KTurtle/C2/Grammar-of-TurtleScript/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | అందరికి నమస్కారం. |
00:02 | KTurtle లోని గ్రామర్ ఆఫ్ టర్టల్ స్క్రిప్ట్ అను ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:08 | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేవి: |
00:11 | టర్టల్ స్క్రిప్ట్ యొక్క వ్యాకరణం(గ్రామర్) మరియు 'ఇఫ్-ఎల్స్' (కండీషన్) పరిస్థితి. |
00:16 | ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను, ఉపయోగిస్తున్నాను:
ఉబుంటు లైనక్స్ ఓఎస్ వర్షన్12.04. KTurtle వర్షన్ 0.8.1 బీటా . |
00:29 | మీకు KTurtle పై ప్రాధమిక అవగాహన ఉన్నదని భావిస్తున్నాను. |
00:35 | ఒకవేళ అవగాహన లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్ కోసం, మా వెబ్ సైట్ ను సందర్శించండి: |
00:40 | కే టర్టల్' యొక్క ఒక కొత్త అప్లికేషన్ తెరుద్దాం. |
00:43 | డాష్ హోమ్ పై క్లిక్ చేయండి. |
00:45 | సెర్చ్ బార్ లో KTurtle అని టైప్ చేసి, |
00:49 | KTurtle ఐకాన్ పై క్లిక్ చేయండి. |
00:52 | మనం KTurtle ను టెర్మినల్ ఉపయోగించి కూడా తెరవవచ్చు. |
00:56 | టెర్మినల్ ను తెరవటానికి Ctrl+Alt+T కీ లను ఏకకాలం లో నొక్కండి. |
01:01 | KTurtle అప్లికేషన్ ను తెరవటానికి KTurtle అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
01:08 | ముందు గా టర్టల్ స్క్రిప్ట్ ను చూద్దాం. |
01:11 | టర్టల్ స్క్రిప్ట్ అనునది ఒక ప్రోగ్రామింగ్ భాష. |
01:15 | ఇది వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించటానికి వివిధ రకాల పదాలు మరియు చిహ్నాలను కలిగి ఉంటుంది. |
01:21 | ఇది టర్టల్ కు ఏమి చేయాలో నిర్దేశిస్తుంది. |
01:25 | KTurtle లోని గ్రామర్ ఆఫ్ టర్టల్ స్క్రిప్ట్ నందు- |
01:30 | కామెంట్ లు |
01:31 | కమాండ్లు |
01:32 | సంఖ్యలు |
01:33 | స్ట్రింగ్ లు |
01:34 | వేరియబుల్స్ మరియు |
01:36 | బూలియన్ వేల్యూ లు ఉంటాయి. |
01:38 | ఇప్పుడు, మనం సంఖ్యలను ఎక్కడ స్టోర్ (నిల్వ) చేయాలో చూద్దాం. |
01:42 | సంఖ్యలు అనేవి: |
01:44 | గణిత నిర్వహణ చిహ్నాలు (Mathematical operators), |
01:46 | పోలిక నిర్వహణ చిహ్నాలు (Comparison operators) మరియు |
01:49 | వేరియబుల్స్ నందు నిల్వ(store) చేయబడతాయి. |
01:50 | బాగా కనబడటానికి program text ను పెద్దది చేసి చూస్తాను. |
01:54 | మొదట గా వేరియబుల్స్ ను చూద్దాం. |
01:57 | వేరియబుల్స్ అనేవి ‘$’ చిహ్నం తో మొదలయ్యే పదాలు, ఉదాహరణకు $a. |
02:04 | వేరియబుల్స్ ఊదా రంగు లో హైలైట్ చేయబడతాయి. |
02:09 | ఈ అసైన్మెంట్ (=) ను ఉపయోగించి, ఒక వేరియబుల్ యొక్క విషయాలు( కంటెంట్స్) పొందవచ్చు. |
02:14 | వేరియబుల్స్ సంఖ్యలు కలిగి ఉంటాయి. ఉదా:$a=100 |
02:20 | స్ట్రింగ్ లు ఉదా: $a=Hello లేదా |
02:25 | బూలియన్ విలువలు అవి true లేదా False ఉదా :$a=true. |
02:32 | వేరియబుల్ నందు ఆ విలువలు ప్రోగ్రాం యొక్క అమలు (execution) పూర్తి అగువరకు లేదా మరియొక విలువ ఇచ్చువరకు ఉంటాయి. |
02:41 | ఉదాహరణకు, ఈక్రీంది కోడ్ ని పరిగణలోకి తీసుకుందాం. |
02:44 | $a = 2004 |
02:50 | $b = 25 |
02:55 | ప్రింట్ $a + $b అని టైప్ చేయండి. |
03:01 | వేరియబుల్ 'a' కి కేటాయించిన విలువ2004. |
03:06 | వేరియబుల్ 'b'కి కేటాయించిన విలువ 25. |
03:10 | ప్రింట్ కమాండ్, టర్టల్ ను కేన్వాస్ పైన ఏదో రాయమని కమాండ్ చేస్తుంది. |
03:15 | 'ప్రింట్ కమాండ్ సంఖ్యలను మరియు స్ట్రింగ్స్ లను input గా తీసుకుంటుంది. |
03:19 | ప్రింట్ $a + $b, టర్టల్ రెండు విలువలు ను కలిపి ఫలితాన్నికేన్వాస్ పైన ప్రదర్శించమని కమాండ్ చేస్తుంది. |
03:29 | స్లో స్పీడ్(వేగం)వద్ద కోడ్ ని రన్ చేద్దాం. |
03:34 | విలువ 2029 కేన్వాస్ పైన ప్రదర్శించ బడుతుంది. |
03.40 | తర్వాత గణిత నిర్వాహక చిహ్నలు(mathematical operators) చూద్దాం. |
03:44 | గణిత నిర్వాహక చిహ్నాలు ( Mathematical operators) ఏమనగా -
'+' (అడిషన్) '-' (సబ్ట్రాక్షన్) '*' (ముల్టిప్లికేషన్) మరియు '/' (డివిజన్) |
03:53 | నేను ఎడిటర్ నుండి ప్రస్తుత కోడ్ ను క్లియర్ చేస్తున్నాను ఇంకా కేన్వాస్ ను క్లియర్ చేయటానికి "క్లియర్" కమాండ్ టైప్ చేసి రన్ చేస్తున్నాను. |
04:01 | నేను ఇప్పటికే టెక్స్ట్ -ఎడిటర్ లో ఒక ప్రోగ్రామ్ ను కలిగి ఉన్నాను. |
04:05 | ఇప్పుడు నేను కోడ్ ని వివరిస్తాను. |
04:08 | reset(రిసెట్) కమాండ్ టర్టల్ ను దాని డిఫాల్ట్ పొజిషన్ కు సెట్ చేస్తుంది. |
04:12 | canvas size(కేన్వాస్ సైజ్) 200,200 అను కమాండ్ కాన్వాస్ వెడల్పు మరియు ఎత్తులు ఒకోదాన్ని 200 పిక్సల్స్ కు ఫిక్స్ చేస్తుంది. |
04:22 | వేరియబుల్ $addకు 1+1' అనే విలువ కేటాయించ బడింది. |
04:26 | వేరియబుల్ $subtract కు 20-5 విలువ కేటాయించ బడింది. |
04:31 | వేరియబుల్ $multiply కు 15*2 విలువ కేటాయించ బడింది. |
04:36 | వేరియబుల్ $divideకు 30/30 విలువ కేటాయించ బడింది. |
04:40 | go 10,10 అను కమాండ్ "టర్టల్" ను కేన్వాస్ కు ఎడమ వైపు నుండి 10pixel మరియు పైనుండి 10pixel దూరం లో ఉంచుతుంది. |
04:52 | print కమాండ్ వేరియబుల్ ను కేన్వాస్ పైన ప్రదర్శిస్తుంది. |
04:56 | నేను కోడ్ ని టెక్స్ట్-ఎడిటర్ నుండి copy చేసి KTurtle ఎడిటర్ లో paste చేస్తున్నాను. |
05:03 | ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను KTurtle ఎడిటర్ లోకి టైప్ చేయండి. |
05:08 | ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత ట్యుటోరియల్ ను తిరిగి ప్రారంభించండి. |
05:13 | ప్రోగ్రామ్ ను రన్ చేయటానికి Run బటన్ పై క్లిక్ చేయండి. |
05:17 | కమాండ్ అమలు విధానం ఎడిటర్ పైన హైలైట్ అవుతుంది. |
05:22 | టర్టల్ విలువలను నిర్దేశించిన స్థానాలలో కేన్వాస్ పైన ప్రదర్శిస్తుంది. |
05:34 | కంపారిజన్ ఆపరేటర్ఉపయోగించి ఒక సాధారణ ఉదాహరణ పరిశీలిద్దాం. |
05:41 | నేను ఎడిటర్ నుండి ప్రస్తుత కోడ్ క్లియర్ చేస్తున్నాను ఇంకా కేన్వాస్ ను క్లియర్ చేయటానికి "క్లియర్"కమాండ్ టైప్ చేసి రన్ చేస్తున్నాను. |
05:49 | బాగా కనబడటానికి program text ను పెద్దది చేసి చూస్తాను. |
05:53 | ఇలా టైప్ చేద్దాం: |
05:55 | $answer = 10 > 3 |
06:03 | print $answer |
06:09 | ఇక్కడ 10 గ్రేటర్ దేన్ ఆపరేటర్ ను ఉపయోగించి 3 తో పోల్చబడింది. |
06:14 | ఈ పోలిక ఫలితం, ఒక బూలియన్ వేల్యూ true, మరియు అది |
06:19 | వేరియబుల్ $answer లో స్టోర్ (నిల్వ) చేయబడుతుంది మరియు దాని విలువ 'true' కేన్వాస్ పైన ప్రదర్శించబడుతుంది. |
06:27 | ఇప్పుడు కోడ్ ని రన్ చేద్దాం. |
06:29 | టర్టల్ బూలియన్ వేల్యూ 'true' ను కేన్వాస్ పైన ప్రదర్శిస్తుంది. |
06:34 | ఇప్పుడు, ఈ అప్లికేషన్ లో స్ట్రింగ్ లు ఎలా పని చేస్తాయో చూద్దాం- |
06:39 | స్ట్రింగ్స్ వేరియబుల్స్ లో నంబర్స్(సంఖ్యలు) గా కూడా పెట్టవచ్చు. |
06:43 | స్ట్రింగ్స్ మేధ్ మెటికల్ లేదా కంపారిజన్ ఆపరేటర్ల లో ఉపయోగించ బడవు. |
06:49 | స్ట్రింగ్స్ ఎరుపు రంగు లో హైలైట్ చేయబడతాయి. |
06:53 | KTurtle డబల్ కోట్స్ లో ఉన్న ఒక లైన్(గీత)ను ఒక స్ట్రింగ్ గా గుర్తిస్తుంది. |
07:00 | నేను ఎడిటర్ నుండి ప్రస్తుత కోడ్ క్లియర్ చేస్తున్నాను ఇంకా కేన్వాస్ ను క్లియర్ చేయటానికి "క్లియర్" కమాండ్ టైప్ చేసి రన్ చేస్తున్నాను. |
07:08 | ఇప్పుడు, నేను బూలియన్ విలువలు గురించి వివరిస్తాను. |
07:11 | బూలియన్ విలువలు రెండు మాత్రమే ఉన్నాయి: true మరియు false. |
07:16 | ఉదాహరణకు, కోడ్ ని టైప్ చేద్దాం: |
07:20 | $answer = 7<5 |
07:28 | print $answer. |
07:34 | వేరియబుల్ $answerకు కేటాయించిన బూలియన్ వేల్యూ ఫాల్స్ ఎందుకంటే 7, 5 కంటే పెద్దది. |
07:43 | ఇప్పుడు కోడ్ ని రన్ చేద్దాం. |
07:47 | టర్టల్ కేన్వాస్ పైన బూలియన్' విలువ "false" గా ప్రదర్శిస్తుంది. |
07:51 | తర్వాత “if-else” కండీషన్ గురించి నేర్చుకుందాం. |
07:56 | ఒకవేళ బూలియన్ విలువ ‘ట్రూ’గా అంచనా వేసినపుడు మాత్రమే ‘if(ఇఫ్)’ కండీషన్ అమలు అవుతుంది. |
08:03 | ‘if’ కండిషన్ ‘ఫాల్స్’అయినపుడు మాత్రమే ‘else(ఎల్స్)’ కండిషన్ అమలు అవుతుంది. |
08:09 | నేను ఎడిటర్ నుండి ప్రస్తుత కోడ్ క్లియర్ చేస్తున్నాను ఇంకా కేన్వాస్ ను క్లియర్ చేయటానికి "క్లియర్" కమాండ్ టైప్ చేసి రన్ చేస్తున్నాను. |
08:17 | నేను ఇప్పటికే టెక్స్ట్ ఫైల్ లో ఒక కోడ్ ని కలిగి ఉన్నాను. |
08:21 | ఈ కోడ్ 4 ,5 మరియు 6 సంఖ్యలను పోల్చి ఫలితాన్ని అనుగుణంగా కేన్వాస్ పైన ప్రదర్శిస్తుంది. |
08:30 | నేను కోడ్ ను టెక్స్ట్ -ఎడిటర్ నుండి కాపీ చేసి KTurtle ఎడిటర్ లో పేస్ట్ చేస్తున్నాను. |
08:36 | ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను KTurtle ఎడిటర్ లోకి టైప్ చేయండి. |
08:42 | ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత ట్యుటోరియల్ ను తిరిగి ప్రారంభించండి. |
08:46 | ఇప్పుడు కోడ్ ని రన్ చేద్దాం. |
08:49 | టర్టల్ 4 మరియు 5 విలువలను పోల్చుతుంది |
08:53 | మరియు ఫలితం : "4 is smaller than 6" గా కేన్వాస్ పైన ప్రదర్శిస్తుంది. |
09:00 | ఇక్కడితో మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము. |
09:05 | సారాంశం చూద్దాం. |
09:07 | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి: |
09:11 | గ్రామర్ ఆఫ్ టర్టల్ స్క్రిప్ట్ మరియు |
09:14 | ‘if-else’ కండీషన్. |
09:17 | ఇప్పుడు, అసైన్మెంట్ భాగానికి వెళ్దాం. |
09:19 | వీటిని ఉపయోగించి ఒక ఈక్వేషన్( సమీకరణం) ను సాధించండి. |
09:22 | if - else కండీషన్, |
09:24 | మేధ్ మెటికల్ మరియు కంపారిజన్ ఆపరేటర్లు |
09:27 | "print" మరియు "go" కమాండ్స్ ఉపయోగించి ఫలితాన్ని ప్రదర్శించండి. |
09:33 | అసైన్మెంట్ సాధించటానికి- |
09:35 | ఏవయినా నాలుగు యాదృచ్ఛిక సంఖ్యలు ఎంచుకోండి, |
09:38 | రెండు జతల యాదృచ్ఛిక సంఖ్యలను గుణించండి. |
09:42 | కంపారిజన్ ఆపరేటర్స్ ఉపయోగించి ఫలితాన్ని పోల్చి చూడండి, |
09:46 | రెండు ఫలితాలను ప్రదర్శించండి. |
09:49 | పెద్ద ఫలితాన్ని కేన్వాస్ మధ్యలో ప్రదర్శించండి. |
09:54 | మీకు నచ్చిన సమీకరణాన్ని మీరు ఎంచుకోవచ్చు. |
09:59 | ఈ URL వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి: |
10:03 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది. |
10:06 | మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. |
10:12 | స్పోకెన్ ట్యుటోరియల్ టీం: |
10:14 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. |
10:18 | ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది. |
10:22 | మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి:
contact@spoken-tutorial.org |
10:30 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం. |
10:35 | దీనికి, ICT, MHRD భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
10:43 | ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది: |
10:52 | ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయ లక్ష్మి, మాతో చేరినందుకు ధన్యవాదములు. |