Linux/C2/File-Attributes/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:00 | లైనక్స్ ఫైల్ అట్రిబ్యూట్స్ పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్‌కు మీకు స్వాగతం. |
00:05 | ఈ ట్యుటోరియల్ కొరకు ముందుగా మీరు example1, example2, example3, example4, example5, మరియు testchown అనే ఖాళీ ఫైళ్లను సృష్టించాలి. |
00:18 | test_chown మరియు directory1 అనే పేరుతో ఖాళీ డైరెక్టరీలను కూడా సృష్టించండి. |
00:25 | ఫైల్ అట్రిబ్యూట్ అనేది ఒక కంప్యూటర్ ఫైల్‌ను వివరించే లేదా దానితో సంబంధం కలిగి ఉన్నమెటా డేటా. |
00:33 | ఫైల్ యొక్క యజమాని, ఫైల్ రకం, ఫైల్‌ను పొందడానికి అనుమతి వంటి ఫైల్ లక్షణాలను ఫైల్ అట్రిబ్యూట్ వివరిస్తుంది. |
00:45 | c-h own కమాండ్ ఫైల్ లేదా డైరెక్టరీ యొక్క యజమానిని మార్చడానికి ఉపయోగించబడుతుంది. ఇది ఒక అడ్మిన్ కమాండ్, రూట్ యూజర్ మాత్రమే ఒక ఫైల్ లేదా డైరెక్టరీ యొక్క యజమానిని మార్చగలడు. |
01:00 | chown space options space ownername space filename (ఫైల్ పేరు) లేదా directoryname (డైరక్టరీ పేరు) chown కమాండ్ యొక్క సింటాక్స్ |
01:13 | మనం chown కమాండ్తో క్రింది ఆప్షన్లను ఇవ్వవచ్చు. |
01:18 | -R : ప్రస్తుతం మీరు ఉన్న డైరక్టరీ యొక్క సబ్ డైరక్టరీలోని ఫైళ్ల అనుమతి మార్చడానికి. |
01:28 | -c : ప్రతి ఫైలుకు అనుమతి మార్చడానికి |
01:33 | -f : ఎర్రర్ మెసేజ్లు ప్రదర్శించకుండా ch ownను నివారిస్తుంది. |
1:37 | ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం |
01:40 | టెర్మినల్‌కు వెళ్లండి. మనం ఖాళీ ఫైళ్లు మరియు ఫోల్డర్లు సృష్టించిన డైరక్టరీకి వెళదాం. అందుకు cd స్పేస్ Desktop స్లాష్ file attribute టైపు చేసి ఎంటర్ నొక్కండి |
01:56 | ఇప్పుడు $ ls space ఇచ్చి -l space testchown అని కమాండ్ టైపు చేసి enter నొక్కండి. |
02:11 | testchown' ఫైల్ యొక్క యజమాని షాహిద్ అని మనం ఇక్కడ చూడవచ్చు. |
02:18 | ఫైల్ యొక్క యజమానిని మార్చడానికి, $ sudo space c-h own space అనగా a-n-u-s-h-a anusha స్పేస్ testchown అనగా t-e-s-t-c-h-o-w-n అని కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి |
02:36 | sudo పాస్వర్డ్ ఎంటర్ చేసి మరలా ఎంటర్ నొక్కండి |
02:44 | ఇప్పుడు $ ls space -l space t-e-s-t-c-h-o-w-n అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఇక్కడ మనం ఫైల్ యొక్క నూతన యజమాని అనూష అని చూడవచ్చు. |
03:03 | ఇప్పుడు మనం డైరెక్టరీ యొక్క యజమానిని ఏ విధంగా మార్చాలో చూద్దాం |
03:07 | $ ls –l కమాండ్ను టైప్ చేసి ఎంటర్ నొక్కండి. 'test_chown' డైరక్టరీ యొక్క యజమాని షాహిద్ అని మనం ఇక్కడ చూడవచ్చు. |
03:21 | డైరక్టరీ యొక్క యజమానిని మార్చడానికి, కమాండ్‌ను టైప్ చేయండి |
03:26 | $ sudo స్పేస్ chown స్పేస్ మైనస్ కాపిటల్ R స్పేస్ a-n-u-s-h-a anusha స్పేస్ spacetest_chown అనే డైరక్టరీ పేరును టైప్ చేసి ఎంటర్ నొక్కండి |
03:44 | అవసరమైతే sudo పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి, మరలా ఎంటర్ నొక్కండి. |
03:49 | మన సౌకర్యం కొరకు Clt+L నొక్కడం ద్వారా నేను స్క్రీన్‌ను క్లియర్ చేస్తాను. ఇప్పుడు $ ls స్పేస్ –l అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. డైరక్టరీ యొక్క నూతన యజమాని అనూష అని మనం చూడవచ్చు. |
04:06 | ఒకటి లేదా అంతకంటే ఎక్కవ ఫైళ్ల ఏక్సెస్ మోడ్ లేదా అనుమతులను మార్చడానికి chmod కమాండ్ ఉపయోగించబడుతుంది. |
04:13 | chmod కమాండ్ యొక్క సింటాక్స్ chmod స్పేస్ [options]స్పేస్ mode స్పేస్ ఫైల్పేరు స్పేస్ chmod స్పేస్ [options] స్పేస్ మనం chmod కమాండ్తో క్రింది ఆప్షన్లను ఇవ్వవచ్చు. |
04:29 | -c : మార్పులు చేసిన ఫైళ్ల గురించి సమాచారం ముద్రిస్తుంది. |
04:34 | -f : chmod మార్చలేని ఫైళ్ల గురించి యూజర్కు తెలియచేయదు. |
4:41 | ఇక్కడ ఈ క్రింది రకాల అనుమతులు ఉన్నాయి |
04:44 | r : రీడ్ w : రైట్ x : ఎగ్జిక్యూట్ s : సెట్ యూజర్ (లేదా గ్రూప్) ) ID |
04:54 | ప్రత్యామ్నాయంగా మనం మూడు-అంకెల ఆక్టల్ సంఖ్య ద్వారా అనుమతులను తెలియచేయవచ్చు. |
05:00 | మొదటి అంకె యజమాని అనుమతిని, రెండవ అంకె గ్రూప్ అనుమతిని, మూడవ అంకె ఇతరుల అనుమతిని సూచిస్తాయి. |
05:09 | క్రింది ఆక్టల్ విలువలను కూడటం ద్వారా అనుమతులు లెక్కించబడతాయి: 4 అనగా రీడ్, 2 అనగా రైట్, 1 అనగా ఎగ్జిక్యూట్ |
05:20 | ఇప్పుడు మనం chmod యొక్క కొన్ని ఉదహరణలు చూద్దాం, టెర్మినల్‌కు వెళ్లండి యింకా ఫైల్ example1కి add execute-by-user అనుమతి జతచేయడానికి కమాండ్‌ను ఎంటర్ చేద్దాం. |
05:30 | దానికి ముందు Clt+l నొక్కి నేను మరొకసారి స్క్రీన్ క్లియర్ చేస్తాను |
05:36 | ఇప్పుడు $ chmod space u+x space example1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి |
05:49 | $ ls space -l space example1 అని టైప్ చేసి మార్పులను చూడటానికి ఎంటర్ నొక్కండి |
06:01 | ఇక్కడ మనం ఫైల్ example1కు యజమాని ద్వారా read/write/execute అనుమతి, గ్రూప్ ద్వారా read/execute అనుమతి, మరియు ఇతరుల ద్వారా execute-only అనుమతి ఇవ్వబడటాన్ని చూడవచ్చు |
06:15 | ఇప్పుడు $ chmod space 751 space example1 కమాండ్‌ను టైప్ చేసి ఎంటర్ నొక్కండి |
06:26 | ఇప్పుడు $ ls space -l space example1 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి |
06:35 | పైన ఇచ్చిన కమాండ్, మన ఫైల్ example1 కు యజమాని ద్వారా read/write/execute అనుమతిని, గ్రూప్ ద్వారా read/execute అనుమతిని, మరియు ఇతరుల ద్వారా execute-only అనుమతిని ఇచ్చిందని గమనించవవచ్చు |
06:52 | ఫైల్ example1కు ప్రతి ఒక్కరికి read-only అనుమతిని ఇవ్వడానికి $ chmod space =r space example1 అనే కమాండ్‌ను టైప్ చేసి ఎంటర్ నొక్కండి |
07:08 | $ ls space -l space example1 కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి |
07:19 | ఫైల్ example1 కోసం ప్రతి ఒక్కరికి read only అనుమతి ఇవ్వబడిందని మనం ఇక్కడ చూడవచ్చు |
07:30 | అనుమతిని అనేకసార్లు మార్చడానికి మరియు ప్రతి ఒక్కరికీ read and execute అనుమతిని ఇవ్వడానికి ఇంకా directory1 డైరక్టరీ యజమానికి write అనుమతిని కూడా ఇవ్వడానికి కమాండ్‌ను టైప్ చేయండి |
07:44 | $ chmod space minus capital R space 755 space directory1 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి |
08:00 | $ ls space -l అని టైప్ చేసి మార్పులను చూడటానికి ఎంటర్ నొక్కండి |
08:09 | ఫైల్ example2 కోసం యూజర్‌కు execute అనుమతిని ఇవ్వడానికి $ chmod space u+x space example2 అనే కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి |
08:27 | ఇప్పుడు $ ls space -l space example2 అనే కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి . |
08:40 | ఇక్కడ యూజర్‌కు example2 కొరకు execute అనుమతి ఇవ్వబడటాన్ని మనం చూడవచ్చు |
08:50 | ఫైల్ example3 కొరకు గ్రూప్‌కు write అనుమతులను ఇవ్వడానికి $ chmod space g+w space example3 అనే కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి |
09:10 | $ ls space -l space example3 అనే కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి |
09:23 | ఇక్కడ మనం గ్రూప్‌కి write అనుమతి జతపరచబడటం చూడవచ్చు |
09:30 | అందరికి write అనుమతిని తొలగించడానికి $ chmod space a-w space example3 అని టైపు చేసి ఎంటర్ నొక్కండి |
09:45 | ఇప్పుడు $ ls space -l space example3 అని టైపు చేసి ఎంటర్ నొక్కండి |
09:55 | అందరికీ write అనుమతి తొలగిపొవడం మనం ఇక్కడ చూడవచ్చు |
10:02 | ఒకటి లేదా ఎక్కువ ఫైళ్ల యొక్క గ్రూప్‌ను కొత్త గ్రూప్‌కు మార్చడానికి chgrp కమాండ్ ఉపయోగించబడుతుంది. |
10:10 | ఈ కొత్త గ్రూప్ ఒక గ్రూప్ ID నంబర్ లేదా /etc/group లో ఉన్న గ్రూప్ పేరు అయి ఉంటుంది. |
10:20 | ఒక ఫైల్ యొక్క యజమాని లేదా privileged యూజర్ మాత్రమే గ్రూప్ మార్చవచ్చు. |
10:26 | chgrp command కొరకు సింటాక్స్ chgrp space [options] space newgroup space files. |
10:36 | టెర్మినల్‌కు వెళదాం. ఇప్పుడు మనం chgrp కమాండ్ యొక్క కొన్ని ఉదాహరణలు చూద్దాం. $ ls space -l space example4 కమాండ్ టైప్ చేయండి ఎంటర్ నొక్కండి |
10:57 | ఇక్కడ మనం షాహిద్ అనే యూజర్‌కు గ్రూప్ అనుమతిని చూడవచ్చు. |
11:03 | గ్రూప్ అనుమతిని మార్చడానికి, $ sudo space chgrp space rohit space example4 కమాండ్ టైప్ చేయండి |
11:20 | ఎంటర్ నొక్కండి, అవసరమైతే సూడో పాస్‌వర్డ్ ఎంటర్ చేయండి. |
11:27 | $ ls space -l space example4 కమాండ్ టైప్ చేయండి ఎంటర్ నొక్కండి |
11:38 | ఇక్కడ మనం గ్రూప్ షాహిద్ నుండి రోహిత్‌కు మారడాన్ని చూడవచ్చు |
11:46 | ఐనోడ్ నంబర్ అనేది డివైస్‌కు కేటాయించబడిన ఒక ప్రత్యేక పూర్ణసంఖ్య. |
11:51 | ఐనోడ్ ఒక సాధారణ ఫైల్ లేదా డైరక్టరీ గురించి ప్రాధమిక సమాచారాన్ని నిల్వ చేస్తుంది. |
11:57 | అన్ని ఫైల్స్ ఐనోడ్‌కు హార్డ్ లింక్స్‌గా ఉన్నాయి. |
12:00 | ఎప్పుడైతే ఒక ప్రోగ్రామ్ ఒక ఫైల్‌ను పేరుతో సూచిస్తుందో, అప్పుడు తగిన ఐనోడ్‌ను వెదకడానికి system ఫైల్‌పేరును ఉపయోగిస్తుంది . |
12:12 | ఒక ఫైల్ యొక్క ఐనోడ్ సంఖ్యను చూడటానికి మనం ls space –i కమాండ్ ను ఉపయోగించవచ్చు. |
12:19 | $ ls space -i space example5 కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి |
12:29 | ఫైల్ కు ముందు రాయబడిన సంఖ్య ఫైల్ యొక్క ఐనోడ్ సంఖ్య. |
12:35 | ఐనోడ్‌లు ఒక సమయంలో స్పష్టంగా ఒక డైరక్టరీతో జతకూడి ఉంటాయి. |
12:41 | హార్డ్ లింకులు బహుళ డైరక్టరీ ఎంట్రీలను ఒకే ఐనోడ్‌తో జతపరుస్తాయి. ln కమాండ్ లింకును ఏర్పరుస్తుంది |
12:52 | హార్డ్ లింక్ సృష్టించడానికి ln కమాండ్ యొక్క సింటాక్స్ |
12:57 | ln space source space link అనే కమాండ్ లో source అనేది ఉనికిలో ఉన్న ఫైల్ మరియు link అనేది సృష్టించవలసిన ఫైల్. |
13:06 | ఇప్పుడు మనం కొన్ని hard links యొక్క ఉదాహరణలు చూద్దాం |
13:10 | స్క్రీన్ మరొకసారి క్లియర్ చేస్తాను. ఇప్పుడు $ ln space example1 space exampleln అని కమాండ్ టైపు చేసి ఎంటర్ నొక్కండి |
13:25 | రెండు ఫైళ్ల యొక్క ఐనోడ్ సంఖ్యను చూపడానికి $ ls space -i space example1 space exampleln అని కమాండ్ టైపు చేసి ఎంటర్ నొక్కండి. |
13:41 | ఇక్కడ మనం రెండు ఫైళ్ల ఐనోడ్ సంఖ్య ఒకటిగా ఉండటాన్ని చూడవచ్చు, file exampleln అనేది file example1కు హార్డ్ లింక్ |
13:54 | సాఫ్ట్ లింక్ సింబాలిక్ లింక్ అనేది ఒక ప్రత్యేక రకపు ఫైల్, ఇది absolute or relative pathలో మరొక ఫైల్ లేదా డైరెక్టరీకి సూచికను కలిగి ఉంటుంది |
14:07 | సాఫ్ట్ లింకులను సృష్టించడానికి ln కమాండ్ యొక్క సింటాక్స్ |
14:12 | ln space -s space {టార్గెట్ –ఫైల్ పేరు} space {సింబాలిక్-ఫైల్ పేరు} |
14:19 | ఇప్పుడు మనం సాఫ్ట్ లింక్ యొక్క కొన్ని ఉదాహరణలు చూద్దాం |
14:25 | సాఫ్ట్ లింక్‌ను సృష్టించడానికి, $ ln space -s space example1 space examplesoft అనే కమాండ్ టైప్ చేయండి |
14:40 | ఎంటర్ ప్రెస్ చేయండి |
14:43 | ఇప్పుడు, ఐనోడ్ సంఖ్యను మరియు రెండు ఫైళ్ల జాబితాను ప్రదర్శించడానికి, $ ls space -li space example1 space examplesoft అనే కమాండ్ టైప్ చేయండి |
15:01 | ఎంటర్ నొక్కండి |
15:03 | ఈ రెండు ఫైళ్ల ఐనోడ్ సంఖ్యలు వేరుగా ఉన్నాయని మరియు examplesoft అనేది example1 యొక్క సాఫ్ట్ లింక్ అని ఇక్కడ మనం చూడవచ్చు. |
15:16 | ఈ ట్యుటోరియల్‌లో మనం అనుమతి, యజమాన్యం మరియు ఫైల్ యొక్క గ్రూప్ మార్చడం వంటి Linux Files Attributes గురించి నేర్చుకున్నాం. |
15:26 | ఇంకా మనం ఒక ఫైల్ యొక్క ఐనోడ్, సాఫ్ట్ మరియు హార్డ్ లింకులను గురించి కూడా నేర్చుకున్నాం. |
15:31 | దీనితో మనం ఈ ట్యుటోరియల్ ముగింపుకి వచ్చాం. |
15:35 | స్పోకెన్ ట్యటోరియల్స్ టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్‌లో భాగం, దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది. |
15:44 | దీనిపై మరింత సమాచారం క్రింద ఉన్న లింక్‌లో లభ్యమవుతోంది. |
15:50 | ఈ రచనకు సహాయపడింది నిఖిల. వీడ్కోలు, ధన్యవాదములు. |