Drupal/C2/Installation-of-Drupal/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 11:00, 7 October 2016 by Madhurig (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 ద్రూపల్ యొక్క సంస్థాపన పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్ స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో, మనము ద్రూపాల్ని ఉబుంటు లీనక్స్ మరియు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ల పై డౌన్లోడ్ మరియు ఇన్స్టాల్ చేయుట నేర్చుకుందాం.
00:17 ఈ ట్యుటోరియల్ కోసం, మీకు అవసరమైనవి-

వెబ్ నుండి తాజా వర్షన్ ఇన్స్టాల్ చేయుటకు ఒక పని చేస్తున్నఇంటర్నెట్ కనెక్షన్ లేదా మీకు అవసరమైన స్థానిక ఫైళ్ళు అందించబడవచ్చు.

00:30 ఉబుంటు లీనక్స్ లేదా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసి ఉన్న మషీన్ కూడా అవసరం.
00:38 ఈ ట్యుటోరియల్ని అనుసరించదానికి మీకు పైన పేర్కొన్న ఆపరేటింగ్ సిస్టమ్ల అవగాహన ఉండాలి.
00:45 ద్రూపల్ని ఇన్స్టాల్ చేయుటకుఅనేక మార్గాలు ఉన్నాయి.
00:48 ఈ ట్యుటోరియల్ కొరకు నేను ఈ చాలా సులభమైన సంస్థాపనా విధానము 'Bitnami Drupal స్టాక్ ఉపయోగిస్తాను.
00:57 Bitnami ద్రూపల్ స్టాక్ ని ఇన్స్టాల్ చేయుటకు మీకు అవసరమైనవి:

ఇంటెల్ x86 లేదా అనుకూలమైన ప్రాసెసర్.

01:05 కనీసం 256 MB RAM
01:08 కనీసం 150 MB హార్డ్ డ్రైవ్ స్పేస్ మరియు
01:13 TCP / IP ప్రోటోకాల్ మద్దతు.
01:16 ఈ క్రిందివి అనుకూలమైన ఆపరేటింగ్ సిస్టమ్లు:
01:20 ఏదైనా ఒక x86 లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్.
01:24 ఏదైనా ఒక 32- బిట్ విండొస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనగా విండోస్ విస్టా, విండోస్ 7, విండోస్ 8, విండోస్ 10, విండోస్ సర్వర్ 2008 లేదా విండోస్ సర్వర్ 2012.
01:41 ఏదైనా ఒక OS X ఆపరేటింగ్ సిస్టమ్ x86.
01:46 మనకు నచ్చిన వెబ్ బ్రౌజర్ని తెరిచి చూపిన URLకి వెళ్దాం.
01:53 క్రిందికి స్క్రోల్ చేసి, విండోస్ మరియు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్లకు ఇన్స్టాలర్ను తనిఖీ చేద్దాం.
02:01 మీరు ఇన్స్టాలర్ని మీ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రకారం ఎంచుకోవాలి.
02:06 నేను ఒక లినక్స్ యూజర్ని అందుకే, నేను లినక్స్ ఇన్స్టాలర్ని ఎన్నుకుంటను.
02:11 మీరు గనక ఒక విండోస్ యూసర్ అయితే, విండోస్ కోసం ద్రుపల్ ఇన్స్టాలర్ని ఎంచుకోండి.
02:17 ఇక్కడ మనము ద్రూపల్ యొక్క వివిధ వెర్షన్లు చూడగలం.
02:22 డౌన్లోడ్ వెర్షన్ గురించి మీకు అవగాహన లేకపోతే, మీరు సిఫార్సు చేసిన వెర్షన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
02:29 ఈ రికార్డింగ్ సమయంలో,ద్రూపల్ 8.1.3 సిఫార్సు చేసిన వెర్షన్.
02:36 మీరు ప్రయత్నిం చిన్నప్పు ఆది భిన్నంగా ఉండవచ్చు.
02:39 కుడి వైపు ఉన్న డౌన్లోడ్ బటన్ పై క్లిక్ చేయండి.
02:43 ఒక పాపప్ విండో Bitnami వెబ్సైట్లో ఒక ఖాతాను సృష్టించడానికి మనల్ని ప్రాంప్ట్ చేస్తుంది.
02:50 ఇప్పుడు కోసం, No thanks పై క్లిక్ చేయండి.
02:53 వెంటనే, ఇన్‌స్టాలర్ యొక్క డౌన్‌లోడ్ ప్రారంభమవుతుంది. ఫైలు సేవ్ చేయుటకు OK బటన్పై క్లిక్ చేయండి.
03:01 క్రింది సంస్థాపన సోపానలు విండోస్ మరియు లినక్స్ OSల కోసం సమానమే.
03:07 మీకు గనక Bitnami ఇన్‌స్టాలర్ ఫైళ్ళు అందించబడితే డౌన్ లోడ్ చేసుకోవటానికి బదులు గా వాటిలో ఒకటి ని ఉపయోగించండి.
03:15 డౌన్లోడ్స్ ఫోల్డర్ లో డౌన్లోడ్ చెయ్యబడిన ఇన్‌స్టాలర్ ఫైల్ని తెరవండి.
03:20 ఈ ఇన్‌స్టాలర్ ఫైల్ ని అమలు చేయుటకు మీకు నిర్వాహక అనగా అడ్మిన్ (admin) యాక్సెస్ ఉండాలి.
03:25 మీరు ఒక విండోస్ వినియోగదారుడు అయితే, ఇన్‌స్టాలర్ ఫైల్ పై రైట్ క్లిక్ చేసి 'Run as administrator' ఎంపిక ఎంచుకోండి.
03:33 మీరు ఒక లినక్స్ వినియోగదారుడు అయితే, ఇన్‌స్టాలర్ ఫైల్ పై రైట్ క్లిక్ చేసి 'Properties' ఎంచుకోండి.
03:40 తదుపరి 'Permissions' టాబ్ పై క్లిక్ చేసి 'Allow executing file as program' ఎంపిక చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి.
03:48 ఈ విండోని మూసివేయుటకు క్లోజ్ బటన్పై క్లిక్ చేయండి.
03:52 ఇప్పుడు, ఇన్స్టాలర్ ఫైలు పై డబుల్ క్లిక్ చేయండి.
03:55 సంస్థాపన మొదలవుతుంది. Next బటన్పై క్లిక్ చేయండి.
04:01 ఇక్కడ మనము సంస్థాపనకి కావలసిన భాగాలను ఎంచుకోవచ్చు.
04:06 ప్రతీ భాగం పై క్లిక్ చేసి మొదట దాని గురించి ఇచ్చిన వివరణాత్మక సమాచారాన్ని చదవండి.
04:12 నేను అన్నిభాగాలను ఎంచుకొనుటకు ఇష్టపడుతాను. Next బటన్పై క్లిక్ చేయండి.
04:18 ఈ విండోలో, మనము ద్రుపల్ ని ఏ ఫోల్డర్ లో ఇన్స్టాల్ చెయ్యాలో ఎంచుకోవాలి.
04:24 నేను నా హోమ్ ఫోల్డర్ ఎంచుకుంటాను.
04:27 విండోస్ లో అది డీఫాల్ట్ గా C colon(C:)లో లేదా ప్రధాన డ్రైవ్ లో ఇన్స్టాల్ అవుతుంది.
04:34 Next బటన్పై క్లిక్ చేయండి.
04:36 ఇప్పుడు మనం ఒక ద్రుపల్ అడ్మిన్ ఖాతాని సృష్టించాలి.
04:40 నేను అసలు పేరు ప్రియ గా టైప్ చేస్తాను. ఈ పేరు అప్లికేషన్ లో ప్రదర్శింపబడుతుంది.
04:47 ఇక్కడ మీ స్వంత పేరు టైప్ చేయండి.
04:50 ఇమెయిల్ అడ్రస్ ఫీల్డ్ లో, నేను priyaspoken@gmail.com అని టైప్ చేస్తాను.
04:56 దయచేసి మీ సొంత చెల్లుబాటు అయ్యే ఇమెయిల్ చిరునామాను వాడండి.
05:00 తరువాత, నిర్వాహకుని కోసం,ఎన్నుకున్న యూసర్ నేమ్ మరియు పాస్ వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది.
05:07 లాగిన్ యూజర్ నేమ్ లో నేను 'అడ్మిన్' టైప్ చేస్తాను.
05:11 పాస్వర్డ్ రంగం లో నేను ఒక పాస్వర్డ్ టైప్ చేస్తాను. ధ్రువీకరణ కోసం పాస్వర్డ్ మళ్ళి టైప్ చేయండి.
05:17 మీ ఎంపిక ప్రకారం ఏ లాగిన్ నేమ్ మరియు పాస్వర్డ్ నైనా టైప్ చేయవచ్చు.
05:22 Next బటన్పై క్లిక్ చేయండి.
05:24 లినక్స్ లో, Apache కోసం, అప్రమేయ listening పోర్ట్ 8080 మరియు MySQL కోసం అది 3306.
05:34 విండోస్ లో, ఇది 80 మరియు 3306.
05:39 ఆ పోర్ట్లు, ఇదివరకే ఇతర అప్లికేషన్ల చేత ఉపయోగంలో ఉంటే, ప్రత్యామ్నాయ 'పోర్ట్సు' ఉపయోగించడానికి ప్రేరేపిస్తుంది.
05:47 ఇప్పటికే నా కంప్యూటరులో MySQL సంస్థా పించబడి ఉంది. కనుక ఇది ఒక ప్రత్యామ్నాయ పోర్ట్ కోసం ప్రాంప్ట్ చేస్తుంది.
05:54 నేను 3307 వేస్తాను.
05:57 Next బటన్పై క్లిక్ చేయండి.
05:59 ఇప్పుడు మనము మన ద్రూపల్ సైట్కి ఒక పేరుని ఇవ్వాల్సి ఉంటుంది. నేను Drupal 8 గా పేరు టైప్ చేస్తాను.
06:06 మీ ఎంపిక ప్రకారం ఏ పేరు నైనా ఇవ్వవచ్చు.
06:10 Next బటన్పై క్లిక్ చేయండి.
06:12 ఇక్కడ అది Bitnami క్లౌడ్ హోస్టింగ్ కోసం మనల్ని అడుగుతుంది. ఇప్పటికోసం కోసం, నేను ఇది వద్దనుకుంటున్నాను.
06:19 కాబట్టి, దానిని డి-సెలెక్ట్ చేయుటకు చెక్ బాక్స్ పై క్లిక్ చేస్తాను.
06:23 తదుపరి Next బటన్పై క్లిక్ చేయండి.
06:26 ద్రుపల్ ఇప్పుడు ఇన్స్టాల్ అవ్వుటకు సిద్ధంగా ఉంది. Next బటన్పై క్లిక్ చేయండి.
06:31 సంస్థాపన పూర్తిచేయుటకు చాలా నిమషాలు పడుతుంది.
06:36 సంస్థాపన ముగిసిన తర్వాత, 'Launch Bitnami Drupal Stack' తనిఖీ చెయ్యబడింది నిర్ధారించుకోండి.
06:43 Finish బటన్పై క్లిక్ చేయండి.
06:46 Bitnami ద్రూపల్ స్టాక్ నియంత్రణ విండో స్వయంచాలకంగా తెరుచుకుంటుంది.
06:51 అన్ని రన్నింగ్ సర్వీస్లు చూడటానికి Manage Servers టాబ్ క్లిక్ చేయండి.
06:56 ఇక్కడ MySQL డేటాబేస్ మరియు Apache వెబ్ సర్వర్ నడుస్తున్నాయని చూడవచ్చు.
07:02 ద్రూపల్ పై పని చేయుటకు మనకు MySQL, PostgreSQL లేదా Oracle వంటి ఒక డేటాబేస్ అవసరం అని గమనించండి.
07:11 మరియు Apache లేదా Nginx లాంటి ఒక వెబ్ సర్వర్.
07:16 అప్రమేయంగా, Bitnami Drupal స్టాక్ MySQL డేటాబేస్ మరియు Apache వెబ్ సర్వర్ తో వస్తుంది.
07:23 కంట్రోల్ విండో కి తిరిగి వెళ్దాం.
07:26 మనము సేవలను ప్రారంచుటకు, ఆపుటకు మరియు పునఃప్రారంభించుట తగిన బటన్లను క్లిక్ చేయడం ద్వారా చేయవచ్చు.
07:33 Welcome టాబ్ పై క్లిక్ చేయండి.
07:36 ద్రుపల్ ని ప్రారంభించడానికి, కుడి చేతి వైపు ఉన్న Go to Application బటన్ క్లిక్ చేయండి.
07:42 బ్రౌసర్ లో స్వయంచాలకంగా bitnami పేజీ తెరుచుకుంటుంది.
07:46 ఇప్పుడు, యాక్సెస్ ద్రుపల్ లింక్ను క్లిక్ చెయ్యండి. మనము మన ద్రుపల్ వెబ్సైట్కు మళ్ళించబడుతాము.
07:54 వెబ్సైట్ పేరు 'Drupal 8' అని గమనించండి.
07:58 వెబ్సైట్ లోకి లాగిన్ చేసేందుకు, కుడి ఎగువ మూలలో ఉన్న లాగిన్ లింక్ ని క్లిక్ చేయండి.
08:03 మనము ఇదివరకు సృస్టించిన యూజర్ నేమ్ మరియు పాస్ వర్డ్ టైప్ చేద్దాం.
08:11 ఇప్పుడు, లాగిన్ బటన్పై క్లిక్ చేయండి.
08:14 చిరునామా బార్ లో, మన వెబ్సైట్ యొక్క చిరునామా // localhost: 8080 / Drupal / user / 1 చూడగలం.
08:27 తరువాతి ట్యుటోరియల్ లో, మనము / user / 1 ante ఏమిటో నేర్చ్కుంటాము.
08:32 ఈ localhost కి బదులుగా మీకు సిస్టమ్ కన్ఫిగరేషన్ ఆధారంగా '127.0.0.1', చూపవచ్చు.
08:42 తదుపరి సమయం నుండి మనము ద్రుపల్ని, వెబ్ చిరునామా ఉపయోగించి యాక్సెస్ చేయవచ్చు

localhost colon 8080 slash drupal లేదా localhost slash drupal.

ఒక వేళా Apache listening పోర్ట్ 80 అయితే.

08:57 తరువాత, Bitnami ద్రుపల్ స్టాక్ నియంత్రణ విండో ఎలా యాక్సెస్ చెయ్యాలో చూద్దాం.
09:03 మీరు ఒక లినక్స్ యూసర్ అయితే, దయచేసి ఈ సోపానాలని అనుసరించండి.
09:07 ఫైల్ బ్రోవ్సెర్‌కి మారండి.
09:10 ఎడమ సైడ్బార్ లో, Places కింద Home క్లిక్ చేయండి.
09:15 ఇప్పుడు, జాబితా నుండి drupal hyphen 8.1.3 hyphen 0 folderపై డబుల్ క్లిక్ చేయండి.
09:23 ఇక్కడ మీకు manager hyphen linux hyphen x64.run ఫైల కనిపిస్తుంది. దానిని తెరవడానికి డబుల్ క్లిక్ చేయండి.
09:33 మీరు ఒక విండోస్ వినియోగదారుడు అయితే Start Menu -> All Programs -> Bitnami Drupal Stack -> Bitnami Drupal Stack Manager Toolకు వెళ్ళండి.
09:44 Bitnami ద్రుపల్ స్టాక్ నియంత్రణ విండో తెరుచుకుంటుంది.
09:48 మీరు ద్రూపల్ని తెరిచిన ప్రతీసారి, అన్ని సర్వర్లు నడుస్తున్నాయో లేదో తనిఖీ చెయ్యండి.
09:54 దీని తో, మనము ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చము.
09:57 ట్యూటోరియల్ సారాంశం ఈ ట్యుటోరియల్ లో, మనము ద్రూపాల్ని ఉబుంటు లినక్స్ మరియు విండోస్ ఆపరేటింగ్ సిస్టంల పై సంస్థాపన గురించి నేర్చుకున్నాం.
10:07 క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశం ఇస్తుంది. దయచేసి డౌన్లోడ్ చేసి చూడండి.
10:14 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ జట్టు వర్క్ షాప్లు నిర్వహిస్తుంది మరియు ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు, దయచేసి మాకు వ్రాయండి.
10:25 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్:

NMEICT, మానవ వనరుల అభివృద్ది మంత్రిత్వ శాఖ మరియు NVLI, సాంస్కృతిక శాఖ, భారతదేశం ప్రభుత్వంద్వారా నిధులను పొందుతుంది.

10:36 ఈ ట్యూటోరియల్ని తెలుగులోకి అనువదించిందిమాధురి గణపతి. ధన్యవాదములు

Contributors and Content Editors

Madhurig, PoojaMoolya