PHP-and-MySQL/C4/User-Password-Change-Part-3/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
0:03 | ఇది "change password" పై ట్యుటోరియల్ యొక్క మూడవ భాగము. ఈ భాగములో, మనము డేటాబేస్‌లో ఉన్న పాస్‌వర్డ్‌ను మార్చబోతున్నాము. |
0:11 | ఇక్కడ మనము ఇదివరకే మన డేటాబేస్కు కనెక్ట్ అయి ఉన్నాము. |
0:14 | ఇక్కడ మనము ఇదివరకే కనెక్ట్ అయి ఉన్నాము కాబట్టి తిరిగి కనెక్ట్ కావలసిన పనిలేదు. ఎందుకంటే ఆ కమాండ్ ఇదివరకే ఇవ్వబడింది. |
0:23 | నేను "query change" అనే ఒక కొత్త query క్రియేట్ చేస్తాను మరియు అది "mysql query" ఫంక్షన్‌కు సమానముగా ఉంటుంది. |
0:30 | ఇప్పుడు, ఇది ఒక కొత్త కోడ్ బిట్. మీరు సులభంగా చూసేందుకు వీలుగా నేను క్రిందికి స్క్రోల్ చేస్తాను. |
0:36 | ఇది "UPDATE". నేను "UPDATE users" అని అంటాను. అంటే మీరు చూస్తున్నట్టుగా అది మన టేబిల్ - కాబట్టి మన "users" టేబిల్‌ను అప్డేట్ చేయుట కొరకు. |
0:44 | నేను "SET password equal to new password" అని అంటాను. |
0:51 | ఇక్కడ నేను ఇన్వర్టెడ్ కామాస్ ఉపయోగించానని నిర్ధారించుకుంటాను. |
0:56 | తరువాత నేను ప్రస్తుతము నా పేజ్‌లో నా వద్ద ఉన్న "user" వేరియబుల్నకు సమానమైన WHERE యూజర్ నేం అని అంటాను |
1:03 | ఇప్పుడు ఇది క్రింది దానికి సమానము అవుతుంది. |
1:07 | ఇక్కడ ఈ కాలంలో మన వద్ద ఉన్నదానికి. |
1:12 | మనము ఈ క్రింది మన php సెషన్ ఇదివరకే ప్రాసెస్ చేసాము కాబట్టి, |
1:18 | "Alex" కు సమానమైనదానికి |
1:21 | ఈ కోడ్ పీస్ ప్రాధమికంగా "update the table" అని చెబుతోంది, ఈ పాస్వర్డ్ ను యూజర్ ఎంటర్ చేసిన కొత్త పాస్వర్డ్ కు మార్చండి. అంటే వారికి కావలసిన పాస్వర్డ్. |
1:32 | మరియు ఈ "where" ను Alex కు మార్చండి. |
1:37 | ఎందుకంటే ఇది Alex కు సమానము. |
1:40 | ఈ యూజర్ నేం Alex కు సమానము కాబట్టి, ఈ పాస్వర్డ్ మార్చబడుతుంది. |
1:45 | ఇది 900 తో మొదలౌతుంది మరియు మనము దానిని మార్చిన వెంటనే దీనిని రిఫ్రెష్ చేయవచ్చు మరియు అది నిజంగా మారిందా అని చెక్ చేయవచ్చు. |
1:56 | నేను మరి కొన్ని విషయాలు చేరుస్తాను. |
2:03 | దీనిని ఇక్కడ వెనక్కు వేద్దాము. |
2:06 | మరియు నేను పేజ్‌ను కిల్ చేస్తాను మరియు "die" అని అంటాను మరియు ఆ తరువాత "Your password has been changed" అని అంటాను. |
2:15 | తరువాత నేను "return" అని చెప్పే ఒక లింక్ వేస్తాను మరియు దానితో అది మెయిన్ పేజ్‌కు తిరిగివస్తుంది. |
2:23 | ఇది "index.php". |
2:27 | మనము పేజ్‌ను కిల్ చేసే ముందు, నేను సెషన్‌ను destroy చేస్తాను. |
2:31 | కాబట్టి "session destroy" అని అంటాను. |
2:33 | దీనికి కారణము, ఒకసారి యూజర్ తమ పాస్వర్డ్ మార్చుకుంటే, ఈ లింక్ వారిని తిరిగి మెయిన్ పేజ్‌కు తీసుకొని వెళ్తుంది మరియు ఇది సెషన్‌ను డెస్ట్రాయ్ చేస్తుంది. |
2:42 | కాబట్టి వాళ్ళు కొత్త పాస్వర్డ్ ఉపయోగించి తిరిగి లాగిన్ కావాలి. |
2:59 | కాబట్టి మనము దీనిని టెస్ట్ చేస్తే, md5 హాష్ 900 తో మొదలయ్యే "abc" నా ప్రస్తుత పాస్వర్డ్ అని గుర్తుంచుకోండి. |
3:00 | మరియు ఇక్కడ నేను వెనక్కు వెళ్తే, నా పాత పాస్వర్డ్ "abc", నా కొత్త పాస్వర్డ్ "123" అని వ్రాస్తాను మరియు "change password" క్లిక్ చేస్తాను, అన్ని వాలిడేషన్స్ చెక్ చేయబడ్డాయని మనము చూడవచ్చు, మన పాస్వర్డ్ మారింది మరియు మనము మెయిన్ పేజ్‌కు వెనక్కు వెళ్ళుటకు మనకు ఈ మెసేజ్ వస్తుంది. |
3:18 | ఇప్పుడు, ఒకవేళ నేను మెంబర్ పేజ్‌కు వెళ్ళాలని ప్రయత్నిస్తే, మీరు లాగ్ ఇన్ అవ్వాలని చూపుతుంది. ఇక్కడ మనము "session destroy" ఫంక్షన్ ఉపయోగించాము కాబట్టి, మన సెషన్ డెస్ట్రాయ్ అయ్యింది. |
3:32 | ఇంకా, నేను తిరిగి లాగ్ ఇన్ అయితే, మరియు నా పాత పాస్వర్డ్ అయిన "abc" ను పాస్వర్డ్ గా టైప్ చేస్తే, మనకు ఒక "Incorrect password" మెసేజ్ వస్తుంది. |
3:43 | ఒకవేళ నేను "123" అని ప్రయత్నిస్తే, నేను లాగ్ ఇన్ అవుతాను. దానికి రుజువు ఇక్కడ చూపబడింది. |
3:50 | మనము వెనక్కు వెళ్దాము మరియు "browse" పై క్లిక్ చేద్దాము. మనము క్రింది స్క్రోల్ అవుదాము మరియు మనము పాస్వర్డ్ 900 నుండి 202 కు మారిందని చూడగలము. |
3:59 | అందుచేత, ఇది పూర్తిగా ఒక కొత్త హాష్ మరియు పూర్తిగా ఒక కొత్త పాస్వర్డ్. |
4:06 | కాబట్టి ప్రతి ఒక్కటి బాగా పనిచేస్తోంది. ఇది చేయుట చాలా సులభము అని మీరు చూడగలరు. |
4:11 | మీరు చేయవలసినది మీ "sql" queries బాగా నేర్చుకోవాలి. నా వద్ద వాటిపై కూడా ట్యుటోరియల్స్ ఉన్నాయి. |
4:18 | మరియు మీరు మీ పాత పాస్వర్డ్ మరియు మీ రెండు కొత్త పాస్‌వర్డ్‌లను ఎలా చెక్ చేయాలి అని లాజికల్‌గా ఆలోచించాలి. |
4:24 | మనము రిజిస్ట్రేషన్ చేసినప్పుడు, పాస్వర్డ్ ఎంత పెద్దదిగా ఉండాలి అని ఒక పరిమితి ఉంది. |
4:31 | పాస్వర్డ్ 6 క్యారెక్టర్ల కంటే పెద్దదిగా ఉండాలా లేక 25 క్యారెక్టర్ల కంటే పెద్దదిగా ఉండకూడదా అని చూచుటకు మరొక చెక్ ఎంటర్ చేయుట మీకే వదులుతున్నాను. |
4:42 | కాబట్టి మీరు చేయగలిగే చెక్స్ ఎన్నో ఉన్నాయి కాని mysql డేటాబేస్ ఉపయోగించి phpలో పాస్వర్డ్ మార్చుకొనుటకు ఇది ప్రాధమిక పద్ధతి. |
4:53 | దీనిని మీరు ఆనందించారని ఆశిస్తున్నాను. మీకు ఏవైనా వ్యాఖ్యానములు లేక ప్రశ్నలు ఉంటే, నాకు తెలియజేయండి. ఇంకా వీడియో అప్డేట్స్ కొరకు సబ్‌స్క్రైబ్ చేయండి. |
5:01 | చూసినందుకు ధన్యవాదములు! స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కొరకు డబ్బింగ్ చెప్పినవారు నిఖిల. |