LibreOffice-Suite-Draw/C2/Introduction/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | ఇంట్రడక్షన్ టు లిబరే ఆఫీసు డ్రా(Introduction to LibreOffice Draw)గురించి తెలియ బరిచే స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేది,
|
00:13 | * కాంటెక్స్ట్ మెనూ |
00:15 | మనం ఇంకా నేర్చుకునేది:
|
00:25 | * ప్రాథమిక ఆకారాలను ప్రవేశ పెట్టుట. |
00:28 | ఒక వేళ మీ వద్ద లిబ్రే ఆఫీస్ సూట్ ఇన్స్టాల్ చేసి లేకపోతే, సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్ ఉపయోగించి డ్రాను ఇన్స్టాల్ చేసుకోవచ్చు. |
00:35 | సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్ పై మరింత సమాచారం కోసం, ఈ వెబ్ సైట్ లో ఉబుంటు లైనక్స్ ట్యుటోరియల్స్ని చూడండి. |
00:43 | ఈ వెబ్ సైట్లో సూచనలను అనుసరించి లిబ్రేఆఫీస్ సూట్ డౌన్లోడ్ చేయండి. |
00:48 | వివరణాత్మక సూచనలు లిబ్రేఆఫీస్ సూట్ మొదటి ట్యుటోరియల్ లో అందుబాటులో ఉన్నాయి. |
00:54 | డ్రాను ఇన్స్టాల్ చేస్తున్నపుడు 'కంప్లీట్' ఎంపికను వాడడం గుర్తుపెట్టుకోండి. |
00:59 | లిబరే ఆఫీసు డ్రా, ఒక వెక్టర్ ఆధారిత గ్రాఫిక్స్ సాఫ్ట్వేర్. |
01:03 | ఇది విస్తృతమైన వెక్టర్ గ్రాఫిక్స్ సృష్టించడానికి అనుమతిస్తుంది. |
01:08 | గ్రాఫిక్స్లో రెండు రకాలు వున్నవి - వెక్టర్ ఆధారిత గ్రాఫిక్స్ మరియు బిట్మాప్స్. |
01:13 | లిబరే ఆఫీసు డ్రాను వుపయోగించి వెక్టర్ గ్రాఫిక్స్ను తయారు మరియు మార్పులు చెయ్యవచ్చు. |
01:18 | మరొకటి బిట్మాప్ లేదా రాస్టేర్ ఇమేజ్(raster image). |
01:21 | ప్రముఖ బిట్ మ్యాప్ఫార్మాట్లు BMP, JPG, JPEG మరియు PNG. |
01:30 | ఇమేజ్ ఫార్మాట్లను పోల్చి రెండు రకాల మధ్య తేడాను అర్ధం చేసుకుందాం. |
01:35 | ఎడమ వైపు వున్న చిత్రం వెక్టర్ గ్రాఫిక్. |
01:38 | కుడి వైపు వున్న చిత్రం బిట్ మ్యాప్. |
01:41 | చిత్రాలను విస్తరించినపుడు ఏమి జరుగుతుందో గమనించండి. |
01:45 | వెక్టర్ గ్రాఫిక్ స్పష్టంగా వుంది; బిట్మ్యాప్ చిత్రం అస్పష్టంగా వుంది. |
01:51 | వరసలు మరియు వక్రరేఖలను గణిత సూత్రాలుగా వుపయోగించి, వెక్టర్ ఆధారిత గ్రాఫిక్స్ సాఫ్ట్వేర్ చిత్రాలను బద్ర పరుస్తుంది. |
01:58 | అందువల్ల చిత్రాల పరిమాణం మార్చినా కాని, చిత్రం నాణ్యత ప్రభావితం కాదు. |
02:04 | బిట్మ్యాప్ పిక్సెల్స్ లేదా రంగుల చిన్న చుక్కలని ఒక వరుస క్రమంలో ఒక గ్రిడ్ లేదా చదరపులో ఉపయోగిస్తుంది. |
02:11 | చిత్రాన్ని పెద్దదిగా చేసినపుడు వచ్చే చిన్న చతురస్రాలను చూసారా? |
02:15 | ఇవే గ్రిడ్స్. |
02:17 | చిన్న చుక్కలు ప్రతి గ్రిడ్లో రంగును నింపుతాయి. |
02:20 | మీరు మరో వ్యత్యాసం గమనించి ఉండవచ్చు- బిట్ మ్యాప్ చిత్రాలు దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి. |
02:26 | అయితే వెక్టర్ గ్రాఫిక్స్, ఏ ఆకారంలోనైన ఉండవచ్చు. |
02:30 | మనకు వెక్టర్ గ్రాఫిక్స్ గురించి తెలుసు కనుక, వాటిని డ్రా ఉపయోగించి ఎలా సృష్టించాలో నేర్చుకుందాం. |
02:36 | ఇక్కడ, మనం ఉపయోగిస్తున్నది:
|
02:46 | ఒక కొత్త డ్రా(Draw) ఫైల్ను తెరవడానికి , స్క్రీన్ యొక్క పై ఎడమ కొనలో వున్న అప్లికేషన్స్(Applications) ఎంపికను క్లిక్ చేయండి. |
02:54 | ఆపై ఆఫీస్(Office) మళ్ళి ఆ తర్వాత లిబరే ఆఫీస్ పై క్లిక్ చేయండి. |
02:59 | ఒక డైలాగ్ బాక్స్ వివిధ లిబరే ఆఫీస్ భాగాలతో తెరుచుకుంటుంది. |
03:03 | డ్రాయింగ్(Drawing)పై క్లిక్ చేయండి. |
03:05 | ఇది ఒక ఖాళీ డ్రా ఫైల్ను(Draw file) తెరుస్తుంది. |
03:09 | డ్రా ఫైలు కు పేరు పెట్టి బద్ర పరుద్దాం. |
03:12 | మెయిన్ మెనూ(Main menu)లో ఫై ల్(File) పై క్లిక్ చేసి సేవ్ అస్(Save as) ఎంపిక పై క్లిక్ చేయండి. |
03:18 | సేవ్ అస్(Save as) డైలాగ్-బాక్స్ తెరుచుకుంటుంది. |
03:21 | ఫైల్ నేమ్(File Name) ఫీల్డ్ లో "వాటర్ సైకిల్" (“WaterCycle”)అని టైపు చేద్దాం. |
03:26 | డ్రాయింగ్కు సంబంధిత పేరు పెట్టడం ఒక మంచి పద్ధతి. |
03:31 | డ్రా ఫైల్స్ కు డిఫాల్ట్ ఫైల్ టైపు, డాట్ ఓడిజి(dot odg) ఫార్మాట్. |
03:37 | బ్రౌసె ఫోల్డర్స్(Browse folders) ఫీల్డ్ ను వాడి, డెస్క్టాపు పై ఈ ఫైల్ ను సేవ్ (Save) చేద్దాం. |
03:42 | సేవ్ (Save) పై క్లిక్ చేద్దాం. |
03:44 | వాటర్ సైకిల్ (Water Cycle)గా ఫైల్ బద్రపరచబడింది. |
03:47 | టైటిల్ బార్(Title bar)లో డ్రా(Draw) ఫైల్, ఫైల్ పేరు మరియు ఎక్స్టెన్షన్తో కనిపిస్తుంది. |
03:53 | ఈ స్లయిడ్లో చూపిన విధంగా వాటర్ సైకిల్ యొక్క చిత్రాన్ని ఎలా సృష్టించాలో నేర్చుకుందాం. |
03:59 | దశల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేద్దాం. |
04:02 | ప్రతి ఒక్క ప్రాథమిక స్థాయి ట్యుటోరియల్లో ఈ చిత్రంలోని వివిధ అంశాలు ఎలా సృష్టించవచ్చో వివరించబడింది. |
04:09 | డ్రా ట్యుటోరియల్స్ ప్రాథమిక స్థాయి చివరకి వచ్చేసరికి, మీరు కూడా ఈ రేఖాచిత్రాన్ని సృష్టించగలరు. |
04:17 | ముందుగా మనం, డ్రా వర్క్ స్పేస్(Draw workspace) లేదా Draw window(డ్రా విండో)తో సుపరిచితులం అవుదాం. |
04:23 | మెయిన్ మెనూ(Main menu)లో డ్రా(Draw)లో మనం వాడగల ఎంపికల జాబితా వుంది. |
04:27 | ఎడమ భాగంలో వున్న పేజెస్(Pages) ప్యానెల్, Draw(డ్రా )ఫైల్ లోని అన్ని పేజీలను చూపిస్తుంది. |
04:32 | గ్రాఫిక్స్ సృష్టించే స్థలమును పేజ్(Page) అంటారు. |
04:37 | ప్రతి పేజ్(Page)లో మూడు లేయర్స్(layers) ఉన్నవి. |
04:39 | ఇవి Layout, Controls(లేఔట్, కంట్రోల్స్) మరియు Dimension Lines(డైమెన్శన్ లైన్స్. |
04:44 | అప్రమేయంగా Layout layer(లేఔట్ లేయర్) కనిపిస్తుంది. |
04:47 | ఇక్కడే మనం గ్రాఫిక్స్ ఎక్కువగా తయారు చేస్తాం. |
04:51 | మనం కేవలం Layout layer(లేఔట్ లేయర్)తో మాత్రమే పని చేస్తాం. |
04:54 | ఇప్పుడు మనం లిబ్రే ఆఫీస్ డ్రా(LibreOffice Draw)లో అందుబాటులో ఉన్న వివిధ టూల్బార్లను అన్వేషిద్దాం. |
04:59 | డ్రాలో అందుబాటులో వున్న టూల్బార్లు చూడడానికి Main (మెయిన్) మెనుకి వెళ్ళి View(వ్యూ) పై క్లిక్ చేసి తర్వాత టూల్బార్స్ (Tool bars)పై క్లిక్ చేయ్యండి. |
05:07 | అందుబాటులో ఉన్న అన్ని టూల్స్ల జాబితా చూస్తారు. |
05:11 | కొన్ని టూల్బార్స్ యొక్క ఎడమ వైపు ఒక చెక్ మార్క్ ఉంది. |
05:15 | అనగా ఆ టూల్బార్ ఎనేబుల్ చేయబడింది మరియు అది డ్రా విండో(Draw window)లో కనపడుతుంది. |
05:20 | స్టాండర్డ్(Standard) ఎంపిక పై ఒక చెక్ ఉంది. |
05:23 | మీరు విండోలో స్టాండర్డ్ టూల్బార్(Standard toolbar)ను చూడగలరు. |
05:27 | ఇప్పుడు స్టాండర్డ్(Standard) టూల్బార్ పై క్లిక్ చేయడం ద్వారా దీనిని అన్-చెక్ చేద్దాం. |
05:32 | స్టాండర్డ్(Standard) టూల్బార్ ఇక మనకు కనిపించదు. |
05:36 | దాన్ని మళ్ళీ కనిపించేలా చేద్దాము. |
05:39 | అదే విధంగా, మీరు ఇతర టూల్బార్లు కూడా ఎనబ్ల్ లేదా డిసేబ్ల్ చెయ్యవచ్చు. |
05:44 | వాటర్ సైకిల్ రేఖాచిత్రం కోసం ప్రాథమిక ఆకారాలు గీయడానికి ముందు, పేజీ(page)ను Landscape వ్యూ(లాండ్స్కేప్ వ్యూ)కు సెట్ చేద్దాం. |
05:51 | ఇందుకోసం పేజీ పై రైట్ క్లిక్ చేసి, పేజీ(Page) ఎంపికను ఎంచుకోండి. |
05:56 | వివిధ ఉప ఎంపికలు కనిపిస్తాయి. |
05:59 | పేజి సెటప్(Page Setup) ఎంపిక పై క్లిక్ చేయండి. |
06:02 | పేజి సెటప్(Page Setup) డైలాగ్-బాక్స్ కనిపిస్తుంది. |
06:06 | పేజీ ఫార్మాట్(Page Format) కింద, ఫార్మాట్(Format) ఫీల్డ్ వుంది. |
06:10 | ఇక్కడ ప్రింటింగ్ కోసం సాధారణంగా ఉపయోగించే కాగిత పరిమాణం A4ను ఎన్నుకుందాం. |
06:17 | మీరు ఫార్మాట్ ఎంపిక చేసినప్పుడు, విడ్త్(Width) మరియు హఇట్(Height) ఫీల్డ్స్ స్వయంచాలకంగా అప్రమేయ విలువలతో నింపబడుతాయి. |
06:25 | ఓరిఎన్టేషన్ (Orientation) ఎంపికలో, మనం ల్యాండ్ స్కేప్(Landscape) ఎంచుకుందాం. |
06:29 | పేపర్ ఫార్మాట్ ఫీల్డ్స్ కుడి వైపు మీరు Draw page(డ్రా పేజి) యొక్క చిన్న ప్రివ్యూ చూస్తారు. |
06:36 | ఓకే(OK) క్లిక్ చేయండి. |
06:38 | సూర్యుడుని గీయడం ద్వారా రేఖాచిత్రాన్ని మొదలు పెడదాం. |
06:41 | డ్రాయింగ్ టూల్బార్(drawing toolbar)లో, బేసిక్ షేప్స్(Basic Shapes) పక్కన వున్నచిన్న నల్ల త్రికోణం పై క్లిక్ చేయండి. |
06:47 | వృత్తం పై క్లిక్ చేయండి. |
06:49 | ఇప్పుడు కర్సర్ పేజి వద్దకు తీసుకెళ్ళి ఎడమ మౌస్ బటన్ను పట్టుకొని లాగండి. |
06:56 | పేజీలో ఒక వృత్తం గీయబడ్డది. |
06:59 | ఇప్పుడు, మనం సూర్యుడి పక్కన ఒక మబ్బును గీద్దాం. |
07:03 | ఇందుకోసం, డ్రాయింగ్ టూల్బార్ వద్దకు వెళ్ళి Symbol Shapes(సింబల్ షేప్స్) ఎంచుకుందాం. |
07:08 | సింబల్ షేప్స్(Symbol Shapes) పక్కన వున్న చిన్న నల్ల త్రికోణం మీద క్లిక్ చేసి క్లౌడ్(Cloud) ఎంచుకోండి. |
07:14 | డ్రా పేజీ(draw page) పై , సూర్యుడి పక్కన కర్సర్ను ఉంచండి. |
07:18 | ఎడమ మౌస్ బటన్ను పట్టుకొని లాగండి. |
07:21 | మీరు ఒక మబ్బును గీశారు! |
07:23 | తర్వాత, ఒక పర్వతం గీద్దాం. |
07:25 | బేసిక్ షేప్స్ (Basic shapes) ఎంచుకొని మళ్ళీ Isosceles triangle(ఐసోసెలెస్ ట్రైఆంగిల్) పై క్లిక్ చేయండి. |
07:30 | ఇంతకు ముందు వలె, డ్రా పేజి(Draw page)లో ఒక త్రిభుజం ప్రవేశ పెడదాం. |
07:35 | ఇప్పుడు, మనం మూడు ఆకారాలు ప్రవేశ పెట్టినాము. |
07:38 | మీ ఫైల్లో మీరు మార్పు చేసిన ప్రతిసారీ సేవ్ చేయడం గుర్తుంచుకోండి. |
07:42 | ఇందుకోసం Ctrl+S కీలను కలసి నొక్కండి. |
07:48 | మార్పులు స్వయంచాలకంగా సేవ్ చేయడానికి ఒక సమయ విరామం కూడా సెట్ చేయవచ్చు. |
07:53 | ఇందు కోసం మెయిన్(Main) మెనూకి వెళ్ళి టూల్స్(Tools) ఎంచుకోండి. |
07:57 | Tools(టూల్స్) దిగువన, ఆప్షన్స్ (Options) పై క్లిక్ చేయండి. |
08:00 | Options(ఆప్షన్స్) డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
08:03 | లోడ్/సేవ్(Load/Save) పక్కన వున్న ప్లస్ సైన్ పై క్లిక్ చేయండి. తరువాత, కుడి వైపు వున్న చెక్ బాక్సుల నుండి General(జనరల్) పై క్లిక్ చేయండి. |
08:11 | Save Auto Recovery Information Every(సేవ్ ఆటో ర్రేకవేరి ఇన్ఫర్మేషన్ ఎవరీ) బాక్స్ పై చెక్ పెట్టి, 2 టైపు చేయండి. |
08:17 | అనగా, ఈ ఫైలు స్వయంచాలకంగా ప్రతి రెండు నిమిషాలకోసారి బద్రపరచబడుతుంది. |
08:22 | OK క్లిక్ చేయండి. |
08:24 | ఫైల్ >> క్లోజ్(File >>Close) పై క్లిక్ చేసి ఫైల్ ను మూసేద్దాం. |
08:29 | ఇప్పటికే ఉన్న డ్రా(Draw) ఫైల్ తెరవడానికి, మెను బార్లో ఫైలు(File) మెను పై క్లిక్ చేసి ఆపై ఓపెన్(Open) ఎంపికను క్లిక్ చేయండి. |
08:38 | తెరపై డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
08:41 | ఇక్కడ, మీరు మీ డాక్యుమెంట్ను ఎ ఫోల్డర్ లో బద్రపరిచారో కనుక్కోండి. |
08:46 | మీకు కావలసిన ఫైల్ను ఎంపిక చేసి ఓపెన్(Open)పై క్లిక్ చేయండి. |
08:51 | ఇక్కడ మీకు ఒక ఎసైన్మెంట్ ఉన్నది. |
08:53 | ఒక కొత్త డ్రా(draw) ఫైల్ను సృష్టించి దాన్ని మై వాటర్ సైకిల్(My Water Cycle)గా సేవ్ చేయండి. |
08:57 | పేజ్ ఒరిఎన్ టేషన్(page orientation) పోర్ట్రైట్(Portrait)కు మార్చండి. |
09:00 | ఒక మబ్బును, ఒక స్టార్ను మరియు వృత్తంను ప్రవేశ పెట్టండి. |
09:04 | పేజ్ ఒరిఎన్టేషన్(page orientation)ను (Landscape)లాండ్స్కేప్ కు మార్చండి. |
09:07 | చిత్రాల స్థానాలు ఎలా మార్పు చెందాయో చూడండి. |
09:11 | దీనితో మనం ఇంట్రడక్షన్ టు లిబరే ఆఫీసు డ్రా(Introduction to LibreOffice Draw) ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం. |
09:16 | ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకున్నది, |
09:19 | * లిబరే ఆఫీసు డ్రా, |
09:21 | * లిబరే ఆఫీసు డ్రా వర్క్స్పేస్ మరియు |
09:23 | * కాంటెక్స్ట్ మెనూ |
09:25 | మనం ఇంకా నేర్చుకున్నది |
09:27 | *డ్రా ఫైల్ను తయారు చేయుట, సేవ్ చేయుట, మూసి వేయుట మరియు తెరుచుట. |
09:31 | * టూల్ బార్స్ ఎనేబ్ల్ చేయుట |
09:33 | * డ్రా పేజి సెట్ చేయుట మరియు |
09:35 | * ప్రాథమిక ఆకారాలు ప్రవేశ పెటుట. |
09:38 | ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
09:42 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. |
09:45 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియోని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు. |
09:49 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం, |
09:52 | స్పోకెన్ ట్యూటోరియల్స్ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. |
09:55 | ఆన్లైన్ పరీక్ష లో ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు జారిచేస్తుంది. |
09:59 | మరిన్ని వివరాలకు , దయచేసి contact@spoken-tutorial. orgను సంప్రదించండి |
10:05 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, |
10:09 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
10:17 | ఈ మిషన్ గురించి స్పోకెన్ హైఫన్ ట్యుటోరియల్ డాట్ ఆర్గ్ స్లాష్ NMEICT హైఫన్ ఇంట్రో లింక్లో మరింత సమాచారము అందుబాటులో ఉంది. |
10:28 | ఈ ట్యూటోరియల్ను తెలుగు లోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సీలువు తీసుకుంటున్నాను ధన్యవాదములు. |