LibreOffice-Suite-Draw/C3/Edit-Curves-and-Polygons/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 23:37, 23 March 2017 by Yogananda.india (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 లిబరే ఆఫీసు డ్రాలో Editing Curves and Polygonsపై స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్లో డ్రా(Draw)లో కర్వ్లను మరియు పాలీగన్లను ఎలా సవరించాలో నేర్చుకుంటాం.
00:13 ఈ ట్యుటోరియల్ కోసం, మీకు లిబరే ఆఫీసు డ్రాలో ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి. లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం ఈ వెబ్ సైట్ను సందర్శించండి.
00:23 ఇక్కడ, మనం ఉపయోగిస్తున్నది: ఉబుంటు లినక్సు వర్షన్ 10.04 మరియు , లిబరే ఆఫీసు సూట్ వర్షన్ 3.3.4.
00:32 మన రూట్ మ్యాప్(RouteMap) రేఖా చితాన్ని తెరుద్దాం.
00:37 ఇంతకు ముందు, మనం వక్రతలు(కర్వ్స్) మరియు పాలీగోన్లను గీయడం నేర్చుకున్నాo.వీటిని ఎలా సవరించాలో(edit) తెలుసుకుందాం.
00:42 స్కూల్ కాంపస్(School Campus) ఆకారం మారుద్దాం.
00:48 ఇందుకోసం ఎడిట్ పాయింట్స్(Edit Points) టూల్బార్ను వాడుదాం.
00:52 మెయిన్ మెనూ(Main menu)నుండి, వ్యూ(View) క్లిక్ చేసి, టూల్బార్స్(Tool bars) ఎంపిక చేసుకొని, ఎడిట్ పాయింట్స్(Edit Points) క్లిక్ చేయండి.
01:00 ఎడిట్ పాయింట్స్(Edit Points) టూల్బార్ కనిపిస్తుంది.
01:04 స్కూల్ కాంపస్(School Campus) బహుభుజి ఎంపిక చేసుకుందాం.
01:09 ఎడిట్ పాయింట్స్(Edit Points) టూల్ బార్లో పాయింట్స్(Points) చిహ్నం క్లిక్ చెయ్యండి.
01:12 ఆబ్జెక్ట్ లో, పచ్చ(గ్రీన్) సెలక్షన్ హేండిల్స్(selection handles) నీలం(బ్లూ) ఎడిట్ పాయింట్స్గా మారుతాయి.

ఇది మీరు ఎడిట్ పాయింట్(Edit point) మోడ్లో ఉన్నారని సూచిస్తుంది.

01:23 ఎడిట్ పాయింట్స్(Edit Points) టూల్బార్ పై, ఇన్సర్ట్ పాయింట్స్ (Insert points) చిహ్నాన్ని క్లిక్ చేయండి.
01:29 డ్రా(Draw) పేజీకి వెళ్దాం. కర్సర్ ప్లస్ గుర్తుకి మారుతుంది.
01:35 స్కూల్ కాంపస్(School Campus) బహుభుజి యొక్క ఎడమ వైపు ప్లస్ గుర్తును పెట్టండి.
01:41 ఎడమ మౌస్ బటన్ నొక్కి కుడికి వైపు లాగండి. బటన్ వదలండి. మీరు ఒక పాయింట్ చేర్చారు.
01:51 చేర్చబడ్డ ఆ పాయింట్ మీద క్లిక్ చేయండి. ఎడిట్ పాయింట్స్(Edit Points) టూల్బార్ ఎంపికలు ఎనేబ్ల్ చేయబడ్డాయి.
02:00 సిమ్మేట్రిక్ ట్రాన్సిషన్(Symmetric Transition)పై క్లిక్ చేయండి.
02:03 చుక్కల నియంత్రణ రేఖ పాయింట్ పక్కన కనిపిస్తుంది.
02:07 కాంపస్(campus) ఆకారం మార్చడానికి కంట్రోల్ లైన్ని బయటకు లాగుదాం. ఆకారం మార్చబడింది!
02:16 ఎడిట్ పాయింట్స్(Edit Points) టూల్బార్ నుండి నిష్క్రమించడానికి పాయింట్స్(Points) క్లిక్ చేయండి.
02:21 ఇప్పుడు, కాంపస్(campus)ను కుడి వైపు సాగదీద్దాం.
02:26 కుడివైపు వున్న చివరి పాయింట్ను మాత్రమే ప్రత్యేకంగా తరలిద్దాం.
02:30 స్కూల్ కాంపస్(School Campus)పాలీగాన్ ఎంచుకోండి.
02:34 ఎడిట్ పాయింట్స్(Edit Points) టూల్బార్ని ఎనేబ్ల్ చేద్దాం.
02:38 నీలి(బ్లూ)ఎడిట్ పాయింట్స్ ఆబ్జెక్ట్ మీద కనిపిస్తాయి. ఈ పాయింట్ను ఎంచుకోండి.
02:45 ఎడిట్ పాయింట్స్(Edit Points) టూల్బార్ పై మూవ్ పాయింట్స్(Move points) క్లిక్ చేయండి.
02:50 మీరు ఎంచుకున్న పాయింట్ కృష్ణ నీలంగా(డార్క్ బ్లూ) మారడం చూడండి.
02:54 ఇప్పుడు, కుడి వైపుకు పాయింట్ని లాగండి.
02:58 మన అవసరాన్ని బట్టి ఆబ్జెక్ట్స్ ను స్థాన పరచడానికి గ్రిడ్(grid)ను ఉపయోగించవచ్చు.
03:03 స్కూల్ కాంపస్(School Campus) ఆకారం మళ్ళీ మార్చాం!
03:09 ఈ ట్యుటోరియల్ ఆపి ఈ అసైన్మెంట్ చేయండి.
03:12 కర్వ్ గీసి దాని పై ఎడిట్ పాయింట్స్(Edit Points) టూల్బార్ నుండి అన్ని ఎంపికలు అప్లై(Apply) చేయండి. మీకు ఎడిట్ పాయింట్స్(Edit Points) టూల్బార్లో ప్రావీణ్యం తెచ్చుకోవడం కోసం చాలా అభ్యాసం అవసరం అని గుర్తుంచుకోండి.
03:25 చివరగా, మ్యాప్లోని అన్ని ఆబ్జెక్ట్ లను గ్రూప్ చేద్దాం. కీబోర్డ్ పై Ctrl+A నొక్కి కాంటెక్స్ట్ మెనూ(Context menu) కోసం రైట్ క్లిక్ చేద్దాం.
03:35 గ్రూప్(Group) ఎంచుకోండి. అన్ని ఆబ్జెక్ట్ లు ఇప్పుడు సమూహ పరచబడ్డాయి.
03:43 మ్యాప్ పూర్తయింది! మీరు భవనాలకు రంగులు వేయవచ్చు, లైన్లను ఉపయోగించి రోడ్లను జోడించ వచ్చు, ట్రాఫిక్ సిగ్నల్స్ మరియు మీకు అవసరం వున్న ఏ ఇతర వివరాలైయిన జోడించండి.
03:56 ఇది మన రంగు చేసిన నమూనా రూట్మ్యాప్(routemap).
04:00 ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. ఈ ట్యుటోరియల్లో, కర్వస్(Curves) మరియు పాలీగాన్స్(Polygons)లను ఎలా సవరించాలో నేర్చుకున్నాం.
04:10 ఇక్కడ మీకు మరొక్క అసైన్మెంట్ ఉంది. ఈ స్లయిడ్లో చూపించిన విధంగా మ్యాప్ను సృష్టించండి.
04:16 ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.

మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియోని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు.

04:27 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం, స్పోకెన్ ట్యూటోరియల్స్ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. ఆన్లైన్ పరీక్షలో ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది.
04:37 మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgను సంప్రదించండి.
04:45 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
05:00 ఈ మిషన్ గురించి స్పోకెన్ హైఫన్ ట్యుటోరియల్ డాట్ ఓర్జి స్లాష్ NMEICT హైఫన్ ఇంట్రో లింక్లో మరింత సమాచారము అందుబాటులో ఉంది.
05:11 ఈ ట్యూటోరియల్ను తెలుగులోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకున్నాను ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, PoojaMoolya, Yogananda.india