C-and-Cpp/C2/Functions/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 13:21, 24 March 2017 by Yogananda.india (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 C మరియు C++ పై స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం.
00:06 ఈ తరగతిలో మనం నేర్చుకోబోయేది,
00:09 ఫంక్షన్ అంటే ఏమిటి?
00:11 ఫంక్షన్ల సీన్ట్యాక్స్.
00:13 రిటర్న్ వాక్యము యొక్క ప్రాముఖ్యత.
00:16 వీటిని ఉదాహరణల ద్వారా చూద్దాం.
00:18 మనము సామాన్యంగా చేసే తప్పులు మరియు వాటి సవరణలనుకూడా చూద్దాం.
00:22 ఈ టూటోరియల్ని రెకార్డ్ చేయుటకు నేను ఉపయోగించినవి.
00:25 ఉబంటు ఆపరేటింగ్ సీస్టం 11.10,
00:29 gcc మరియు g++ కంపైలర్ వర్షన్ 4.6.1 .
00:35 ఫంక్షన్ల పరిచయం తో ప్రారంబిద్దాం.
00:39 ఒక ఫంక్షన్ తనాలో తానే ఒక పని నిర్వహించే ప్రోగ్రాం.
00:45 ప్రతి ప్రోగ్రాంలో ఒకటి లేక ఎక్కువ ఫంక్షన్లు ఉంటాయి.
00:49 ఒక్క సారి ఎక్సెక్యూట్ అయినతర్వాత నియంత్రణ మళ్ళీ ఎక్కడ ప్రోగ్రామ్ యాక్సెస్ చేయబడినదో అక్కడికే తిరిగి వెళ్ళండి.
00:55 ఫంక్షన్ యొక్క సిన్టాక్స్ చూద్దాం.
00:59 ret-type ఫంక్షన్ తిరిగి ఇచ్చే డేటా రకమును నిర్వచిస్తుంది.
01:05 fun_name ఫంక్షన్ పేరు నిర్వచిస్తుంది.
01:09 parameters అనేవి వేరియబుల్స్ మరియు వాటి రకాల జాబిత.
01:14 మనము ప్యారమేటర్ జాబితాను ఖాళీ ఉంచవచ్చు.
01:18 ఇలాంటి ఫంక్షన్లను ఆర్గ్యుమెంట్స్ లేని ఫంక్షన్లు అంటారు.
01:21 మరియు దీనిని ఆర్గ్యుమెంట్స్ ఉన్న ఫంక్షన్స్ అంటారు
01:26 vodi ఉపయోగించే ప్రోగ్రాంని చూద్దాం.
01:29 నేను ముందుగానే ప్రోగ్రాంను ఎడిటర్లో టైప్ చేసి ఉంచాను.
01:32 దాన్ని తెరుస్తాను.
01:35 మన ఫైల్ పేరు ఫంక్షన్ అని గమనించండి.
01:38 మరియు .c ఎక్స్టెన్షన్ తో సేవ్ చేశాను.
01:43 కోడ్ను వివరిస్తాను.
01:45 ఇది మన హెడ్డర్ ఫైల్.
01:47 ఉపయోగించే ముడుగానే ఫంక్షన్ను నిర్వచించి ఉండాలి.
01:51 ఇక్కడ add అనే ఫంక్షన్ ను నిర్వచించినము.
01:54 add ఫంక్షన్కు ఆర్గ్యుమెంట్స్ లేవని గమనించండి.
01:58 మరియు రిటర్న్ రకం void .
02:01 రెండు విధముల ఫంక్షన్లున్నవి-
02:03 యూసర్-డిఫైన్డ్ అంటే మన యాడ్ లాంటివి, మరియు
02:06 ప్రి-డిఫైన్డ్ ( pre-difined ) అంటే ప్రింట్ ఎఫ్ (printf) మరియు మెయిన్ (main) ఫంక్షన్ల లాంటివి .
02:12 ఇక్కడ a మరియు b లకు 2 మరియు 3 విలువలకు ఇనిషియలైజ్ చేశాం .
02:19 ఇక్కడ c అనే వేరియబుల్ ను ప్రకటించాము.
02:21 తదుపరి a మరియు b విలువలను జోడించాము
02:24 ఫలితం c లో నిలువ చేశాము
02:27 మన ఫలితాన్ని ముద్రిస్తాం.
02:29 ఇది మన మెయిన్ ఫంక్షన్ .
02:32 ఇక్కడ యాడ్ ఫంక్షన్ను ఉపయోగిద్దామ్.
02:34 సంకలనం జరిగి ఫలితం ముద్రింపబడుతుంది.
02:39 సేవ్ క్లిక్ చేయండి.
02:42 ప్రోగ్రాంను ఎక్సిక్యూట్ చేద్దాం.
02:45 Ctrl, Alt మరియు T కిలను ఏకకాలంలో నొక్కి టర్మినల్ విండో తెరవండి.
02:53 gcc ఫంక్షన్ డాట్ సి హైఫాన్ o fun టైప్ చేసి కంపైల్ చేయండి.
03:00 ఎక్సెక్యూట్ చేయుటకు ./fun (డాట్ స్లాష్ ఫన్) టైప్ చేయండి.
03:05 Sum of a and b is 5 అనే ఔట్ పుట్ ప్రదర్శింపబడుతుంది.
03:10 ఇపుడు మన ప్రోగ్రాంకు తిరిగి వద్దాం.
03:13 ఫంక్షన్ లో ప్యారమేటర్ లేదా ఆర్గ్యుమెంట్స్ అనే విశేషమైన ఐడెంటిఫైర్స్ఉన్నవి.
03:20 ఆర్గ్యుమెంట్స్ తో ఉన్న ఒక ఉదాహరణను చూద్దాం.
03:23 నేను ఇక్కడ కొన్ని మార్పులు చేస్తాను.
03:27 int add(int a, int b) అని టైప్ చేయండి.
03:32 ఇక్కడ మనము ఒక్ క్రియ ఫంక్షన్ add (యాడ్)ను ప్రకటించాము .
03:36 int a మరియు int b ఫంక్షన్ యాడ్ల ఆర్గ్యుమెంట్స్.
03:41 దీన్ని తొలగిద్దాం. a మరియు b ని చేసే అవసరం లేదు.
03:46 ప్రింట్ఎఫ్ వాక్యాను తొలగించండి.
03:49 ఇంట్ మెయిన్() (int main())టైప్ చేయండి.
03:52 ఇక్కడ sum అనే వేరియబుల్ని ప్రకటిద్దాం
03:54 int sum; టైప్ చేయండి.
03:57 తదుపరి sum = add(5,4); టైప్ చేయండి.
04:03 ఇక్కడ మనము యాడ్ ఫంక్షన్ను ఆహ్వానించాం.
04:05 తరువాత 5 మరియు 4 ప్యారామీటర్లను పంపిస్తాము.
04:10 a లో 5 మరియు b లో 4 నిలువ చాయబడుతాయి.
04:14 సంకలన క్రియ జరిగినది.
04:18 ఫలితమును ముద్రిద్దాం.
04:20 దానికి ఇక్కడ ఇలా టైప్ చేయండి. printf(" Sum is %d\n ",sum); .
04:27 ఫంక్షన్ను ముందే ఉపయోగించము కాబట్టి దీన్ని తొలగించండి.
04:32 return 0; టైప్ చేయండి.
04:36 వోయిడ్ కానీఫంక్షన్ తప్పనిసరిగా రిటర్న్ వాక్యాని ఉపయోగించి ఒక విలువను తిరిగి ఇవ్వాలి.
04:41 సేవ్ పై క్లిక్ చెయండి.
04:43 ప్రోగ్రాంను ఎక్సిక్యూట్ చేద్దాం.
04:45 టెర్మినల్కు తిరిగి రండి.
04:48 ఇంతక ముందు చేసినట్లు కంపైల్ చెయండి.
04:50 ఎక్సెక్యూట్ చేద్దాం.
04:52 Sum is 9 అని ఔట్పుట్ ప్రదర్శింపబడుతుంది.
04:57 ఇప్పుడు C++లో అదే ప్రోగ్రామ్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూద్దాం.
05:02 మన ప్రోగ్రాంకు వద్దాం
05:04 ఇక్కడ కొన్ని మార్పులు చేస్తాను.
05:07 ముందుగా Shift, Ctrl మరియు S కిలను ఏకకాలంలో నొక్కండి.
05:12 ఇప్పుడు .సిపిపి (.cpp) ఎక్స్టెన్షన్ ఇచ్చి ఫైల్ సేవ్ చెయండి.
05:18 సేవ్ పై క్లిక్ చెయండి. ముందుగా హెడ్డర్ ఫైల్ను <iostream>కు మారుద్దామ్.
05:24 ఇక్కడ using వాక్యాన్ని ఉప్యోగిద్దాం.
05:28 ఫంక్షన్ డిక్లరేషన్ C++ లో C లాగే ఉంటుంది.
05:32 అందుకే ఇక్కడ ఏమార్పూ అవసరం లేదు.
05:37 C++లో ముద్రించుటకు cout<< ఉపయోగిస్తాం, కాబట్టి ప్రింట్ ఎఫ్(printf)ను cout వాక్యంతో మారుద్దాం.
05:48 మనకు ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫయర్ మరియు \n అవసరం లేదు.
05:52 కామా తొలగించండి.
05:54 ఇప్పుడు రెండు యాంగిల్(<<) బ్రాకెట్లను తెరవండి.
05:58 sum తరువాత మరలా రెండు యాంగిల్ బ్రా కెట్లను తెరవండి.
06:03 డబల్ కొట్స్ లో , బ్యాక్ స్లాష్ ఎన్ "\n" టైప్ చేయండి.
06:07 క్లోసింగ్ బ్రాకెట్ను తొలగించండి.
06:09 ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి.
06:11 ప్రోగ్రాంను కంపైల్ చేద్దాం.
06:14 టర్మినల్కు తిరిగి వద్దామ్.
06:16 g++ function.cpp -o fun1 టైప్ చేయండి.
06:23 ఇక్కడ మన వద్ద fun1 ఎందుకంటే, fun ఫైల్ యొక్క అవుట్పుట్ ఓవర్రైట్ చెయ్యకూడదని.
06:31 ఎంటర్ నొక్కండి.
06:34 ./fun1 టైప్ చేయండి.
06:38 Sum is 9 అనే ఔట్-పుట్ ప్రదర్శిచబడుతుంది.
06:42 ఇప్పుడు మనం సామాన్యంగా చేసే తప్పులను చూద్దాం.
06:47 ఇక్కడ నేను 4 స్థానంలో x టైప్ చేస్తాను.
06:51 మిగతా కోడ్ ని అలాగే ఉండనిస్తాను.
06:55 సేవ్ పై క్లిక్ చేయండి.
06:58 ప్రోగ్రాంను కంపైల్ చేద్దాం.
07:02 పదో వరసలో తప్పు కనిపిస్తున్నది.
07:06 x ను పరధి (scope) లో డిక్లేర్ చేయలేదు.
07:09 ఎందుకంటే x ఒక క్యారెక్టర్ వేరియబుల్ కాబట్టి.
07:13 దీన్ని ఎక్కడా డిక్లేర్ చేయల్లేడు.
07:15 మరియు మన యాడ్(add) ఫంక్షన్ కు పూర్ణాకం ఆర్గ్యుమెంట్ ఉంది.
07:21 తిరిగి ఇచ్చే రకం మరియూ తిరిగి ఇచ్చే విలువ మధ్య భేదం ఉన్నది.
07:25 ఇప్పుడు ప్రోగ్రాంకు వద్దాం.
07:27 తప్పును సరిదిద్దుదాం.
07:30 పదో వరసలో 4 టైప్ చేయండి.
07:32 సేవ్ పై క్లిక్ చేయండి.
07:35 మరలా ఎక్సెక్యూట్ చేద్దాం.
07:37 ప్రోమ్ప్ట్ ను క్లియర్(clear) చేస్తాను.
07:40 ప్రోగ్రాం కంపైల్ చేయండి.
07:42 చూసారా సరిపోయింది.
07:45 ఇప్పుడు మనం సామాన్యంగా చేసే ఇంకొక తప్పు చూద్దాం.
07:50 ఇక్కడ ఒకే ప్యారామీటర్ ను పంపించామ్ అనుకోండి.
07:55 4 తొలగించండి. సేవ్ పై క్లిక్ చేయండి.
07:58 టర్మినల్కు వెళ్దాం
08:00 కంపైల్ చేద్దాం. పదో వరసలో తప్పు కనిపిస్తున్నది.
08:06 int add (int, int) ఫంక్షన్కు మరి తక్కువ ఆర్గ్యుమెంట్స్ ఉన్నవి .
08:11 ప్రోగ్రాంకు తిరిగి వెళ్ళండి.
08:14 ఇక్కడ రెండు ప్యారామీటర్లు ఉన్నవని కనిపిస్తుంది.
08:19 int a మరియు int b.
08:22 ఐతే మనము ఒక ప్యారామీటర్ మాత్రమే పంపిస్తున్నాము.
08:25 అందుకే తప్పు అని చూపిస్తుంది.
08:27 తప్పునీ సరిదిద్దుదాం.
08:29 4 టైప్ చేయండి.
08:31 సేవ్ పై క్లిక్ చేయండి.
08:34 టర్మినల్కు వద్దాం.
08:36 మరలా ఎక్సెక్యూట్ చేద్దాం.
08:39 పనిచేస్తున్నది.
08:42 మన స్లయిడ్ లకు తిరిగి వద్దాం.
08:44 ఈ తరగతి లో మనం నేర్చుకున్నవి-
08:49 ఫంక్షన్. ఫంక్షన్ యొక్క సిన్టాక్స్ (syntax)
08:51 ఆర్గ్యుమెంట్స్ లేని ఫంక్షన్స్
08:53 ఉదాహరణకు void add()
08:55 ఆర్గ్యుమెంట్స్ ఉన్న ఫంక్షన్స్
08:57 ఉదాహరణకు int add(int a and int b)
09:02 అస్సైంమెంట్ లా , ఒక సంఖ్య యొక్క వర్గం గణించడానికి ఒక ప్రోగ్రామ్ను రాయడం.
09:07 ఈ లింక్ లో ఉన్న వీడియోని చూడగలరు .
09:11 ఇది స్పోకన్ టుటోరియల్ యొక్క సారాంశం ఇస్తుంది .
09:14 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేనిచో, మీరు వీడియోని డౌన్ లోడ్ చేసి చూడగలరు.
09:18 స్పోకెన్ టుటోరియల్ ప్రొజెక్ట్ టీం,
09:21 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ లను నిర్వహిస్తుంది
09:24 ఆన్ లైన్ (online) పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి వారికి యోగ్యతా పత్రం(certificates) ఇవ్వబడును.
09:28 మరిన్నివివరాలుకు, contact@spoken-tutorial.orgకు సంప్రదించండి.
09:35 స్పోకెన్ టూటోరియల్ ప్రాజెక్ట్ టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము.
09:40 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
09:47 ఈ మిషన్ గురించి మరింత సమాచారం క్రింద చూపబడిన లింక్ వద్ద అందుబాటులో ఉంది.
09:52 ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శ్రీహర్ష ఏ.ఎన్. నేను మాధురి మీ వద్ద సెలవు తీస్కున్తున్నాను. ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, PoojaMoolya, Yogananda.india