Drupal/C3/Menu-and-Endpoints/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | మెనూ అండ్ ఎండ్ పాయింట్స్ పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో మనము URL ప్యాటర్న్లు మరియు మెనూ మానేజ్మెంట్ ల గూర్చి నేర్చుకుంటాము. |
00:15 | ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను వాడుతున్నాది: ఉబుంటు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, దృపల్ 8 మరియు ఫైర్ ఫాక్స్ వెబ్ బ్రౌజర్. మీరు ఏ వెబ్ బ్రౌజర్ నైనా ఉపయోగించవచ్చు. |
00:29 | ఈ ట్యుటోరియల్ లో, మనం వెబ్సైట్ కోసం సరైన URL పాత్లను సృష్టించే ప్రక్రియ గురించి చేర్చిద్దాం. |
00:36 | Endpoints మరియు aliases- Endpoints, ఒక ప్రత్యేక కంటెంట్‌ని ప్ర దర్శించే URL పాతాలు. |
00:45 | అప్రమేయంగా ద్రుపల్ లో నోడ్ యొక్క ఎండ్ పాయింట్ నోడ్ స్లాష్ నోడ్ ఐడి (node/[node:id]) |
00:53 | దీనిని సర్వర్ కి పంపితే, నోడ్ యొక్క విషయాలు ప్రదర్శింప బడుతాయి. ఐడి లోని సంఖ్య మానవులు చదువ లేరు. |
01:02 | దీనిని మనము సులభంగా ఒక ప్రత్యేక కంటెంట్‌కి అనుబంధించలేము అనగా నోడ్ స్లాష్ ( /) 278162.
మానవులు చదువ గలిగే ఎండ్ పాయింట్ ఒక అలియాస్ సృష్టించడం ద్వారా అందుబాటులో ఉంటుంది. |
01:19 | అలియాస్ ante కంటెంట్ కోసం ఒక ప్రత్యామ్నాయ URLపాత్. మనము అదే కంటెంట్‌ని ప్రదర్శించడానికి అసలు లేదా అనేక ఇతర అలియా స్స్ ల ను కూడా ఉపయోగించవచ్చు. |
01:34 | ఉదాహరణకు, నోడ్ స్లాష్ /278162 మరియు కంటెంట్/ ద్రుపల్- క్యాంపు- ముంబయి -2015. |
01:47 | రెండు ఒకే కంటెంట్‌ని తిరిగిస్తాయి. రెండవది గుర్తుంచుకోవడానికి సులభం. |
01:54 | మనకున్న అన్ని కంటెంట్లకు వర్తించే URL పాటర్న్ లను సృష్టిద్దాం |
01:59 | URL పాత్ లను సెట్ చేయుట కు మూడు మాడ్యూల్స్ కావాలి |
02:04 | ఆ మాడ్యూల్స్ Pathauto, Token మరియు CTools. |
02:13 | Pathauto మాడ్యూల్ ని మీ మెషిన్ పై ఇన్స్టాల్ చేయండి. |
02:18 | Pathauto ప్రాజెక్ట్ పేజీ కి తిరిగి రండి. ఇక్కడ Pathautoకోసం టోకన్ మరియు CTools కావాలని మీరు గమనించ గలరు |
02:27 | Token మరియు CTools ఇన్స్టాల్ చేయండి. ఈ మాడ్యూల్స్ ని ఇన్స్టాల్ చేసిన తరవాత వాటిని ఆన్ చేయండి |
02:37 | ఇప్పుడు వాటిని వాడుటకు మనము సిద్ధంగా ఉన్నాము. |
02:40 | Configuration పై క్లిక్ చేయండి. క్రిందికి వెళ్తే, మీకు ఎడమ వైపు SEARCH AND METADATA విభాగం క్రింద, URL అలియాస్స్ కనిపిస్తాయి. |
02:52 | అప్రమేయంగా URL aliases అందుబాటులో లేవు. |
02:58 | Patterns ట్యాబ్ పై క్లిక్ చేయండి. Add Pathauto pattern బటాన్ పై క్లిక్ చేయండి. |
03:05 | Pattern type డ్రాప్ డౌన్ పై క్లిక్ చేయండి. |
03:09 | ఇక్కడ ఫోరమ్, కంటెంట్, టక్సన్యోమి టర్మ్ మరియు యూసర్ కోసం ప్రత్యేక నమూనాలను సృష్టించవచ్చు. |
03:17 | ఉదాహరణకు నేను కంటెంట్ ఎంచుకుంటాను. పాత్ పాటర్న్ ఫీల్డ్ లో నమూనా టెంప్లేట్ అందించాలి. |
03:27 | టెంప్లేట్ వేరియబుల్స్‌ని టోకెన్స్ అంటారు. అవి ప్రతి ఎంటిటి కోసం డైనమిక్ గా ఉత్పత్తి చెయ్యబడుతాయి. |
03:36 | ఈ వేరియబుల్స్‌ని టోకన్ మాడ్యూల్ అందిస్తుంది. మీరు Browse available tokensని ఏ ఇన్పుట్ రూపం లో నైనా చుస్తే, పూర్వనిర్వచిత టోకెన్లను చేర్చగలరు. |
03:49 | ఎక్కడైతే మీకు టోకెన్ చేర్చేదుందో అక్కడ Path pattern బాక్స్ పై క్లిక్ చేయండి. |
03:55 | కంటెంట్/ స్లాష్ టైప్ చేసి, Browse available tokens లింక్ పై క్లిక్ చేయండి. |
04:02 | Available tokens చూపించడానికి ఒక పాపప్ విండో తెరుచుకుంటుంది. |
04:07 | మనకు content/[title of the page] ఇలాంటి పాటర్న్ కావలిస్తే, పేజీ యొక్క శీర్షిక కోసం టోకన్, నోడ్స్ విభాగం క్రింద ఉంది. |
04:18 | నోడ్స్ విభాగంలో కుడి బాణం బటన్ క్లిక్ చేయండి. |
04:23 | token [node:title] ఎంచుకోండి ఏడైతే పేజీ యొక్క శీర్షిక అనగా టైటిల్ తో మార్చ బడుతుంది. |
04:32 | ఇది [node:title]ని ఫామ్ బాక్స్ లో కర్సర్ యొక్క స్థానం లో చేర్చుతుంది. |
04:38 | అది జరగక పొతే, అవసరానికి తగిన విధంగా బాక్స్ మరియు కర్సర్ యొక్క స్థానం పై క్లిక్ చేయుట నిర్ధారించుకోండి. |
04:49 | కంటెంట్ టైప్ క్రింద, మనం ఈ నమూనా ఏ ఎంటిటి టైప్ కి వర్తిస్తుందో ఎంచుకోవచ్చు. |
04:56 | మనం అన్ని టైప్స్‌ని ఎంచుకుందాం, అందువలన ఈ నమూనా వాటన్నిటికి అప్రమేయంగా వర్తిస్తుంది. |
05:04 | ఈ సెట్టింగ్‌ని ఒక నిర్దిష్టమైన టైప్ కోసం ఓవర్‌రైడ్ చెయ్యవచ్చు.
ఉదాహరణకు: ఒక యూసర్ గ్రూప్ స్లాష్ /[node:title]ని సృష్టించవచ్చు మరియు దానిని యూసర్ గ్రూప్స్ కి మాత్రమే వర్తిపచేయవచ్చు. |
05:18 | లేబుల్ ఫీల్డ్ లో కంటెంట్ title అని టైప్ చేయండి. తదుపరి సేవ్ బటాన్ క్లిక్ చేయండి. ఇక్కడ మనం సృష్టించిన కొత్త పాటర్న్ ని తనిఖీ చేయవచ్చు. |
05:31 | ఈ పాటర్న్ కొత్త గా జోడించిన కంటెంట్ లకు URL aliasesలను ఉత్పత్తి చేయుటకు వర్తిస్తుంది. కానీ అది ఇప్పటికే ఉన్నకంటెంట్ లకు URL aliases సృష్టించదు. |
05:45 | ఇప్పటికే ఉన్నకంటెంట్ లకు అప్లై చేయుటకు Bulk generate ట్యాబ్ పై క్లిక్ చేయండి. కంటెంట్ టైప్ ఎంచుకొని అప్డేట్ బటన్ పై క్లిక్ చేయండి. |
05:58 | అది URL aliases ఉత్పత్తి చేయడం మొదలు పెడుతుంది. దానికి ఇప్పటికే ఉన్న కంటెంట్ ల సంఖ్యను బట్టి కొంత సమయం పడుతుంది. |
06:08 | లిస్ట్ ట్యాబ్ పై క్లిక్ చేయండి. మనం మన కంటెంట్ కోసం URL aliasesని చూడవచ్చు. |
06:15 | మన సైట్ పై ఉన్న ప్రతి నోడ్ కొరకు ఒక సిస్టం పాత్ స్లాష్ నోడ్ స్లాష్ నోడ్ ఐడి(/నోడ్/నోడ్ ఐడి)ఉంది. |
06:24 | కొత్తగా ఉత్పత్తి చేసిన URL alias మొదటి Alias కాలం లో ఉంది. |
06:30 | అన్ని aliases ఒకే పాటర్న్ ని అనుసరిస్తాయని చూడవచ్చు. మీరు కొత్త కంటెంట్ టైప్ సృష్టించిన ప్రతి సరి ఇది మీరు చేయాలి. |
06:41 | పాటర్న్ లను సృష్టించడానికి క్రింది నియమాలను ఉపయోగించాలి- లోయర్ కేసు పదాలను ఉపయోగించండి, పదాల మధ్య స్పేస్ ఇవ్వకండి. |
06:52 | పదాలను వేరు చేయుటకు హైఫన్ ని వాడండి అండర్ స్కోర్ వద్దు.
శోధన ఇంజిన్ ఆప్టిమైజేషన్ (SEO) కోసం URLలో అర్థవంతమైన, మానవలు చదవగలిగే పదాలు ఉపయోగించండి. |
07:07 | సంయానుసారంగా వర్గీకరించబడే కంటెంట్స్ కోసం డేట్ టోకన్స్ వాడండి. |
07:12 | ఎక్కడ సెట్టింగ్స్ ట్యాబ్ లో URL alias పాటర్న్ లను నియంత్రించడానికి మర్రిన్ని ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.
ఇక్కడ మనం అప్రమేయ సెపరేటర్, లెన్త్ మొదలైనవి చూడవచ్చు. |
07:26 | అప్రమేయంగా అనేక సాధారణ పదాలు నమూనా నుండి తీసివెయ్యబడినవని మనం చూడవచ్చు. ఇది ఎండ్ పాయింట్ ని సంక్షిప్తంగా మరియు అర్ధవంతము చేయుటకు. |
07:38 | సారాంశం చూద్దాం.
Pathauto మరియు Token మాడ్యూల్స్ URL పాటర్న్స్ సెట్ చేయుటకు అనుమతిస్తాయి. |
07:46 | అలియాసెస్ తొలగించూట మరియు పెద్దఎత్తున ఏ సమయంలో నైనా అలియాసెస్ ని ఉత్పత్తి చేయుట. |
07:52 | ఇక మీదట నుండి, ప్రతి కొత్త నోడ్ మనము స్థాపించిన నమూనాలను ఉపయోగిస్తుంది. |
07:59 | మేనుస్ గూర్చి నేర్చుకుందాం. |
08:03 | మనము మన సైట్ పై యాదృచ్ఛిక క్రమంలో మెనూ లను వ్యూస్ మరియు బేసిక్ పేజీల ఆధారాంగా జోడిస్తున్నాము. |
08:10 | మెనూ సిస్టం ని ఎలా నిర్వహించాలో తెలుసుకుందాం. |
08:15 | స్ట్రక్చర్ కి వెళ్ళి స్క్రోల్ చేసి Menus క్లిక్ చేయండి. |
08:21 | ఇక్కడ అప్రమేయంగా ద్రుపల్ తో వచ్చే వివిధ మెనూ లు ఉన్నాయి. మా వద్ద ఖచ్చితంగా ఆరు మెనూలు, ఉన్నాయి. |
08:31 | మాకు మెయిన్ నావిగేషన్ మెనూ పై ఆసక్తి ఉంది. ఎడిట్ మెనూ పై క్లిక్ చేద్దాం. |
08:38 | ఇక్కడ, క్లిక్ మరియు డ్రాగ్ పద్దతి లో మెనూ లింక్ లను క్రమ పర్చగలం. |
08:44 | హోమ్ మరియు Upcoming Events ని అన్నిటి కన్న పైకి డ్రాగ్ చేద్దాం. |
08:49 | మీరు మీకు కావలసిన విధంగా మళ్ళీ క్రమ పర్చవచ్చు. క్రమపర్చడం పూర్తి కాగానే సేవ్ క్లిక్ చేయండి. |
08:56 | మన వద్ద ఇవెంట్స్ మరియు అప్ కమింగ్ ఇవెంట్స్(Upcoming Events) ఉన్నవి.
మనము ఇవెంట్స్ అన్నిటికన్న పైకి మరియు అప్ కమింగ్ ఇవెంట్స్(Upcoming Events)ని కుడి వైపుకి డ్రాగ్ చేద్దాం. |
09:07 | ఇది ఒక సబ్ మెనూ ని సృష్టిస్తుంది. |
09:10 | ఇది చాలా తేలిక. సేవ్ క్లిక్ చేసి ఫ్రంట్ పేజీ వద్ద కు చూడండి. |
09:15 | నాలుగు మెనూ లు ఉన్నాయని గమనించండి. |
09:19 | ఇవెంట్ యొక్క సబ్ మెనూ ఎక్కడ ఉంది? |
09:23 | గుర్తుంచుకోండి ద్రుపల్ లో అన్ని థీమ్స్ సబ్ మెనూస్ లేదా డ్రాప్ డౌన్స్ కి మద్దతు ఇవ్వవు. Bartik థీమ్ వాటిల్లో ఒకటి. |
09:32 | ఇప్పటి కోసం స్ట్రక్చర్ మరియు మెనూస్ కి వెళ్ళి, మెయిన్ మెనూ ని ఎడిట్ చేయండి. Upcoming Eventని ఇక్కడకి డ్రాగ్ చేసి సేవ్ క్లిక్ చేయండి. |
09:44 | ఒక ప్రత్యేక నోడ్ లేదా మన సైట్ యొక్క ఒక నిర్దిష్ట విభాగానికి ఒక లింక్ అవసరం ఉంటే ఏమి చేయాలి? |
09:51 | ఉదాహరణకు, నా ఫోరమ్స్ కి ఒక మెనూ లింక్ కావాల్సి ఉంటే, నేను మొదట నా సైట్ కి వెళ్తాను. |
09:58 | ఫోరమ్స్ పేజీ కి వెళ్ళి, అసలు URL అనగా స్లాష్ ఫోరమ్(/forum) ని కాపీ చేస్తాను. |
10:05 | ఆపై వెనక్కి వచ్చి ఎడిట్ మెనూ ఆ తరవాత Add link పై క్లిక్ చేయండి. |
10:12 | దానికి ఒక టైటిల్, ఫోరమ్ అని ఇచ్చి, కాపీ చేసి లింక్ ని పేస్ట్ చేయండి. |
10:17 | మీరు కంటెంట్ యొక్క నిర్దిష్ట భాగాన్ని శోధీస్తుంటే, కేవలం అక్షరాలు F లేదా G టైప్ చేయండి. ఆ అక్షరంతో మొదలయ్యే అన్ని నోడ్స్ చూపబడతాయి. |
10:28 | ఉదాహరణకు, మనము 'a' టైప్ చేస్తే, శీర్షిక లో 'a' ఉన్న అన్ని నోడ్స్ చూడవచ్చు. |
10:38 | కేవలం మనం శోధిస్తున్న దానిని ఎంచుకుంటే, అది మనకు దాని నోడ్ ఐడి సంఖ్య ఒకటని చూపిస్తుంది. |
10:46 | మనకు ఒక అంతర్గత పాత్ కావాలిస్తే, అనగా ఒక నోడ్‌ని జోడించే సామర్థ్యం ఉంటే అది / నోడ్ /యాడ్ ( /node/add) ఉండాలి. |
10:56 | దానిని హోమ్ పేజీకి లింక్ చేయాల్సి ఉంటే, అది front అవుతుంది. కానీ మనకు ఇక్కడ / ఫోరమ్ కావాలి, ఏదైతే ఫోరం కోసం ఒక లింక్ గా ఉండి. |
11:08 | సేవ్ క్లిక్ చేయండి ఇప్పుడు మన వద్ద ఫోరమ్ కోసం ఒక లింక్ ఉంది. |
11:14 | సేవ్ క్లిక్ చేయండి. అది పని చేస్తుందా తెలుసుకొనుటకు రెండు సార్లు తనిఖీ చేయండి. అది నిజంగానే పని చేస్తుంది. |
11:21 | దానిని అర్థం చేసుకోవడానికి, దాని పై మరిం త పని చేయండి.
దీనితో, మన మెనూ సిస్టం లో ఒక వ్యూని లేదా ఒక కంటెంట్ టైప్ కోసం మెనూ ఐటమ్ సృష్టించుట చాల తేలిక. |
11:34 | ఇంతటితో ఈ టుటోరియల్ చివరికి వచ్చాం. |
11:38 | సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది: URL పాటర్న్ లను సెట్ చేయుట మరియు మెనూ లను నిర్వహించుట. |
11:59 | ఈ వీడియో Acquia మరియు OS Training నుండి స్వీకరించి స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట్, IIT బాంబే వీరు సవరించారు. |
12:09 | ఈ లింక్ లో ఉన్న వీడియొ స్పోకన్ టూటోరియల్ ప్రొజెక్ట్ సారాంశం. దీనిని డౌన్ లోడ్ చేసి చూడగలరు. |
12:17 | స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట టీమ్ వర్క్ షాప్‌లు నిర్వహిచి సర్టిఫికేట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు మమల్ని సంప్రదించగలరు. |
12:26 | స్పోకన్ టుటోరియల్ కు NMEICT, మినిస్టీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మరియు NVLI మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, భారత ప్రభుత్వం సహాయం అందిస్తోంది. |
12:39 | ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి. మాతో చేరినందుకు ధన్యవాదములు. |