LibreOffice-Suite-Draw/C2/Create-simple-drawings/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 15:22, 3 March 2017 by Pratik kamble (Talk | contribs)
Time | Narration |
00:02 | లిబరే ఆఫీసు డ్రా లో హౌ టు క్రిఏట్ సింపుల్ డ్రాయింగ్స్(How to Create Simple Drawings)పై స్పోకెన్ ట్యుటోరియల్‌కు స్వాగతం. |
00:08 | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేది: |
00:13 | రేఖలు, బాణాలు మరియు దీర్ఘ చతురస్రాల లాంటి ప్రాథమిక ఆకారాలు. |
00:17 | ప్రాథమిక రేఖాగణిత ఆకారాలు, చిహ్నాలు, నక్షత్రాలు, బ్యానర్ల ను వాడి సాధారణ రేఖా చిత్రాలు ఎలా సృష్టించాలి, |
00:22 | ఒక ఆబ్జెక్ట్ ను ఎంచుకోవడం, తరలించడo మరియు తొలగించడo. |
00:27 | రూలర్ (ruler) మరియు అలైన్(align) టూల్బార్ ను ఉపయోగించి ఆబ్జెక్ట్లను సరైన స్థానంలో పెట్టడం. |
00:33 | ఇక్కడ, మనం ఉపయోగిస్తున్నది :
ఉబుంటు లినక్సు వర్షన్ 10.04 మరియు లిబరే ఆఫీసు సూట్ వర్షన్ 3.3.4. |
00:42 | ఆబ్జెక్ట్ అనే పదంను నిర్వచిద్దాం. |
00:44 | ఆబ్జెక్ట్ అనే పదం, డ్రా (Draw)లో ఉపయోగించే ఆకారాలు లేదా ఆకారాల సమూహలను అనగా రేఖలు, చతురస్రాలు, బాణాలు, ఫ్లో చార్ట్ లు మరియు ఇతరులను సూచిస్తుంది. |
00:55 | ఈ స్లయిడ్లో చూపిన అన్ని ఆకారాలు ఆబ్జెక్ట్ లుగా సూచించ బడుతాయి. |
00:59 | డెస్క్‌టాప్ పై సేవ్ చేసిన వాటర్ సైకిల్ (WaterCycle) ఫైల్‌ను తెరుద్దాం. |
01:04 | ముందుగా ఒక ఆబ్జెక్ట్ ను ఎలా ఎంచుకోవాలో నేర్చుకుoదాం. |
01:08 | మేఘాన్ని ఎంచుకునేదుకు దాని పై క్లిక్ చేయండి. |
01:13 | ఇలా చేయడం వల్ల ఎనిమిది హ్యాండిల్స్ కనిపిస్తాయి. |
01:16 | హ్యాండిల్స్- హ్యాండిల్స్ అనగా ఎంచుకున్న ఆబ్జెక్ట్ యొక్క అన్ని పక్కల కనిపించే చిన్న నీలం లేదా ఆకుపచ్చ చతురస్రాలు. |
01:22 | హ్యాండిల్స్ మరియు వాటి ఉపయోగం గురించి తరువాతి ట్యుటోరియల్స్‌లో నేర్చుకుంటారు. |
01:27 | రేఖాచిత్రాన్నికి మరి కొన్ని ఆబ్జెక్ట్ లను జోడిద్దాం. |
01:30 | నేలను చూపడానికి ఒక దీర్ఘచతురస్రO జోడింద్దాం. |
01:34 | డ్రాయింగ్(Drawing) టూల్బార్ నుండి , బేసిక్ షేప్స్ (Basic Shapes) పై క్లిక్ చేసి తరవాత రేక్ట్యాగిల్ (Rectangle)పై క్లిక్ చేయండి. |
01:39 | కర్సరుని పేజీ(page) పైకి కదిపితే. ప్లస్ గుర్తు తో పాటు కాపిటల్ 'I' కనిపిస్తుంది. |
01:45 | ఒక దీర్ఘ చతురస్రం గీయడానికి మౌస్ ఎడమ బటన్ పట్టుకొని లాగండి. |
01:50 | మౌస్ బటన్ వదలండి. |
01:52 | నేల నుండి మబ్బుకి నీటి ఆవిరి యొక్క కదలిక చూపించడానికి కొన్ని బాణాలు గీద్దాం. |
02:00 | ఒక రేఖ గీయడానికి డ్రాయింగ్(Drawing) టూల్‌బార్‌లో లైన్(Line)పై క్లిక్ చేద్దాం. |
02:04 | పేజి(page) వైపు కర్సర్‌ను కదపండి. |
02:06 | ప్లస్ గుర్తు తో ఒక స్లాన్టింగ్ డాష్ను చూస్తారు. |
02:10 | మౌస్ ఎడమ బటన్ పట్టుకొని పై నుండి కిందికి లాగండి. |
02:15 | ఒక సరళ రేఖ ను గీశారు! |
02:17 | లైన్ కు రెండు హ్యాండిల్స్ ఉన్నాయి. |
02:20 | రేఖకు ఒక ఆరో హెడ్ జోడిద్దాం. |
02:23 | రేఖను ఎంచుకోండి. |
02:25 | కంటేక్స్ట్ మెనూ కొరకు రైట్ క్లిక్ చేసి లైన్(Line) పై క్లిక్ చెయ్యండి. |
02:30 | లైన్(Line) డైలాగ్ బాక్స్ చూస్తారు. ఆరో స్టైల్స్ (Arrow styles) ట్యాబ్ పై క్లిక్ చేసి తర్వాత ఆరో స్టైల్(Arrow style) డ్రాప్-డౌన్ పై క్లిక్ చేయండి. |
02:39 | ఇది అందుబాటులో వున్న ఆరో స్టైల్స్ (Arrow styles)ని చూపిస్తుంది. |
02:43 | ఆరో (Arrow) అనే మొదటి ఎంపికను ఎంచుకోండి. |
02:46 | ఓకే(ok) క్లిక్ చేయండి. |
02:48 | ఇది లైన్ యొక్క రెండు చివరలకు ఆరో హెడ్స్ ను ఎంచుకున్న స్టైల్ లో జోడిస్తుంది. |
02:52 | కానీ మనకు లైన్ యొక్క ఒకే చివరలో ఆరో హెడ్ కావాలి. |
02:57 | కాబట్టి, ముందుగా Ctrl + Z నొక్కి మార్పును అన్డూ(undo) చేద్దాం. |
03:02 | కాంటెక్స్ట్ మెనూ కోసం మళ్ళీ రైట్ క్లిక్ చేయండి. |
03:05 | లైన్(Line) ట్యాబ్ పై క్లిక్ చేయండి. |
03:09 | ఆరో స్టైల్స్ (Arrow styles) కింద, స్టైల్(style) అనే ఫీల్డ్ చూస్తారు. |
03:14 | రెండు డ్రాప్-డౌన్ బాక్సులను చూస్తారు- ప్రతి లైన్ ముగింపు కోసం ఒకటి. |
03:19 | ఎడమ డ్రాప్ డౌన్ బాక్స్ పై క్లిక్ చేసి Arrow(ఆరో) ఎంచుకోండి. |
03:23 | కుడి డ్రాప్-డౌన్ బాక్స్‌లో, None(నన్) ఎంచుకోండి. |
03:26 | ఓకే(ok) క్లిక్ చేయండి. |
03:28 | లైన్ పైన ముగింపు వద్ద ఒక ఆరో హెడ్ జతపర్చబదిందని గమనించండి. |
03:33 | లైన్స్ అండ్ ఆరో స్(Lines and Arrows) ఎంపిక వాడి కూడా బాణాలు గీయవచ్చు. |
03:38 | ఈ బాణం పక్కన ఇంకా రెండు బాణాలు గీద్దాం. |
03:42 | డ్రాయింగ్(Drawing) టూల్బార్ నుండి Lines and Arrows పై క్లిక్ చేసి Line Starts with Arrow ఎంచుకోండి. |
03:48 | డ్రా పేజీ(Draw page)కి కర్సరును కదపండి. |
03:51 | మౌస్ ఎడమ బటన్ పట్టుకొని పై నుండి కిందికి లాగండి. |
03:56 | బాణాన్ని ఈ విధంగా గీయడం సులభం కదా? |
04:00 | ఇదే పద్ధతిలో మరో బాణం జోడించండి. |
04:06 | ఈ ట్యుటోరియల్‌లో విరామం తీసుకొని ఈ అసైన్మెంట్ చేయండి. |
04:09 | మై వాటర్ సైకిల్(MyWaterCycle), ఫైల్ లో ఒక లైన్ గీయండి. |
04:13 | లైన్ ఎంచుకొని లైన్(Line) డైలాగ్ బాక్స్ తెరవండి. |
04:16 | లైన్ ప్రాపర్టీస్(Line Properties) ఫీల్డ్ కింద, లైన్ల యొక్క style, color, width మరియు transparency మార్చండి . |
04:24 | ఆరో స్టైల్స్(Arrow Styles) ఫీల్డ్ కింద, ఆరో స్టైల్స్ మార్చండి. |
04:28 | తర్వాత, ఒక స్టార్ గీద్దాం. |
04:31 | డ్రాయింగ్(Drawing) టూల్బార్ వద్దకు వెళ్ళి స్టార్స్(Stars) పక్కన చిన్న నల్ల త్రికోణం క్లిక్ చేయండి. |
04:37 | 5-పాయింట్ స్టార్(5-Point Star) ఎంచుకొండి. |
04:41 | మబ్బు పక్కన కర్సర్‌ని ఉంచండి. |
04:44 | మౌస్ ఎడమ బటన్ పట్టుకొని, ఎడమ వైపుకు లాగండి. |
04:48 | ఒక స్టార్‌ని గీశారు! |
04:50 | ఆబ్జెక్ట్ ను ఎలా తరలించాలో మరియు ఎలా తొలగించాలో నేర్చుకుందాం. |
04:54 | ఆబ్జెక్ట్ ను కదపడానికి, దానిని ఎంచుకోని, కావలసిన స్థానానికి లాగండి. |
04:59 | మౌస్ బటన్ వదలండి. |
05:02 | కీబోర్డ్ పై వున్న అప్, డౌన్, మరియు సైడ్ బాణం(up, down, side, arrow) కీలను వాడి ఒక ఆబ్జెక్ట్‌ను తరలించవచ్చు. |
05:08 | ఆబ్జెక్ట్ లను కదపడం తేలిక కదా? |
05:11 | ఒక ఆబ్జెక్ట్ ను తొలగించడానికి, దానిని ఎంచుకొని కీబోర్డ్ నుండి డిలీట్(Delete)కీ నొక్కండి. |
05:17 | ఆబ్జెక్ట్ తొలగించబడింది. ఇది కూడా తేలిక. |
05:20 | ప్రాథమిక సహాయాలు- రూలర్ (Ruler) మరియు అలైన్(align) టూల్బార్ల గురిoచి నేర్చుకుందాం. |
05:26 | పేజీ మార్జిన్లు ఏర్పాటు చేయడానికి, మరియు కొలతల యూనిట్లు సవరించడానికి రూలర్‌ను ఉపయోగిస్తారు. |
05:31 | అలైన్(Align) టూల్‌బార్‌ని ఆబ్జెక్ట్ లను సరైన స్థానం లో పెట్టడానికి ఉపయోగిస్తారు. |
05:35 | రూలర్(Ruler) డ్రా వర్క్ స్పేస్ (Draw workspace) పైన మరియు ఎడమ వైపు కనిపిస్తుంది. |
05:40 | కొలతల యూనిట్లు ఏర్పాటు చేయడానికి, పైన వున్న రూలర్(Ruler) పై రైట్ క్లిక్ చేయండి. |
05:45 | కొలత యూనిట్ల జాబితా చూస్తారు. |
05:48 | సెంటీమీటర్(Centimeter) పై క్లిక్ చేయండి. |
05:50 | పైన ఉన్నరూలర్(top ruler)కి కొలత యూనిట్ సెంటీమీటర్‌కు సెట్ చేయబడినది. |
05:55 | అదే విధంగా, ఎడమ వైపు రూలర్(ruler)కి కొలతలు సెట్ చేద్దాం. |
06:00 | ఆబ్జెక్ట్ స్ లను సరైన స్కేల్‌కు చిత్రీకరించుటకు, రెండు రూలర్ల కొలతలు ఒకే యూనిట్‌కు సెట్ చేయ్యడం గుర్తుంచుకోండి. |
06:08 | వాడుకలో వున్న రూలర్ తెలుపురంగులో ఉందని గమనించoడి. |
06:12 | పేజీ సెటప్(Page Setup)లో సెట్ చేసిన పేజీ మార్జిన్ల విలువలను రూలర్(ruler) చివరలు సూచిస్తాయి. |
06:19 | ఆబ్జెక్ట్ స్ కోసం కొలతలను రూలర్(Ruler) ఎలా ప్రదర్శిస్తుందో చూద్దాం. |
06:23 | క్లౌడ్ ఎంచుకోండి. |
06:25 | మీరు రూలర్(ruler) పైన రెండు చిన్న ప్రారంభ మరియు ముగింపు మార్కులు చూసారా? |
06:29 | ఇవి మేఘం అంచులని నిర్వచిస్తాయి. |
06:32 | రూలర్ పై ఈ మార్కులు తరలిస్తే, తదనుగుణంగా చిత్రంలో మార్పులు గమనించవచ్చు. |
06:38 | రూలర్ పేజీ పై ఒక ఆబ్జెక్ట్ యొక్క పరిమాణం చూపిస్తుంది. |
06:42 | ఇది ఆబ్జెక్ట్ ను పేజీ పై ఉంచడానికి అనుమతిస్తుంది మరియు పేజీ సరిహద్దులు చూపిస్తుంది. |
06:49 | మరొక ప్రాథమిక సహాయం- అలైన్(align) టూల్బార్ వద్దకు వెళ్దాం. |
06:53 | అలైన్(align) టూల్బార్ ఉపయోగించి ఎంచుకున్న ఆబ్జెక్ట్ ను ఎడమకి, కుడికి, పైకి, క్రిందకి మరియు మధ్యలోకి సమలేఖనం చేయవచ్చు. |
07:01 | అలైన్(Align) టూల్‌బార్‌ను ఎనేబుల్ చేయడానికి మెయిన్ మెనూ(Main Menu) వద్దకు వెళ్ళి వ్యూ(View) పై క్లిక్ చేయండి. |
07:07 | వ్యూ(View) మెనూ, దిగువన టూల్‌బార్స్(Toolbars)పై క్లిక్ చేయండి. |
07:11 | మీరు టూల్‌బార్స్ యొక్క జాబితా చూస్తారు. |
07:13 | అలైన్(Align) క్లిక్ చేయండి. |
07:15 | అలైన్(Align) టూల్బార్ చూస్తారు. |
07:18 | వివిధ అలైన్(Align) ఎంపికలు ఉపయోగించినప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఎలా సమలేఖనo చేయబడుతుందో చూద్దాం. |
07:24 | క్లౌడ్ ఎంచుకోండి. |
07:26 | అలైన్(Align) టూల్బార్ పైన, లెఫ్ట్(Left) క్లిక్ చేయండి. |
07:29 | మేఘం ఎడమ వైపు సమలేఖనo చేయబడినది. |
07:32 | సెంటర్డ్(Centered)మరియు Centre(సెంటర్) ఈ రెండు ఎంపికల మధ్య వ్యత్యాసం అర్థం చేసుకుందాం. |
07:38 | మనం వృత్తాన్ని Centre(సెంటర్)కు సమలేఖనo చేసి తర్వాత సెంటర్డ్(Centered)కు చేద్దాం. |
07:43 | ముందుగా, వృత్తాన్ని కుడి వైపుకు సమలేఖనo చేద్దాం. |
07:47 | వృత్తాన్ని ఎంచుకొని అలైన్ (Align) టూల్బార్ పై క్లిక్ చేసి, రైట్(Right) పై క్లిక్ చేయండి. |
07:52 | అలైన్(Align) టూల్బార్ లో నుండి, Centre(సెంటర్) పై క్లిక్ చేయండి. |
07:56 | వృత్తం మధ్య స్థానానికి సమలేఖనం అయింది. |
07:59 | సెంటర్(Centre) ఎంపిక ఆబ్జెక్ట్ ను సరిగ్గా పేజీ ఎగువ మరియు దిగువన అంచుల మధ్య కేంద్ర్రేకరిస్తుంది. |
08:06 | ఇది పేజీ వెడల్పుతో పాటు ఆబ్జెక్ట్స్ ను తరలించదు. |
08:10 | అలైన్(Align) టూల్బార్ నుండి, సెంటర్డ్(Centered) ఎంచుకోండి. |
08:15 | వృత్తం పేజీ మధ్యలో కి సర్దుబాటు చేయబడినది. |
08:18 | సెంటర్డ్(Centered) ఎంపిక వృత్తాన్ని పేజీ మధ్యలోకి సర్దుబాటు చేస్తుంది. |
08:23 | ఇది ఎగువ మరియు దిగువ అంచులు మరియు పేజీ వెడల్పుకు అనుగుణముగా ఆబ్జెక్ట్ లను తరలిస్తుంది. |
08:33 | నమూనా రేఖా చిత్రం ప్రకారం ఆబ్జెక్ట్ లను తిరిగి సరైన స్థానాలకు తరలిద్దాం. |
08:40 | ఫైల్ని మూసే ముందు దానిని సేవ్(save) చేయడం గుర్తు పెట్టుకోండి. |
08:43 | ఒక అసైన్మెంట్, |
08:46 | మై వాటర్ సైకిల్ (MyWaterCycle) ఫైల్లో, ఒక పేజీని జోడించండి. |
08:50 | ఈ రెండు చిత్రాలను సృష్టించoడి. |
08:53 | ఆరో కీలను ఉపయోగించి వాటిని తరలించoడి. |
08:55 | గీసిన ఏ ఆబ్జెక్ట్ నైన ఎంచుకోని తొలగించండి. |
08:59 | కొన్ని ఆబ్జెక్ట్ ల యొక్క పరిమాణాన్ని కొలవడానికి రూలర్(ruler)ను ఉపయోగించండి. |
09:04 | అలైన్(Align) టూల్బార్ ఉపయోగించి ఆబ్జెక్ట్ లను పేజీ మధ్యలోకి సమలేఖనం చేయండి. |
09:11 | ఇప్పుడు డ్రా(Draw) ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం. |
09:15 | ఈ ట్యుటోరియల్‌లో, మనం నేర్చుకున్నది ఈ కింది వాటిని వాడి సాధారణ రేఖా చిత్రాలను ఎలా సృష్టించాలి: |
09:19 | * ప్రాథమిక ఆకారాలు అనగా రేఖలు, బాణాలు, దీర్ఘ చతురస్రాలు. |
09:24 | * ప్రాథమిక రేఖాగణిత ఆకారాలు, చిహ్నాలు, నక్షత్రాలు మరియు బ్యానర్లు. |
09:29 | ఒక ఆబ్జెక్ట్‌ని ఎంచుకోని తొలగించడం నేర్చుకున్నారు. |
09:32 | రూలర్(ruler) మరియు అలైన్(align) టూల్బార్లను ఉపయోగించి ఆబ్జెక్ట్ లను సరైన స్థానంలో పెట్టడం. |
09:37 | ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
09:41 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ సారాంశం. |
09:44 | మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియోని డౌన్లోడ్ చేసి చూడండి. |
09:48 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: |
09:51 | * స్పోకెన్ ట్యూటోరియల్స్ని ఉపయోగించి వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది. |
09:54 | ఆన్లైన్ పరీక్ష లో ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది. |
09:58 | మరిన్ని వివరాలకు contact@spoken-tutorial. orgను సంప్రదించండి. |
10:04 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, |
10:09 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
10:17 | ఈ మిషన్ గురించి స్పోకెన్ హైఫన్ ట్యుటోరియల్ డాట్ org స్లాష్ NMEICT హైఫన్ ఇంట్రో లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది. |
10:27 | ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు. |