LibreOffice-Suite-Draw/C2/Common-editing-and-print-functions/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 15:58, 3 March 2017 by PoojaMoolya (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 లిబరే ఆఫీసు డ్రా లో కామన్ ఎడిటింగ్ అండ్ ప్రింటింగ్ ఫంక్షన్ల (Common Editing and Printing Functions in LibreOffice Draw)పై స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేది:
00:10 డ్రా(Draw) పేజీకి అంచులని సరిగా ఏర్పాటు చేయుట.
00:13 పేజీ నంబర్లు, తేదీ మరియు సమయం చేర్చడం.
00:16 చర్యలను అండు(undo) మరియు రిడు(redo) చేయడం.
00:18 ఒక పేజీ పేరుని మార్చడం
00:20 *ఒక పేజీని ముద్రించడం.
00:22 ఇక్కడ, మనం ఉపయోగిస్తున్నది : ఉబుంటు లినక్స్(Ubuntu Linux) వర్షన్ 10.04 మరియు

లిబరే ఆఫీసు సూట్(LibreOffice Suite) వర్షన్ 3.3.4.

00:33 వాటర్ సైకిల్ ఫైల్ను తెరిచి, వాటర్ సైకిల్ రేఖా చిత్రం ఉన్న పేజిని ఎంచుకుందాం.
00:40 ఈ రేఖా చిత్రం కోసం పేజీ మార్జిన్లు సరిగా ఏర్పాటు చేద్దాం.
00:44 పేజీ మార్జిన్లు ఎందుకు అవసరం?
00:46 పేజీ మార్జిన్లు, ఒక పేజీ లోపల ఆబ్జెక్ట్ లను అమర్చుటకు కావలసిన స్థలాన్ని నిర్ణయిస్తాయి.
00:53 ఉదాహరణకు, మన రేఖా చిత్రాన్ని ప్రింట్ చేసి దానిని ఫైల్ చేయాల్సి ఉంటే.
00:57 మార్జిన్లు ఇరుప్రక్కలా తగినంత స్థలం ఉండేలా నిర్ధారిస్థాయి.
01:01 అందువల్ల చిత్రాన్ని ముద్రించినప్పుడు, చిత్రం యొక్క భాగం కత్తిరించబడదు లేదా దాగి ఉండదు.
01:07 పేజీ అంచులని సరిగా ఏర్పాటు చేసి వాటర్ సైకిల్(WaterCycle) రేఖా చిత్రాన్ని ప్రింట్ చేద్దాం.
01:11 ఈ చిత్రాన్ని ప్రింట్ చేయడానికి ఉపయోగించే కాగిత పరిమాణం, ప్రామాణిక పరిమాణం కాదనుకోండి.
01:18 దాని వెడల్పు 20 సెం మరియు ఎత్తు 20 సెం ఉంది.
01:23 దీనికి 1.5 సెం బాటమ్(Bottom) మార్జిన్ అవసరం కూడా వుంది .
01:29 ఈ కొలతలను సరిగా ఏర్పాటు చేయడానికి మెయిన్(Main) మెనూ నుండి ఫార్మాట్(Format) ఎంచుకొని, పేజీ(Page ) పై క్లిక్ చేయండి.
01:35 పేజి సెటప్(Page Setup) డైలాగ్-బాక్స్ తెరుచుకుంటుంది.
01:38 పేజి(Page) ట్యాబును ఎంచుకోండి .
01:41 విడ్త్(Width) ఫీల్డ్ లో , విలువ '20' మరియు హైట్(Height) ఫీల్డ్ లో '20' ప్రవేశపెట్టండి.
01:47 మార్జీన్స్(Margins) కింద, బాటమ్(Bottom) ఫీల్డ్ లో, '1.5' ప్రవేశపెట్టండి.
01:54 కుడివైపు, డ్రా పేజి యొక్క ప్రివ్యూను మీరు చూస్తారు.
01:58 ఈ ప్రివ్యూ డ్రా పేజీకి చేసిన మార్పులను చూపిస్తుంది.
02:02 ఓకే(OK) క్లిక్ చేయండి
02:04 రేఖా చిత్రం ఎలా కనిపిస్తుంది?
02:06 ఇది పేజీ బయటికి వచ్చింది!
02:08 అనగా దీనిని ప్రింట్ చేసినప్పుడు రేఖా చిత్రం యొక్క భాగం కనబడకుండ పోతుంది.
02:14 మీరు నిశ్చయించుకోవలసినవి: రేఖా చిత్రాలు ఎప్పుడూ మార్జిన్ల లోపలే వుండాలి.
02:18 డ్రా చేసినప్పుడు రేఖా చిత్రం యొక్క ఏ భాగo అయినా మార్జిన్ బయటికి రాకూడదు.
02:23 అందువలన, మీ రేఖా చిత్రం ప్రారంభించడానికి ముందే పేజీ మార్జిన్లు సరిగ్గా ఏర్పాటు చేయడం ఒక మంచి పద్ధతి.
02:29 మళ్ళీ, మెయిన్ మెను నుండి ఫార్మాట్ ఎంచుకొని పేజీ పై క్లిక్ చేయండి.
02:35 పేజి సెటప్(Page Setup) డైలాగ్-బాక్స్ తెరుచుకుంటుంది.
02:38 పేజి(Page) ట్యాబ్ పై క్లిక్ చేయండి.
02:40 ఫార్మాట్(Format)డ్రాప్-డౌన్ జాబితా పై క్లిక్ చేసి A4 ఎంచుకోండి.
02:45 ఇది మనం సెట్ చేసిన అసలు మార్జిన్.
02:48 ఓకే(OK) క్లిక్ చేయండి
02:52 రేఖా చిత్రం మార్జిన్ లోపల అమర్చబడుతుంది.
02:55 పేజి సెటప్(Page setup) డైలాగ్ బాక్స్ ను డ్రా పేజి (Draw page) నుండి కుడా తెరవ వచ్చు.
03:00 పేజీ పై రైట్ క్లిక్ చేసి, కాంటెక్స్ట్(Context) మెనుని ఉపయోగించి.
03:05 Cancel(కాన్సల్) పై క్లిక్ చేసి డైలాగ్ బాక్స్ నుండి నిష్క్రమిద్దాం.
03:09 ఇప్పుడు, పేజీ నంబర్లు, తేదీ, సమయం మరియు రచయిత పేరు చేర్చుదాం.
03:15 వాటర్ సైకిల్ (WaterCycle) రేఖా చిత్రం వున్న పేజీని ఎంచుకొని పేజీకి సంఖ్యను చేర్చుదాం.
03:21 మెయిన్(Main) మెనూ కు వెళ్ళి, ఇన్సర్ట్(Insert) ఎంచుకొని ఫీల్డ్స్(Fields) పై క్లిక్ చేద్దాం.
03:27 ఫీల్డ్స్(Fields) జాబితా కనిపిస్తుంది.
03:31 డ్రా(Draw) ద్వారా స్వయంచాలకంగా సృష్టించవలసిన విలువలను ఫీల్డ్స్(Fields) కలిగి ఉంటుంది.
03:35 మనం కేవలం ఫీల్డ్ మరియు డ్రా(Draw) ద్వారా ఉత్పత్తి చేయబడిన విలువను చేర్చాలి.
03:41 పేజి నెంబర్(Page number) పై క్లిక్ చేద్దాం.
03:43 డ్రా పేజి పై సంఖ్య '1' తో ఒక టెక్స్ట్-బాక్స్ చేర్చబడినది.
03:48 ఈ టెక్స్ట్ బాక్స్ పరిమాణం సర్దుబాటు చేసి దీనిని కొద్దిగా చిన్నగా చేద్దాం.
03:55 ఇప్పుడు, బాక్స్ ను లాగి పేజీ దిగువన కుడి మూల వద్ద పెడుదాం.
04:01 సంఖ్య బాక్స్ ను సజావుగా తరలించడానికి, సంఖ్య బాక్స్ను ఎంచుకొని షిఫ్ట్(Shift)కీ నొక్కండి.
04:07 ఇప్పుడు, దీనిని మరింత కిందికి తరలిద్దాం.
04:11 ఈ డ్రా(Draw) ఫైల్ లోని రెండవ పేజీ లో తదుపరి సంఖ్య చేర్చబడిందో లేదో తనిఖీ చేద్దాం.
04:17 దీనికి పేజీ సంఖ్య లేదు!
04:20 మనమ్ ఫీల్డ్(field) ను చేర్చిన వద్ద మాత్రమే పేజీ సంఖ్యచేర్చబడుతుంది!
04:26 ఇప్పుడు, పేజీ సంఖ్య ఫార్మాట్ ఎలా మార్చాలో తెలుసుకుందాం .
04:30 మెయిన్(Main ) మెనూ నుండి , ఫార్మాట్(Format) క్లిక్ చేసి పేజి(Page) ఎంచుకోండి.
04:36 పేజి సెటప్(Page Setup) డైలాగ్-బాక్స్ తెరుచుకుంటుంది.
04:39 పేజి(Page ) ట్యాబు పై క్లిక్ చేయండి.
04:41 లేఔట్ సెట్టింగ్స్(Layout settings), నుండి ఫార్మాట్ (Format) ఎంచుకోండి.
04:45 డ్రాప్-డౌన్ జాబితా నుండి a, b, c ఎంచుకోండి.
04:49 ఓకే(OK) క్లిక్ చేయండి
04:52 పేజి నంబరింగ్ 1, 2, 3 నుండి a, b, c కి మారింది.
04:58 ఇలాగే, మీరు దీనిని ఏ ఫార్మాట్ కైనా మార్చవచ్చు.
05:01 డేట్(Date) మరియు టైం(Time) ఫీల్డ్స్ ఎలా చేర్చాలో చూద్దాం.
05:05 డేట్(Date) మరియు టైం(Time) స్టాంప్స్ని కుడా డ్రా(Draw) పేజిలో చేర్చవచ్చు.
05:10 ఇందుకోసం ఇన్సర్ట్(Insert) మరియు ఫీల్డ్స్(Fields) పై క్లిక్ చేయాలి.
05:14 ఒకటి డేట్ (ఫిక్స్డ్)(Date(fixed)) మరియు టైం (ఫిక్స్డ్)(Time(fixed)).
05:18 మరొకటి డేట్(Date) (వేరియాబల్)(variable) మరియు టైం(వేరియాబల్)(Time(variable)).
05:23 డేట్(ఫిక్స్డ్)(Date(fixed)) మరియు టైం(ఫిక్స్డ్)(Time(fixed)) ఎంపికలు ప్రస్తుత తేదీ మరియు సమయoలను చేర్చుతాయి .
05:29 ఈ తేదీ మరియు సమయం విలువలు నవీకరించబడవు.
05:33 మరోవైపు, డేట్(వేరియాబల్)(Date(variable)) మరియు టైం(వేరియాబల్)(Time(variable)) ఎంపికలు,
05:37 మీరు ఫైల్ తెరిచినప్పుడు స్వయంచాలకంగా నవీకరించబడుతాయి.
05:42 ఇక్కడ టైం(వేరియాబల్)(Time(variable))ను చేర్చుదాం.
05:46 ఇప్పుడు, మనము బాక్స్ ను లాగి, పేజీ దిగువన కుడి మూల వద్ద ఉన్న పేజీ సంఖ్య పైన పెడుదాం.
05:56 మీరు డ్రా(Draw) పేజీని తెరిచిన ప్రతిసారి చేర్చబడ్డ సమయం ప్రస్తుత సమయంతో నవీకరించబడుతుంది.
06:03 ఇప్పుడు మనం ఈ ఫైలు సృష్టించిన రచయిత పేరును ప్రవేశపెడుదాం.
06:08 ఇక్కడ, పేజీ వన్ లో రచయిత పేరు - "Teacher. A. B."గా సెటప్ చేద్దాం.
06:17 పేజి వన్(Page one) వద్దకు వెళ్దాం.
06:19 మెయిన్(Main ) మెనూ వద్దకు వెళ్ళి టూల్స్(Tools) ఎంచుకొని ఆప్షన్స్( Options)పై క్లిక్ చేయండి.
06:24 ఆప్షన్స్ (Options) డైలాగ్-బాక్స్ తెరుచుకుంటుంది.
06:27 ఆప్షన్స్ (Options) డైలాగ్-బాక్స్ నుండి లిబరే ఆఫీసు(LibreOffice) పై క్లిక్ చేసి మళ్ళి ఆ తర్వాత యూసర్ డేటా (User Data)పై క్లిక్ చేయండి.
06:34 డైలాగ్ బాక్స్ యొక్క కుడి వైపున, మీరు యూజర్ డేటా సమాచారాన్ని నమోదు చేయవచ్చు.
06:40 మీ అవసరాలకు తగ్గట్టుగా, ఇక్కడ వివరాలను నమోదు చేయవచ్చు.
06:44 ఫస్ట్/లాస్ట్ నేమ్/ఇనిశియల్స్ (First/Last Name/Initials)లో వరుసగ, "టీచర్(Teacher)", 'A', మరియు 'B' టెక్స్ట్ లను ప్రవేశ పెడుదాం.
06:53 ఓకే(OK) క్లిక్ చేయండి
06:55 ఇప్పుడు, మెయిన్( Main ) మెనూ నుండి , ఇన్సర్ట్(Insert) క్లిక్ చేసి , ఫీల్డ్స్(Fields) ఎంచుకొని , ఆథర్ (Author)పై క్లిక్ చేయండి.
07:02 టీచర్(Teacher) AB పేరు టెక్స్ట్ బాక్స్ లో ప్రవేశ పెట్టబడినది.
07:07 ఈ బాక్స్ను లాగి డ్రా (Draw)పేజీ యొక్క కుడి దిగువ మూలలో వున్న, టైమ్(Time) ఫీల్డ్ పైన పెడుదాం.
07:15 ఇప్పుడు, డ్రా పేజీ లో చేర్చబడ్డ ఫీల్డ్స్ తొలగించాలనుకుంటే ఎలా?
07:21 కేవలం టెక్స్ట్ బాక్స్ ను ఎంచుకొని డిలీట్(Delete) కీ నొక్కండి.
07:25 ఆథర్ నేమ్(Author Name) ఫీల్డ్ తొలగిద్దాం.
07:28 మరియు ఈ చర్యను అన్డు(undo)(రద్దు)చేయాలంటే ఎలా?
07:31 తేలిక! Ctrl మరియు Z కీలు కలిసి నొక్కడం ద్వారా మీరు ఏ చర్య అయినా అన్డూ (undo)(రద్దు) చెయ్యవచ్చు.
07:38 చివరిసారి ఎక్సిక్యూట్ చెయ్యబడ్డ చర్య, అనగా , Author(ఆథొర్) ఫీల్డ్ యొక్క తొలగింపు రద్దు(అన్డు) చేయబడినది.
07:45 ఫీల్డ్ మళ్ళీ కనిపిస్తుంది.
07:48 చర్యలు అన్డూ(undo)(రద్దు )లేదా పునరావృత్తం(రీడు(Redo)), మెయిన్(Main) మెను నుండి కుడా చేయవచ్చు.
07:53 మెయిన్(Main ) మెనూ, నుండి ఎడిట్(Edit) ఎంచుకొని రీడు(Redo)పై క్లిక్ చేయండి.
07:57 Author(ఆథర్)పేరు ఇకపై కనిపించదు!
08:00 Ctrl + Z కీలను నొక్కి చేసిన అన్ని ఫీల్డ్ యొక్క అమరిక అన్ డూ(undo) (రద్దు ) చేద్దాం.
08:06 కీ బోర్డు నుండి షార్ట్ కట్ కీలు ఉపయోగించి కూడా undo(అన్ డూ) మరియు redo(రిడూ) ఆదేశాలను ఇవ్వచ్చు.
08:13 Ctrl మరియు 'Z' కీలను కలిపి నొక్కి ఒక చర్య ను అన్డు(undo) చేద్దాం.
08:18 Ctrl' మరియు Y'కీల ను కలిసి నొక్కి ఒక చర్యను రీడు(redo) చెయ్యవచ్చు.
08:23 ఈ ట్యుటోరియల్లో విరామం తీసుకొని ఈ అసైన్మెంట్ చేయండి.
08:26 ఆథర్’స్ నేమ్(Author’s name) మార్చి దానిని సేవ్(save) చేయండి.
08:29 ఇప్పుడు, పేజీ(page)కి రెండు బాణాలను జోడించండి.
08:33 రెండవ పేజీ లో పేజీ సంఖ్య మరియు తేదీని చేర్చండి.
08:38 ఇప్పుడు, గత ఐదు చర్యల ను అన్ డూ(undo) మరియు రీడు (redo) చేయండి.
08:42 అన్ డూ(undo) మరియు రీడు (redo) ఎంపికలు అన్ని చర్యల ను అన్ డూ(undo) చేస్తాయో లేదో తనిఖీ చేయండి.

కొన్ని చర్యలు అన్ డూ(undo) చెయ్యబడ్డాయో లేదో కూడా తనిఖీ చేయండి.

08:51 వాటర్ సైకిల్ స్లయిడ్ (WaterCycleSlide)గా ఈ పేజికి పేరు ఇద్దాం.
08:54 పేజేస్ (Pages) పేన్లో స్లయిడ్ ఎంచుకొని, రైట్ క్లిక్ చేసి రేనేమ్ పేజి(Rename Page) ఎంచుకోండి.
09:00 రేనేమ్ స్లయిడ్(Rename Slide) డైలాగ్-బాక్స్ తెరుచుకుంటుంది.
09:03 నేమ్ (Name) ఫీల్డ్ లో , పేరు వాటర్ సైకిల్ స్లయిడ్ (WaterCycleSlide) అని ప్రవేశ పెట్టండి.
09:08 ఓకే(OK) క్లిక్ చేయండి
09:10 ఇప్పుడు, ఈ పేజీ మధ్య కర్సర్ ఉంచండి.
09:14 ఇక్కడ వాటర్ సైకిల్ స్లయిడ్ (WaterCycleSlide) అనే పేరును చూడగలుగుతున్నారా?
09:18 పేజీకి సంబంధించిన పేరు పెట్ట డం ఒక మంచి పద్ధతి.
09:23 ఇప్పుడు ప్రింటింగ్ ఎంపికలు సెట్ చేసి, వాటర్ సైకిల్ (WaterCycle ) రేఖా చిత్రం ను ప్రింట్ చేద్దాం.
09:28 మెయిన్(Main ) మెనూ లో , ఫైల్(File ) పై క్లిక్ చేసి, తర్వాత ప్రింట్(Print) పై క్లిక్ చేయండి.
09:33 ప్రింట్(Print) డైలాగ్-బాక్స్ కనిపిస్తుంది.
09:36 జనరల్(General ) మరియు ఆప్షన్స్ (Options ) టాబ్ల కింద వున్న సెట్టింగుల గురించి తెలుసుకోవడానికి,
09:41 లిబ్రేఆఫీస్ రైటర్ సిరీస్లోని వ్యూయింగ్ అండ్ ప్రింటింగ్ డాకుమెంట్స్(Viewing and printing Documents) మీద ట్యుటోరియల్ను చూడండి.
09:48 ఎడమ వైపున మీరు పేజీ ప్రివ్యూ(page preview) ప్రాంతం చూస్తారు.
09:53 ప్రింట్(Print) డైలాగ్-బాక్స్కి కుడి వైపున నాలుగు టాబ్స్ వున్నవి.
09:58 జనరల్, లిబరే ఆఫీసు డ్రా, పేజి లేఔట్, ఆప్షన్స్ (General, LibreOffice Draw, Page Layout, Options).
10:04 లిబరే ఆఫీసు డ్రా (LibreOffice Draw)కు సంబందించిన ఎంపికలను చూడండి.
10:09 లిబరే ఆఫీసు డ్రా (LibreOffice Draw) టాబ్ పై క్లిక్ చేయండి.
10:13 పేజీ నేమ్ మరియు డేట్ అండ్ టైం బాక్సుల పై చెక్ పెట్టండి.
10:17 ఇది రేఖా చిత్రం తో పాటు పేజీ పేరు, తేదీ మరియు సమయం కూడా ముద్రిస్తుంది.
10:23 రేఖా చిత్రాన్ని ప్రింట్ చేయడానికి, ఒరిజినల్ కలర్స్(Original colors) మరియు ఫీట్ టు ప్రింటబ్ల్ పేజి(Fit to printable page) పై క్లిక్ చేయండి.
10:29 వాటర్ సైకిల్ (WaterCycle) రేఖా చిత్రాన్ని ప్రింట్ చేయుటకు మీ కంప్యూటర్ నుండి ప్రింట్(Print) పై క్లిక్ చేయండి.
10:34 ఒక వేళ మీరు మీ ప్రింటర్ను సరిగ్గా కన్ఫిగర్ చేసి ఉంటే, ఇప్పుడు మీ రేఖా చిత్రం ప్రింటింగ్ ప్రారంభం కావాలి.
10:40 ఇప్పుడు మనం లిబరే ఆఫీసు డ్రా ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం.
10:45 ఈ ట్యుటోరియల్ లో, మీరు నేర్చుకున్నది:
10:48 డ్రా(Draw) పేజీ కోసం అంచులను సెట్ చేయడం.
10:50 పేజీ నంబర్లు , తేదీ మరియు సమయం ఎలా చేర్చడం.
10:54 చర్య లను అన్డూ(undo)(దిద్దుబాటు ) మరియు రీడు(Redo)(పునరావృతం) చేయుట,
10:57 పేజి రీనేమ్ (Rename)మరియు ఒక పేజిని ప్రింట్ చేయడం.
11:01 ఇక్కడ మీకు ఒక అసైన్మెంట్ ఉంది.
11:03 ఇంకా రెండు పేజీలను చేర్చండి
11:06 ప్రతి పేజీ కోసం వివిధ మార్జిన్లు సెట్ చేసి, మునుపటి ట్యుటోరియల్ లో సృష్టించిన లేబుల్ మరియు ఇన్విటేషన్ లను ప్రింట్ చేయండి.
11:14 ప్రతి పేజీలో పేజి కౌంట్(Page count) చేర్చి, ఏమి జరుగుతుందో గమనించండి.
11:21 ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
11:24 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది
11:28 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియోని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
11:32 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం,
11:34 స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది
11:37 ఆన్లైన్ పరీక్ష లో ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు జరిచేస్తుంది.
11:41 మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial. org సంప్రదించండి.
11:47 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము,
11:52 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
11:59 ఈ మిషన్ గురించి స్పోకెన్ హైఫన్ ట్యుటోరియల్ డాట్ org స్లాష్ NMEICT హైఫన్ ఇంట్రో లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది.
12:10 ఈ ట్యూటోరియల్ని తెలుగులోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సులువు తీసుకున్తున్నాను, ధన్యవాదములు.

Contributors and Content Editors

Chaithaya, Madhurig, PoojaMoolya