Firefox/C2/Tabbed-Browsing-Blocking-Pop-ups/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 13:03, 14 August 2014 by Madhurig (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:00 మొజిల్లా ఫయర్ ఫాక్స్ గురించి ఈ స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:04 ఈ ట్యుటోరియల్ లో మనము టాబ్డ్ బ్రౌజింగ్, కంటెంట్ను ఆఫ్లైన్ నిల్వ చేయడం, పాప్ అప్స్ ను నిరోధించడం గురించి నేర్చుకుంటాం
00:13 ఈ ట్యుటోరియల్లో, ఫయర్ ఫాక్స్ వెర్షన్ 7.0 ను ఉంబంటు 10.04 పై ఉపయోగిస్తున్నాం
00:21Mozilla Firefox allows you to load multiple web pages into separate tabs within the same browser window. మొజిల్లా ఫయర్ ఫాక్స్ మీకు బ్రౌజర్ విండోలో వేరు వేరు టాబ్లతో అనేక వెబ్ పేజీలను లోడ్ చేయుటకు అనుమతిస్తుంది.
00:29 టాబ్డ్ బ్రౌజింగ్ యొక్క అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, అనేక బ్రౌజర్ విండోల ప్రదర్శన అవసరాన్ని తొలగిస్తుంది
00:36 అందుకే మీ డెస్క్టాప్ చిందరవందరగా లేకుండా ఉంచడానికి సహాయపడుతుంది.
00:40 ప్రతి ట్యాబు ప్రదర్శింపబడినప్పుడు బ్రౌజరు యొక్క మొత్తం కనిపించే ప్రాంతాని ఆక్రమిస్తుంది.
00:45 ఇది తరచుగా తెరచి ఉన్న బ్రౌజర్ విండోల పరిమాణాన్ని మరియు స్థానాన్ని మార్చే అవసరాన్ని తొలగిస్తుంది.
00:52 టాబ్డ్ బ్రౌజింగ్, టైల్డ్ విండో బ్రౌజింగ్ కంటే తక్కువ మెమరీ మరియు ఆపరేటింగ్ సిస్టమ్ వనరులను ఉపయోగిస్తుంది.
01:00 కాకపోతే యూజర్ ఒకేసారి ఎక్కువ సంఖ్యలో ట్యాబులను తెరవకూడదు.
01:05 మీరు ఒక నిర్దిష్టమైన వెబ్ పేజి లో ఉన్నారనుకోండి.
01:08 ఇక్కడ ఒక లింక్ ఉంది -'Firefox for Desktop'.
01:11 దీనిని మీరు కొత్త ట్యాబ్ లో తెరవవచ్చు
01:14 అలా చేయుటకు లింకు పై రైట్ క్లిక్ చేసి ,
01:17 కాంటెక్స్ట్(context ) మెనూ లో Open link in new tab పై క్లిక్ చేయండి .
01:21 అదే బ్రౌజర్ విండోలో, ప్రస్తుతం ఉన్న ట్యాబ్ యొక్క కుడి వైపున ఒక క్రొత్త ట్యాబ్ తెరుచుకుందని మీరు చూడవచ్చు.
01:28 కాబట్టి, మీ విండోను మూసివేయకుండా లేదా కదుపకుండా, మీరు అదే విండోలో మరొక వెబ్ పేజి ను తెరవవచ్చు.
01;34 మీరు File (ఫైల్) మరియు New Tab (ను ట్యాబు ) పై క్లిక్ చేసి , కొత్త ట్యాబ్ ను తెరవవచ్చు.
01:40 దీని కొరకు షార్ట్ కట్ కీలు CTRL+T.
01:40 మీరు ఒక క్రొత్త ట్యాబ్ ను తెరచినప్పుడు, ఆ కొత్త ట్యాబ్ వెంటనే క్రియాశీలత పొందుతుంది.
01:50 ఇప్పుడు URL బార్ వద్దకు వెళ్ళి, 'www.google.com' అని టైపు చేయండి.
01:56 ఇప్పుడు మీ వద్ద భిన్నమైన వెబ్ పేజి ల తో 3 ట్యాబ్ లు ఉన్నాయి
02:01 మీరు అన్నిటి కన్న కుడి వైపున ఉన్నట్యాబ్ కు కుడి వైపున ప్లస్ ('+' ) బటన్ పై క్లిక్ చేసి , ఒక కొత్త ట్యాబ్ ను తెరవవచ్చు
02:08 మనము మన అవసరాలకు తగ్గట్టుగా ట్యాబ్ లను ఏర్పాటు చేసుకోవచ్చు..
02:11 ఒక ట్యాబ్ పై క్లిక్ చేసి మౌస్ బటన్ వదలకుండా , అవసరమైన స్థానానికి ట్యాబ్ ను తరలించండి
02:17 ఇప్పుడు మౌజ్ బటన్ ను వదిలివేయండి
02:20 ఇప్పుడు టాబ్ కావలసిన స్థానంలో ఉంది.
02:23. మొజిల్లా ఫయర్ ఫాక్స్ మనము పని చేయుటకు అనుమతించిన కొన్ని ప్రాథమిక కార్యకలాపాలను చూద్దాం.
02:29 సర్చ్ ఇంజిన్ ను 'google' కు మార్చుదాం
02:32 సర్చ్ బార్ లో ‘email wikipedia’ అని టైపు చేసి, సర్చ్ బార్ కు కుడి వైపు ఉన్న మగ్నిఫ్యింగ్ గ్లాస్ క్లిక్ చేయండి
02:40 సంబంధిత వికీపీడియా పేజీ యొక్క మొదటి శోధన ఫలితం.
02:44 ఈ పేజీ ను తెరవడానికి లింకు పై క్లిక్ చేయండి
02:48 ఇప్పుడు File( ఫైల్ ) మరియు ఆపై “Save Page As” పై క్లిక్ చేయండి
02:52 'search.html' పేరుతో ఫైల్ ను మనము డెస్క్టాప్ పై సేవ్ చేద్దాము.
02:59 ఇప్పుడు, File మరియు New Tab ల పై క్లిక్ చేసి బ్రౌజర్ విండోలో ఒకకొత్త ట్యాబ్ను తెరవండి
03:05 మనము సేవ్ చేసిన పేజ్ ఈ కొత్త ట్యాబ్ విండోలో తెరుద్దం
03:10 File(ఫైల్) మరియు Open File(ఓపెన్ ఫైల్ ) పై క్లిక్ చేయండి
03:12 బ్రౌస్ చేసి సేవ్ చేసిన ఫైల్ ను తెరవండి .
03:17 URL బార్ లోని చిరునామా ఇంటర్నెట్ చిరునామా కాకుండా మీ కంప్యూటర్ లోని స్థానిక స్థాననిదని చూడగలరు.
03:25 ఇప్పుడు మీరు ఆఫ్లైన్లో ఉన్నపటికీ, ఈ పేజీ ను చదువుకోవచ్చు.
03:29 పాప్ అప్స్ మీ అనుమతి లేకుండా స్వయంచాలకంగా కనిపించే విండో లు.
03:34 ఫయర్ ఫాక్స్ పాప్-అప్స్ మరియు పాప్-అండర్స రెండిటిని ప్రిఫరేన్సుస్ విండో లోని కంటెంట్ ట్యాబు ద్వరా నియంత్రించుటకు అనుమతిస్తుంది.
03:42 విండోస్ పై ఇది Options(ఆప్షన్స్ ) విండో లో ఉంటుంది
03:46 డిఫాల్ట్ గా, పాప్ అప్ బ్లాకింగ్ ప్రారంభమవుతుంది.
03:50 ఎడిట్ మరియు ప్రిఫరెన్సెస్ పై క్లిక్ చేయండి.
03:52 విండోస్ వినియోగదారులు దయచేసి టూల్స్ మరియు ఆప్షన్స్ పై క్లిక్ చేయండి
03:56 కంటెంట్ ట్యాబు లోని మొదటి ఎంపిక 'Block pop-up windows' డిఫాల్ట్ గా తనిఖి చేయబడుతుంది
04:02 లేకపోతే, దయచేసి ఈ ఎంపిక పై క్లిక్ చేయండి
04:05 ఈ డైలాగ్ బాక్స్ లోని వివిధ ఎంపికలను మరొక ట్యుటోరియల్ లో చేర్చిద్దాం
04:11 క్లోజ్ బటన్ పై క్లిక్ చేయండి.
04:13 దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరికు వచ్చాము.
04:16 మనము నేర్చుకున్న దాని సారాంశము:
04:19 టాబ్డ్ బ్రౌజింగ్, కంటెంట్ ను ఆఫ్లైన్ లో నిల్వ చేయడం, పాప్ అప్స్ ను బ్లాక్ చేయడము
04:25 సమగ్రమైన ఈ అసైన్మెంట్ ను ప్రయత్నించండి.
04:29 ఒక కొత్త ట్యాబు ను తెరవండి
04:30 సర్చ్ ఇంజిన్ 'google'కు మార్చండి.
04:33 'The history of email' కొరకు వెతకండి.
04:36 మొదటి ఫలితం సేవ్ చేసి మరియు , దానిని ఒక ఆఫ్లైన్ డాక్యుమెంట్ గా చూచుటకు ఒక కొత్త ట్యాబ్ ను తెరవండి.
04:43 సర్చ్ ఇంజిన్ ను 'bing' కు మార్చండి.
04:46 మళ్ళి 'The history of email' కొరకు వెతకండి.
04:49 ‘History of Email & Ray Tomlinson’ అనే లింకును సేవ్ చేసి , ఒక ఆఫ్లైన్ డాక్యుమెంట్ గా చూచుటకు ఒక కొత్త ట్యాబ్ ను తెరవండి.
04:58 ఈ క్రింది లింకు వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి.
05:02 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశాన్ని తెలుపుతుంది.
05:04 మీకు మంచి బాండ్ విడ్త్ లేకపోతె, వీడియోని డౌన్ లోడ్ చేసుకుని చూడవచ్చు.
05:09 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యుటోరియల్ ల పైన వర్క్ షాపులను నిర్వహిస్తుంది.
05:14

ఆన్లైన్ పరీక్షలలో ఉత్తిర్ణులైన వారికి సర్టిఫికెట్లు జారిచేస్తుంది

05:18 మరిన్ని వివరాల కొరకు దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
05:25 ఈ స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో భాగము
05:29 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది
05:37 ఈ మిషన్ గురించి మరింత సమాచారము Spoken Hyphen tutorial dot org slash NMEICT hyphen Intro లో అందుబాటులో ఉన్నది.
05:48 ఈ ట్యుటోరియల్ను తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి
05:53 మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Nancyvarkey, PoojaMoolya, Sneha, Yogananda.india