40 | అందుచేత, ఇది ఉపయోగకారి గా ఉంది. కానీ, మీరు విషయాలను అంచనా వేసేందుకు, అంటే కొన్ని విషయాలను క్రమీకరించేందుకు, ఈ గెట్ వేరియబుల్ ను ఉపయోగించవచ్చు. |
03:50 | మీ సమాచారం జారీ చేయబడడం చూడవచ్చు. |
03:56 | మౌలికంగా అదే పోస్ట్ వేరియబుల్ |
04:01 | ఫాం దాఖలు చేయడంలొ, దీన్ని బాగా ఉపయోగించవచ్చు. దీనితో ఈ ట్యుటోరియల్ చివరిభాగానికి వచ్చాం. |
04:06 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కొరకు, స్వరాన్నందిస్తున్నవారు, సునీత. వీక్షించినందుకు ధన్యవాదములు. |