Linux/C2/File-System/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:00 | Linux File System(లినక్సు ఫైల్ సిస్టం ) పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:04 | నేను Ubuntu (ఉబుంటు )10.04 ఉపయోగిస్తున్నాను. |
00:07 | మీకు Linux(లినక్స్ ) ఆపరేటింగ్ సిస్టంను ఎలా ప్రారంభించాలో తెలుసని మరియు కొన్ని ప్రాధమిక కమాండ్ల గురించిన అవగాహన ఉందని అనుకుంటున్నాము. |
00:13 | మీకు ఆసక్తి ఉంటే, ఇది మరొక్క స్పోకెన్ ట్యుటోరియల్ ద్వారా ఈ క్రింది వెబ్ సైట్ టు http://spoken-tutorial.org లో అందుబాటులో ఉంది. |
00:25 | Linux(లినక్స్ ) కేస్ సెన్సిటివ్ అని గమనించండి. |
00:28 | సూచించబడనంత వరకు ఈ ట్యుటోరియల్లో ఉపయోగించిన అన్నీ కమాండ్లు లోవర్ కేస్ లో ఉంటాయి. |
00:36 | Linux(లినక్స్ )లో ఇంచుమించు ప్రతీదీ ఒక ఫైలే. |
00:39 | ఫైల్ అంటే ఏమిటి? మనకు తెలుసు ఫైల్ అంటే నిజ జీవితములో మన డాక్యుమెంట్లు మరియు కాగితములు పదిల పర్చుకొనేది |
00:47 | అదే విధంగా Linux(లినక్స్ )లో ఫైల్అంటే సమాచారాన్ని కలిగిఉండేది |
00:53 | తరువాత, డైరెక్టరి అంటే ఏమిటి? |
00:56 | డైరెక్టరీ అంటే ఫైల్స్ మరియు ఇతర (ఉప) డైరెక్టరీల సమాహారం అని అర్ధం . |
01:02 | మన ఫైళ్ళను క్రమ పద్ధతిలో ఏర్పాటు చేసుకొనుటకు డైరెక్టరీ సహాయపడుతుంది. |
01:08 | ఇది విండోస్ లో మనము పిలిచే ఫోల్డర్ లాంటిదే. |
01:12 | ప్రతి ఒక్కరు తమ డైరెక్టరీలోని ఫైల్లను తాము మాత్రమే ఉపయోగించ గలరు ఇతరులకు దానిని వాడుటకు లేదా మార్పుటకు వీలు ఉండదు |
01:20 | ఒకవేళ డైరెక్టరీలు లేనిచో, సిస్టంలో ఉన్న ప్రతి ఫైల్ కీ ఒక ప్రత్యేకమైన పేరు ఇవ్వవలసి వస్తుంది. దీని వలన నిర్వహణ కష్టమవుతుంది. |
01:31 | ఫైళ్ళ మరియు డైరెక్టరీల యొక్క ఈ నిర్వచనాలు, వాటి గురించి సాధారణ అవగాహన పొందుటకు వీలు అయినప్పటికీ, అవి పూర్తిగా ఖచ్చితమైనవి కావు. |
01:42 | అదే విధముగా, ఒక ఫైలు పేరు మరియు కొన్ని లక్షణములు లేక " administrative information” కలిగి ఉంటుంది; అంటే, ఫైల్ రూపొందించబడిన/మార్పు చేయబడిన తేదీ మరియు దాని యొక్క అనుమతులు. |
01:55 | లక్షణములు ఫైల్ యొక్క ఐనోడ్ లో నిల్వ చేయబడతాయి.
ఇది ఫైల్ సిస్టములో ఉన్న సమాచారము యొక్క ప్రత్యేక భాగం. ఇందులో ఫైల్ యొక్క పొడవు మరియు అది డిస్క్ లో ఎక్కడ నిల్వ చేయబడింది అన్న విషయములు ఉంటాయి. |
02:08 . | సిస్టం ఫైల్ ఐనోడ్ యొక్క సంఖ్యను ఉపయోగిస్తుంది. పెద్ద పెద్ద సంఖ్యల కంటే పేర్లను గుర్తు పెట్టుకోవడం మనకు సులభము కాబట్టి డైరెక్టరీనిర్మాణము, ప్రయోజనము కొరకు ఫైల్ కు ఒక పేరు ఇవ్వబడుతుంది |
02:23 | అతి సరళంగా ఉన్న నిర్వచనమునకు వ్యతిరేకముగా, డైరెక్టరీ నిజానికి ఇతర ఫైళ్ళను నిలువ చేయదు. అది ఐనోడ్ సంఖ్యలు మరియు ఇతర ఫైళ్ళ పేర్లను నిలువ చేసే ఒక ఫైలు మాత్రమే. |
02:37 | నిజానికి Linuxలో మూడు రకాల ఫైళ్ళు ఉన్నాయి: |
02:41 | 1 రెగ్యులర్ ఫైల్స్ లేదా ఆర్డినరీ ఫైల్స్ : ఇది క్యారెక్టర్ల ప్రవాహము వలె సమాచారమును మాత్రమే కలిగి ఉంటుంది. |
02:48 | 2 డైరెక్టరీలు: ఇంతకు ముందు స్లైడ్లలో మనము చూసిన విధంగా ఉంటాయి |
02:52 | 3 డివైస్ ఫైళ్ళు: అన్ని హార్డ్వేర్ పరికరాలు మరియు పెరిఫెరల్స్ Linuxలో ఫైళ్ళుగా సూచించబడతాయి. |
02:59 | ఒక CD, ఒక హార్డ్ డిస్క్ లేక ఒక usb స్టిక్ - Linuxలో ఏదైనా సరే ఒక ఫైలుగా పరిగణించబడుతుంది. కాని ఇలా ఎందుకు అవుతుంది? ఎందుకంటే ఇది ఈ పరికరములను సాధారణ ఫైళ్ళ మాదిరిగానే చదువుట మరియు వ్రాయుటలో సహాయపడుతుంది. |
03:15 | Linuxలోని అన్ని ఫైళ్ళు సంబంధము కలిగి యుంటాయి. అంటే అవి అన్ని మనలాగానే ఒక కుటుంబముగా ఏర్పడతాయి. |
03:22 | కొన్ని ఫైళ్ళు మరియు ఉప డైరెక్టరీలు కలిగిన ఒక డైరెక్టరీ ఒక దానితో ఒకటి తల్లి - బిడ్డ సంబంధము కలిగియుంటాయి. ఇది “Linux File System Tree” ని ఏర్పర్చుతుంది |
03:34 | అన్నింటి కంటే పైన రూట్ ఉంటుంది (ఇది ఫ్రంట్ స్లాష్ / చే సూచించబడుతుంది). ఇది అన్ని ఇతర ఫైళ్ళు మరియు డైరెక్టరీలు కలిగి ఉంటుంది. |
03:42 | మనకు సరైన మార్గం తెలిసి ఉంటే ఇది ఒక ఫైలు లేక డైరెక్టరీ నుండి మరొక దానికి సులువుగా వెళ్ళుటకు ఉపయోగపడుతుంది. |
03:51 | ఒక Linux File System తో పని చేస్తుంటే, మనకు ఈ చెట్టు తో బాటు కదులుతున్నట్టు అనిపిస్తుంది. |
03:56 | ఒక కమాండు మరియు అక్కడి నుండి , ఒక చోటి నుండి మరొక చోటికి మీకు దారి చూపబడుతుంది |
04:01 | ఇది ఆసక్తికరంగా ఉంది కదా! నిజమే. మనము ఇక పై చూడబోయేది ఈ విధంగా ఉంటుంది. |
04:05 | మనము Linux సిస్టంలోనికి లాగిన్ అయితే, డీఫాల్ట్ గా ఒక హోం డైరెక్టరీలో ఉంటాము. |
04:11 | ఇప్పుడు టర్మినల్ వైపుకు వెళ్ళండి. |
04:13 | Ctrl+alt+T ఉబంటులో ఒక టర్మినల్ మొదలు పెట్టుటకు సహాయపడుతుంది. |
04:17 | ఈ కమాండు అన్ని unix సిస్టములలో పనిచేయకపోవచ్చు. అయినప్పటికీ, ఒక టర్మినల్ను తెరచుటకు ఒక సాధారణ పద్ధతి వేరొక స్పోకెన్ ట్యుటోరియల్లో ఇది వరకే వివరించబడింది. |
04:27 | హోం డైరెక్టరీ చూడటానికి, "echo space dollar H-O-M-E in capital" అనే కమాండ్ ప్రాంప్ట్ వద్ద టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
04:40 | ఇది మన హోం డైరెక్టరీ యొక్క పాత్ పేరు ను ఇస్తుంది. |
04:44 | మనము ఒక డైరెక్టరీ నుండి మరొక దానిలోకి వెళ్ళవచ్చు. |
04:47 | కాని ఏ సమయములోనైనా మనము ఒక్క డైరెక్టరీలో ఉండవచ్చు మరియు ఈ డైరెక్టరీని కరెంట్ డైరెక్టరీ లేక వర్కింగ్ డైరెక్టరీ అని అంటారు. ఇప్పుడు స్లైడ్ల వద్దకు తిరిగి వెళ్ళండి. |
04:56 | pwd కమాండు కరెంట్ డైరెక్టరీని చూడటానికి సహాయపడుతుంది. pwd అంటే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. |
05:03 | కమాండ్ ప్రాంప్ట్ వద్ద “pwd” అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఇప్పుడు ఇది మన ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. |
05:13 | మనము ఒక డైరెక్టరీ నుండి మరొక దానికి వెళ్ళవచ్చు తెలిపినాము |
05:17 | కానీ మనం అది ఎలా చేస్తాము? దీని కొరకు మనకు cd కమాండ్ ఉంది. |
05:22 | cd కమాండ్ తో పాటుగా మీరు వెళ్లదలచుకున్న డైరెక్టరీ పాత్ నేమ్ ను టైప్ చేయాలి. |
05:28 | కమాండ్ ప్రాంప్ట్ వద్ద pwd అని టైప్ చేసి మరియు ఎంటర్ నొక్కడం ద్వారా మన కరెంట్ డైరెక్టరీని మరల చూడ గలము |
05:37 | ఇప్పుడు మనం డైరెక్టరీలో ఉన్నాము. |
05:41 | ఇప్పుడు మనం స్లాష్ usr డైరెక్టరీకి వెళ్ళాలి అనుకుందాం. దాని కోసం, "cd space slash usr" అని టైప్ చేయండి. Linux లో స్లాష్ అంటే ఫ్రంట్ స్లాష్ అని గుర్తుపెట్టుకోండి మరియు ఎంటర్ నొక్కండి |
05:56 | ఇప్పుడు మన కరంట్ డైరెక్టరీని చూద్దాము. pwd అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
06:03 | ఇప్పుడు మనము స్లాష్ usr డైరెక్టరీకి వెళ్ళి నాము |
06:08 | ఇక్కడ సమస్య ఏమిటంటే, పాత్ నేమ్ లు చాలా పొడవుగా ఉండవచ్చు. ఎందుకంటే ఇవి Absolute Pathnames. ఇది రూట్ డైరెక్టరీ నుండి మొదలుకొని పూర్తి పాత్ ను ఇస్తుంది. |
06:18 | దీనికి బదులుగా కరంట్ డైరెక్టరీ నుండి మొదలయ్యే Relative Pathnames వాడవచ్చు. |
06:23 | ఇక్కడ రెండు విశేష కారెక్టర్ల గురించి తెలుసుకోవాలి. కరంట్ డైరెక్టరీని సూచించే “dot” మరియు కరంట్ డైరెక్టరీ యొక్క మాతృ డైరెక్టరీని సూచించే “dot dot”. |
06:36 | ఇప్పుడు cd కమాండు గురించి సంక్షిప్తముగా తెలుసుకుందాము. |
06:40 | cd కమాండు నిర్వివాదముగా హోం డైరెక్టరీకి వెళ్ళుటకు ఉపయోగించబడుతుంది. |
06:46 | కమాండ్ ప్రాంప్ట్ వద్ద "cd" టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
06:51 | ఇప్పుడు pwd కమాండును ఉపయోగించి మన కరంట్ డైరెక్టరీని తనిఖీ చేయండి |
06:55 | కాబట్టి, మనము మన హోం డైరెక్టరీకి తిరిగి వచ్చాము. /home/gnuhata [ narration- slash home slash gnuhata ] |
07:01 | ఇప్పుడు మనము మ్యూజిక్ డైరెక్టరీకి వెళ్దాము. కమాండు ప్రాంప్టు వద్ద "cd space Music (M in capital) slash" అని టైప్ చేయండి మరియు ఎంటర్ నొక్కండి. |
07:13 | ఇప్పుడు pwd కమాండుతో మన కరంట్ డైరెక్టరీని తనిఖి చేయండి . pwd అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. చూడండి, /home/gnuhata/Music కు వెళ్ళాము |
07:26 | మ్యూజిక్ నుండి మనము ఇప్పుడు మాతృ డైరెక్టరీకి వెళ్దాము. దీనికి మీరు cd కమాండును dot dotతో ఉపయోగించాలి. |
07:33 | కమాండు ప్రాంప్ట్ వద్ద cd స్పేస్ dot dot అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
07:40 | ఇప్పుడు pwd టైప్ చేసి మన కరంట్ డైరెక్టరీని తనిఖి చేయండి. మనము మళ్ళి /home/gnuhata లో ఉన్నాము |
07:51 | ఇప్పుడు dot ఉపయోగించి కరంట్ డైరెక్టరీ యొక్క ఉప డైరెక్టరీ వద్దకు వెళ్ళవచ్చు . |
07:58 | కమాండు ప్రాంప్ట్ వద్ద cd space dot slash Documents(D in capital) slash అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
08:09 | pwd అని టైప్ చేసి మన కరంట్ డైరెక్టరీని తనిఖి చేయండి . మనము /home/gnuhata/Documents వద్ద ఉన్నాము. |
08:19 | కంట్రోల్ L అని నొక్కి నేను స్క్రీన్ ను క్లియర్ చేస్తాను. కాబట్టి మీరు స్పష్టంగా చూడగలరు. |
08:23 | cd కమాండుతో మన హోం డైరెక్టరీకి వెళ్ళుటకు cd అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
08:32 | మళ్ళీ pwd కమాండుతో మన కరంట్ డైరెక్టరీని తనిఖి చేయండి . మనము /home/gnuhata వద్దకు తిరిగి వచ్చాము. |
08:41 | మనము ఒక సంబంధిత మార్గములో ఎన్నైనా ...[narration - dot dot] separated by /[narration - slash] లను కలపవచ్చు. |
08:47 | ఈ స్లైడులో మనము ఫైల్ సిస్టం యొక్క అమరికను చూడవచ్చు.
రూట్ లేక / (స్లాష్ )అన్నిటికంటే పైన ఉంది. హోం మరియు బిన్ అనేవి రూట్ కింద ఉన్న రెండు ఉప-డైరెక్టరీలు. యూజర్ పేరు, ఇక్కడ gnuhata అనే డైరెక్టరీ హోం కింద ఉన్న ఉప-డైరెక్టరీ. |
09:05 | కాబట్టి, ఇప్పుడు మనము /home/gnuhata లో ఉన్నాము. ఇప్పుడు మనము బిన్ డైరెక్టరీకి ఎలా వెళ్ళగలము? |
09:12 | కమాండు ప్రాంప్ట్ వద్ద "cd space dot dot slash dot dot slash bin" అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
09:23 | pwd కమాండుతో మన కరంట్ డైరెక్టరీని తనిఖి చేయండి మనము /bin (slash bin) వద్ద ఉన్నాము |
09:30 | మొదట dot dot మనలను /home/gnuhata slash home slash gnuhata నుండి /home (slash home) కు తీసుకొని వెళ్తుంది. |
9:37 | ఆ తరువాతది మనలను /home నుండి రూట్ కు తీసుకొని వెళ్తుంది . |
09:43 | దాని నుండి స్లాష్ ( / )లేక రూట్ నుండి మనము /bin(స్లాష్ బిన్) డైరెక్టరీకి వెళ్ళాము. |
09:48 | cd కమాండు తో హోం డైరెక్టరీకి తిరిగి వెళ్ళండి. |
09:52 | ఒక డైరెక్టరీని సృష్టించుటకు మనము mkdir అనే కమాండును ఉపయోగిస్తాము. |
09:56 | కమాండు మరియు సృష్టించాల్సిన డైరెక్టరీ యొక్క పేరును టైప్ చేయాలి. ప్రస్తుత డైరెక్టరీ క్రింద ఒక డైరెక్టరీ సృష్టించబడుతుంది. |
10:04 | testdir అనే ఒక డైరెక్టరీని సృష్టించుటకు, "mkdir space testdir" అనే కమాండును టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
10:15 | ఇది testdir డైరెక్టరీని విజయవంతంగా సృష్టిస్తుంది. |
10:19 | ఒక డైరెక్టరీ యొక్క విజయవంతమైన సృష్టి కి లేక తొలగింపుకు ఎటువంటి స్పష్టమైన సూచన లేదని గమనించండి. |
10:25 | మీకు ఏ విధమైన ఎర్రర్ మెసేజ్ రాకపోతే, అది విజయవంతంగా అమలుపరచబడిందని సూచిస్తుంది. |
10:30 | మనకు అనుమతి ఉండి మరియు ఆ పేరుతో ఏ డైరెక్టరీ ఇది వరకే లేకపోతే, మనము రిలేటివ్ లేక అబ్సొల్యూట్ పాత్ నేమ్ ను ఉపయోగించి ట్రీలో ఎక్కడైనా ఒక డైరెక్టరీని సృష్టించవచ్చు. |
10:43 | ఈ ప్రక్రియను బహుళ డైరెక్టరీలు తయారుచేయుటకు లేక డైరెక్టరీల అమరికను తయారు చేయుటకు ఉపయోగించవచ్చు. |
10:49 | mkdir space test 1 space test2 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఇది ప్రస్తుత డైరెక్టరీ కింద test1 మరియు test2 అని రెండు డైరెక్టరీలను సృష్టిస్తుంది |
11:06 | "mkdir space testtree space testtree slash test3". అని టైప్ చేయండి. |
11:20 | ఇది testtree అనే డైరెక్టరీని మరియు testtree క్రింద test3 అనే ఉప డైరెక్టరీని తయారు చేస్తుంది. |
11:28 | కాబట్టి, మనము కరంట్ డైరెక్టరీలో testdir, test1, test2 మరియు testtree అనే నాలుగు డైరెక్టరీలను సృష్టించాము. ఇందులో మొదటి మూడు ఖాళీగా ఉన్నాయి మరియు చివరి దానిలో test3 అనే ఒక ఉప డైరెక్టరీ ఉంది. |
11:47 | mkdir కమాండు లాగానే, rmdir కమాండును ఒక డైరెక్టరీ లేక డైరెక్టరీలను తొలగించుటకు ఉపయోగించవచ్చు. |
11:56 | "rmdir space test1" అనే కమాండు test1 డైరెక్టరీని తొలగిస్తుంది. |
12:09 | ఆ డైరెక్టరీ మీదే అయితే , అమరికలో మీ కరంట్ డైరెక్టరీ, తొలగించవలసిన డైరెక్టరీకి పైన ఉండి మరియు ఖాళీగా ఉంటే ఆ డైరెక్టరీని తొలగించవచ్చు. |
12:23 | కమాండు ప్రాంప్టు వద్ద "cd space testtree slash test3" అని టైప్ చేయండి. |
12:35 | కాబట్టి, మనము ఇప్పుడు testtree క్రింద ఉప డైరెక్టరీ అయిన test3 డైరెక్టరీలో ఉన్నాము. |
12:42 | ఇక testdir డైరెక్టరీని తొలగించుటకు ప్రయత్నిద్దాము. "rmdir space testdir" అనే కమాండును టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
12:55 | ఇది వీలు కాదు, ఎందుకంటే అమరికలో కరంట్ డైరెక్టరీ, తొలగించవలసిన డైరెక్టరీకి పైన లేదు. |
13:02 | కాబట్టి, అమరిక లో testdir డైరెక్టరీకి పైన ఉన్న డైరెక్టరీకి మనము వెళ్ళాలి. |
13:08 | "cd space dot dot" అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
13:14 | ఇప్పుడు, "cd space dot dot" అనే కమాండును టైప్ చేసి మన మాతృ డైరెక్టరీకి తిరిగి వెళ్ళగలము |
13:20 | ఇప్పుడు, తిరిగి ముందు కమాండును ప్రయత్నించండి. |
13:24 | "rmdir space testdir" అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
13:30 | testdir డైరెక్టరీ విజయవంతంగా తొలగించబడింది. testdir డైరెక్టరీ కూడా ఖాళీగా ఉందని గమనించండి. |
13:38 | బహుళ డైరెక్టరీలను లేక డైరెక్టరీల అమరికను ఒకేసారి తొలగించవచ్చు. కాబట్టి, testtree డైరెక్టరీని దాని test3 ఉపడైరెక్టరీతో సహా తొలగించుటకు ప్రయత్నించండి. |
13:48 | కమాండ్ ప్రాంప్ట్ వద్ద "rmdir space testtree space testtree slash test3 " అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
14:02 | testree ఖాళీగా లేదు కాబట్టి testree డైరెక్టరీని తొలగించలేమని ఇది ఎర్రర్ మెసేజ్ ను చూపిస్తుంది. |
14:11 | కాని testtree/tree3 అనే డైరెక్టరీ ఖాళీగా ఉండటముచేత తొలగించబడిందని మీరు గమనించకపోవచ్చు. |
14:19 | దానిని తనఖి చేయుటకు , కమాండ్ ప్రాంప్టు వద్ద "cd space testtree" అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
14:27 | ఇప్పుడు "ls" అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. డైరెక్టరీలో ఏమీ లేదు. కాబట్టి test3 తొలగించ బడినదని గమనించండి |
14:36 | కాబట్టి ఈ linux ట్యుటోరియల్లో మనము Linux Files మరియు డైరెక్టరీల గురించి మరియు Linux డైరెక్టరీలతో ఎలా పనిచేయాలో వాటిని ఎలా తయారు చేయాలో ఎలా చూడాలో వాటి మధ్య కదలికలను ఎలా గమనించాలో ఎలా తొలగించాలో నేర్చుకొన్నాము. |
14:49 | ఇక నేను ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాను. స్పోకెన్ ట్యుటోరియల్స్ అనేవి టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము. దీనికి నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ ద్వారా ICT సహాయం అందిస్తోంది. |
15:03 | దీని గురించిన మరింత సమాచారము ఈ క్రింది లింకు వద్ద లభించును |
15:08 | ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష (అనువాదం చేసినవారి పేరు) మరియు స్రవంతి (రికార్డ్ చేసినవారి పేరు) బళ్ళారి. .సహకరించినందుకు ధన్యవాదములు. సెలవు |