LibreOffice-Suite-Draw/C2/Fill-objects-with-color/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:00 | లిబరే ఆఫీసు డ్రా లో ఫిల్ ఆబ్జేక్ట్స్ విత్ కలర్ (Fill Objects with Color)పై స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేది: |
00:09 | * ఆబ్జేక్ట్ లను కలర్(color), గ్రేడిఎంట్(gradients),హాట్చింగ్(hatching) మరియు బిట్మాప్la(bitmaps) తో పూరించండo, |
00:15 | * పేజీ కి బ్యాక్ గ్రౌండ్ కలర్లను ఏర్పాటు చేయడం, |
00:17 | * కొత్త రంగులు సృష్టించడం. |
00:20 | 'వాటర్ సైకిల్ (WaterCycle)' ఫైల్ తెరవడంతో ప్రారంభిద్దాం. |
00:24 | మీరు ఆబ్జేక్ట్ లను: |
00:25 | * కలర్లు, |
00:26 | * గ్రేడిఎంట్లు, |
00:29 | * లైన్ పాటర్న్(patterns)లేదా హాట్చింగ్(hatching) మరియు |
00:32 | * చిత్రాలతో నింపవచ్చు. |
00:33 | ఇక్కడ, మనం ఉపయోగిస్తున్నది :
|
00:42 | 'వాటర్ సైకిల్ (WaterCycle)' రేఖాచిత్రానికి రంగు వేద్దాం. |
00:46 | సూర్యుని పక్కన వున్నరెండు మేఘాలకు రంగు వేస్తూ ప్రారంభిద్దాం. వీటిని తెల్ల రంగు తో పూరిద్దాం. |
00:54 | సూర్యుని పక్కన వున్న మేఘం ఎంచుకోండి. |
00:56 | కాంటెక్స్ట్ మెనూ(context menu) కొరకు రైట్ క్లిక్ చేసి ఏరియా(Area)పై క్లిక్ చెయ్యండి. |
01:01 | ఏరియా(Area) డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. |
01:05 | ఏరియా(Area) ట్యాబ్ పై క్లిక్ చేసి ఫిల్(Fill) ఎంపిక క్రింద కలర్(Color) ఎంచుకోండి. |
01:13 | స్క్రోల్ చేసి వైట్( white)పై క్లిక్ చేయండి . |
01:16 | ఓకే క్లిక్ చేయండి. |
01:19 | ఇదే విధంగా, ఇతర మేఘానికి కూడా రంగు వేయవచ్చు. |
01:24 | ఏరియా(Area) కింద రైట్ -క్లిక్ చేసి, కలర్(Color) మరియు వైట్(White)ఎంచుకోండి. |
01:30 | ప్రతి ఒక్క మేఘానికి రంగు వేయడానికి చాలా సమయం పడుతుంది. |
01:33 | దానికి ఒక సులువైన మార్గం, వాటిని సమూహ పరచడం. |
01:38 | ఇతర రెండు మేఘాలకు గ్రే(gray)రంగు వేద్దాం ఎందుకంటే అవి వర్షం కలిగిన మేఘాలు. |
01:46 | ముందుగా వాటిని సమూహ పరుద్దాం. |
01:48 | 'షిఫ్ట్(Shift)' కీ నొక్కి మొదటి మేఘాన్ని క్లిక్ చేసి, ఆపై రెండో మేఘాన్ని క్లిక్ చేయండి. |
01:54 | కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం రైట్ క్లిక్ చేసి గ్రూప్(Group) పై క్లిక్ చేయండి . |
01:58 | మేఘాలు సమూహం చేయబడ్డాయి. |
02:00 | మళ్ళి కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం రైట్ క్లిక్ చేసి ఏరియా(Area) పై క్లిక్ చేయండి |
02:07 | "ఏరియా(Area)" డైలాగ్ బాక్స్ లో, ఏరియా ట్యాబ్ క్లిక్ చేయండి. ఫిల్(Fill)ఎంపిక క్రింద కలర్(Color) ఎంచుకోని స్క్రోల్ చేసి కలర్(colour ) "Gray 70%" పై క్లిక్ చేయండి. |
02:23 | "ఓకే(ok)" క్లిక్ చేయండి. |
02:25 | ఇదే విధంగా త్రిభుజానికి "బ్రౌన్ 3(brown 3”)”" రంగు వేద్దాం. |
02:37 | ఇదే విధంగా మళ్ళి దీర్ఘచేతురస్రానికి "బ్రౌన్ 4(brown 4”)”" రంగు వేద్దాం. |
02:48 | ఇదే విధంగా సూర్యునికి పసుపు రంగు వేయండి. |
02:58 | తరువాత, ఇతర త్రికోణం మరియు నీటిని సూచించే వక్రతకు “turquoise 1”రంగు వేద్దాం . |
03:05 | వాటికి అదే ఫార్మాటింగ్ అవసరం గనక, ఒక వేళ అవి సమూహంలో లేకపోతే, వాటిని సముహ పరుద్దాం. |
03:12 | వాటికి రంగులు వేయుటకు, మునుపటి సోపానాలు అనుసరించండి -రైట్ క్లిక్ చేసి ఏరియా, ఏరియా టాబ్, ఫిల్(Fill), కలర్(color), turquoise 1 పై క్లిక్ చేయండి. |
03:27 | '"వాటర్(water)'" ఆబ్జెక్ట్ను గమనించండి, త్రికోణం మరియు వక్రత యొక్క సరిహద్దులు కనిపిస్తున్నాయి. |
03:35 | ఈ చిత్రo బాగా కనిపిన్చడానికి సరిహద్దులు తీసేద్దాము. |
03:41 | ఆబ్జెక్ట్ను ఎంచుకొని, కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం రైట్ క్లిక్ చేసి లైన్(Line)పై క్లిక్ చేయండి |
03:48 | లైన్(Line)డైలాగ్ -బాక్స్ కనిపిస్తుంది. |
03:52 | లైన్(Line) ట్యాబు పై క్లిక్ చేయండి |
03:55 | లైన్ ప్రాపర్టీస్(Line properties) లో , స్టైల్(Style) డ్రాప్ -డౌన్ బాక్స్ పై క్లిక్ చేసి ఇన్విసిబ్లె(Invisible)ఎంచుకోండి. |
04:03 | "ఓకే(ok)" క్లిక్ చేయండి. |
04:05 | "వాటర్(water)" ఆబ్జెక్ట్ యొక్క ఆకారం అదృశ్యo అవుతుంది. |
04:09 | ఇప్పుడు, చెట్లకు రంగు వేద్దాం . |
04:14 | ఎడమ వైపు వున్న చెట్టు ఎంచుకోండి. |
04:16 | కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం రైట్ క్లిక్ చేసి ఎంటర్ గ్రూప్(Enter Group)పై క్లిక్ చేయండి. |
04:23 | ఇప్పుడు, చెట్టుని సవరిద్దాం. |
04:26 | కుడివైపు వున్న ఆకులు ఎంచుకోండి. |
04:30 | కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం రైట్ క్లిక్ చేసి ఏరియా (Area) 'పై క్లిక్ చేయండి. |
04:36 | "ఏరియా(Area)" డైలాగ్ బాక్స్ లో, |
04:38 | 'ఏరియా(Area)' ట్యాబ్ క్లిక్ చేయండి. |
04:40 | ఫిల్(Fill)కింద , కలర్(Color)ఎంచుకోండి . |
04:44 | స్క్రోల్ చేసి “గ్రీన్(Green ) 5”పై క్లిక్ చేయండి. |
04:47 | "ఓకే(ok)" క్లిక్ చేయండి. |
04:49 | ఎడమ వైపు వున్న ఆకులకు కుడా ఇదే విధముగా చేద్దాం. |
04:57 | తదుపరి చెట్టు యొక్క కాండంకు రంగు వేద్దాం. |
05:05 | Y ఆకారంలో వున్నబాణం ఎంచుకోండి, కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం రైట్ క్లిక్ చేసి ఏరియా (Area)పై క్లిక్ చేయండి. |
05:08 | 'ఏరియా(Area)' డైలాగ్ బాక్స్ లో అన్ని ఎంపికలు నిలిచి వుండడం గమనించండి. |
05:15 | కలర్ (Color) ఎంచుకుందాం. |
05:18 | స్క్రోల్ చేసి బ్రౌన్ 1(Brown 1)పై క్లిక్ చేయండి. |
05:21 | "ఓకే(ok)" క్లిక్ చేయండి. |
05:23 | మనం చెట్టుకు రంగు వేశాం ! |
05:26 | సమూహం నుండి నిష్క్రమించడానికి, రైట్-క్లిక్ చేసి ఎక్సిట్ గ్రూప్(Exit Group) ఎంచుకోండి. |
05:31 | ఇదే విధంగా ఇతర చెట్లకు రంగులు వేయవచ్చు. |
05:36 | మనం ఇతర చెట్లను తొలగించి , రంగు వేసిన చెట్టును - కాపీ పేస్ట్ చేసి కావలసిన స్థానానికి తరలించవచ్చు. |
05:44 | ఈ మార్గం చాలా సులభం కదా? |
05:49 | ఇప్పుడు, సూర్యుడి పక్కన వున్న మేఘానికి ఒక ఛాయని జోడిద్దాం. |
05:55 | వాటిని ఎంచుకొనుటకు , డ్రాయింగ్(Drawing) టూల్బార్ నుండి ‘సెలెక్ట్ (Select)'పై క్లిక్ చేసి ఆపై సమూహ పరుద్దాం. |
06:03 | తెల్ల మేఘం సమూహాన్ని ఎంచుకోని కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం రైట్ క్లిక్ చేసి ఏరియా (Area)పై క్లిక్ చేయండి |
06:10 | ఏరియా (Area)డైలాగ్ బాక్స్ లో, షాడో(Shadow) ట్యాబ్ క్లిక్ చేయండి. |
06:15 | ప్రాపర్టీస్ (properties) లో, యూజ్ షాడో(Use Shadow) బాక్స్ పై చెక్ పెట్టండి. |
06:20 | ఇతర ఫీల్డ్ లు (field) ఇప్పుడు క్రియాశీలకంగా మారుతాయి. |
06:24 | పోసిషన్(Position)లో, దిగువ కుడి మూల ఎంపిక పై క్లిక్ చేయండి. |
06:29 | పోసిషన్(Position), నీడ ఎక్కడ కనిపిస్తుందో నిర్వచిస్తుంది. |
06:33 | కలర్(Color) ఫీల్డ్ లో ,గ్రే(Gray)ఎంచుకోండి . |
06;36 | "ఓకే(ok)" క్లిక్ చేయండి. |
06:39 | ప్రతి తెల్ల మబ్బు వెనుక ఒక నీడ కనిపిస్తుంది. |
06:44 | ఇప్పుడు, మేఘాలను మరింత వాస్తవికoగా తయారు చేద్దాము. |
06:48 | బూడిద రంగు మేఘ సమూహం ఎంచుకోని కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం రైట్ క్లిక్ చేసి ఏరియా (Area)పై క్లిక్ చేయండి. |
06:55 | “ఏరియా(Area)” డైలాగ్-బాక్స్ లో , ఏరియా(Area) ట్యాబు ఎంచుకొని, ఫిల్(Fill)కింద , గ్రేడియంట్(Gradient)పై క్లిక్ చేయండి . |
07:02 | గ్రేడియంట్ (Gradient)1ఎంచుకోండి. |
07:04 | "ఓకే(ok)" క్లిక్ చేయండి. |
07:06 | ఇప్పుడు మేఘం బూడిద షేడ్తో ఇంకా చాలా వాస్తవికoగా ఉంది! |
07:11 | ఒక ఆకారం ఎంచుకోండి - అనగా ఒక క్లౌడ్ సమూహం. కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం రైట్ క్లిక్ చేసి ఏరియా (Area)పై క్లిక్ చేయండి |
07:19 | ఏరియా(Area) ట్యాబ్ ఎంపికలు కనిపిస్తాయి. |
07:23 | "ఫిల్(Fill)" కింద మీరు 4 ఎంపికలు చూస్తారు – |
07:27 | కలర్స్ (colors), గ్రేడిఎంట్(gradient), హాట్చింగ్(hatching) మరియు బిట్మాప్(bitmap). |
07:32 | డైలాగ్ బాక్స్ లో ప్రతి ఎంపికకు ఒక సంబంధిత ట్యాబ్ ఉందని గమనించండి. |
07:39 | ఈ ట్యాబ్లు కొత్త శైలి లను సృష్టించుటకు మరియు సేవ్ చేయుటకు అనుమతిస్తాయి . |
07:43 | కలర్స్(Colors) ట్యాబ్ పై క్లిక్ చేద్దాము. |
07:46 | ప్రాపర్టీస్(Properties)కింద కలర్(Color) డ్రాప్-డౌన్ నుండి. , Red 3 ఎంచుకోండి. |
07:53 | తర్వాత, RGB ఎంచుకోని, 'R', 'G' మరియు 'B' కోసం విలువలను చూపిన విధంగా ప్రవేశ పెట్టండి. |
08:01 | 'R', 'G' మరియు 'B' అనగా ఏ రంగు లో నైన రెడ్, గ్రీన్ మరియు బ్లూ రంగుల యొక్క నిష్పత్తి. |
08:08 | 'R' కోసం 200, 'G' కోసం 100 మరియు 'B' కోసం 50 ప్రవేశ పెడుదాం . |
08:16 | ఇక్కడ రంగును మార్చడానికి, ఎరుపు, ఆకుపచ్చ మరియు నీలం రంగుల యొక్క నిష్పత్తిని మారుస్తున్నాం. |
08:22 | 'RGB' ఫీల్డ్ పైన, ఉన్న ప్రివ్యూ బాక్స్ను చూడండి. |
08:28 | మొదటి ప్రివ్యూ బాక్స్ అసలు రంగును చూపిస్తుంది. |
08:31 | కలర్(Color) ఫీల్డ్ పక్కన వున్న రెండవ ప్రివ్యూ బాక్స్ మనం చేసిన మార్పులను చూపిస్తుంది. |
08:37 | నేమ్(Name) ఫీల్డ్ లో, దీని కోసం ఒక పేరు టైప్ చేద్దాం. |
08:41 | “న్యూ రెడ్ (New red)” అని పేరు ప్రవేశ పెడదాం . |
08:44 | ఆడ్(Add) బటన్ పై క్లిక్ చేద్దాం. |
08:46 | జాబితాకు ఒక కొత్త రంగు జోడిOచబడినది. |
08:49 | "ఓకే(ok)" క్లిక్ చేయండి. |
08:51 | మనం ఒక కొత్త రంగుని సృష్టించాము . |
08:54 | Ctrl మరియు Z నొక్కి ఈ చర్య ను రద్దు చేద్దాం. |
08:59 | మేఘం యొక్క రంగు మళ్ళీ తెలుపు కు మార్చబడినది. |
09:03 | ఏరియా(Area) డైలాగ్ బాక్స్ వుపయోగించి మీరు మీ సొంత గ్రేడిఎంట్లు (gradients) మరియు హాట్చింగ్(hatching)లను సృష్టించవచ్చు. |
09:10 | గ్రేడియంట్(Gradient)లు, ఒక రంగు నుండి మరొక్క రంగులోకి కలిసి పోయే షేడ్లు . |
09:14 | ఉదాహరణకు, కలర్ షేడ్ బ్లూ(blue ) నుండి గ్రీన్(green)రంగుకు మారుతుంది. |
09:18 | హాట్చింగ్(hatching) రేఖాచిత్రంలో సమాంతర రేఖలు ఉపయోగించి రూపొందించిన ఒక షేడింగ్ (shading)లేదా టెక్స్చర్(texture). |
09:24 | డ్రా(Draw )లోకి బిట్మ్యాప్ ఎలా ఇంపోర్ట్ (import) చేయాలో నేర్చుకుందాం. |
09:28 | మెయిన్ మెనూ(Main menu)నుండి , ఫార్మటు(Format) ఎంచుకొని ఏరియా(Area)పై క్లిక్ చేయండి . |
09:33 | ముందుగా చుసిన విధముగానే ఏరియా(Area) డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది బిట్ మ్యాప్స్(Bitmaps) ట్యాబ్ పై క్లిక్ చేయండి. |
09:39 | ఇప్పుడు ఇంపోర్ట్(Import) బటన్ క్లిక్ చేయండి. |
09:42 | ఇంపోర్ట్(Import) డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. |
09:45 | బ్రౌజ్ చేసి ఒక బిట్మ్యాప్ ఎంచుకోండి. |
09:48 | ఓపెన్(Open) బటన్పై క్లిక్ చేయండి. |
09:50 | డ్రా(Draw), బిట్మ్యాప్(Bitmap)కు ఒక పేరు ప్రవేశపెట్టమని ప్రేరేపిస్తుంది. |
09:55 | "న్యూ బిట్మ్యాప్ (NewBitmap)" అనే పేరు ప్రవేశ పెడదాం. |
09:58 | "ఓకే(ok)" క్లిక్ చేయండి. |
10:00 | బిట్మ్యాప్ ఇప్పుడు డ్రాప్-డౌన్ జాబితాలో కనిపిస్తుంది. |
10:04 | నిష్క్రమించడానికి ఓకే(ok) క్లిక్ చెయ్యండి. |
10:07 | ఇప్పుడు మేఘాలను గమనించoడి . |
10:10 | Ctrl మరియు Z నొక్కి ఈ చర్యను రద్దు చేద్దాం. |
10:14 | "వాటర్ (water)" ఆబ్జెక్ట్ ను పూరించడానికి బిట్మ్యాప్(bitmap)లు ఉపయోగిద్దాం |
10:19 | ఇప్పుడు నీటి రూపాన్ని మరింత వాస్తవికo గా చుపిద్దాం . |
10:22 | ఇది చేయుటకు, సముహ పరచిన త్రికోణం మరియు వక్రత ను ఎంచుకోండి. |
10:26 | కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం రైట్ క్లిక్ చేసి ఏరియా (Area)పై క్లిక్ చేయండి. |
10:31 | “ఏరియా(Area)” డైలాగ్-బాక్స్ లో, బిట్ మ్యాప్స్ (Bitmaps) టాబ్ క్లిక్ చేయండి. |
10:36 | బిట్ మ్యాప్స్ జాబితా స్క్రోల్ చేసి వాటర్(Water) ఎంచుకోండి. |
10:41 | "ఓకే(ok)" క్లిక్ చేయండి. |
10:43 | నీరు ఇప్పుడు మరింత వాస్తవికoగా కనిపిస్తోంది! |
10:46 | ఈ ట్యుటోరియల్ లో విరామం తీసుకొని ఈ అసైన్మెంట్ చేయండి. |
10:50 | * ఆబ్జెక్ట్ లను గీసి వాటిని కలర్(color), గ్రేడిఎంట్స్(gradients), హాట్చింగ్(hatching) మరియు బిట్మాప్స్(bitmaps) తో పూరించండి |
10:57 | ట్రాన్స్పరెన్సీ(Transparency) ట్యాబ్ ఉపయోగించి , ఆబ్జెక్ట్ ల పై దాని ప్రభావo చూడండి. |
11:02 | ఇప్పుడు ఆకాశానికి రంగు వేద్దాం. ఇది చాలా తేలిక ! |
11:06 | మొత్తం పేజికి బాక్గ్రౌండ్ను ఇద్దాం . |
11:10 | ఏ ఆబ్జెక్ట్ ఎంపిక చేయబడలేదని నిర్ధారించడానికి 'పేజీ(page)' పై కర్సర్ ను క్లిక్ చేయండి. |
11:15 | కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం రైట్ క్లిక్ చేయండి. |
11:21 | పేజి సెటప్(Page setup) డైలాగ్-బాక్స్ కనిపిస్తుంది. |
11:25 | బాక్గ్రౌండ్(Background) ట్యాబ్ క్లిక్ చేసి ఫిల్(Fill) కింద , కలర్(Color) ఎంచుకోండి. |
11:30 | స్క్రోల్ చేసి కలర్(color ) Blue 8 ఎంచుకోండి. |
11:34 | "ఓకే(ok)" క్లిక్ చేయండి. |
11:36 | ఈ బాక్గ్రౌండ్ సెట్టింగ్ అన్ని పేజీలకు ఉండాల అని 'డ్రా ' (Draw)మిమ్మల్ని అడుగుతుంది. |
11:41 | "నో (NO)" క్లిక్ చేయండి. |
11:44 | ఇప్పుడు ఎంపిక చేసిన పేజీకి మాత్రమే ఒక బాక్గ్రౌండ్ రంగు ఉంది. |
11:48 | మీరు ఆబ్జెక్ట్ లలో రంగులు నింప కుండా వుండడం కూడా ఎంచుకోవచ్చు. |
11:52 | పర్వతo (మౌంటెన్(mountain) ) ఎంచుకోండి. |
11:55 | కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం రైట్ క్లిక్ చేసి ఏరియా (Area)పై క్లిక్ చేయండి. |
11:59 | “ఏరియా(Area)” డైలాగ్-బాక్స్ లో , ఏరియా(Area) ట్యాబ్ ఎంచుకోండి. |
12:04 | ఫిల్(Fill)కింద , సెలెక్ట్ నన్ (None") ఎంచుకోండి. |
12:06 | "ఓకే(ok) క్లిక్ చేయండి. |
12:08 | ఆబ్జెక్ట్ ఏ రంగు తో నింప బడదు, రుపరేఖా మాత్రం బాక్గ్రౌండ్కు వ్యతిరేకంగా కనిపిస్తుంది. |
12:15 | Ctrl మరియు Z నొక్కి ఈ చర్య ను రద్దు చేద్దాం. |
12:20 | మీరు 'ఫార్మాట్(Format)' మెను నుండి కూడా ఈ ఎంపికలని పొందవచ్చు. |
12:25 | మార్పు చేసిన ప్రతిసారీ 'Ctrl + S' కీలు కలిసి నొక్కి, మీ ఫైల్ సేవ్ చేయడం గుర్తుంచుకోండి. |
12:34 | ప్రత్యామ్నాయంగా, ఆటోమేటిక్ సేవ్ (Automatic Save) సెట్ చేయడం ద్వారా మార్పులు స్వయంచా లకంగా సేవ్ చేయబడతాయి. |
12:41 | ఇక్కడ మీకు మరొక అసైన్మెంట్ ఉంది. |
12:43 | సృష్టించిన ఈ చిత్రానికి రంగు వేయండి. |
12:45 | పేజి(page) కు బాక్గ్రౌండ్ ఇవ్వండి . |
12:47 | కొన్ని కొత్త రంగులు సృష్టించండి. |
12:50 | దీనితో మనం లిబరే ఆఫీసు డ్రా ( LibreOffice Draw ) ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం |
12:54 | ఈ ట్యుటోరియల్ లో మనం, కలర్ (color), గ్రేడిఎంట్స్ (gradients), హాట్చింగ్(hatching) మరియు బిట్మాప్ స్ (bitmaps) లను ఉపయోగించి ఎలా, |
13:01 | *ఆబ్జెక్ట్ లను రంగుతో పూరించాలో |
13:03 | * బ్యాక్ గ్రౌండ్స్ ను సృష్టించాలో మరియు |
13:05 | * కొత్త శైలిలను సృష్టిం చాలో నేర్చుకున్నాo. |
13:07 | ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
13:10 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. |
13:13 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియోని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు. |
13:18 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం, |
13:20 | స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. |
13:23 | ఆన్లైన్ పరీక్ష లో ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది . |
13:27 | మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial. org కువ్రాసిసంప్రదించండి. |
13:33 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, |
13:38 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ on ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
13:45 | ఈ మిషన్ గురించి స్పోకెన్ హైఫన్ ట్యుటోరియల్ డాట్ ఆర్గ్ స్లాష్ NMEICT హైఫన్ ఇంట్రో లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది. |
13:56 | ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుతున్నాను ధన్యవాదములు. |