Java/C2/Getting-started-java-Installation/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 10:03, 24 January 2017 by Sushumna (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 గెట్టింగ్ స్టార్టెడ్ విత్ జావా ఇన్‌స్టలేషన్ పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ మనము నేర్చుకునేవి:
00:09 “సినప్టిక్ ప్యాకేజ్ మ్యానేజర్” ఉపయోగించుకొని “JDK” ఎలా ఇన్‌స్టాల్ చేయాలి.
00:13 జావా ఎందుకు కావాలి ?
00:14 జావా రకాలు మరియు అప్లికేషన్స్
00:17 ఇక్కడ మనము:
00:19 ”ఉబంటు 11.10” మరియు
00:21 Java Development Environment జెడికే 1.6 ఉపయోగిస్తాము.
00:26 ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు ఇంటర్నెట్ కనెక్షన్ కావాలి.
00:31 మీ సిస్టమ్ లో Synaptic Package Manager ఇన్స్టాల్ చేసి ఉండాలి.
00:35 మరియు లినక్స్ లో “టర్మినల్, టెక్స్ట్ ఎడిటర్ మరియు సినప్టిక్ ప్యాకేజ్ మ్యానేజర్” ఉపయోగించడం తెలిసి ఉండాలి.
00:43 లేదా, స్పోకన్- ట్యుటోరియల్.org లో లినక్స్ పై స్పోకన్ ట్యుటోరియల్ ని చూడగలరు.
00:51 జావా ప్రోగ్రాం లను అమలుపరుచుటకు, JDK అనగా జావా డెవెలప్ మెంట్ కిట్ ఇన్‌స్టాల్ అయ్యిఉండాలి.
00:57 జెడికే గురించి మరిన్ని వివరాలకు క్రింద లింక్ ని సంప్రదించండి:
01:02 ఇప్పుడు సినప్టిక్ ప్యాకేజ్ మ్యానేజర్ ఉపయోగించి JDK ఇన్‌స్టాల్ చేద్దాం.
01:07 ఇందుకు, మనకు రూట్ అనుమతి కావాలి.
01:10 మరియు రిపాసిటరీ ఎలా ఎంచుకోవాలో తెలిసి ఉండాలి.
01:15 వీటిని ఇంతకు ముందు సూచించిన లినక్స్ ట్యుటోరియల్ లో వివరించడం జరిగింది.
01:19 డెస్క్ టాప్ ఎడమ వైపు మీకు టాస్క్ బార్ కనిపిస్తుంది.
01:26 డెస్క్ టాప్ పై భాగం లో డ్యాష్ హోం ఉంటుంది.
01:28 డ్యాష్ హోం పై క్లిక్ చేయండి.
01:30 సెర్చ్ బార్ లో Synaptic. టైప్ చెయండి.
01:36 మీకు సినప్టిక్ ప్యాకేజ్ మ్యానేజర్ కనిపిస్తుంది.
01:39 సినప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ పై క్లిక్ చేయండి.
01:42 ప్రమాణీకరణ కొరకు పాస్ వర్డ్ అడుగుతుంది.
01:46 పాస్ వర్డ్ టైప్ చేసి Authenticate. పై క్లిక్ చేయండి.
01:55 సినప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ తెరచుకుంటుంది.
02:03 ఇప్పుడు Quick Filter ఎంపికలో jdk. టైప్ చెయండి.
02:08 openjdk-6-jdk అనే ప్యాకేజ్ కనిపిస్తుంది.
02:13 దాని పై రైట్ క్లిక్ చెసి Mark for Installation. పై క్లిక్ చెయండి.
02:17 తరువాత Apply. పై క్లిక్ చెయండి.
02:20 గుర్తించిన మార్పులు చేయడానికి ద్రువీకరణ ఆడుగుతుంది.
02:24 To be Installed పై క్లిక్ చేసి Apply పై క్లిక్ చేయండి.
02:29 The installation will take a few seconds.

కొన్ని క్షణాలలో ఇన్‌స్టలేషన్ పూర్తౌతుంది.

02:38 ఇప్పుడు openjdk-6-jdk ఆ ప్షన్ ఆకుపచ్చగా మారింది. ‍
02:48 ఇన్‌స్టలేషన్ ఇంతటితో పూర్తి అయింది.
02:52 ఇప్పుడు, ఇన్‌స్టలేషన్ సరిగ్గా అయిందో లేదో చూద్దాం. ఇందుకు Ctrl, Alt మరియు T ఒకేసారి నొక్కి టర్మినల్ తెరవండి.
03:02 నేను టర్మినల్ ని తెరచి ఉంచాను.
03:06 కమాండ్ ప్రాంప్ట్ వద్ద java స్పేస్, హైఫన్ version' టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
03:15 జెడికే వర్షన్ సంఖ్య కనిపిస్తుంది .
03:20 మన JDK, distribution ఆధారంగా వర్షన్ సంఖ్య మారుతుంది.
03:25 మనం జెడికే ని సరిగ్గా ఇన్‌స్టాల్ చేసాం.
03:28 ఇప్పుడు, ఒక సులభమైన జావా ప్రోగ్రాం ని రన్ చేసి చూద్దాం
03:34 నేను ఈ కోడ్ ని రాసి దానిని TestProgram డాట్ java. పేరుతో సేవ్ చేసాను.
03:40 ఇప్పుడు, కంపైల్ చేసి రన్ చేస్తాను.
03:45 ఈ కోడ్ We have successfully run a Java Program అని టర్మినల్ పై ముద్రిస్తుంది.
03:52 టర్మినల్ కి వద్దాం.
03:56 మన ఫైల్ TestProgram డాట్ java హోం డైరెక్టరీ లో సేవ్ చేసామని గుర్తుంచుకోండి.
04:03 ప్రస్తుతం నేను హోం డైరెక్టరీ లోనే ఉన్నాను.
04:07 అందుకే, కమాండ్ ప్రాంప్ట్ వద్ద: javac space TestProgram డాట్ java టైప్ చేయండి.
04:18 ఇది కోడ్ ని కంపైల్ చేస్తుంది.
04:20 ఎంటర్ నొక్కండి
04:24 ఇప్పుడు కోడ్ ని రన్ చేద్దాం.
04:27 అందుకు java స్పేస్ TestProgram టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
04:34 మన ఔట్ పుట్ We have successfully run a java program కనిపిస్తుంది.
04:43 మన ఇన్‌స్టలేషన్ చక్కగా అయింది.
04:47 ఇప్పుడు, మనం స్లయిడ్ వద్దకు వెళ్దాం.
04:50 ఇప్పుడు నేను జావా ఎందుకు అవసరం అని వివరిస్తాను.
04:54 జావా చాలా సులభం.
04:56 జావా ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్
04:59 ఇది ప్లాట్ ఫార్మ్ పై ఆధారపడిఉండదు.
05:01 ఇది సురక్షితం
05:02 జావాకి అత్యధిక నిర్వహణా సామర్థ్యం ఉంది.
05:04 జావా ఒక మల్టీ త్రెడెడ్ భాష
05:07 ఇప్పుడు కొన్ని రకాల జావా అప్లికేషన్లను చూద్దాం.
05:12 JSP లేదా జావా సర్వర్ పేజస్ : ఇది simple HTML ట్యాగ్ ఆధారం పై ఉంటుంది.
05:18 జె ఎస్ పి క్రియాశీలమైన web pages ను నిర్మించేందుకు సహాయ పడుతుంది.
05:22 జావా అప్ప్లెట్స్ : ఇది ఇంటరాక్టివ్ ఫీచర్స్ ఉన్న వెబ్ అప్లికేషన్ తయారు చేసేందుకు సహాయపడుతుంది.
05:28 J2EE లేదా జావా ఎంటర్ ప్రైస్ ఎడిషన్ : కంపెనీలు J2EE ఉపయోగిస్తాయి.
05:33 ఇది XML స్ట్రక్చరేడ్ డాక్యుమెంట్ లను బదిలీ చేసేందుకు సహాయపడుతాయి.
05:37 జావా బీన్స్: జావా బీన్స్ ఒక reusable software component
05:43 ఇది కొత్త మరియు ఆధునిక అప్లికేషన్ లను తయారు చేసేందుకు ఉపయోగిస్తారు.
05:46 మొబైల్ జావా : దీనిని మొబైల్ లాంటి ఇతర మనోరంజక ఉపకరణాలలో ఉపయోగిస్తారు.
05:53 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది:
05:56 సినప్టిక్ ప్యాకేజ్ మ్యానేజర్ ఉపయోగించుకొని జెడికే ఇన్‌స్టాల్ చేసే విధానం.
05:59 జావా ప్రోగ్రాం లను కంపైల్ మరియు రన్ చేయుట.
06:02 జావా ప్రయోజనాలు.
06:03 జావా రకాలు మరియు అప్లికేషన్ లు .
06:07 స్పోకన్ ట్యుటోరియల్ గురించి మరిన్ని వివరాల కొరకు ఈ లింక్ లోని వీడియో చూడండి.
06:13 ఇది స్పోకన్ ట్యుటోరియల్ సారాంశం.
06:16 మంచి బాండ్ విడ్త్ లేదంటే , డౌన్ లోడ్ చేసి చూడండి.
06:21 స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్టు టీమ్:
06:23 స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్ నిర్వహిస్తుంది.
06:26 ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికట్ ఇవ్వబడును.
06:28 మరిన్ని వివారాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ org ను సంప్రదించండి.
06:36 స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం
06:39 దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.
06:45 దీనిపై మరింత సమాచారం ఈ క్రింద లింక్ లో ఉంది.
06:52 http://spoken-tutorial.org/NMEICT-Intro
06:56 ఇంతటితో ఈ ట్యుటోరియల్ సమాప్తం.
07:00 ఈ రచనకు సహాయపడినవారుశ్రీహర్ష ఎ.ఎన్. మరియు సుషుమ్నరావు తాడినాడ.
07:03 పాల్గొన్నందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

PoojaMoolya, Sushumna