C-and-Cpp/C2/First-C-Program/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 11:46, 30 June 2015 by Madhurig (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00.01 ఫస్ట్ C ప్రోగ్రాం పై స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం.
00.05 ఈ తరగతిలో మనం నేర్చుకోబోయేది,
00.08 ఒక సరళమైన C ప్రోగ్రాంను ఎలా రాయాలి ?
00.11 ఎలా కంపైల్ చెయాలి?
00.13 ఎలా ఎక్సెక్యూట్ చెయాలి?
00.14 సామాన్యంగా చేసే తప్పులు మరియు వాటి సవరణలను కూడా వివరివివరిస్తాను.
00.18 ఈ టూటోరియల్ రెకార్డ్ చేయుటకు ఉపయోగించినవి:
00.21 ఉబంటు ఆపరేటింగ్ సీస్టం వర్షన్ 11.10 మరియు ఉబంటు పై “gcc” కంపైలర్ వర్షన్ 4.6.1
00.31 ఈ తరగతిని అభ్యసించుటకు,
00.33 ఉబంటు ఆపరేటింగ్ సీస్టం మరియు ఎడిటర్ గురించితెలిసిఉండాలి.
00.38 "విమ్"(vim) మరియు "జీఎడిట్"(gedit) లాం టి ఎడియర్లు కలవు .
00.42 నేను ఈ తరగతిలో జీఎడిట్ని(gedit) ఉపయోగిస్తున్నాను.
00.45 తత్సంబంధిత తరగతుల కొరకు క్రింద ఇవ్వ బడిన మా వెబ్ సియిట్ను సంప్రదించగలరు.
00.51 C ప్రోగ్రామ్ ను ఎలా రాయాలో ఒక ఉదాహరణ ద్వారా తెలియజేస్తాను
00.55 Ctrl, Alt మరియు T ఏకకాలంలో నొక్కి టెర్మినల్ విండో తెరుద్దాం .
01.07 టెక్స్ట్ ఎడిటర్ను తెరచుటకు , ప్రాంప్ట్ వద్ద టైప్ చేయండి,
01.12 “gedit(జీఎడిట్)” స్పేస్ “ talk(టాక్)” డాట్ “c”

స్పేస్ “&” గుర్తు.

01.20 “అంపె ర్సాండ్ (ampersand &) ప్రాంప్ట్ ని ఫ్రీ చేయుటకు ఉపయోగపడును.
01.24 అన్ని C ఫైల్లకు “dot c” అనే ఎక్స్ టెన్షన్ ఉంటుందని గమనించండి.
01.30 ఇప్పుడు ఎంటర్ నొక్కండి.
01.32 టెక్స్ట్ ఎడిటర్ తెరుచుకున్నది.
01.36 ఒక ప్రోగ్రాం రాయడాన్ని ప్రారంబిద్దాం.
01.39 డబుల్ స్లాష్ // స్లాష్ (Double slash space) టైప్ చేసి
01.42 “My first C program” అని టైప్ చేయండి.
01.48 ఇక్కడ డబల్ స్లాష్ , ఒక వరుస ను కామెంట్ చేయుటకు ఉపయోగిస్తారు.
01.52 కామెంట్లను ప్రోగ్రాం ఒరవడిని అర్థం చేసుకోనుటకు ఉపయోగిస్తారు.
01.56 ఇది డాక్యుమెంటేషన్ కొరకు ఉప్యోగపడుతుంది.
01.58 ఇది మనకు ప్రోగ్రాంగురించి విషయాలను తెలియచేస్తుంది.
02.01 డబల్ స్లాష్ ని (Slash) సింగల్ కామెంట్ లైన్ (Single Comment line) అంటారు.
02.07 ఇప్పుడు ఎంటర్ నొక్కండి.
02.09 హ్యాష్ (hash) # ఇన్ క్లూడ్(# include) స్పేస్ ఓపనింగ్ బ్రాకెట్, క్లోసింగ్ బ్రాకెట్ టైప్ చేయండి.
02.17 ముందుగా బ్రాకెట్లను పూర్తి చేసి తరువాత బ్రాకెట్లలో రాయడం అలవాటుచేసుకొనుట మంచిది.
02.24 ఇప్పుడు బ్రాక్సెట్ లో ఎస్ టి డి ఐ ఓ (stdio) డాట్ (dot) హెచ్ (h) టైప్ చేయండి.
02.30 ఎస్ టి డి ఐ ఓ .హెచ్(stdio.h) ఒక హెడర్ ఫైల్.
02.33 ప్రతి ప్రోగ్రామ్ లో ఈ హెడర్ ఫైల్ ఉండాలి, ఎందుకంటే ప్రోగ్రామ్ స్టాండర్డ్ ఇన్పుట్/ఔట్పుట్ క్రియలను ఉపయోగిస్తుంది.
02.41 ఇప్పుడు ఎంటర్ నొక్కండి.
02.43 "ఇంట్"(int) స్పేస్(space) మెయిన్ (main) ఓపనింగ్ బ్రాకెట్, క్లోసింగ్ బ్రాకెట్ టైప్ చెయండి.
02.50 main ఒక విశేషమైన క్రియ.
02.52 ఇది, ఈ వరసనుండి ప్రోగ్రాం నెరవేర్చపడుతుందని సూచిస్తుంది.
02.58 ఓపనింగ్ మరియు క్లోసింగ్ బ్రాకెట్లను పరేంథసిస్(parenthesis) అంటారు.
03.04 వినియోగదారునకు “main" ఒక క్రియ అని తెలియపరుచుటకు మెయిన్ తరువాత పరేంథసిస్ (parenthesis) అనుసరిస్తుంది.
03.11 ఇక్కడ ఇంట్ (int) main” క్రియ (main function) ఆర్గ్యుమెంట్ (argument) లను స్వీకరించదు.
03.15 ఇది పూర్ణాంక (Integer) విలువను తిరిగిస్తుంది.
03.18 మనం డాటా టైప్ల (Data Type) గురించి మరొక తరగతిలో నేర్చుకుందాం.
03.23 “main ” క్రియ గురించి ఇంకా ఎక్కువ తెలియపరిచే స్లయిడ్లను చూద్దాం.

తదుపరి స్లయిడ్ కు వెళ్దాం.

03.29 ప్రతీయొక్క ప్రోగ్రాంకు “main” క్రియ ఉండితీరాలి.
03.33 ఒకటి కన్నా ఎక్కువ “main” క్రియ ఉండ రాదు
03.36 లేకపోతే కంపైలర్ ప్రోగ్రాం ఆరంభాన్ని కనిపెట్టలేదు.
03.41 ఖాళీ పరేంథసిస్, “main”కు ఆర్గ్యుమెంట్స్ (arguments) లేకపోవడం సూచిస్తాయి.
03.46 ఆర్గ్యుమెంట్స్ ఉద్దేశం గురించి వచ్చే తరగతులలో వివరంగా చర్చిద్దాం.
03.52 మరలా మన ప్రోగ్రాంకు తిరిగి వద్దామ్.
03.55 ఎంటర్ నొక్కండి.
03.58 కర్లి బ్రాకెట్ ను తెరవండి {.
04.00 తెరుచుకొని ఉన్న కర్లి బ్రాకెట్ " main" క్రియ ప్రారంభాన్ని సూచిస్తుంది.
04.04 తదుపరి క్లోసింగ్ కర్లి బ్రాకెట్ } టైప్ చెయండి.
04.08 క్లోసింగ్ కర్లి బ్రాకెట్ “main” క్రియ ముగింపు ను సూచిస్తుంది.
04.13 ఇప్పుడు బ్రాకెట్ లో రెండు సార్లు ఎంటర్ నొక్కండి.
04.16 కర్సర్ను ఒక్క వరస పైకి తీసుకొనివెళ్ళండి.
04.20 ఇండెంటేషన్ కోడెను(code) చదవడానిక అనుకూలంగా చేస్తుంది.
04.23 ఇది త్వరగా తప్పులను కనిపెట్టడానికి సహాయప్డుతుంది.
04.25 అందుకె ఇక్కడ మూడు స్పేస్లు ఇద్దాం.
04.29 తరువాత printf ఓపెనింగ్ మరియు క్లోసింగ్ బ్రాకెట్ () టైప్ చేయండి.
04.34 printf, అవుట్పుట్ను టెర్మినల్ పై ముద్రిచుటకు ఉపయోగించే ఒక ప్రామాణిత క్రియ.
04.39 ఇక్కడ బ్రాకెట్స్ లోపు , డబల్ కొట్స్ లో,
04.43 printfలోని డబల్ కొట్స్ లో ఉన్నవన్నీ టెర్మినల్ పై ప్రదర్శింపబడుతాయి.
04.50 టాక్ టు ఏ టీచర్ (Talk to a Teacher) బ్యాక్ స్లాష్ \n (Back Slash n) అని టైప్ చేయండి.
04.59 బ్యాక్ స్లాష్ \n కొత్త వరసను సూచిస్తుంది.
05.03 ఫలితంగా, printf క్రియ ఎక్జిక్యూషన్ అయిన తరువాత, కర్సర్ తదుపరి వరసకు వెళ్తుంది.
05.10 ప్రతిఒక C వాక్యము సెమీకోలన్ తోనే ముగించాలి.
05.15 అందుకే , దీన్ని వరస చివరిలో లో టైప్ చేయండి.
05.19 సెమికాలన్ ఒక వాక్యాన్ని ముగిస్తుంది.
05.24 ఇప్పుడు ఎంటర్ నొక్కి ఇక్కడ మూడు స్పేస్ లను ఇవ్వండి.
05.27 మరియు return స్పేస్ '0 ' సెమీకోలన్ (semicolon) టైప్ చేయండి.
05.34 ఈ వాక్యము పూర్ణ సంఖ్య (Integer) సున్నాను తిరిగి ఇస్తుంది.
05.38 ఈ క్రియ ఇంట్ (int) రకం కాబట్టి ఈ క్రియకు పూర్ణ సంఖ్యను తిరిగి ఇవ్వాలి.
05.45 రిటర్న్ వాక్యం, ఎక్సెకుటబల్ స్టేట్మెంట్ల ముగింపు సూచిస్తుంది.
05.51 తిరిగి ఇవ్వపడే విలువల గురించి మరొక తరగతిలో నేర్చుకుందాం.
05.55 ఫైల్ సవే చేయుటకు Save బట్టన్ పై క్లిక్ చేయగలరు .
06.00 తరచుగా ఫైల్లను సేవ్ చేసే అలవాటు మంచిది.
06.03 ఇది ఆకస్మికంగా అయ్యే విద్యుత్ వైఫల్యాల నుండి రక్షిస్తుంది.
06.05 అప్లికేషన్ (application) క్రాష్(crash) అయ్యే సంధర్భంలో ఉపయోగపడుతుంది.
06.10 ప్రోగ్రాం ను కంపైల్ చేయుటకు టెర్మినల్కు తిరిగి రాగలరు.
06.15 gcc స్పేస్ talk.c స్పేస్ హైఫాన్ ఓ - o స్పేస్ myoutput అని టైప్ చేయండి.
06.24 gcc ఒక్ కంపైలర్.
06.27 talk.c మన ఫైల్ పేరు.
06.30 -o myoutput ఎక్సెకుటబల్ (executable) myoutput అనే ఫైల్ కు వెళ్లాలని చెబుతుంది.
06.37 ఇప్పుడు ఎంటర్ నొక్కండి.
06.39 ప్రోగ్రాం కంపైల్ అయిందని కనిపిస్తుంది.
06.42 ls స్పేస్ హైఫన్ lrt (-lrt) టైప్ చేస్తే , myoutput అనేది సృష్టించబడిన

చివరి ఫైల్ అని తెలుస్తుంది.

06.54 ప్రోగ్రాం ను ఎక్సెక్యూట్ చేయుటకు డాట్ స్లాష్ మయ్ ఔట్ పుట్ (./myoutput) అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
0 7.01 ఇక్కడ ఔట్పుట్ Talk To a Teacher ప్రదర్శిపబడినది.
07.06 నేను ఇంతకు ముందు చేప్పినట్టు ఎక్సెక్యూట్ అయ్యే చివరి వాక్యం రిటర్న్.
07.10 రిటర్న్ స్టేట్మెంట్ తరువాత ఇంకేమీ ఎక్సెకూటే కాదు. పరీక్షించి చిచూద్దాం.
07.15 మన ప్రోగ్రాంకు తిరిగి వద్దాం,
07.17 రిటర్న్ వాక్యం తరువాత ఇంకొక printf వాక్యమును జతచేద్దాం.
07.22 ఇక్కడ ఒక స్పేస్ ఇచ్చి “printf” ఓపెనింగ్ బ్రాకెట్, క్లోసింగ్ బ్రాకెట్ టైప్ చేయండి.
07.27 బ్రాకెట్ లో డబల్ కొటేషన్ లో Welcome \n, (వెల్కం బ్యాక్ స్లాష్) టైప్ చేసి, చివరిలో సెమీ కోలన్ టైప్ చేయండి.
07.35 సేవ్ (save) పై క్లిక్ చేయండి.
07.37 టెర్మినల్ కు వెనకొచ్చి కంపైల్ మరియు ఎక్సెక్యూట్ చేద్దాం.
07.41 అప్ యారో ఉపయోగించి ఇదివరకు ఉపయోగించిన కమాండ్స్ తెలుసుకోగలరు.
07.46 నేను ఇప్పుడు చేయబోయేది అదే.
07.51 రెండవ వాక్యము Welcome ఎక్సెక్యూట్ కాలేదని కనిపిస్తున్నది.
07.58 మన ప్రోగ్రాంకు తిరిగొద్దాం.
08.00 వెల్ కామ్ వాక్యని రిటర్న్ వాక్యము పైనరాద్దాం.
08.06 సేవ్ పైన క్లిక్ చేయండి
08.09 కంపైల్ మరియు ఎక్సెక్యూట్ చెద్డాం,
08.15 రెండవ ప్రింట్ఎఫ్ (printf) వాక్యము వెల్కం (welcome) కూడా ఎక్సెకూటే చేయపడినది.
08.23 ఇప్పుడు మనం సామాన్యంగా చేసే తప్పుల గురించి చూద్దాం.

మన ప్రోగ్రాం కు తిరిగొద్దాం.

08.29 ఇక్కడ stdio.h లో డా ట్ పెట్ట లేదనుకోండి సవే పై క్లిక్ చేయండి.
08.36 కంపైల్ మరియు ఎక్సెక్యూట్ చెద్డాం.
08.41 మనకిలా కనిపిస్తుంది.
08.42 మన talk.c ఫైల్ లోని రెండవ వరసలో తీవ్రమైన తప్పుంది.
08.48 కంపైలర్ కు stdio.h అనే పేరున్న హెడ్డర్ ఫైల్ దొరకలేదు. అందుకే “no such file or directory” ఎర్రర్ సూచన ఇస్తుంది.
08.59 మరియు కంపైలేషన్ ఆగిపోతుంది.
09.03 ఇప్పుడు తప్పును సరి చేయుటకు ప్రో గ్రాం కు తిరిగి వెళ్ళి డాట్ . పెట్టండి.

సవే పై క్లిక్ చేయండి.

09.11 కంపైల్ మరియు ఎక్సెకూటే చెద్డాం. చూశారా సరిపోయింది.
09.19 ఇంకొక సాధారణ తప్పు చూపిస్తాను.
09.22 ప్రోగ్రాంకు వెళ్దాం.
09.25 ఇక్కడ వాక్యం అత్యంలో సెమీ కోలన్ లేదనుకోండి.
09.31 సేవ్ పై క్లిక్ చేయండి. కంపైల్ మరియు ఎక్సెక్యూట్ చెద్డాం.
09.41 మన talk.c ఫైల్ లో ఆరవ వరసలో తప్పుందని కనిపిస్తున్నది.

ప్రింట్ ఎఫ్ (printf) ముందు సెమీకోలన్ ఆశిస్తుందని చూపిస్తుంది.

09.51 మన ప్రోగ్రాంకు తిరిగి వెళ్దాం.
09.54 నేను ముందే చేప్పినట్టు సెమీ కోలన్ వాక్యమును ముగించుటకు ఉపయోగపడుతుంది.
09.58 అందుకే ఐదవ వరస చివరిలో మరియు ఆరవ వరస ముందు వెతుకుతుంది.
10.06 ఇది ఆరవ వరస.
10.09 ఇది సెమీకోలన్(Semicolon) వేయుటకు చివరి స్థానం.
10.12 కంపైల ర్ ఆరవ వరసలో కూడా ఎర్రర్ సందేశాన్ని(Error message) ఇస్తుందని గుర్తుంచుకోండి.
10.18 ఇక్కడ సెమీకోలన్ పెడితే ఎమౌతుందని చూద్దాం.
10.23 సేవ్ పై క్లిక్ చేయండి.
10.26 కంపైల్ మరియు ఎక్సెక్యూట్ చేద్దాం.
10.30 చూశారా సరిపోయింది.
10.32 ఇప్పుడు మన ప్రోగ్రాంకు తిరిగి వద్దాం. ఇక్కడ ఈ వరస చివర సెమీకోలన్ పెద్దాం.
10.40 సెమీ కోలన్ వరస చివర పెట్టుట అలవాటు కాబట్టి ఇలా చేద్దాం.
10.46 సేవ్ పై క్లిక్ చేయండి.
10.49 కంపైల్ మరియు ఎక్సెక్యూట్ చేద్దాం. పనిచేస్తున్నది.
10.54 ఇప్పుడు మన స్లైడ్స్ కి తిరిగి వెళ్దాం.
10.57 ఒక అసైన్మెంట్ లా
10.59 "Welcome to the World of C" ప్రదర్శింపబడుటకు ప్రోగ్రాం రాయండి.
11.02 “\n” printf లో స్లాష్ ఎన్ లేకపోతే పరిణామము ఎమౌతుందో చూడండి.
11.08 ఇంతటితో మనం తరగతి ముగింపుకు వచ్చాము.
11.12 ఈ లింక్ వద్ద ఉన్న వీడియో చూడగలరు
11.15 ఇది స్పోకన్ ట్యుటోరియల్ సరమ్శమును ఇస్తుంది.
11.18 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేనిచో, మీరు డౌన్ లోడ్ చేసి చూడగలరు.
11.22 స్పోకెన్ టుటోరియల్ ప్రొజెక్ట్ టీం,
11.24 స్పోకన్ ట్యుటోరియల్స్ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
11.28 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి వారికి సర్టిఫికేట్లు జరిచేస్తుంది.
11.31 మరిన్నివివరాలుకు, దయచేసి స్పోకెన్ హఫన్ టుటోరియల్ డాట్ ఓ ఆర్ జి (spoken hyphen tutorial dot org)కు రాయండి.
11.38 స్పోకెన్ టూటోరియల్ ప్రాజెక్ట్ టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము.
11.42 ఐ సి టి (ICT) , ఎమ్ హెచ్ ఆర్ డి (MHRD), భారత ప్రభుత్వము, ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్( National Mission on Education) వారి సహకారంతో నిర్వహించపడినది .
11.47 ఈ మిషన్ గురిచి మరిన్ని వివరాలు స్పోకెన్ హైఫన్ టుటోరియల్ డాట్ ఓ ఆర్ జి స్లాష్ ఎన్ ఎమ్ ఈ ఐ సి టి హైఫన్ ఇంట్రో(spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro )లో చూడగలరు.
11.51 ఈ ట్యూటోరియల్ను తెలుగు లోకి అనువదించింది శ్రీహర్ష ఏ.ఎన్. నేను మాధురి సెలవు తెసుకున్తున్నాను .

Contributors and Content Editors

Madhurig, PoojaMoolya, Yogananda.india