Python/C2/Saving-plots/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
0:00 | హలో, "Saving plots" పై ట్యుటోరియల్కు స్వాగతం |
0:04 | 1 ఈ ట్యుటోరియల్ చివరికి మీరు ఈ క్రింది అంశములను చేయగలుగుతారు,
2 savefig() ఫంక్షన్ ఉపయోగించి ప్లాట్స్ సేవ్ చేయగలుగుతారు. 3 ప్లాట్లను వేరువేరు ఫార్మాట్లలో సేవ్ చేయగలుగుతారు 4 |
0:14 | ఈ ట్యుటోరియల్ మొదలుపెట్టే ముందు, మీరు "Using plot interactively" అనే ట్యుటోరియల్ పూర్తి చేయాలని మేము సూచిస్తున్నాము. |
0:19 | ఇప్పుడు, మీ IPython ఇంటర్ప్రిటర్ను ipython -pylab<Pause> అనే కమాండ్తో ప్రారంభించండి. |
0:31 | మీ ప్లాట్స్ను ప్లాటింగ్ మరియు సేవింగ్ కొరకు అవసరము అయిన పైథాన్ మాడ్యూల్స్తో మీ IPython ఇంటర్ప్రిటర్ను ఇది ప్రారంభిస్తుంది అని మీకు తెలుసు. |
0:37 | ముందుగా, మనము మైనస్ 3 pi నుండి 3 pi వరకు ఒక సైన్ వేవ్ ప్లాట్ చేద్దాము. |
0:43 | ప్లాట్ కొరకు అవసరము అయిన పాయింట్లు లెక్కించడముతో మనము మొదలుపెడదాము. |
0:45 | దీనిని linspace ఉపయోగించి చేయవచ్చు. |
0:59 | మనము కావలసిన పాయింట్లను x లో స్టోర్ చేసాము. |
1:03 | ఇప్పుడు మనము ప్లాట్ స్టేట్మెంట్ ఉపయోగించి పాయింట్లను ప్లాట్ చేద్దాము. |
1:18 | చేసాము! |
1:19 | మనము చాలా ప్రాధమికమైన సైన్ ప్లాట్ చేసాము. ఇప్పుడు ఈ ప్లాట్ను భవిష్యత్ ఉపయోగము కొరకు మరియు దీనిని మీరు మీ రిపోర్ట్లలో పొందుపరచుకొనుటకు వీలుగా దీనిని ఎలా సేవ్ చేయాలో చూద్దాము. |
1:32 | ప్లాట్ను సేవ్ చేయుటకు, మనము savefig() ఫంక్షన్ ఉపయోగిస్తాము. |
1:37 | దీని కొరకు మనం టర్మినల్ వెంబడి ప్లాట్ విండో తెరచి ఉంచుతాము. |
1:40 | స్టేట్మెంట్ ఇది, |
1:52 | savefig ఫంక్షన్ ఫైల్ పేరుతో ఒక ఆర్గ్యుమెంట్ తీసుకుంటుంది, ఫైల్ పేరులో , తరువాత ఉన్న 3 అక్షరాలు ఎక్స్టెన్షన్ మరియు ఫైల్ రకము. ఇది మీరు సేవ్ చేయదలచిన ఫార్మాట్ను తెలుపుతుంది. |
2:11 | ఇంకా, మనము ఫైల్ సేవ్ చేయాలని అనుకున్న దానికి ఫుల్ల్ పాత్ లేక అబ్సొల్యూట్ పాత్ ఇచ్చామని గమనించండి. |
2:18 | ఇక్కడ మనము .png ఎక్స్టెన్షన్ ఉపయోగించాము. అంటే మనము ఇమేజ్ను PNG ఫైల్గా సేవ్ చేయాలని అనుకుంటున్నాము. |
2:25 | ఇప్పుడు మనము కొద్దిసేపటి క్రితము సేవ్ చేసిన sine.png ఫైల్ స్థానమును కనుగొందాము. |
2:32 | మనము ఫైల్ను /home/fossee కు సేవ్ చేసాము. కాబట్టి మనము ఫైల్ బ్రౌజర్ ఉపయోగించి /home/fossee కు వెళ్దాము |
2:49 | అవును, sine.png ఫైల్ ఇక్కడ ఉంది. |
2:52 | మనము దానిని ఓపెన్ చేసి చెక్ చేద్దాము. |
2:57 | కాబట్టి ఒక ప్లాట్ను సేవ్ చేయుటకు, మనము savefig ఫంక్షన్ ఉపయోగిస్తాము. |
3:05 | .savefig , ప్లాట్ను అనేక ఫార్మాట్లలో సేవ్ చేయగలదు. అవి pdf - పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్, ps - పోస్ట్ స్క్రిప్ట్, eps - ఎన్కాప్సులేటెడ్ పోస్ట్ స్క్రిప్ట్, svg - స్కేలబుల్ వెక్టర్ గ్రాఫిక్స్, ట్రాస్పరెన్సీకి సహకరించే png - పోర్టబుల్ నెట్వర్క్ గ్రాఫిక్స్ మొదలైనవి. |
3:24 | ఇక్కడ వీడియోకు విరామము ఇవ్వండి, ఈ క్రింద ఇచ్చిన అభ్యాసము ప్రయత్నించండి మరియు తరువాత వీడియో తిరిగి ప్రారంభించండి. |
3:29 | సైన్ ప్లాట్ను LaTeX డాక్యుమెంట్లలో పొందుపరచగలిగే విధంగా EPS ఫార్మాట్లో సేవ్ చేయండి. |
3:37 | మన వద్ద ఇంకా సైన్ ప్లాట్ ఉంది. దానిని మనము sine.eps గా ప్లాట్ను సేవ్ చేద్దాము. |
3:49 | ఇప్పుడు, మనము ప్లాట్ను savefig ఫంక్షన్ ఉపయోగించి సేవ్ చేస్తాము. |
4:04 | ఇప్పుడు మనము /home/fossee కు వెళ్ళి క్రియేట్ అయిన కొత్త ఫైల్ను చూద్దాము. |
4:13 | అవును! కొత్త ఫైల్ sine.eps ఇక్కడ ఉంది. |
4:18 | ఇక్కడ వీడియోకు విరామము ఇవ్వండి, ఈ క్రింద ఇచ్చిన అభ్యాసము ప్రయత్నించండి మరియు తరువాత వీడియో తిరిగి ప్రారంభించండి |
4:23 | సైన్ ప్లాట్ను PDF, PS మరియు SVG ఫార్మాట్లలో సేవ్ చేయండి. |
4:31 | దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. |
4:34 | ఈ ట్యుటోరియల్లో మనము savefig() ఫంక్షన్ ఉపయోగించి ప్లాట్లను సేవ్ చేయడము నేర్చుకున్నాము. |
4:38 | మరియు ప్లాట్లను pdf - ps - png - svg - eps వంటి వేరువేరు ఫార్మాట్లలో సేవ్ చేయడము నేర్చుకున్నాము. |
4:45 | ఇక్కడ మీరు సాధించుటకు కొన్ని స్వీయ అసెస్మెంట్ ప్రశ్నలు ఉన్నాయి. |
4:48 | 1 ఒక ప్లాట్ను సేవ్ చేయుటకు ఏ కమాండ్ ఉపయోగించబడుతుంది, saveplot() savefig() savefigure() saveplt()
2 |
4:59 | 4 savefig ('sine.png') ప్లాట్ను ఎక్కడ సేవ్ చేస్తుంది.
5 |
5:04 | రూట్ డైరెక్టరీ / (GNU/Linux Unix ఆధారిత సిస్టంల పై), c: \ (విండోల పై) |
5:14 | రెండవ ఆప్షన్. ఫుల్ పాత్ అందించబడలేదు కాబట్టి ఎర్రర్ వస్తుంది. |
5:18 | మూడవది. ప్రస్తుతము పనిచేస్తున్న డైరెక్టరీ. |
5:21 | మరియు చివరి ఆప్షన్ ముందుగా నిర్ణయించబడిన డైరెక్టరీ - /documents వంటివి |
5:26 | ఇప్పుడు, జవాబులు. |
5:28 | ఒక ప్లాట్ సేవ్ చేయుటకు, మనము savefig() ఫంక్షన్ ఉపయోగిస్తాము. |
5:33 | మనము ఫైల్ను సేవ్ చేసినప్పుడు, అది ప్రస్తుతము పనిచేస్తున్న డైరెక్టరీలో సేవ్ అవుతుంది. |
5:38 | మీరు ఆనందించారని మరియు మీకు ఉపయోగకరముగా ఉందని ఆశిస్తున్నాము. |