PHP-and-MySQL/C2/Functions-Advanced/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 23:31, 26 March 2017 by Yogananda.india (Talk | contribs)
Time | Narration |
0:0 | అడ్వాన్స్డ్ ఫంక్షన్ మీద స్పోకెన్ టుటొరియల్ కు మీకు స్వాగతం. ఇక్కడ, ఒక చిన్న క్యాల్కులేటర్ ప్రోగ్రాంని ఎలా క్రియేట్ చేయాలో నేను మీకు చూపిస్తాను. |
0:04 | మనం చేయబోయే ఒక ఫంక్షన్ ఒక విలువను ఇన్పుట్ చేయడానికి అనుమతిస్తుంది. ఒక మేథమేటికల్ ఆపరేషన్ చేసిన తరువాత, దాన్నుంచి విలువను పొందండి. |
0:13 | సరె, మనం ఇంతకుముందు చేసిన లాంటి ఫంక్షన్ ని మళ్ళీ క్రియేట్ చేద్దాం, దానికోసం నేను క్యాల్కులేటర్ని వాడుతాను. |
0:19 | తరువాత నేను ముందుగా నా బ్లాక్ ను క్రియేట్ చేస్తాను. దాని లోపల నంబర్ 1”, నంబర్ 2 మరియు”ఆపరేటర్ అని టైప్ చేస్తాను. |
0:28 | ఇపుడు, ఇది ఒక సంఖ్యావిలువ. ఇది యూజర్-ఇన్పుట్ ను బట్టి, ఒక పూర్ణసంఖ్య లేదా దశాంశము గా ఉంటుంది. ఇది కూడా అలానే ఉంటుంది. ఈ స్ట్రింగ్ విలువ, కూడిక తీసివేత గుణకారము లేదా”భాగహారము లో ఒకటిగా ఉంటుంది. |
0:44 | ఇప్పుడు మన ఫంక్షన్ లోపల మన కోడ్ ని క్రియేట్ చేయాలి, నేనిప్పుడు ఒక స్విచ్ స్టేట్మెంట్ ని దీనిలోపల క్రియేట్ చేస్తాను. |
0:54 | నేను స్విచ్ అని వాసి, ఈ స్విచ్ షరతు లేదా స్విచ్ ఇన్పుట్ ను 'op' గా ఉంచుతాను. |
1:03 | నేను దీనికొరకు, ఒక బ్లాక్ ను క్రియేట్ చేస్తాను, దీన్ని చేయడానికి, కేస్ = ప్లస్ అని వ్రాస్తాను. |
1:14 | నేను నమ్ 1 కు సమానమయిన, టోటల్ అనే ఒక కొత్త వేరియబుల్ ను ఇన్పుట్ గా ఇక్కడ చూపించి ప్లస్ నమ్ 2 అని వ్రాస్తాను. |
1:28 | దీన్ని సెమికోలన్ తో వేరుచేస్తాను. ఇపుడు ఫంక్షన్ తో, స్విచ్ స్టేట్ మెంట్ ను కలిపి, దీనిని సులభంగా చేయవచ్చు. |
1:39 | అందుచేత, మీరు ఇతర స్టేట్ మెంట్స్ లోపల మరియు ఫంక్షన్స్ లోపల, వివిధ రకాలయిన విషయాలను ఉపయోగించవచ్చు. |
1:45 | కాబట్టి, నేను ప్లస్కొరకు ఒక కేస్ ను క్రియేట్ చేసాను. అందుచేత, ఇది యూజర్ పంపిణీ చేసిన ప్లస్ కు సమానమైనపుడు, నమ్ 1అనేది నమ్ 2 కు కలపబడుతుంది. |
1:57 | ఇపుడు మనం క్రింది వైపుకు వెళ్ళి, మైనస్ అనే ఇంకొక కేస్ ను క్రియేట్ చేద్దాం. నేను టోటల్ = నమ్ 1 అని టైప్ చేస్తాను. |
2:10 | మనం క్రిందికి వెళదాం. మీరు దాన్ని విచ్ఛిన్నం చేయండి |
2:16 | మనమిపుడు ఈ కోడ్ ను కాపీ చేద్దాం. |
2:20 | మనం, ఇక్కడ మల్టిప్లై అని వ్రాసి, ఇక్కడ డివైడ్ అని వ్రాసి, గుర్తును మార్చడాన్ని తప్పక చేద్దాం. |
2:27 | ఇపుడు, ఇక్కడేం జరుగుతోందో మీకు అర్థం కాకపోతే, ఇ-మెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి. ప్రతి ఒక్క గజిబిజిని, ఈ పధ్దతిలో పరిష్కరించుకోవచ్చని ఆశిస్తాను. |
2:36 | డీఫాల్ట్ గా మనం అన్ నోన్ ఆపరేటర్ ను ఎకొ చేయబోతున్నాము, ఓకే? |
2:45 | దీన్ని రన్ చేయనివ్వండి. తరువాత ఫంక్షన్ ను కాల్ చేద్దాం. |
2:50 | నేను కాల్కులేటర్ లేదా కాల్క్ అనే ఫంక్షన్ చేయబోతాను. ఇది ఇన్పుట్ గా, ఒక సంఖ్యను, తరువాత రెండవ సంఖ్యను, తరువాత ఒక ఆపరేటర్ అంటే ప్లస్, మైనస్ హెచ్చింపు, భాగింపులను తీసుకుంటుంది. |
2:58 | దీన్ని బహుశా నా మేథమేటికల్ ఆపరేటర్ - సారీ, నా అంకగణిత ట్యుటోరియల్ లో, మీరు చూసి ఉంటారు. |
3:14 | ఇప్పుడు, లోపల గల స్విచ్ స్టేట్ మెంట్, ఓపినితీసుకుంటుంది. ఎంటర్ చేసిన దానిని అది తీసుకుంటుంది. ఇప్పుడు అది ప్లస్ కు సమానమయితే, అది ఈ స్టేట్ మెంట్ కు మారుతుంది. ఇది వ్రాయడానికి సులభం మరియు సమర్థవంతము. |
3:32 | అది ప్లస్ కు సమానమయితే, మనం టోటల్ అనే కొత్త వేరియబుల్ ను క్రియేట్ చేద్దాం. |
3:39 | అది ఎంటర్ చేసిన మొదటి సంఖ్యకు సమానమవుతుంది, మరియు ఎంటర్ చేసిన రెండవ నంబర్ కు కూడబడుతుంది. |
3:45 | ఇక్కడ, ఇది మైనస్ అయితే, అపుడు, వేరియబుల్, టోటల్అవుతుంది. ఈ టోటల్‌ను, ప్లస్లేదా మైనస్ లకు, ఒకే ఒక్క సారి సెట్ చేయవచ్చు. కాబట్టి ఈ టోటల్ వేరియబుల్, నంబర్-1, నంబర్-2 గా ఉంటుంది. గుణకారము, భాగహారములకు కూడా ఇదే వర్తిస్తుంది. |
4:10 | ఇపుడు, ఇది ఏమీ చేయలేదు. దీనిని రిఫ్రెష్ చేయండి. మనం మన ఫంక్షన్ ను కాల్ చేయలేదు కనుక, ఇపుడు, మనం పేజ్ ను ఎంటర్ చేస్తే, అక్కడ ఖాళీ ఉంటుంది. |
4:20 | ఇపుడు మన ఫంక్షన్ ను కాల్ చేయుటకు, మీకు ముందే తెలిసిన విధంగా, మనం కాల్క్ అని వ్రాసి, దానిలో విలువలను ఉంచుదాం. |
4:25 | మనం దానికి రెండు నంబర్లను, అంటే 10 మరియు10 మరియు ప్లస్‌లను ఇద్దాం. ఓకే, అది 20 అయింది. ఇపుడు నేను రిఫ్రెష్ చేస్తే ఏమవుతుందో గమనించండి. ఏమీ కాలేదు. ఎందుకు? |
4:45 | కారణమేమిటంటే, మనం దీన్ని ఎకొ చేయలేదు కాబట్టి. మనం దీనిని ఒక వేరియబుల్ గా మాత్రమే సెట్ చేసాము. |
4:50 | అందుచేత, కాల్క్ నుండి తీసుకున్న అవుట్ పుట్ ను మనం ఎకో చేద్దాం. ఇపుడు, ఈ క్షణంలో, మనం రిఫ్రెష్ చేసినా కూడా ఏమీ జరగదు. |
5:00 | మనకేదీ రాలేదు, ఎందుకంటే, అక్కడ తిరిగి వచ్చే ఔట్ పుట్ లేదు కాబట్టి. అందుచేత, మనమేం చేయాలంటే, రిటర్న్ టోటల్ అని వ్రాయాలి. |
5:16 | ఇదేం చేస్తుందంటే - మీరు ఫంక్షన్ ను, వేరియబుల్ గా అనుకుంటే, అది ఫంక్షన్ యొక్క విలువను టోటల్ గా సెట్ చేస్తుంది. |
5:26 | మీరు రిటర్న్ అని వ్రాస్తూన్నంతవరకూ, ఫంక్షన్ దానికి సమానంగా ఉంటుంది. |
5:31 | అందుచేత, మన్ం రిటర్న్ టోటల్ అని వ్రాసి, ఒక్కొక్క కేస్ కు దీనిని కాపీ మరియు పేస్ట్ చేయబోతున్నాము. |
5:42 | ఓకే, దీనిని అన్నోన్ ఆపరేటర్ కొరకు మనం చేయనవసరం లేదు. ఎందుకంటే, ఇక్కడ ఏ ఆపరేటర్ లేదుకాబట్టి. |
5:49 | మనం దీన్ని రెఫ్రెష్ చేయోచ్చు. |
5:49 | మనకింకా ఏమీ రాలేదు. ఎందుకో ఊహించగలరా? |
5:55 | నేను ఫంక్షన్ లోపలివైపున దీన్ని ఎకొ చేసాను, అందుకే ఇది పని చేయలేదు. అది ఒక తప్పు. |
6:03 | ఫంక్షన్ యొక్క బ్రాకెట్ ఇక్కడ ప్రారంభమయి, ఇక్కడ ముగుస్తుందనేది మీరు చూడగలరు. |
6:08 | నేను దీనిని ఇక్కడ కింద ఉంచుతాను, అది అక్కడే ఉండాలి. రిఫ్రెష్ చేయండి. అది 20 గా వచ్చింది. ఓకే, 10+10 , 20 గా, మొత్తం ఫంక్షన్ లో ఉండడం మనం చూడగలుగుతున్నాము. |
6:24 | కాబట్టి, మనం కొన్ని రకాల విలువలను , అంటే 13 మరియు 17 లను తీసుకుని భాగిద్దాం. ఏమవుతుందో చూద్దాం. |
6:35 | ఓకే, మనకు ఒక పెద్ద దశాంశ సంఖ్య వచ్చింది. కాబట్టి, మనం చేసినది ఒక మంచి ప్రయోగంగా ఉంది. మనకు మొదటి నంబర్, రెండవ నంబర్ మరియు ఆపరేటర్ వచ్చాయి. |
6:46 | స్విచ్ స్టేట్ మెంట్ ద్వారా అది కావలసిన దానిని కనుగొని, దానిపై సంబంధిత ఆపరేషన్ ను చేస్తుంది. |
6:54 | అది నిర్ణయించలేక పోతే, ఒక అన్నోన్ ఆపరేటర్ ఎర్రర్ వస్తుంది. |
6:58 | అందుచేత, ఉదాహరణకు, మనం చెల్లుబాటు కాని ఆపరేటర్ గా, ఎ ను తీసుకుందాం. మనం రిఫ్రెష్ చేయగానే అది అన్నోన్ ఆపరేటర్ వద్దకు వెళుతుంది. దీంతో, మనం ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చేసాం. మనం ఒక ఇన్పుట్ విలువను ఉంచి, తరువాత రిటర్న్ కమాండ్ ను, ఎకొ చేయడం ద్వారా ఆ విలువను తిరిగి పొందాము. |
7:13 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కొరకు స్వరమందించిన వారు సునీత. వీక్షించినందుకు ధన్యవాదములు. |