LibreOffice-Suite-Calc/C2/Working-with-data/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 12:23, 12 January 2015 by Madhurig (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:00 లిబ్రేఆఫీస్ క్యాల్క్ స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం - డేటాతో పనిచేయుట.
00:06 ఈ ట్యుటోరియల్లో మనము ఈ క్రింది విషయాలను నేర్చుకుంటాము:
00:09 "Fill Tools" మరియు "Selection lists" ఉపయోగించి వేగమును పంచడం.
00:13 షీట్ల మధ్య కంటెంట్ను పంచడం.
00:16 డేటాను తొలగించడం, డేటాను రీప్లేస్ చేయడము, డేటాలోని ఒక భాగమును మార్చడము.
00:23 మనము ఉబంటు (Ubuntu)10.04 ను మన ఆపరేటింగ్ సిస్టంగా మరియు లిబ్రేఆఫీస్ సూట్ వెర్షన్ 3.3.4 ను ఉపయోగిస్తాము.
00:32 ఒక స్ప్రెడ్షీట్లో డేటాను ఎంటర్ చేయడం శ్రమతో కూడినది, కాని దానిని సులభతరము చేయుటకు క్యాల్క్ ఎన్నో టూల్స్ అందిస్తుంది.
00:42 ఒక సెల్లో ఉన్న విషయాలను మరొక సెల్కు చేర్చుటకు మౌస్తో డ్రాగ్ మరియు డ్రాప్ చేయుట చాలా ప్రాధమికమైన సామర్ధ్యము.
00:49 కాని ఇన్పుట్ను ఆటోమేట్ చేయుటకు, ముఖ్యంగా పునరావృత చెందే విషయాల కొరకు క్యాల్క్లో ఎన్నో ఇతర టూల్స్ ఉన్నాయి.
00:57 ఈ టూల్స్ల "Fill Tool" మరియు "Selection Lists" అనే పేరుతో ఉన్నాయి.
01:01 ఇవి ఒకే డాక్యుమెంట్ యొక్క అనేక షీట్లలోనికి సమాచారమును చేర్చగాలవు.
01:06 వీటిలో ఒకదాని తరువాత మరొకటి గురించి నేర్చుకుందాము.
01:09 మనము మన "Personal-Finance-Tracker.ods" ఫైల్ తెరుద్దం.
01:14 ఒక షీట్లో విషయాలను నకలు చేయుటకు Fill టూల్ ఎంతో ఉపయోగకరమైన పద్ధతి.
01:19 మన "Personal-Finance-Tracker.ods" ఫైల్లో, "Cost" అనే హెడ్డింగ్ క్రింద ఉన్న డేటాను పక్క సెల్స్లోనికి కాపీ చేయాలనుకుంటే,
01:30 ముందుగా "6000" అనే ఎంట్రీ కలిగి ఉన్న సెల్పైక్లిక్ చేసి, కాపీ చేయవలసిన డేటాను ఎంచుకోండి.
01:38 ఇప్పుడు మౌస్ ఎడమ బటన్ పట్టుకొని, మౌస్ను "2000" అనే ఎంట్రీ కలిగిన సెల్ చివరికి వరకు డ్రాగ్ చేయండి.
01:46 ఇంకా డేటాను మనము ఎక్కడ కాపీ చేయాలని అనుకుంటామో ఆ సెల్స్ను కూడా ఎంచుకోండి.
01:51 ఇప్పుడు మౌస్ ఎడమ బటన్ను వదలండి.
01:53 మెనూబార్లో "Edit" ఎంపిక పై క్లిక్ చేసి తరువాత "Fill" ఎంపిక పై క్లిక్ చేయండి.
01:59 పాప్ అప్ మెనూలో, "Right" ఎంపిక పై క్లిక్ చేయండి.
02:03 "Cost" అనే హెడ్డింగ్ క్రింద ఉన్న డేటా పక్క సెల్స్లోనికి కాపీ అవడము మీరు చూస్తారు.
02:09 మార్పులను అన్డూ చేద్దాము.
02:12 “Fill” టూల్ యొక్క క్లిష్టమైన ఉపయోగము, కొన్ని సిరీస్ షీట్లు లో డేటాను పూరించేందుకు ఉపయోగిస్తారు.
02:20 వారంలో ని రోజుల, సంవత్సరములోని నెలల పూర్తి మరియు అబ్రివేట్ చేయబడిన డీఫాల్ట్ జాబితాను క్యాల్క్ అందిస్తుంది.
02:27 ఇది వినియోగదారులకు తన సొంత జాబితాలు సృష్టించడానికి ఉపయోగపడుతుంది
02:34 ఇప్పుడు మన షీట్లో "Days" అనే ఒక కొత్త హెడ్డింగ్ చేర్చుదాం.
02:38 దీని క్రింద, వారములోని ఏడు రోజులను స్వయంచాలకంగా చూపుతాము.
02:43 "Days" అనే హెడ్డింగ్ క్రింద ఉన్న మొదటి ఏడు సెల్స్ను ఎంచుకోండి.
02:48 ఇప్పుడు మెనూబార్లోని "Edit" ఎంపిక పై క్లిక్ చేసి, తరువాత "Fill" ఎంపిక కు వెళ్ళండి.
02:53 మెనూలోని "Series" ఎంపిక పై క్లిక్ చేయండి.
02:57 "Fill Series" అనే హెడ్డింగ్తో ఒక డైలాగ్ బాక్స్ను చూస్తారు.
03:02 ఇప్పుడు "Series Type" అనే హెడ్డింగ్ క్రింద, "Auto Fill" ఎంపిక పై క్లిక్ చేయండి.
03:07 "Start Value" ఫీల్డ్లో, మనము వారము యొక్క మొదటి రోజును టైప్ చేస్తాము, అంటే "Sunday" అని టైప్ చేస్తాము.
03:13 ఇదివరకే ఇంక్రిమెంట్ 1 గా సెట్ చేయబడింది. ఇప్పుడు "OK" బటన్పై క్లిక్ చేయండి.
03:18 సెల్స్లో రోజులు స్వయంచాలకంగా ఎంటర్ అవడము మీరు చూస్తారు.
03:23 మీరు వారముల రోజులు, నెల లేక సంవత్సరంలాను ఇదే పద్ధతిలో ఎంటర్ చేయవచ్చు. ఎందుకంటే అవి క్యాల్క్లో ముందుగానే నిర్వచించబడినవి.
03:32 వరుసక్రమంలో డేటాను ఆటో-ఫిల్లింగ్ చేయుటకు మరొక పద్ధతి ఈ క్రింద చెప్పబడింది:
03:37 ఒక సెల్లో "Sunday" అని టైప్ చేసి మరియు ఎంటర్ ప్రెస్ చేయండి. దీని వలన కాలంలోని తరువాతి

సెల్కు ఫోకస్ మారుతుంది.

03:46 "Sunday" అని టైప్ చేయబడిన సెల్ వద్దకు తిరిగి వెళ్ళండి. సెల్ యొక్క క్రింది భాగములో కుడి చేతి వైపు మూలకు ఒక చిన్న నల్లని బాక్స్ మీకు కనిపిస్తుంది.
03:55 మౌస్తో ఈ బాక్స్పై క్లిక్ చేయండి.
03:57 కుడి వైపున డిస్ప్లే బాక్స్లో “Saturday" అని చూసే వరకు దానిని డ్రాగ్ చేయండి.
04:04 మౌస్ బటన్ను వదలండి.
04:06 సెల్స్లో వారము యొక్క రోజులు సెల్స్ స్వయంచాలకంగా నింపబడతాయి.
04:10 ఈ కిటుకు క్రమముగా ఉన్న ఏ డేటాకైనా పని చేస్తుంది. మార్పులను అన్డూ చేద్దాము.
04:17 మొదలు, చివర మరియు ఇంక్రిమెంట్ విలువలను ఎంటర్ చేసి సంఖ్యలకు వన్ టైం పూరక సీరీస్ను సృష్టించవచ్చు.
04:24 దీనిని ప్రదర్శించేందుకు, సెల్స్ "A1"నుండి "A7" లో ఎంటర్ చేసిన సీరియల్ సంఖ్యలను తొలగిస్తాము
04:33 సంఖ్యలను తొలగించిన తరువాత, "A2" నుండి "A7" అని రెఫరెన్స్ చేయబడిన సెల్స్ను ఎంచుకోండి.
04:40 ఇప్పుడు మెనూబార్లో "Edit" పై క్లిక్ చేసి తరువాత "Fill" మరియు "Series" ఎంపికల క్లిక్ చేయండి
04:46 ఒక డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. డీఫాల్ట్చే ఎంచుకొనబడకపోతే, "Series type" క్రింద ఉన్న "Linear" ఎంపిక పై న క్లిక్ చేయండి.
04:57 "Start value" ఫీల్డ్లో, మొదటి సీరియల్ నంబర్ "1" టైప్ చేద్దాం.
05:03 "End value" ఫీల్డ్లో, చివరిగా ఎంటర్ కావలసిన విలువ "6" టైప్ చేద్దాం.
05:08 ఇప్పుడు "Increment" విలువను "1" అని సెట్ చేస్తాము మరియు చివరిగా "OK" బటన్పై క్లిక్ చేస్తాము.
05:14 అన్నీ సెల్స్ స్వయంచాలకంగా వరుసక్రమంలో సీరియల్ సంఖ్యలతో నింపబడట మీరు చూడవచ్చు.
05:21 ఈ సందర్భములన్నింటిలో, Fill టూల్ సెల్స్ మధ్య ఒక క్షణికమైన సంబంధము సృష్టిస్తుంది.

ఒకసారి అన్నీ సెల్స్ నిండిన తర్వాత, సెల్స్ మధ్య ఎటువంటి సంబంధం ఉండదు.

05:32 Fill టూల్స్ కాకుండా "Selection Lists" అనే మరొక వేగవంతము చేసే టూల్ ఉంది.

ఇది టెక్స్ట్ వాడకమునకు మాత్రమే పరిమితి అయ్యింది.

05:40 దీని గురించి మనము ఈ సీరీస్ యొక్క తరువాతి ట్యుటోరియల్స్లో చర్చిద్దాము.
05:45 "Fill Tool" మరియు "Selection Lists" గురించి నేర్చుకున్నాకా , మనము ఇప్పుడు షీట్ల మధ్య విషయమును ఎలా పంచాలి అనే అంశమును నేర్చుకుందాము.
05:52 కాల్క్ ద్వారా ఒకే సమాచారమును అనేక షీట్లలో ఒకే సెల్లో ఎంటర్ చేయవచ్చు.
05:58 అంటే, ప్రతి షీట్లో వేరువేరుగా ఒకే జాబితాను ప్రవేశ చేయుటకు బదులు, మీరు అన్ని షీట్లలో ఒకే సారి ప్రవేశ చేయవచ్చు.
06:07 మన "Personal-Finance-Tracker.ods" ఫైల్లోని , మొత్తం డేటా అంతా "షీట్ 1" పై ఉంది.
06:14 ఇప్పుడు "షీట్ 1" చూపుతున్న సమాచారమే "షీట్ 2" మరియు "షీట్ 3" లు కూడా చూపాలి.
06:21 కాబట్టి మెను బార్ లో "Edit" ఎంపికను క్లిక్ చేసి, "Sheet" ఎంపిక పైన క్లిక్ చేస్తాము.
06:27 ఇప్పుడు "Select" పై క్లిక్ చేయండి
06:30 ఇప్పుడు కనిపించే డైలాగ్ బాక్స్లో, షిఫ్ట్ కీ ఉపయోగిస్తూ, మనము "షీట్ 1", "షీట్ 2" మరియు "షీట్ 3" అనే ఎంపికలను ఎంచుకుంటాము,
06:40 తరువాత "OK" బటన్పై క్లిక్ చేస్తాము.
06:42 దీనితో మనము "షీట్ 1" వద్దకు తిరిగి వస్తాము.
06:45 ఇప్పుడు "షీట్ 1"లో కొంత డేటాను ఎంటర్ చేద్దాము.
06:49 ఉదాహరణకు, "F12" అని రిఫరెన్స్ కలిగిన సెల్లో "This will be displayed on multiple sheets". అని టైప్ చేస్తాము.
06:57 ఇప్పుడు "షీట్ 2" మరియు "షీట్ 3" టాబ్లపై ఒకదాని తరువాత ఒకటిగా క్లిక్ చేయండి.
07:02 ఈ షీట్లలో "F12" అని సెల్ రెఫర్ చేయబడిన సెల్లో ఒకే డేటా ఉండటము చూడగలము.
07:09 మార్పులను అన్డూ చేద్దాము.
07:12 తరువాత, సెల్స్లో డేటాను తొలగించుట మరియు ఎడిట్ చేయుటకు ఉన్న వివిధ పద్ధతుల గురించి నేర్చుకుందాము.
07:18 సెల్ యొక్క ఫార్మటింగ్ తొలగించకుండా డేటాను తొలగించుటకు, సెల్ను ఎంచుకోండి.
07:25 సెల్ యొక్క డేటా "Input Line" ఫీల్డ్లో కనిపించడము మీరు చూస్తారు.
07:30 ఇప్పుడు కీబోర్డుపై "Backspace" బటన్ నొక్కండి.
07:35 డేటా అంతా తొలగించపడ్డం మీరు చూడవచ్చు.
07:37 మార్పులను అన్డూ చేద్దాము.
07:39 సెల్లో డేటాను రీప్లేస్ చేయుటకు, సెల్ను ఎంచుకోండి మరియు పాత డేటాపై టైప్ చేయండి.
07:46 కొత్త డేటా అసలు ఫార్మాటింగ్ కలిగి ఉంటుంది.

మార్పులను అన్డూ చేద్దాము.

07:52 ఒక సెల్లో డేటాలోని కొంత భాగమును మార్చుటకు, విషయాల అన్ని తొలగించకుండా, సెల్పైడబల్ క్లిక్ చేయండి.
08:01 ఇప్పుడు కర్సర్ను కదిలిస్తూ, మీరు మీకు కావలసిన విధంగా సెల్ను ఎడిట్ చేయవచ్చు.
08:07 మార్పులను అన్డూ చేద్దాము.
08:09 దీనితో మనము లిబ్రేఆఫీస్ కాల్క్ పై స్పోకెన్ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
08:15 సారాంశముగా, మనము ఈ క్రింది విషయాలను నేర్చుకున్నాము:
08:17 Fill టూల్స్ మరియు "Selection Lists" ఉపయోగించి వేగవంతము చేయడము.
08:20 షీట్ల మధ్య విషయమును పంచడము.
08:23 డేటాను తొలగించడము, డేటాను రీప్లేస్ చేయడము, డేటాలోని కొంత భాగమును మార్చడము.
08:29 *ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
08:35 *అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశమును ఇస్తుంది.
08:35 * మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, దీనిని మీరు డౌన్లోడ్ చేసుకుని చూడవచ్చు.
08:40 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం,
08:43 *స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్షాప్స్ నిర్వహిస్తుంది.
08:46 *ఆన్లైన్ పరీక్ష పాస్ అయిన వారికి సర్టిఫికేట్లను జారీచేస్తుంది.
08:50 *మరిన్ని వివరముల కొరకు, దయచేసి contact@spoken-tutorial. org కు వ్రాసి సంప్రదించండి.
08:57 *స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్లో ఒక భాగము
09:04 * ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ వారు దీనికి సహకరిస్తున్నారు.
09:13 *ఈ మిషన్ గురించి మరింత సమాచారము వద్ద అందుబాటులో ఉంది
09:18 * ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది దేశీక్ర్యూ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు

Contributors and Content Editors

Madhurig, Udaya