Java/C2/Getting-started-java-Installation/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | గెట్టింగ్ స్టార్టెడ్ విత్ జావా ఇన్స్టలేషన్ పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ మనము నేర్చుకునేవి: |
00:09 | “సినప్టిక్ ప్యాకేజ్ మ్యానేజర్” ఉపయోగించుకొని “JDK” ఇన్స్టాల్ ఎలా చేయాలి. |
00:13 | జావా ఎందుకు కావాలి ? |
00:14 | జావా రకాలు మరియు అప్లికేషన్స్ |
00:17 | ఇక్కడ మనము: |
00:19 | ”ఉబంటు 11.10” మరియు |
00:21 | Java Development Environment జెడికే 1.6 ఉపయోగిస్తాము. |
00:26 | ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు ఇంటర్నెట్ కనెక్షన్ కావాలి. |
00:31 | మీ సిస్టమ్ లో Synaptic Package Manager ఇన్స్టాల్ చేసి ఉండాలి. |
00:35 | మరియు లినక్స్ లో “టర్మినల్, టెక్స్ట్ ఎడిటర్ మరియు సినప్టిక్ ప్యాకేజ్ మ్యానేజర్” ఉపయోగించడం తెలిసి ఉండాలి. |
00:43 | లేదా, స్పోకన్- ట్యుటోరియల్.org లో లినక్స్ పై స్పోకన్ ట్యుటోరియల్ ని చూడగలరు. |
00:51 | జావా ప్రోగ్రాం లను అమలుపరుచుటకు, JDK అనగా జావా డెవెలప్ మెంట్ కిట్ ఇన్స్టాల్ అయ్యిఉండాలి. |
00:57 | జెడికే గురించి మరిన్ని వివరాలకు క్రింద లింక్ ని సంప్రదించండి: |
01:02 | ఇప్పుడు సినప్టిక్ ప్యాకేజ్ మ్యానేజర్ ఉపయోగించి JDK ఇన్స్టాల్ చేద్దాం. |
01:07 | ఇందుకు, మనకు రూట్ అనుమతి కావాలి. |
01:10 | మరియు రిపాసిటరీ ఎలా ఎంచుకోవాలో తెలిసి ఉండాలి. |
01:15 | వీటిని ఇంతకు ముందు సూచించిన లినక్స్ ట్యుటోరియల్ లో వివరించడం జరిగింది. |
01:19 | డెస్క్ టాప్ ఎడమ వైపు మీకు టాస్క్ బార్ కనిపిస్తుంది. |
01:26 | డెస్క్ టాప్ పై భాగం లో డ్యాష్ హోం ఉంటుంది. |
01:28 | డ్యాష్ హోం పై క్లిక్ చేయండి. |
01:30 | సెర్చ్ బార్ లో Synaptic. టైప్ చెయండి. |
01:36 | మీకు సినప్టిక్ ప్యాకేజ్ మ్యానేజర్ కనిపిస్తుంది. |
01:39 | సినప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ పై క్లిక్ చేయండి. |
01:42 | ప్రమాణీకరణ కొరకు పాస్ వర్డ్ అడుగుతుంది. |
01:46 | పాస్ వర్డ్ టైప్ చేసి Authenticate. పై క్లిక్ చేయండి. |
01:55 | సినప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ తెరచుకుంటుంది. |
02:03 | ఇప్పుడు Quick Filter ఎంపికలో jdk. టైప్ చెయండి. |
02:08 | openjdk-6-jdk అనే ప్యాకేజ్ కనిపిస్తుంది. |
02:13 | దాని పై రైట్ క్లిక్ చెసి Mark for Installation. పై క్లిక్ చెయండి. |
02:17 | తరువాత Apply. పై క్లిక్ చెయండి. |
02:20 | గుర్తించిన మార్పులు చేయడానికి ద్రువీకరణ ఆడుగుతుంది. |
02:24 | To be Installed పై క్లిక్ చేసి Apply పై క్లిక్ చేయండి. |
02:29 | The installation will take a few seconds.
కొన్ని క్షణాలలో ఇన్స్టలేషన్ పూర్తౌతుంది. |
02:38 | ఇప్పుడు openjdk-6-jdk ఆ ప్షన్ ఆకుపచ్చగా మారింది. |
02:48 | ఇన్స్టలేషన్ ఇంతటితో పూర్తి అయింది. |
02:52 | ఇప్పుడు, ఇన్స్టలేషన్ సరిగ్గా అయిందో లేదో చూద్దాం. ఇందుకు Ctrl, Alt మరియు T ఒకేసారి నొక్కి టర్మినల్ తెరవండి. |
03:02 | నేను టర్మినల్ ని తెరచి ఉంచాను. |
03:06 | కమాండ్ ప్రాంప్ట్ వద్ద java స్పేస్, హైఫన్ version' టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
03:15 | జెడికే వర్షన్ సంఖ్య కనిపిస్తుంది . |
03:20 | మన JDK, distribution ఆధారంగా వర్షన్ సంఖ్య మారుతుంది. |
03:25 | మనం జెడికే ని సరిగ్గా ఇన్స్టాల్ చేసాం. |
03:28 | ఇప్పుడు, ఒక సులభమైన జావా ప్రోగ్రాం ని రన్ చేసి చూద్దాం |
03:34 | నేను ఈ కోడ్ ని రాసి దానిని TestProgram డాట్ java. పేరుతో సేవ్ చేసాను. |
03:40 | ఇప్పుడు, కంపైల్ చేసి రన్ చేస్తాను. |
03:45 | ఈ కోడ్ We have successfully run a Java Program అని టర్మినల్ పై ముద్రిస్తుంది. |
03:52 | టర్మినల్ కి వద్దాం. |
03:56 | మన ఫైల్ TestProgram డాట్ java హోం డైరెక్టరీ లో సేవ్ చేసామని గుర్తుంచుకోండి. |
04:03 | ప్రస్తుతం నేను హోం డైరెక్టరీ లోనే ఉన్నాను. |
04:07 | అందుకే, కమాండ్ ప్రాంప్ట్ వద్ద: javac space TestProgram డాట్ java టైప్ చేయండి. |
04:18 | ఇది కోడ్ ని కంపైల్ చేస్తుంది. |
04:20 | ఎంటర్ నొక్కండి |
04:24 | ఇప్పుడు కోడ్ ని రన్ చేద్దాం. |
04:27 | అందుకు java స్పేస్ TestProgram టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
04:34 | మన ఔట్ పుట్ We have successfully run a java program కనిపిస్తుంది. |
04:43 | మన ఇన్స్టలేషన్ చక్కగా అయింది. |
04:47 | ఇప్పుడు, మనం స్లయిడ్ వద్దకు వెళ్దాం. |
04:50 | ఇప్పుడు నేను జావా ఎందుకు అవసరం అని వివరిస్తాను. |
04:54 | జావా చాలా సులభం. |
04:56 | జావా ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ |
04:59 | ఇది ప్లాట్ ఫార్మ్ పై ఆధారపడిఉండదు. |
05:01 | ఇది సురక్షితం |
05:02 | జావాకి అత్యధిక నిర్వహణా సామర్థ్యం ఉంది. |
05:04 | జావా ఒక మల్టీ త్రెడెడ్ భాష |
05:07 | ఇప్పుడు కొన్ని రకాల జావా అప్లికేషన్లను చూద్దాం. |
05:12 | JSP లేదా జావా సర్వర్ పేజస్ : ఇది simple HTML ట్యాగ్ ఆధారం పై ఉంటుంది. |
05:18 | జె ఎస్ పి క్రియాశీలమైన web pages ను నిర్మించేందుకు సహాయ పడుతుంది. |
05:22 | జావా అప్ప్లెట్స్ : ఇది ఇంటరాక్టివ్ ఫీచర్స్ ఉన్న వెబ్ అప్లికేషన్ తయారు చేసేందుకు సహాయపడుతుంది. |
05:28 | J2EE లేదా జావా ఎంటర్ ప్రైస్ ఎడిషన్ : కంపెనీలు J2EE ఉపయోగిస్తాయి. |
05:33 | ఇది XML స్ట్రక్చరేడ్ డాక్యుమెంట్ లను బదిలీ చేసేందుకు సహాయపడుతాయి. |
05:37 | జావా బీన్స్: జావా బీన్స్ ఒక reusable software component |
05:43 | ఇది కొత్త మరియు ఆధునిక అప్లికేషన్ లను తయారు చేసేందుకు ఉపయోగిస్తారు. |
05:46 | మొబైల్ జావా : దీనిని మొబైల్ లాంటి ఇతర మనోరంజక ఉపకరణాలలో ఉపయోగిస్తారు. |
05:53 | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది: |
05:56 | సినప్టిక్ ప్యాకేజ్ మ్యానేజర్ ఉపయోగించుకొని జెడికే ఇన్స్టాల్ చేసే విధానం. |
05:59 | జావా ప్రోగ్రాం లను కంపైల్ మరియు రన్ చేయుట. |
06:02 | జావా ప్రయోజనాలు. |
06:03 | జావా రకాలు మరియు అప్లికేషన్ లు . |
06:07 | స్పోకన్ ట్యుటోరియల్ గురించి మరిన్ని వివరాల కొరకు ఈ లింక్ లోని వీడియో చూడండి. |
06:13 | ఇది స్పోకన్ ట్యుటోరియల్ సారాంశం. |
06:16 | మంచి బాండ్ విడ్త్ లేదంటే , డౌన్ లోడ్ చేసి చూడండి. |
06:21 | స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్టు టీమ్: |
06:23 | స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్ నిర్వహిస్తుంది. |
06:26 | ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికట్ ఇవ్వబడును. |
06:28 | మరిన్ని వివారాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ org ను సంప్రదించండి. |
06:36 | స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం |
06:39 | దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది. |
06:45 | దీనిపై మరింత సమాచారం ఈ క్రింద లింక్ లో ఉంది. |
06:52 | http://spoken-tutorial.org/NMEICT-Intro |
06:56 | ఇంతటితో ఈ ట్యుటోరియల్ సమాప్తం. |
07:00 | ఈ రచనకు సహాయపడినవారుశ్రీహర్ష ఎ.ఎన్. మరియు సుషుమ్నరావు తాడినాడ. |
07:03 | పాల్గొన్నందుకు ధన్యవాదములు. |