Linux/C2/Redirection-Pipes/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:00 | రీడైరక్షన్ మరియు పైప్స్ పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్‌కు స్వాగతం. |
00:07 | నేను ఉబంటు 10.04 ఉపయోగిస్తున్నాను. |
00:09 | మీకు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మరియు కమాండ్ల గురించి ప్రాధమిక అవగాహన ఉందని మేము భావిస్తున్నాము. |
00:16 | మీకు ఆసక్తి ఉంటే, అది క్రింది వెబ్‌సైట్‌లో, మరొక స్పోకెన్ ట్యుటోరియల్ ద్వారా లభ్యమవుతుంది. |
00:22 | లైనక్స్ కేస్ సెన్సిటివ్ అని కూడా గమనించండి. |
00:25 | ప్రత్యేకంగా తెలుపబడితే తప్ప ఈ ట్యుటోరియల్‌లోని అన్ని కమాండ్లు లోయర్ కేసులో ఉంటాయి. |
00:32 | లైనక్స్‌లో మనం ఎక్కువ భాగం పనిని టెర్మినల్ ద్వారా చేస్తాము. |
00:35 | ఒక కమాండ్‌ను ఎగ్జిక్యూట్ చేయాలంటే, సాధారణంగా మనం కీబోర్డ్ ద్వారా టైప్ చేస్తాం. |
00:39 | మనం తేదీ మరియు సమయం కనుక్కోవాలనుకోండి. |
00:41 | కీబోర్డ్ ద్వారా "date" అని టైప్ చేసి ఎంటర్ నొక్కుతాం. |
00:46 | అంటే మనం సాధారణంగా కీబోర్డ్ ద్వారా ఇన్‌పుట్ అందిస్తాం. |
00:48 | అదేవిధంగా మన కమాండ్ యొక్క అవుట్‌పుట్ కూడా టెర్మినల్ విండో వద్ద ప్రదర్శింపబడటాన్ని మనం చూస్తాం. |
00:56 | మనం ఏదో కమాండ్‌ను ఎగ్జిక్యూట్ చేసేటపుడు కొన్ని తప్పులు దొర్లాయని కూడా అనుకుందాం. |
00:59 | ఉదాహరణకు మనం "cat space aaa" అని టైప్ చేసి ఎంటర్ నొక్కాం. |
01:05 | aaa అనే పేరు గల ఫైల్ అసలు లేదు. |
01:08 | అదే తెలుపుతూ ఒక ఎర్రర్ ప్రదర్శించబడుతుంది. |
01:10 | ఇప్పుడు ఈ ఎర్రర్ టెర్మినల్ విండో పై కూడా వస్తుంది. అందవలన టెర్మినల్ వద్ద కూడా ఎర్రర్ రిపోర్టింగ్ చూస్తాం. |
01:20 | ఇన్‌పుటింగ్, అవుట్‌పుటింగ్ మరియు ఎర్రర్ రిపోర్టింగ్ అనేవి కమాండ్లకు సంబంధించిన మూడు ప్రత్యేక చర్యలు. |
01:24 | రీడైరక్షన్ గురించి నేర్చుకునే ముందు మనం రెండు ముఖ్యమైన విషయాలను గురించి తెలుసుకోవాలి. అవి stream మరియు file descriptor. |
01:31 | Bash వంటి ఒక లైనక్స్ షెల్, ఇన్పుట్ అందుకొని, అవుట్పుట్ ను ఒక సీక్వెన్స్ లేదా క్యారెక్టర్ల ప్రవాహంలా పంపుతుంది. |
01:37 | ప్రతి క్యారెక్టర్ దాని ముందు మరియు వెనుక ఉన్నదాని నుండి స్వతంత్రంగా ఉంటుంది. |
01:41 | IO techniques ఉపయోగించడం ద్వారా Streams గ్రహించబడతాయి. |
01:44 | అసలైన క్యారెక్టర్ల వరుస ఒక ఫైల్, కీ బోర్డ్, ఒక విండో మొదలైన వాటిలో ఎక్కడ నుండి వచ్చింది లేదా వెళ్లింది అనేది ముఖ్యం కాదు. |
01:51 | లైనక్స్‌లో, ఒక ప్రాసెస్ యొక్క ప్రతి ఓపెన్ ఫైల్ ఒక పూర్ణసంఖ్యతో సంబంధం కలిగి ఉంటుంది. |
01:57 | ఈ సంఖ్యా విలువలు file descriptorsగా పిలువబడతాయి. |
02:05 | లైనక్స్ షెల్స్ మూడు ప్రామాణిక I/O streams ఉపయోగిస్తాయి. |
02:08 | వీటిలో ప్రతి ఒక్కటీ ఒక ప్రసిద్ధి చెందిన file descriptorతో సంబంధం కలిగి ఉంది. |
02:12 | Stdin అనేది ప్రామాణిక input stream. |
02:15 | అది కమాండ్లకు ఇన్‌పుట్ అందిస్తుంది. |
02:17 | అది file descriptor 0ను కలిగి ఉంది. |
02:19 | Stdout ప్రామాణిక output stream. |
02:22 | అది కమాండ్ల నుండి అవుట్‌పుట్‌లను చూపుతుంది. దాని file descriptor 1 |
02:26 | stderr ప్రామాణిక error stream. అది కమాండ్ల నుండి error output చూపుతుంది. అది file descriptor 2ను కలిగి ఉంది. |
02:36 | Input streams ప్రోగ్రాములకు ఇన్పుట్ అందిస్తాయి. |
02:40 | డీఫాల్ట్ గా అది టెర్మినల్ కీస్ట్రోక్స్ నుండి తీసుకుంటుంది. |
02:44 | Output streams టెక్స్ట్ కారక్టర్లను డీఫాల్ట్ గా టెర్మినల్కు ముద్రిస్తాయి. |
02:47 | వాస్తవానికి ఈ టెర్మినల్ ఒక ASCII టైప్‌రైటర్ లేదా డిస్ ప్లే టెర్మినల్. |
02:52 | కానీ అది ఇప్పుడు తరచుగా ఒక గ్రాఫికల్ డస్క్ టాప్ పై టెక్స్ట్ విండోగా ఉంటుంది. |
02:56 | డీఫాల్ట్ గా 3 streams కొన్ని ఫైళ్లతో జతకూడి ఉన్నాయని మనం చూసాము. |
03:01 | కానీ, లైనక్స్‌లో మనం ఈ సాధారణ రీతిని మార్చవచ్చు. |
03:04 | మనం ఈ 3 streamsను ఇతర ఫైళ్లకు కలుపవచ్చు. |
03:07 | ఈ ప్రక్రియ redirectionగా పిలువబడుతుంది. |
03:09 | ఇప్పుడు మనం 3 streamsలో redirection ఏ విధంగా చేస్తామో చూద్దాం. |
03:14 | ముందు మనం standard input ఏ విధంగా redirect చేయబడుతుందో చూద్దాం. |
03:17 | మనం < (left angled bracket) operatorను ఉపయోగించి ఒక ఫైల్ నుండి standardin redirect చేద్దాం. ఏ విధంగా చేస్తామో చూద్దాం. |
03:22 | ఒక ఫైల్‌లోని లైన్లు, పదాలు మరియు క్యారెక్టర్ల సంఖ్యను కనుగొనడానికి wc కమాండ్ ఉపయోగపడుతుందని మనకు తెలుసు. |
03:28 | టెర్మినల్ విండోపై wc అని టైప్ చేయండి. |
03:31 | ఇప్పుడు ఎంటర్ నొక్కండి. |
03:32 | ఏం జరుగుతుంది ?? మనకు ఒక బ్లింకింగ్ కర్సర్ కనిపిస్తుంది. అంటే మనం కీబోర్డ్ ద్వారా ఎంటర్ చేయాలి |
03:37 | ఉదాహరణకు "This tutorial is very important" అని టైప్ చేయండి. |
03:46 | ఇప్పుడు ఎంటర్ నొక్కండి. |
03:48 | ఇప్పుడు Ctrl మరియు d కీ లను కలిపి నొక్కండి. |
03:52 | ఇప్పుడు మనం ఎంటర్ చేసిన లైన్ల పై కమాండ్ పనిచేస్తుంది. |
03:55 | ఈ కమాండ్ టెర్మినల్ పై అవుట్‌పుట్ ఇస్తుంది. |
03:57 | ఇక్కడ wc కమాండ్ తరువాత ఏ పైలూ ఇవ్వబడలేదు. |
04:01 | అందువలన అది ప్రామాణిక input stream నుండి input తీసుకుంటుంది. |
04:04 | ప్రామాణిక input stream డీఫాల్ట్ గా కీబోర్డ్‌తో జతకూడి ఉంటుంది. అందువలన wc కీబోర్డ్ నుండి ఇన్‌పుట్ తీసుకుంటుంది. |
04:12 | ఇప్పుడు మనం "wc space 'left-angled bracket" space test1 dot txt" అని వ్రాస్తే |
04:19 | wc మనకు ఫైల్ test1 dot txtలోని వరుసలు, పదములు మరియు అక్షరముల సంఖ్యను తెలుపుతుంది |
04:27 | ఇప్పుడు "wc space test1 dot txt" అని టైప్ చేయండి |
04:34 | మనకు అదే ఫలితం వస్తుంది. |
04:37 | అయితే తేడా ఏమిటి? |
04:39 | మనం "wc space test1dot txt" అని రాసినపుడు, కమాండ్ test1dot txt ఫైల్‌ను తెరచి చదువుతుంది |
04:46 | కానీ మనం "wc space 'left-angled bracket' test1 dot txt" అని రాసినపుడు, మనకు తెరుచుకోవడానికి ఏ ఫైలూ ఉండదు. |
04:53 | బదులుగా, అది standardin నుండి ఇన్‌పుట్ తీసుకోవడానికి చూస్తుంది. |
04:57 | ఇప్పుడు మనం standardinను ఫైల్ test1dot txtకి డైరెక్ట్ చేసాం. |
05:01 | అందువలన కమాండ్ test1 నుండి రీడ్ చేస్తుంది. |
05:04 | నిజానికి standardinకు డేటా ఎక్కడ నుండి వస్తుందనేది తెలియదు. |
05:10 | అందువలన, మనం ప్రామాణిక ఇన్ పుట్ ఎలా రీడైరక్ట్ చేయాలో చూసాం. |
05:12 | ఇప్పుడు మనం standard output మరియు standard errorను ఏ విధంగా రీడైరక్ట్ చేయాలో చూద్దాం. |
05:17 | output లేదా errorను ఒక ఫైల్కు రీడైరక్ట్ చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయి : |
05:20 | ఉదాహరణకి n అనేది file descriptorను సూచిస్తుందనుకోండి. nsingle right-angled bracket outputను file descriptor n నుండి ఒక ఫైల్‌కు బదిలీ చేస్తుంది. |
05:29 | ఫైల్‌కు మీరు ప్రామాణికతను రాయాలి. |
05:32 | ఒకవేళ ఫైల్ ఉనికిలో లోకపోతే, అది సృష్టించబడుతుంది. |
05:35 | అది ఉనికిలో ఉంటే, సాధారణంగా ఏ విధమైన హెచ్చరిక లేకుండానే ఉనికిలో ఉన్న విషయాలు పోతాయి. |
05:40 | ' n 'double right-angled bracket' కూడా outputను file descriptor n నుండి ఫైల్కు రీడైరక్ట్ చేస్తుంది. |
05:47 | మరలా, మీరు ఫైల్‌కు ప్రమాణం రాయవలసి ఉంటుంది. |
05:50 | ఫైల్ ఉనికిలో లేకపోతే, అది సృష్టించబడుతుంది. |
05:52 | అది ఉనికిలో ఉంటే, ఉనికిలో ఉన్న ఫైల్‌కు అవుట్‌పుట్ కూర్చబడుతుంది . |
05:59 | n సింగిల్ రైట్ ఏంగిల్ బ్రాకెట్లోని లేదా n డబుల్ రైట్ ఏంగిల్ బ్రాకెట్స్ లోని n file descriptorను సూచిస్తుంది. |
06:05 | అది వదలివేయబడితే, అప్పుడు standard output అనగా file descriptor 1 తీసుకోబడుతుంది. |
06:10 | అందువలన, ఒక right angle bracket మరియు 1 right angle bracket ఒకటే. |
06:15 | కానీ error streamను రీడైరక్ట్ చేయడానికి, మీరు 2 right angle bracket లేదా 2 double right angle bracket ఉపయోగించవలసి ఉంది. |
06:22 | దీనిని మనం ప్రయోగపూర్వకంగా చూద్దాం. |
06:24 | గత ఉదాహరణలో మనం ఒక ఫైల్ లేదా standardin పై wc కమాండ్ యొక్క ఫలితం టెర్మినల్ విండో పై ప్రదర్శింపబడుతుందని చూసాం. |
06:31 | ఇది టెర్మినల్ మీద కనబడకూడదంటే ఏమి చేయాలి? |
06:34 | సమాచారాన్ని తరువాత ఉపయోగించుకోవడానికి, మనం దానిని ఫైల్‌లో స్టోర్ చేయాలనుకుంటాం. |
06:38 | డీఫాల్ట్ గా wc దాని అవుట్‌పుట్‌ను standardoutలో రాస్తుంది. |
06:42 | Standardout డీఫాల్ట్ గా టెర్మినల్ విండోతో కలుపబడి ఉంటుంది. |
06:45 | అందవలన మనం అవుట్‌పుట్‌ను టెర్మినల్ విండోలో చూస్తాం. |
06:48 | అయితే మనం standardoutను ఒక ఫైల్కు రీడైరక్ట్ చేయగలిగితే, wc కమాండ్ నుండి అవుట్‌పుట్ ఆ ఫైల్‌లో రాయబడుతుంది. |
06:57 | "wc space test1 dot txt 'right-angled bracket' wc_results dot txt" అని వ్రాసి. |
07:09 | ఎంటర్ నొక్కండి. |
07:11 | ఇది నిజంగా జరిగిందా అని చూడటానికి మనం wc_results dot txt by the c-a-t commandలోని విషయాలను డిస్ప్లే చెయ్యవచ్చు. |
07:23 | అది జరిగింది. |
07:24 | ఒకవేళ, మనకు అదే డైరక్టరీలో మరొక ఫైల్ test2 ఉంటే. |
07:30 | Now we again execute the command with test2 file. We type "wc space test2 dot txt 'right-angled bracket' wc_results dot txt" |
07:30: | మనం మరలా test2 ఫైల్ తో కమాండ్‌ను ఎగ్జిక్యూట్ చేయవచ్చు. "wc space test2 dot txt 'right-angled bracket' wc_results dot txt" అని టైప్ చేద్దాం. |
07:44 | wc_results ఫైల్ లోని విషయాలు ఓవర్ రైట్ చేయబడతాయి. |
07:48 | మనం దీనిని చూద్దాం. |
07:56 | దానికి బదులుగా మనం "wc space test1 dot txt 'right-angled bracket' twice wc underscore results dot txt" అని రాస్తే |
08:07 | కొత్త విషయాలు అప్పటికే ఉనికిలో ఉన్న wc underscore results dot txt ఫైల్‌లో ఉన్న విషయాలను ఓవర్ రైట్ చేయవు, అది అపెండ్ చేయబడుతుంది. |
08:15 | మనం దీనిని కూడా చూద్దాం. |
08:26 | standard errorను రీడైరక్ట్ చేయడం కూడా ఇదే విధంగా జరుగుతుంది. |
08:29 | ఒకే ఒక్క తేడా ఏంటంటే right angle bracket లేదా double right angle bracket గుర్తుకు ముందు మనం standard error యొక్క file descriptor సంఖ్యను తెలుపవలసి ఉంటుంది. |
08:38 | aaa అనే పేరుతో ఏ ఫైలూ ఉనికిలో లేదని మనకు తెలుసు, "wc space aaa" అని వ్రాయండి |
08:46 | షెల్ “No such file or directory” అనే error ఇస్తుంది. |
08:50 | మనకు స్క్రీన్ పై error messages రావడం ఇష్టం లేదనుకుందాం. వాటిని మరొక ఫైల్‌కు రీడైరక్ట్ చేయవచ్చు. |
08:55 | దీని కోసం మనం "wc space aaa space 2 'right-anged bracket' errorlog dot txt" కమాండ్ ఇవ్వవచ్చు |
09:06 | ఇప్పుడు టెర్మినల్ పై ఎర్రర్ కనిపించదు, కానీ అది errorlog dot txt ఫైల్‌లో రాయబడుతుంది |
09:12 | మనం దీనిని "cat space errorlog dot txt" కమాండ్ ద్వారా చూడవచ్చు |
09:22 | "cat space bbb space 2 'right-angled bracket' errorlog dot txt" కమాండ్ ఇవ్వడం ద్వారా నేను మరొక error చేసాననుకుంటే |
09:34 | పాత error ఓవర్ రైట్ అయి కొత్త error కనిపిస్తుంది. |
09:39 | "cat space errorlog dot txt" చూడండి. |
09:46 | ఈ ఎర్రర్ లను అన్నిటినీ మనం లిస్ట్ చేయాలంటే ఎలా?? మనం "wc space aaa space 2 'right-angled bracket' twice errorlog dot txt" కమాండ్‌ను ఇవ్వాలి |
09:58 | దీనిని మనం cat commandను ఉపయోగించి పరిశీలిద్దాం. |
10:06 | మనం మూడు స్ట్రీమ్‌లు standard out,standard in,standard error ఏవిధంగా రీడైరక్ట్ చేయబడ్డాయో మరియు వేర్వేరుగా మ్యానిప్యులేట్ చెయ్యబడ్డాయో చూసాం. మనం streamsను ఒకేసారి మార్చగలిగినపుడు, అంటే వేర్వేరు streams జతచేసినపుడు ఈ విషయం యొక్క వాస్తవ సామర్ధ్యం నిర్ధారించబడుతుంది.. |
10:20 | ఈ ప్రక్రియ పైప్ లైనింగ్‌గా పిలువబడుతుంది. |
10:22 | కమాండ్ల యొక్క వరుసలను సృష్టించడానికి Pipes ఉపయాగించబడతాయి. |
10:25 | ఒక పైప్, వరుసలోని ఒక కమాండ్ యొక్క అవుట్‌పుట్‌ను తరువాతి కమాండ్ యొక్క ఇన్‌పుట్‌తో కలుపుతుంది. |
10:30 | అది command1 vertical bar command2 hyphen option vertical bar command3 hyphen option1 hyphen option2 vertical bar command4 గా కనిపిస్తుంది |
10:46 | ఉదాహరణకు మనం ప్రస్తుత డైరక్టరీలోని ఫైళ్లు మరియు డైరక్టరీల మొత్తం సంఖ్యను తెలుసుకోవాలంటే |
10:51 | మనమేం చేయగలం? "ls space minus l" " ప్రస్తుత డైరక్టరీలోని అన్ని ఫైళ్లు మరియు డైరక్టరీల జాబితాను చూపుతుంది అని మనకు తెలుసు. |
10:58 | మనం ఒక ఫైల్ యొక్క అవుట్‌పుట్‌ను రీడైరక్ట్ చేయవచ్చు "ls space minus l 'right-angled bracket' files dot txt" |
11:08 | "cat space files dot txt" రన్ చేయండి |
11:14 | ఇప్పుడు ప్రతిలైను ఒక ఫైల్ లేదా డైరక్టరీ యొక్క పేరు అయి ఉంటుంది. |
11:17 | మనం ఈ ఫైల్ లోని మొత్తం వరుసలను లెక్కించాలంటే, files dot txtని ఉపయోగించవచ్చు. |
11:24 | దీనిని మనం "wc space minus l files dot txt" కమాండ్‌ను ఉపయోగించి చేయవచ్చు |
11:32 | మన పనికి ఉపయోగపడినప్పటికీ దీనితో కొన్ని సమస్యలు ఉన్నాయి. |
11:35 | ఇక్కడ files dot txt ఉన్నట్లు దీనికి ఒక మధ్యంతర ఫైల్ మనకు అవసరమౌతుంది. |
11:40 | ఒకవేళ మొదటి కమాండ్ చాలా సమాచారాన్ని తయారుచేసినట్లయితే, అది డిస్క్ మెమొరీని అనవసరంగా వృధా చేయవచ్చు. |
11:46 | అంతేకాక మనం అనేక వరుసలను కలపాలంటే, ఈ పద్ధతి చాలా నిదానంగా ఉంటుంది. |
11:50 | ఈ రకమైన పైప్‌లను ఉపయోగించడం ద్వరా మనం దీనిని తేలికగా చేయవచ్చు. మనం "ls space minus l 'vertical bar' wc space minus l" అని రాస్తాం |
12:01 | ఇదే ఫలితాన్ని మనం ఎంతో తేలికగా పొందవచ్చు. |
12:06 | ls కమాండ్ నుండి వచ్చిన అవుట్పుట్ wc కమాండ్ యొక్క ఇన్పుట్ అవుతుంది |
12:10 | పైప్‌లను ఉపయోగించి మనం కమాండ్ల యొక్క యింకా పొడవైన వరుసలను కలుపవచ్చు. |
12:15 | మల్టీపేజ్ డిస్ ప్లేలను చదవడం పైప్స్ యొక్క సాధారణ ఉపయోగం. |
12:19 | "cd space slash user slash bin" అని టైప్ చేయండి. |
12:24 | ఇప్పుడు మనం బిన్ డైరక్టరీలో ఉన్నాం. |
12:28 | "ls minus l" రన్ చేయండి |
12:31 | మనం అవుట్‌పుట్‌ను సరిగా చూడలేము. కానీ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పైప్ లను ఉపయోగించి కలిపితే, దానిని చూడగలం. |
12:37 | జాబితాను స్క్రోల్ చేయడానికి ఎంటర్ నొక్కండి. |
12:41 | దాని నుండి బయటకు రావడానికి "q" నొక్కండి. |
12:45 | ఇవి ఫైల్స్ తో పనిచేయడంలో మనకు సహాయపడే కొన్ని కమాండ్లు. |
12:48 | ఇంకా చాలా కమాండ్లు ఉన్నాయి. |
12:50 | అంతేకాక మనం చూసిన ప్రతి కమాండ్‌కి అనేక ఆప్షన్లు ఉన్నాయి. |
12:54 | man' కమాండ్ ను ఉపయోగించి వీటి గురించి మరింత తెలుసుకోవాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. |
12:58 | కమాండ్లను నేర్చుకోవడానికి వాటిని మళ్లీ మళ్లీ ఉపయోగించడమే ఉత్తమమైన మార్గం. |
13:04 | దీనితో మనం ఈ ట్యుటోరియల్ ముగింపుకి వచ్చాం. |
13:07 | స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్‌లో భాగం, దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది. |
13:15 | ఈ విషయం పై మరింత సమాచారం క్రింద ఉన్న లింక్‌లో లభ్యమవుతుంది. |
13:19 | ఈ రచనకు సహాయపడింది నిఖిల. వీడ్కోలు. ధన్యవాదములు. |