Drupal/C2/Managing-Content/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 14:55, 24 March 2017 by Madhurig (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 మ్యానేజింగ్ కాంటెంట్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో, మనము నేర్చుకునేది కొత్త కంటెంట్ సృష్టించుట.
00:11 కంటెంట్ మరియు దాని రివిజన్లు నిర్వహించుట.
00:15 ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను వాడుతున్నావి- ఉబుంటు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ దృపల్ 8 మరియు ఫైర్ ఫాక్స్ వెబ్ బ్రౌజర్.
00:25 మీరు ఏ వెబ్ బ్రౌజర్ నైనా ఉపయోగించవచ్చు.
00:29 మనము ముందుగానే సృష్టించిన వెబ్సైట్ ను తెరుద్దాం.
00:33 కొత్త కంటెంట్ని ఎలా సృష్టించాలో నేర్చుకుందాం.
00:37 మన మొదటి ఈవెంట్ని చేర్చుదాం. కంటెంట్ క్లిక్ చేయండి.
00:42 యాడ్ కంటెంట్ క్లిక్ చేసి ఈవెంట్స్ ఎంచుకోండి.
00:46 మేము ఏర్పాటు చేసిన కొన్ని విషయాలను ప్రదర్శించేందుకు ఒక నమూనా ఈవెంట్ సెట్ చేశాము.
00:52 నేను ఈవెంట్ నేమ్ ఫీల్డ్ లో ద్రూపల్ క్యాంప్ సిన్సన్యాటీ అని టైప్ చేస్తాను.
00:58 ఈవెంట్ డిస్క్రిప్షన్ ఫీల్డ్ లో- This is the first DrupalCamp in the southern Ohio region అని టైప్ చేస్తాను.
01:07 ఇక్కడ క్రియేట్ న్యూ రివిషన్ చెక్ బాక్స్ ఆన్ చేసి ఉందని గమనించండి.
01:12 ఇక్కడ కుడి వైపు మనకు ఏమి చేసేది లేదు.
01:17 ఇప్పటికి ఈవెంట్ లోగో ని ఖాళీగా ఉంచండి.
01:21 కానీ మనకు ఒక ఈవెంట్ వెబ్సైటు కావాలి.
01:24 అందుకే http://drupalcampcincinnati.orgని యుఆర్ఎల్ గా టైప్ చేద్దాం.
01:34 లింక్ టెక్స్ట్ లో దీనిని ఖాళీగా ఉంచుదాం. డిస్‌ప్లే ఇప్పుడు కేవలం ఒక నిజమైన యుఆర్ఎల్, అయితే మనం దానిని ఇప్పుడు చేద్దాం.
01:44 ఈవెంట్ డేట్ పై క్లిక్ చేస్తే ఒక చిన్న క్యాలెండర్ పాప్ అప్ అవుతుంది.
01:49 11 జనవరి 2016 ఎంచుకుందాం.
01:54 ఇప్పుడు ఏ ఈవెంట్ స్పాన్సర్స్ ని చేర్చ లేము ఎందుకంటే మన వద్ద ఎటువంటి యూసర్ గ్రూప్స్ కూడా సెట్ చేసి లేవు.
02:01 ద్రుపల్ యొక్క మరొక్క ముఖ్య లక్షణం ఇన్లైన్ ఎంటిటి రేఫరెన్స్.
02:07 ఇది మనల్ని యూసర్ గ్రూప్స్ని చేర్చుటకు అనుమతి ఇస్తుంది కానీ దానిని తర్వాత నేర్చుకుందాం.
02:13 మనం వద్ద కొన్ని ఈవెంట్ టాపిక్స్ ఉన్నవి. I టైప్ చేసి Introduction to Drupal ఎంచుకుందాం.
02:21 Add another item క్లిక్ చేయండి. ఈ సరి m టైప్ చేద్దాం.
02:27 m అక్షరంతో ఉన్న టాపిక్ లు కనిపిస్తున్నాయని గమనించండి.
02:32 మాడ్యూల్ డెవెలప్‌మెంట్ ఎంచుకుందాం. మీకు కావాల్సిన ఇతర టాపిక్ లు ఎంచుకోవచ్చు.
02:38 Save and publish పై క్లిక్ చేయండి.
02:41 ఇక్కడ మన ద్రుపల్ క్యాంపు సిన్సన్యాటీ నోడ్ ఉంది.
02:45 Title, Body, Event Website స్వయంచాలకంగా ఒక లింక్, కానీ అది ఉనికిలో లేదు.
02:53 ఈ ఈవెంట్ డేట్ యొక్క ఫార్మటు మనకు కావలిస్తే మార్చవచ్చు.
02:58 ఇది ఒక టాక్సానమీ.
03:00 ఈ లింక్ పై క్లిక్ చేస్తే Introduction to Drupal కు ట్యాగ్ చేసిన ప్రతి ఒక్క ఈవెంట్ అందుబాటులో ఉంటుంది మరియు ప్రచురణ తేదీ క్రమంలో జాబితా చెయ్యబడుతుంది.
03:12 మన మొదటి ఈవెంట్ నోడ్ని విజయవంతంగా సృష్టిచాము.
03:17 ఇప్పుడు Shortcuts మరియు Add content పై క్లిక్ చేయండి మరియు ఈ సారి మన User Groupని చేర్చుదాం.
03:27 దీనిని సిన్సన్యాటీ యూసర్ గ్రూప్ అని పిలుద్దాం.
03:31 యూసర్ గ్రూప్ డిస్క్రిప్షన్ ఫీల్డ్ లో ఇలా టైప్ చేయండి This is the user group from the southern Ohio region based in Cincinnati.
03:42 We meet on the 3rd Thursday of every month.
03:47 అక్కడ మరింత సమాచారం జోడించవచ్చు.
03.51 ఈ యూసర్ గ్రూప్ కి యుఆర్ఎల్ https colon slash slash groups dot drupal dot org slash Cincinnati.
04:03 అది ఇప్పుడు ఉనికి లో లేదు, కానీ ఇది సాధారణంగా ఇలా కనిపిస్తుంది.
04:10 మీ ప్రాంతంలో యూసర్ గ్రూప్ లను కనుకోడానికి groups dot drupal dot orgకి వెళ్ళండి.
04:16 మీకు ఆసక్తి ఉన్న దాని బట్టి ఒక శీఘ్ర శోధన చేయండి.
04:21 ప్రపంచవ్యాప్తంగా అనేక యూసర్ గ్రూప్స్ ఉన్నవి.
04:25 Group Contact లో Drupal space Group టైప్ చేయండి మరియు Contact Email లో drupalgroup@email.com అని టైప్ చేయండి.
04:38 గమనించండి, ఇది సరైన ఫార్మట్ గల ఈమెయిల్ చిరునామా ఉండాలి లేకపోతే ద్రూపల్ దానిని తిరస్కరిస్తుంది.
04:46 ఇక్కడ ఉన్న అనేక ఎంపిక లలో నుండి గ్రూప్ లెవెల్ ఎంచుకోండి.
04:50 ఈవెంట్ స్పాన్సర్డ్ లో మనం ఒక ఈవెంట్ ని ఎంచుకోవాలి.
04:55 మీరు కేవలం d టైప్ చేస్తే డ్రాప్ డౌన్ లో ద్రూపల్ క్యాంప్ సిన్సన్యాటీ కనిపిస్తుంది.
05:02 Save and Publish క్లిక్ చేయండి.
05:05 మన మొదటి యూసర్ గ్రూప్ ని విజయవంతంగా సృష్టించినాము.
05:09 ఇప్పుడు మన కంటెంట్ ఎలా నిర్వహించాలో నేర్చుకుందాం.
05:13 కంటెంట్ పై క్లిక్ చేస్తే మన సైట్ పై ఉన్న మొత్తం కంటెంట్ యొక్క జాబిత వస్తుంది.
05:19 ఏ కంటెంట్ టైప్ అనేది పట్టించుకోక మొత్తం కంటెంట్ కనిపిస్తుంది.
05:25 మనము Publish status, Content type మరియు Title ప్రకారం ఫిల్టర్ చెయ్యవచ్చు.
05:32 ఇక్కడ మనము W టైప్ చేసి Filter క్లిక్ చేస్తే మనకు w తో మొదలైయ్యే నోడ్ లు మాత్రమే కనిపిస్తాయి.
05:41 Reset క్లిక్ చేయండి.
05:43 మన వద్ద బహుళ భాషలు ఉంటే, మరొక భాషను కూడా ఎంచుకోవచ్చు.
05:49 ఒక్క సారి మన వద్ద జాబిత ఉంటె ఒకే సారి మనము అనేక నోడ్ లను ఎంచుకొని, వాటి పైన చాల పనులు చెయ్యగలం అనగా- Delete, make Sticky, Promote, Publish మొదలైనవి.
06:04 నేను Unpublish content ఎంచుకొని అప్లై క్లిక్ చేస్తాను.
06:09 నేను ఎంచుకున్న నోడ్స్ యొక్క స్టేటస్ Unpublished గా అప్డేట్ చెయ్యబడిందని గమనించండి.
06:16 ఇది కోనెంట్ ని నిర్వహించేందుకు సులభమయిన స్థానము.
06:20 అన్ని నోడ్స్ ని ఒకే సరి ఎంచుకొని Publish మరియు ఆపై Apply క్లిక్ చేయండి.
06:28 కొన్ని నోడ్స్ ఇదివరకే పబ్లిష్ అయినా పర్వాలేదు ఇప్పుడు మొత్తం కంటెంట్ పబ్లిష్ అవుతుంది.
06:35 ఇక్కడి నుండి ఒకే నోడ్ ని ఎడిట్ లేదా డిలీట్ చెయ్యవచ్చు లేదా నోడ్స్ యొక్క బ్యాచ్ ని ఎంచుకొని దాని కంటెంట్ ని తొలగించవచ్చు.
06:44 ద్రుపల్ లో కంటెంట్ ని నిర్వహించుట చాల తేలిక. కేవలం టూల్ బార్ పై ఉన్న కంటెంట్ లింక్ పై క్లిక్ చేస్తే మనల్ని ఆ పేజీకి తీసుకెళ్తుంది.
06:54 పైన ఉన్న ట్యాబ్స్ ని ఉపయోగించి మనము ఇచ్చిన కామెంట్స్ ని నిర్వహించవచ్చు.
07:00 ఏదైనా ఒక file field లో అప్లోడ్ చేసి ఫైల్ ని కూడా తేలిక గా నిర్వహించ వాచ్చు.
07:05 ఇమేజ్ ని చూచుటకు దాని పై క్లిక్ చేయండి అది తేరా పై తెరుచుకుంటుంది.
07:10 ఇమేజ్ ని ఎక్కడ ఉపయోగించామో చూచుటకు Places లింక్ పై క్లిక్ చేయండి. అది మనకు ఆ ఫైల్ ఎక్కడ వాడబడిందో చూపే నోడ్ ల జాబిత ఇస్తుంది.
07:20 Administration టూల్ బార్ లోని కంటెంట్ లింక్ తో మన కంటెంట్, కామెంట్స్ మరియు ఫైల్స్ ని నిర్వహించవచ్చు.
07:29 ఏదైన ఒక నోడ్ కి ఒక కామెంట్ జోడిద్దాం.
07:33 నేను ఈ కామెంట్ ని చేర్చుతాను "Great Node! Fantastic content”.
07:39 సేవ్ క్లిక్ చేయండి.
07:42 మనం సూపర్ యూసర్ గా లాగిన్ చేశాము గనక, మనకు అన్నిటికి ఆమోదం ఉంటుంది. నిజానికి మనము ఏమి చేసే పని లేదు.
07:50 మీరు కామెంట్స్ ని ఆమోదం కోసం సెట్ చేస్తే, Content ఆపై Comments క్లిక్ చెయ్యాలి మరియు వాటిని ఇక్కడ నిర్వహించ గలరు.
07:59 ఉదాహరణకు చాలా కామెంట్స్ని పబ్లిష్ చెయ్యవచ్చు లేదా ఈ స్క్రీన్ నుండి వాటిని తొలగించండి.
08:05 ద్రుపల్ లో కంటెంట్స్ కామెంట్స్ మరియు ఫైల్స్ ని ఒకే చోటు నుండి నిర్వహించవచ్చు.
08:12 తదుపరి ఒక నోడ్ ని అప్డేట్ లేదా మర్చి, దాని రివిజన్లు ఎలా పని చేస్తున్నాయో చూద్దాం.
08:20 హోమ్ పేజీ కి వెళ్ళుటకు హోమ్ లింక్ పై క్లిక్ చేయండి.
08:24 ద్రూపల్ క్యాంప్ సిన్సన్యాటీ పై ఉన్న Quick edit క్లిక్ చేయండి.
08:29 ఈ నోడ్ యొక్క బాడీ లో మరి కొంత కంటెంట్ని చేర్చుదాం- "There is another great camp in Columbus every October".
08:39 సేవ్ క్లిక్ చేయండి.
08:41 ఇప్పుడు ద్రూపల్ క్యాంప్ సిన్సన్యాటీ పై క్లిక్ చేస్తే Revisions అనే పేరుతో ఒక కొత్త ట్యాబ్ ని చూస్తారు.
08:49 Revisions పై క్లిక్ చేస్తే అడ్మిన్ ఈ నోడ్ ని 2:37కి అప్డేట్ చేసిందని కనిపిస్తుంది మరియు ఇది దాని ప్రస్తుత అనగా Current రేవిషన్.
09:00 పాత వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.
09:03 దాని పై క్లిక్ చేస్తే పాత వర్షన్ కనిపిస్తుంది. దానిలో రెండవ పేరాగ్రాఫ్ లేదు.
09:09 వెనక్కి వెళ్ళి Revisions క్లిక్ చేయండి. మనము పాత వర్షన్ లని రివర్ట్ లేదా డెలీట్ చెయ్యవచ్చు.
09:18 దీనిని కొద్దిగా సులభం చేసే ఇతర మాడ్యూల్స్ కూడా ఉన్నవి.
09:22 కానీ ద్రుపల్ వద్ద పూర్తీ అంతర్ నిర్మిత వర్షన్ కంట్రోల్ ఉంది దాని వలన, మీకు ఏ నోడ్ కి ఎవరు ఎప్పుడు ఏ మార్పు చేశారో అనేది తెలుస్తుంది. మీరు దానిని మీకు కావాల్సి నప్పుడు రివర్ట్ చెయ్యవచ్చు.
09:36 అయితే ద్రుపల్ లోని బిల్ట్ ఇన్ లేదా అంతర్ నిర్మిత వర్షన్ కంట్రోల్ చాల ఉపయోగకరం.
09:41 దీనితో మనం ఈ ట్యూటోరియల్ చివరికి వచ్చాము. ట్యుటోరియల్ సారాంశం.
09:47 ఈ టుటోరియల్ లో మనం నేర్చుకున్నది- కంటెంట్ లు సృష్టించుట, కంటెంట్ లు మరియు రివిజన్ లను నిర్వహించుట
10:06 ఈ వీడియో ను Acquia మరియు OS Training నుండి స్వీకరించి స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట్, IIT బాంబే వీరు సవరించారు.
10:16 ఈ లింక్ లో ఉన్న వీడియొ స్పోకన్ టూటోరియల్ ప్రొజెక్ట్ సారాంశం. దీనిని డౌన్ లోడ్ చేసి చూడగలరు.
10:23 స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట టీమ్ వర్క్ షాప్లు నిర్వహిచి సర్టిఫికేట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు మమల్ని సంప్రదించగలరు.
10:32 స్పోకన్ టుటోరియల్ కు NMEICT, మినిస్టీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మరియు NVLI మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, భారత ప్రభుత్వం సహాయం అందిస్తోంది.
10:45 నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig