LibreOffice-Suite-Base/C2/Tables-and-Relationships/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:00 | లిబ్రేఅఫీస్ బేస్ మీద ట్యుటోరియల్‌కు స్వాగతం. |
00:04 | ఈ ట్యుటోరియల్‌లో, మనం లిబ్రేఅఫీస్ బేస్‌లో టేబుల్స్ మరియు రిలేషన్షిప్స్ కవర్ చేస్తాము. |
00:10 | ఇక్కడ, మనము వీటి గురించి నేర్చుకుంటాము
1. టేబుల్‌కు డాటా ఆడ్ చేయడం |
00:16 | 2. రిలేషన్షిప్స్ డిఫైన్ చేయడం మరియు క్రియేట్ చేయడం |
00:19 | మునుపటి లిబ్రేఅఫీస్ బేస్ ట్యుటోరియల్‌లో, మనము బేస్, డాటాబేస్ బేసిక్స్ ఇంట్రొడ్యూస్ చేసి డాటా బేస్ మరియు టేబుల్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాము. |
00:31 | ట్యుటోరియల్ యొక్క గమనములో మనము లైబ్రరి అనే ఎగ్జాంపుల్ డాటాబేస్ కూడా క్రియేట్ చేసి బుక్స్ టేబుల్ కూడా క్రియేట్ చేసాము. |
00:42 | ఈ ట్యుటోరియల్‌లో, మనము లైబ్రరి డాటా బేస్ రెస్యూమ్ చేసి టేబుల్‌కి డాటా ఎలా ఆడ్ చేస్తారో చూస్తాము. |
00:51 | దీని కోసం, మనం మొదట లిబ్రేఅఫీస్ బేస్ ప్రోగ్రామ్ ఇన్వోక్ చేద్దాము. |
00:57 | దీని కోసం, మనం స్క్రీన్‌కి ఎడమ వైపున ఉన్న స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేసి, |
01:03 | ఆల్ ప్రొగ్రామ్స్ మీద క్లిక్ చేసి, తర్వాత లిబ్రేఅఫీస్ సూట్ మరియు లిబ్రేఅఫీస్ బేస్ మీద క్లిక్ చేద్దాము. |
01:12 | మనము ఇప్పటికే చివరి ట్యుటోరియల్‌లో లైబ్రరి డాటాబేస్ క్రియేట్ చేసి ఉన్నాము కనుక, ఈ సారి మనం కేవలం దానిని ఓపెన్ చేసే అవసరం మాత్రం ఉంది. |
01:20 | అది చేయడానికి, మనం 'open an existing database file' వైకల్పాన్ని క్లిక్ చేద్దాము. |
01:28 | 'Recently Used' డ్రాప్ డౌన్ బాక్స్‌లో, మన లైబ్రరి డాటాబేస్ కనపడాలి, |
01:35 | కనుక ఇప్పుడు, Finish బటన్ మీద క్లిక్ చేయండి. |
01:38 | మీరు దానిని చూడనట్లయితే, మనం ఎక్కడియితే లైబ్రరి డాటాబేస్ సేవ్ అయి ఉండో ఆ విండోస్ డైరెక్టరిని బ్రౌజ్ చేయడానికి మధ్యలో ఉన్న ఓపెన్ బటన్ మీద క్లిక్ చేయవచ్చు. |
01:50 | కనపడగానే, filename మీద క్లిక్ చేయండి. తర్వాత Open బటన్ మీద క్లిక్ చేయండి. |
01:57 | ఇప్పుడు, ఒకవేళ లిబ్రేఅఫీస్ బేస్ ప్రొగ్రాం ఇప్పటికే ఓపెన్ అయి ఉంటే, మనం ఇక్కడి నుండి లైబ్రరి డాటాబేస్ ఓపెన్ చేయవచ్చు, |
02:07 | అది పైన ఉన్న File menu క్లిక్ చేయడం ద్వారా ఇంకా Open క్లిక్ చేయడం ద్వారా చేస్తాము. |
02:14 | మనం లైబ్రరి డాటాబేస్ సేవ్ అయి ఉన్న విండోస్ డరెక్టరీని బ్రౌజ్ చేస్తాము. |
02:21 | మనం Library.odb మీద క్లిక్ చేసి తర్వాత క్రింద ఉన్న Open బటన్ మీద క్లిక్ చేద్దాము. |
02:31 | మనమిప్పుడు లైబ్రరి డాటాబేస్‌లో ఉన్నాము. |
02:35 | మనం లెఫ్ట్ పానెల్లో డాటాబేస్ లిస్ట్ లోని టేబుల్స్ ఐకాన్ మీద క్లిక్ చేద్దాము. |
02:42 | కుడి పానెల్లో టేబుల్స్ లిస్ట్‌లో బుక్స్ టేబుల్ కనపడడాన్ని గమనించండి. |
02:48 | ఇప్పుడు మనం బుక్స్ టేబుల్ మీద రైట్ క్లిక్ చేస్తాము. |
02:53 | ఇక్కడ మీరు ఎన్నుకోగలిగే వివిధ వైకల్పాలను గమనించండి. |
02:58 | ఈ టేబుల్‌కి డాటా ఆడ్ చేయడానికి మనమిప్పుడు 'open' బటన్ మీద క్లిక్ చేద్దాము |
03:04 | ప్రత్యామ్నాయంగా, మనం టేబుల్ నేమ్ మీద దానిని ఓపెన్ చేయడానికి డబుల్ క్లిక్ చేయవచ్చు. |
03:10 | టైటిల్ 'Books - Library - LibreOffice Base: Table Data View'తో ఒక క్రొత్త విండో ఓపెన్ అవుతుంది. |
03:20 | ఇప్పుడు మనం వాల్యూస్‌ని ప్రతి సెల్‌లోకి డైరెక్ట్‌గా టైప్ చేస్తూ బుక్స్ టేబుల్లో డాటా ఎంటర్ చేయడం మొదలు పెట్టవచ్చు. |
03:32 | Bookid కాలమ్ (column)కి 'Autofield' ఉండడం గమనించండి. |
03:37 | దీని అర్థం మనం ఇన్సర్ట్ చేసే డాటా యొక్క ప్రతి రో (Row)కి బేస్ ఆటోమేటిక్‌గా ఆరోహించే (ascending) నంబర్స్ ఆపాదిస్తుంది. |
03:48 | ఇప్పుడు, మనం స్క్రీన్ మీద చూపిన విధముగా, ఒక రో తర్వాత మరొకటిగా, సెల్స్‌లోకి డాటా ఇన్పుట్ చేద్దాము. |
04:23 | కనుక, ఇక్కడ మన టేబుల్ బుక్స్‌లో మనకు 5 రోస్ సాంపుల్ డాటా ఉన్నది. |
04:29 | మనం పైన ఉన్న ఫైల్ మెను క్లిక్ చేసి తర్వాత క్లోస్ ఎంపిక చేసుకుని విండో క్లోస్ చేద్దాము. |
04:39 | ఇక్కడ మీకు ఒక అసైన్మెంట్ ఇవ్వబడింది. |
04:42 | ప్రతి మెంబర్ గురించి సమాచారం స్టోర్ చేసే మెంబర్స్ టేబుల్ క్రియేట్ చేయండి, ఉదాహరణకు, మెంబర్ నేమ్ మరియు ఫోన్ నంబర్. |
04:53 | ఈ క్రింది మూడు ఫీల్డ్స్ ఇన్క్లూడ్ చేయండి |
04:57 | Fieldtype Integerతో MemberId, ఇక దీనిని ప్రైమరి కీ చేయండి |
05:06 | Fieldtype Textతో నేమ్ |
05:10 | Fieldtype Textతో ఫోన్ |
05:15 | సరే, మీ పని అయిపోతే, మెంబర్స్ టేబుల్ ఈ విధంగా కనపడుతుంది. |
05:22 | మనం విండో క్లోస్ చేద్దాము. |
05:25 | మనం స్క్రీన్ మీద చూపిన విధంగా మెంబర్స్ టేబుల్లోకి నాలుగు సాంపుల్స్ ఆడ్ చేద్దాము. |
05:35 | మనం ఎలాగయితే బుక్స్ టేబుల్ కోసం చేసామో అలానే చేద్దాము. <ఇక్కడ 10 సెకండ్ల్స్ పాటు పాజ్ చేయండి> |
05:46 | ఒక్కసారి చేసాక, మనం విండో క్లోస్ చేద్దాము. |
05:50 | ఇప్పుడు, మనం మెయిన్ విండోకి తిరిగి వెళ్ళి మళ్ళీ టేబుల్స్ ఐకాన్ మీద క్లిక్ చేద్దాము. |
05:57 | ఇక మనం మూడవ టేబుల్ క్రియేట్ చేద్దాము: BooksIssued. |
06:03 | చేసినాక, BooksIssued టేబుల్‌కు ఈ క్రింది ఫీల్డ్స్ ఉంటాయి: |
06:10 | IssueId, Fieldtype Integer అది ప్రైమరి కీ అవుతుంది |
06:16 | BookId, Fieldtype Integer |
06:20 | MemberId Fieldtype Integer |
06:24 | IssueDate Fieldtype Date |
06:28 | ReturnDate Fieldtype Date |
06:32 | ActualReturnDate Fieldtype Date |
06:36 | తర్వాత CheckedIn Fieldtype Yes/No Boolean |
06:42 | సరే, మనం BooksIssued టేబుల్ క్రియేట్ చేసాము, |
06:47 | ఇక మనము ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తోన్న విధంగా దానిలోకి క్రింది సాంపుల్ డాటా ఆడ్ చేద్దాము. |
06:56 | ఇది మీకు ఇప్పుడు పూర్తిగా అర్థం కాక పోయినప్పటికీ, మనం త్వరలో ఏమి జరుగుతోందో అర్థం చేసుకుంటాము. |
07:17 | సాంపుల్ డాటాతో కలిపి ఇప్పుడు, మన లైబ్రరి డాటాబేస్‌లో మనకు మూడు టేబుల్స్ ఉన్నాయి |
07:25 | ఇప్పుడు మనం డాటాబేస్‌లో రిలేషన్షిప్స్ డిఫైన్ చేయడం నేర్చుకుందాము. |
07:31 | కనుక మనము మూడు వివిధ సెట్స్ ఆఫ్ ఇంఫర్మేషన్ స్టోర్ చేయడానికి మూడు టేబుల్స్ క్రియేట్ చేసాము. |
07:38 | బుక్స్, మెంబర్స్ మరియు మెంబర్స్‌కి బుక్స్ ఇస్యూ చేయడం. |
07:44 | ఇప్పుడు మనం ప్రతి పుస్తకాన్ని, ప్రతి మెంబర్నీ ఇంకా ప్రతి బుక్ ఇస్స్యూని ఈ మూడు టేబుల్స్‌లో విలక్షణంగా ఐడెంటిఫై చేయడానికి కాలమ్స్ (columns) కూడా సెట్ అప్ చేస్తాము. |
07:57 | అవి ప్రైమరీ కీస్ అవుతాయి. |
08:00 | ప్రైమరీ కీ యొక్క వివిధ ప్రయోజనాలలో ఒకటి ఏమిటంటే అది టేబుల్స్ మధ్య రిలేషన్షిప్స్ స్థాపించడానికి సాయపడుతుంది. |
08:10 | కానీ మనకు రిలేషన్షిప్స్ ఎందుకు కావాలి? |
08:13 | మనం BooksIssued టేబుల్ వైపు చూద్దాము. ఇక్కడ, మనం BookId మరియు MemberId ఫీల్డ్స్ చూడగలము. |
08:23 | వాటికి BooksIssued టేబుల్లో ఏ వాల్యూ అయినా ఉండవచ్చు. |
08:28 | కానీ, అవి బుక్స్ మరియు మెంబర్స్ టేబుల్స్‌లో తదనుగుణముగా మన దగ్గర ఉన్న అవే వాల్యూస్‌కి అనురూపమై ఉండాలి. |
08:38 | కనుక ఒకవేళ బుక్, మాక్బెత్కి, బుక్స్ టేబుల్లో 3 BookIdగా ఉన్నట్లయితే, |
08:45 | BooksIssued టేబుల్ యొక్క BookIdలో 3 ఉపయోగించడం ద్వారా, మనం అప్పటికీ అదే బుక్‌ను రెఫర్ చేస్తాము.. |
08:56 | కనుక ఈ రెండు టేబుల్స్నీ స్పష్టంగా కనెక్ట్ చేయడం కోసం, మనం ఇప్పటికీ ఏదో విధంగా వాటిని లింక్ చేయాల్సిన అవసరం ఉంది. |
09:05 | అంతేకాక, ఉదాహరణకు,
3వ తేదీ జూన్ 2011న 'Macbeth' అనే పుస్తకం రవి కుమార్‌కు ఇస్యూ అయ్యిందని ఎలా మీరు నిర్ధారిస్తారు? |
09:16 | లేదా ఒక పుస్తకం లైబ్రరీ యొక్క మెంబర్స్‌కు మాత్రమే ఇస్యూ అయ్యింది మరెవరికీ కాదు అని మీరు ఎలా ఖాయపరచగలరు? |
09:25 | ఇవన్నీ కూడా రిలేషన్షిప్స్ సెట్ అప్ చేయడం ద్వారా మీరు సాధించగలరు, అది డాటాను ఇంటర్‌లింక్ చేయడానికి దోహదపడుతుంది. |
09:34 | మనం సముచితమైన ఫీల్డ్స్ లింక్ చేయడం ద్వారా బేస్‌ను బుక్స్ టేబుల్ మరియు మెంబర్స్ టేబుల్ నుండి మాత్రమే వాల్యూస్ ఉపయోగించేలా చూడాలి. |
09:46 | అది ఎలాగో మనం చూద్దాము. |
09:48 | లిబ్రేఅఫీస్ బేస్ మెయిన్ విండోలో, మనం టూల్స్ ఆ తర్వాత రిలేషన్షిప్స్ మీద క్లిక్ చేద్దాము. |
09:58 | ఇది ఒక చిన్న పాపప్ విండో ఓపెన్ చేస్తుంది, |
10:03 | ఇక్కడ మనం అన్నింటికన్న పైన ఉన్న టేబుల్ ఎంపిక చేసుకుని ఆడ్ బటన్ మీద క్లిక్ చేస్తాము, తర్వాత ఇతర రెండు టేబుల్‌కి కూడా ఇదే రిపీట్ చేస్తాము. |
10:15 | పాపప్ విండో క్లోస్ చేయండి. |
10:18 | మనమిప్పుడు మూడు టేబుల్స్ Books, BooksIssued ఇంకా Members ఒక లైనులో చూడగలము. |
10:26 | క్లిక్ చేయడం, డ్రాగ్ చేయడం మరియు డ్రాప్ చేయడం ద్వారా మనం టేబుల్స్ మధ్య మరింత స్పేస్ ప్రవేశపెడదాము. |
10:35 | ఇప్పుడు, మనం బుక్స్ టేబుల్ లోని BookId మీద క్లిక్ చేసి BooksIssued టేబుల్లోని BookId మీద డ్రాగ్ చేసి డ్రాప్ చేద్దాము. |
10:48 | ఈ రెండు ఫీల్డ్ నేమ్స్ కలిపే ఒక లైను గమనించండి. కనుక అక్కడ, మనం ఒక రిలేషన్షిప్ సెట్ అప్ చేసాము! |
10:57 | మనం MemberId కోసం అదే రిపీట్ చేద్దాము. |
11:02 | మెంబర్స్ టేబుల్ లోని MemberId మీద క్లిక్ చేసి దానిని డ్రాగ్ చేసి BooksIssued టేబుల్లో డ్రాప్ చేయండి. |
11:11 | మనం ఇప్పుడు రెండు రిలేషన్షిప్స్ క్రియేట్ చేయడం మీరు చూడగలరు. |
11:16 | ఇక, ఈ విధంగా మనం రిలేషన్షిప్స్ స్థాపించగలము |
11:20 | కనుక రిలేషనల్ డాటాబేస్‌లో వివిధ టేబుల్స్‌లో స్టోర్ అయి ఉన్న అర్థవంతమైన డాటాను ఇంటర్‌లింక్ చేయండి |
11:30 | ఇది లిబ్రేఅఫీస్లో టేబుల్స్ మరియు రిలేషన్షిప్స్ మీద ఈ ట్యుటోరియల్ చరమాంకానికి మనను తీసుకు వస్తుంది |
11:36 | సంగ్రహపరచడానికి, మనం నేర్చుకున్నది: టేబుల్‌కు డాటా ఆడ్ చేయడం ఇంకా రిలేషన్షిప్స్ డిఫైన్ చేసి క్రియేట్ చేయడం |
11:45 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ లోని భాగము, దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
11:57 | ఈ ప్రాజెక్ట్‌ను Spoken Tutorial.org http://spoken-tutorial.org సమన్వయపరుస్తోంది.. |
12:03 | ఇదే అంశం మీద మరింత సమాచారం ఈ క్రింది లింకులో అందుబాటులో ఉంది: http://spoken-tutorial.org/NMEICT-Intro. |
12:08 | ఈ స్క్రిప్ట్ రచనకు సహాయపడినవారు నిఖిల మరియు స్వాతి |
12:17 | చేరినందుకు ధన్యవాదములు. . |