Linux/C2/Basics-of-System-Administration/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:02 | నమస్కారం , లైనక్స్ లో బేసిక్స్ ఆఫ్ సిస్టం అడ్మినిస్ట్రేషన్ అనే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:09 | ఈ ట్యుటోరియల్ లో మనం ఈ క్రింది విషయాలు నేర్చుకుంటాము. |
00:13 | add user |
00:14 | su |
00:16 | usermod |
00:17 | userdel |
00:18 | id |
00:19 | du |
00:20 | df |
00:22 | ఈ ట్యుటోరియల్ కోసం నేను ఉబంటు 10.10 ఉపయోగిస్తున్నాను. |
00:27 | దీనికి ముందుగా “General Purpose Utilities in Linux” అనే ట్యుటోరియల్ చూడండి. |
00:35 | అది ఈ వెబ్ సైట్ లో ఉంది. |
00:39 | చూపించిన కమాండ్స్ ను అమలు పరుచుట కు ఎవరికైనా ఎడ్మిన్ అనుమతి ఉండాలి. |
00:47 | ముందుగా ఒక కొత్త యూజర్ ను ఎలా సృష్టించాలో నేర్చుకుందాము. |
00:53 | "Adduser" కమాండ్ ప్రమాణీకరణ తో పాటుగా ఒక కొత్త యూజర్ లాగిన్ సృష్టిస్తుంది. |
01:01 | "Sudo" కమాండ్ సహాయంతో మనం ఏ యూజర్ ఎకౌంట్ అయిన జోడించవచ్చు. |
01:06 | “sudo” కమాండ్ గురించి సంక్షిప్తంగా వివరిస్తాను. |
01:11 | Sudo కమాండ్ ఎడ్మిన్స్ట్రేటీవ్ యూజర్ ఒక కమాండ్ ను సూపర్ యూజర్ లా అమలు పరుచుట కు అనుమతిస్తుంది. |
01:19 | Sudo కమాండ్ కి చాలా ఎంపికలు ఉన్నాయి.
మనం ఈ ట్యుటోరియల్ లో ముందుకి వెళ్ళే కొద్దీ ఆ ఎంపికల గురించి నేర్చుకుంటాము. |
01:27 | ఒక కొత్త యూజర్ ని ఎలా సృష్టించాలో నేర్చుకుందాము. |
01:32 | మీ కీబోర్డ్ పై “Ctrl, Alt మరియు t” ఏకకాలంలో నొక్కి “టర్మిల్” ను తెరవండి |
01:45 | నేను ఇంతకు ముందే టర్మినల్ ను తెరచి ఉంచాను. |
01:49 | “sudo space adduser” అనే కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
01:58 | మిమ్మల్ని పాస్వర్డ్ అడుగుతుంది. |
02:01 | నేను ఇక్కడ “ఎడ్మిన్” పాస్వర్డ్ ని ఇచ్చి ఎంటర్ నొక్కు తాను |
02:07 | టెర్మినల్ పై టైప్ చేసిన పాస్వర్డ్ కనిపించటం లేదు |
02:11 | కనుక, మనం పాస్వర్డ్ ని జాగ్రత్తగా టైప్ చేయాలి. |
02:16 | ఒకసారి అలా చేసిన తరువాత “adduser : Only one or two names allowed” అనే మెసేజ్ ప్రదర్శింప బడుతుంది |
02:27 | కాబట్టి “duck” అనే పేరుతో కొత్త యూజర్ ఎకౌంట్ ని సృష్టిద్దాం |
02:34 | కమాండ్ ను టైప్ చేయండి : |
02:36 | sudo space adduser space duck, ఎంటర్ నొక్కండి |
02:45 | మనం “duck” అనే కొత్త యూజర్ ని సృష్టించాము |
02:49 | ఒక కొత్త యూజర్ ని సృష్టించే సమయంలో ఆ యూజర్ కోసం ఒక ప్రత్యేక “హోమ్” డైరెక్టరీ కూడా సృష్టించబడుతుంది |
02:58 | “duck” అనే యూజర్ కోసం ఒక కొత్త పాస్వర్డ్ ఇమ్మని ప్రాంప్ట్ వద్ద కనిపిస్తుంది. |
03:05 | మీకు నచ్చిన పాస్వర్డ్ ను టైప్ చేయండి, నా విషయంలో నేను “duck” ని నా పాస్వర్డ్ గా టైప్ చేసి ఎంటర్ నొక్కుతాను |
03:17 | కొత్త పాస్వర్డ్ ని మరలా టైప్ చేయండి. |
03:20 | భద్రతా కారణాలు మరియు ధ్రువీకరణ కోసం పాస్వర్డ్ ను రెండుసార్లు అడగబడింది. |
03:26 | ఇప్పుడు మన కొత్త యూజర్ కి కొత్త పాస్వర్డ్ నవీకరించబడింది. |
03:31 | మిమ్మల్ని ఇతర వివరాలు కూడా అడుగుతుంది. |
03:35 | ప్రస్తుతానికి, నేను కేవలం పూర్తీ పేరు ను “duck” అని ఎంటర్ చేస్తాను మరియు ఎంటర్ కీ నొక్కటం ద్వారా మిగతా వివరాలను ఖాళీగా వదిలేస్తాను. |
03:46 | ఎంటర్. |
03:47 | “y” ని ఎంటర్ చేసి నేను దీన్ని ద్రువీకరిస్తాను. |
03:51 | సమాచారం మొత్తం సరైనదే అని ద్రువీకరించటానికి ఇలా చేయాలి. |
03:55 | యూజర్ ఎకౌంట్ సృష్టించబడిందో లేదో చూద్దాం. |
04:00 | దీనికోసం , కమాండ్ ప్రాంప్ట్ వద్ద ఇలా టైప్ చేయండి |
04:04 “ | “ls space /(slash) home” |
04:09 | మరియు ఎంటర్ నొక్కండి |
04:11 | హోమ్ ఫోల్డర్ లో ఉన్న యూజర్స్ జాబితాని చూపించటానికి “ls” కమాండ్ ఉపయోగపడుతుంది . |
04:17 | ఇక్కడ మనం కొత్తగా సృష్టించిన “duck” అనే యూజర్ ఉంది. |
04:23 | స్లైడ్స్ వద్దకి తిరిగి వెళతాను. |
04:26 | ఇప్పుడు, తరువాత కమాండ్ “su” |
04:30 | “su” అనగా “స్విచ్ యూజర్”. |
04:34 | ఈ కమాండ్ ప్రస్తుతం ఉన్న యూజర్ నుండి వేరొక యూజర్ కి
మారుటకు సహాయపడుతుంది. |
04:39 | ఇప్పుడు టెర్మినల్ కు వెళదాం. |
04:43 | కమాండ్ ను ప్రవేశ పెట్టండి |
04:45 | టెర్మినల్ పై “su space hyphen space duck” అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
04:53 | మిమ్మల్ని పాస్వర్డ్ అడుగుతుంది. |
04:56 | నేను ఇక్కడ “duck” అనే యూజర్ యొక్క పాస్వర్డ్ టైప్ చేయాలి, అది కూడా “duck” అని గుర్తు తెచ్చుకోండి.. |
05:04 | టర్మినల్ మునుపటి యూజర్ నుండి కొత్త యూజర్ కి మారటాన్ని గుర్తించండి, మన విషయంలో ఇక్కడ అది “duck”. |
05:14 | ఈ యూజర్ ను లాగ్ అవుట్ చేయటానికి, |
05:17 | “logout” టైపు చేసి, ఎంటర్ నొక్కండి |
05:22 | టెర్మినల్ ప్రస్తుత యూజర్ అయిన “duck” నుండి లాగ్ అవుట్ అయ్యి మునుపటి యూజర్ ఎకౌంట్ అయిన “vinhai” కు తిరిగి వస్తుంది. |
05:31 | “usermod” కమాండ్ గురించి నేర్చుకుందాము. |
05:35 | “usermod” కమాండ్ |
05:37 | సూపర్ యూజర్ లేదా రూట్ యూజర్ ఇతర యూజర్ ఎకౌంట్స్ యొక్క సెట్టింగ్స్ ను మార్పుచేయటానికి అనుమతిస్తుంది. ఉదాహరణకు , |
05:46 | పాస్వర్డ్ ను నో పాస్వర్డ్ లేదా ఎమ్ప్టీ పాస్వర్డ్ కు మార్చటం. |
05:50 | యూజర్ ఎకౌంట్ డిసేబుల్ చెయ్యబడే తేదీని చూపించటం. |
05:55 | ఈ కమాండ్ ను ప్రయత్నించి చూద్దాం. |
05:57 | నేను టెర్మినల్ కి వెళతాను. |
05:59 | Duck (డక్ )అనే యూజర్ ఎకౌంటు తేది ఎప్పుడు ముగిస్తుందో సెట్ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను |
06:05 | కమాండ్ ప్రాంప్ట్ వద్ద టైప్ చేయండి |
06:09 | sudo space usermod space -(hyphen)e space 2012-(hyphen)12-(hyphen)27 space duck |
06:33 | ఎంటర్ నొక్కండి. |
06:37 | ఎంపిక “-e” సహాయంతో పై కమాండ్ లో సూచించిన విధంగా యూజర్ ఎకౌంట్ ముగింపు తేదీ సెట్ చేయబడింది.. |
06:46 | ఇప్పుడు మీరు Duck అనే యూజర్ ఎకౌంట్ కు ముగింపు తేదీని సెట్ చేసారు. |
06:52 | “uid” మరియు “gid” కమాండ్స్ గురించి చూద్దాం. |
06:57 | “id” – కమాండ్ ను వినియోగదారుల మరియు సమూహాల గుర్తింపు తనిఖీకి ఉపయోగిస్తారు |
07:04 | యూజర్ యొక్క గుర్తింపు ను తెలుసుకోవటానికి, మనం “id space -(hyphen)u” ను ఉపయోగిస్తాము. |
07:12 | గ్రూప్ యూజర్స్ యొక్క గుర్తింపు ను తెలుసుకోవటానికి, “id space -(hyphen)g” ను ఉపయోగిస్తాము. |
07:20 | ఇప్పుడు దీని పై పనిచేద్దాం. |
07:22 | టెర్మినల్ వద్ద, |
07:25 | “id” అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి . |
07:29 | మనం ఉపయోగిస్తున్న సిస్టం పై User IDs మరియు Group IDs చూడవచ్చు. |
07:37 | యూజర్ ఐడి మాత్రమే పొందటానికి, మనం “-(hyphen)u” ఎంపిక ఉపయోగిస్తాము. |
07:43 | “id space -(hyphen)u” కమాండ్ ని టైప్ చేద్దాం. |
07:49 | ఎంటర్ నొక్కండి . |
07:50 | ఇప్పుడు మనం కేవలం యూజర్స్ యొక్క ఐడిలు మాత్రమే చూడవచ్చు. |
07:55 | కానీ మనం యూజర్స్ యొక్క పేర్లు తెలుసుకోవడం ఎలా? |
08:00 | దాని కోసం, |
08:02 | టెర్మినల్ పై “id space -(hyphen)n space -(hyphen)u” అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి |
08:13 | ఇప్పుడు మనం యూజర్ ఐడి లకి బదులుగా వారి పేర్లను చూడవచ్చు. |
08:20 | ఇప్పుడు మనం Group Ids కొరకు కమాండ్ లు నేర్చుకుందాం. |
08:24 | “ id space -(hyphen)g” అని టైప్ చేద్దాం. |
08:29 | ఇక్కడ మనం గ్రూప్ ids చూడవచ్చు. |
08:32 | మనము ప్రస్తుత యూజర్ ల గ్రూప్ ID లు చూడాలనుకుంటే, |
08:38 | “id space -(hyphen) (capital)G” అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి |
08:46 | నేను G ని క్యాపిటల్ లెటర్స్ లో టైప్ చేశాను అని గమనించండి. |
08:50 | మీరు ఫలితాన్నిగమనించండి. |
08:53 | ఒక యూజర్ ఎకౌంట్ ను ఎలా తొలగించాలో నేర్చుకుందాం. |
08:57 | దీని కోసం మనం “userdel” కమాండ్ ఉపయోగిస్తాం. |
09:00 | “userdel” కమాండ్ తో యూజర్ ఎకౌంట్ ను శాశ్వతంగా తొలిగించ వచ్చు. |
09:07 | దీనిని టెర్మినల్ పై ప్రయత్నిద్దాం |
09:09 | “sudo space userdel space -(hyphen)r space duck” అని టైప్ చేయండి. |
09:22 | నేను ఇక్కడ -(hyphen)r ఎంపిక ఉపయోగించాను. |
09:25 | ఇది యూజర్ ని మరియు అతని హోం డైరెక్టరీ ని కూడా తొలగిస్తుంది |
09:30 | ఎంటర్ నొక్కి ఏం జరుగుతుందో చూద్దాం. |
09:34 | ఇప్పుడు “duck” అనే యూజర్ తొలగించ బడినది |
09:38 | దీనిని తనిఖి చేయటానికి |
09:41 | “ls space /(slash)home” అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
09:47 | “duck” అనే యూజర్ ఎకౌంట్ తొలగించ బడడాన్ని మనం చూడొచ్చు. |
09:53 | స్లైడ్స్ వద్దకి తిరిగి వెళదాం. |
09:56 | “df” మరియు “du” అనేవి లైనక్స్ అడ్మిన్స్త్రేషన్ లో ఉపయోగకరమైన కొన్ని
కమాండ్ లు . |
10:03 | ”df” కమాండ్ డిస్క్ లోని ఖాళీ స్థలం గురించి నివేదిక ఇస్తుంది. |
10:08 | మరియు “du” కమాండ్ ఒక ఫైల్ ఎంత స్పేస్ ఆక్రమించింది అనే దాని పై రిపోర్ట్ ఇస్తుంది. |
10:13 | ఈ రెండు కమాండ్ లను ఒక ఎసైన్మెంట్ గా ప్రయత్నించి, అవుట్ పుట్ ను కనుకోండి. |
10:19 | టెర్మినల్ కు వెళదాం, “df” కమాండ్ తో వినియోగించే కొన్ని ఉపయోగకరమైన ఎంపికలను నేను మీకు చూపిస్తాను. |
10:26 | df space -(hyphen)h అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
10:33 | ఇది ఫైల్ సిస్టం పరిమాణాన్ని మరియు ఉపయోగించిన స్థలాన్ని చూపిస్తుంది. |
10:38 | ఇది మౌంట్ అయ్యి ఉన్న స్థలమును ను మరియు మనుషులు చదవగలిగే ఫార్మాట్ లో చూపిస్తుంది. |
10:46 | “du” కమాండ్ తో కొన్ని ఎంపికలను ప్రయత్నిద్దాం. |
10:50 | ఈ సమయానికి మీరు మీ హోమ్ ఫోల్డర్ లో కొన్ని టెక్స్ట్ ఫైల్స్ సృష్టించారని నేను అనుకుంటాను. |
10:57 | ఒకవేళ చేయకపోతే దయచేసి “General Purpose Utilities in Linux” పై టుటోరియల్ ను చూడండి |
11:04 | ఈ కమాండ్ లను అమలు చేయటానికి నేను ఇప్పటికే నా హోమ్ డైరెక్టరీలో కొన్ని టెక్స్ట్ ఫైల్స్ సృష్టించాను . |
11:11 | హోం ఫోల్డర్ కు వెళ్ళుటకు, టెర్మినల్ పైన |
11:15 | cd space /(slash) home” టైపు చేసి ఎంటర్ నొక్కండి . |
11:20 | du space -(hyphen)s space *. (astrix dot) txt అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
11:33 | ఈ కమాండ్ ఫైల్ పరిమాణాల తోపాటు డైరెక్టరీ లో అందుబాటులో ఉన్న టెక్స్ట్ ఫైల్ ల ఒక నివేదిక ఇస్తుంది. |
11:43 | ఒక అసైన్మెంట్ గా , కమాండ్ ప్రాంప్ట్ వద్ద ఇలా టైప్ చేయండి |
11:47 | “du space -(hyphen)ch space *.(astrix dot)txt” మరియు ఏం జరుగుతుందో చూద్దాం. |
11:59 | స్లైడ్స్ వద్దక్కి తిరిగి వెళతాను. |
12:01 | మనం నేర్చుకున్నది, సంక్షిప్తంగా: |
12:03 | కొత్త యూజర్ ను సృష్టించుటకు “adduser” కమాండ్ . |
12:06 | మరొక యూజర్ కు మారుటకు “su” కమాండ్ . |
12:09 | యూజర్ ఎకౌంట్ సెట్టింగ్స్ మార్చదానికి “usermod” కమాండ్ |
12:12 | ఎకౌంట్ తొలగించ డానికి “userdel” కమాండ్. |
12:15 | యూజర్ ఐడిలు మరియు గ్రూప్ ఐడిల గురించి తెలుసుకోవటానికి id కమాండ్ |
12:20 | ఫైల్ సిస్టం పరిమాణం మరియు లభ్యతను తనిఖి చేయటానికి “df” కమాండ్ |
12:24 | ఫైల్ ఆక్రమించిన స్థలాని తనిఖి చేయటానికి “du” కమాండ్. |
12:27 | ఈ “Basics of system administration” అనే ట్యుటోరియల్ చివరికి వచ్చాము |
12.33 | ఈ url వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి |
12:37 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశం. |
12:40 | మీవద్ద మంచి బ్యాండ్ విడ్త్ లేనిచో , మీరు డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
12:44 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి మేము వర్క్ షాప్స్ నిర్వహిస్తాము. ఆన్లైన్ టెస్ట్ పాసయిన వారికి సర్టిఫికేట్స్ కూడా ఇస్తాము. మరిన్ని వివరాల కోసం దయచేసి మమ్మలిని సంప్రదించండి. |
12:53 | స్పోకెన్ ట్యుటోరియల్ “టాక్ టు ఎ టీచర్” ప్రాజెక్ లో ఒక భాగం, దీనికి ICT (NMEICT), MHRD, భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్జుకేషన్ సహకారం అందిస్తోంది. |
13:03 | ఈ url లో మరింత సమాచారం అందుబాటులో ఉంది |
13:08 | ఈ రచనకి సహాయపడినది శ్రీహర్ష ఏ.ఎన్ మరియు స్రవంతి. |
13:12 | మాతో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. సెలవు |