LibreOffice-Suite-Writer/C2/Introduction-to-LibreOffice-Writer/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 16:28, 11 July 2014 by Gaurav (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 లీబ్రే ఆఫీస్ రైటర్ స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం.

ఈ ట్యూటోరియల్ లో ఈ విషయాలను నేర్చుకుంటాం.

రైటర్ పరిచయం.

00:10 రైటర్లో విభిన్న టూల్బార్స్
00:13 కొత్త డాక్యుమెంట్ను ఎలా ఓపెన్ చేయాలి మరియు డాక్యుమెంట్ నుంచి ఎలా నిష్క్రమించాలి.
00:17 ఒక డాక్యుమెంట్ను ఎలా సేవ్ చేయాలి.
00:20 రైటర్లో ఒక డాక్యుమెంట్ను ఎలా క్లోజ్ చేయాలి
00:22 లీబ్రే ఆఫీస్ రైటర్, లీబ్రే ఆఫీస్ సూట్లోని వర్డ్ ప్రాసెసర్ కాంపోనెంట్
00:27 ఇది మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్లోని మైక్రోసాఫ్ట్ వర్డ్ కు సమానమైనది.
00:33 ఇది ఫ్రీ మరియు ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ కనుక ఎలాంటి ఆంక్షలు లేకుండా పంచుకోవచ్చు, మార్పుచేయవచ్చు మరియు పంపిణీ చేయవచ్చు.

ఇది ఫ్రీ సాఫ్ట్వేర్ కావడాంతో ఎలాంటి లైసెన్స్ ఫీస్ చెలించకుండానే దీనిని పాచుకోవచ్చు

00:41 ఇది ఫ్రీ సాఫ్ట్ వేర్ కావడంతో, ఎలాంటి లైసెన్స్ ఫీజులు చెల్లించకుండానే, దీన్ని పంచుకోవచ్చు.
00:47 లీబ్రే ఆఫీస్ సూట్ను ప్రారంభించడం కోసం మీరు మైక్రోసాఫ్ట్ విండోస్ 2000 మరియు దాని యొక్క ఉన్నత వెర్షన్లు అయిన MS విండోస్ XP లేదా MS విండోస్ 7 లేదా జిఎన్యు/లీనక్స్ ను ఆపరేటింగ్ సిస్టమ్గా వినియోగించవచ్చు.
01:04 మనం ఉబుంటూ లినక్స్ 10.04 ఆపరేటింగ్ సిస్టమ్గాను మరియు లీబ్రే ఆఫీస్ సూట్ వెర్షన్ 3.3.4ను ఉపయోగిస్తున్నాం.
01:16 మీరు లీబ్రే ఆఫీస్ సూట్ను ఇన్ స్టల్ చేయనట్లయితే, “Synaptic Package Manager" (సిన్యప్టిక్ ప్యాకేజ్ మేనేజర్) ద్వారా రైటర్ను ఇన్ స్టల్ చేయవచ్చు.
01:24 “Synaptic Package Manager" (సైనాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్) కి సంభంధించిన మరింత సమాచారం కొరకు దయచేసి Ubuntu Linux ట్యూటోరియల్స్ ని రెఫర్ చేయండి.
01:31 ఈ వెబ్‌సైట్లోని సూచనలు పాటించడం ద్వారా లిబ్రే ఆఫీస్ సూట్ ని డౌన్‌లోడ్ చేసుకోండి
01:37 లీబ్రే ఆఫీస్ సూట్ యొక్క మొదటి ట్యుటోరియల్లో సవిస్తరమైన సూచనలు లభ్యమవుతాయి.
01:43 ఇన్ స్టల్ చేసే సమయంలో రైటర్ను ఇన్ స్టల్ చేసే ఆప్షన్ “Complete”(‘కంప్లీట్’)ను ఉపయోగించడం మర్చిపోవద్దు.
01:50 ఒకవేళ మీరు ఇప్పటికే లీబ్రే ఆఫీస్ సూట్ను ఇన్ స్టల్ చేసినట్లయితే
01:54 స్క్రీన్ ఎడమ వైపు పైన ఉండే “Applications”(‘ అప్లికేషన్’) మీద క్లిక్ చేసి, ఆ తరువాత “Office”(‘ఆఫీస్’) ఆపై (LibreOffice)‘లీబ్రే ఆఫీస్’ ఆప్షన్ను క్లిక్ చేయడం ద్వారా
02:02 "LibreOffice Writer"('లీబ్రే ఆఫీస్ రైటర్’)ను చూడగలుగుతారు.
02:08 లీబ్రే ఆఫీస్ కాంపోనెంట్స్ తో కూడిన కొత్త డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది.
02:13 లీబ్రే ఆఫీస్ రైటర్ యాక్సెస్ కోసం, ఈ సూట్ యొక్క వర్డ్ ప్రాసెసర్ కాంపోనెంట్ అయినటువంటి “Text Document” ‘టెక్స్ డాక్యుమెంట్’ ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
02:23 ఇది మెయిన్ రైటర్ విండోలో ఖాళీ డాక్యుమెంట్ను ఓపెన్ చేస్తుంది.
02:28 రైటర్ విండోలో టైటిల్ బార్,
02:33 మెనూ బార్, స్టాండర్డ్ టూల్బార్,
02:36 ఫార్మెటింగ్ బార్ మరియు స్టేటస్ బార్ వంటి వివిధ టూల్బార్స్ ఉంటాయి. ఇవే విస్త్రతంగా వినియోగించబడే ఆప్షన్లు. ట్యుటోరియల్స్ ముందుకు సాగుతున్న కొద్దీ వీటి గురించి మనం నేర్చుకుంటాం.
02:47 రైటర్లో ఒక కొత్త డాక్యుమెంట్ను ఎలా ఓపెన్ చేయాలన్న ట్యుటోరియల్ ద్వారా మనం ఇప్పుడు ప్రారంభిద్దాం.
02:53 స్టాండర్డ్ టూల్బార్లోని ‘New Icon"(న్యూ ఐకాన్)’ మీద క్లిక్ చేయడం ద్వారా
03:00 లేదా మెనూ బార్లో "File"(‘ఫైల్’) ఆప్షన్ మీద క్లిక్ చేసి
03:05 ‘కొత్త’ ఆప్షన్ మీద క్లిక్ చేసి, చివరగా "Text Document"(‘టెక్ట్స్ డాక్యుమెంట్’) ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా మీరు కొత్త డాక్యుమెంట్ ఓపెన్చేయవచ్చు.
03:12 రెండు సందర్భాల్లోనూ రైటర్ విండో తెరుచుకోవడాన్ని గమనించవచ్చు.
03:17 ఎడిటర్ ప్రాంతంలో కొంత టెక్ట్స్ ను టైప్ చేయండి.
03:21 కనుక 'Resume'(‘రెజ్యూం’) అని టైప్ చేద్దాం
03:24 మీ డాక్యుమెంట్ రాయడం పూర్తయిన తరువాత భవిష్యత్ వినియోగం కోసం దాన్ని సేవ్ చేయాలి.
03:29 ఈ ఫైల్ను సేవ్ చేయడం కోసం, మెనూబార్లోని “File”(‘ఫైల్’) మీద క్లిక్ చేయండి.
03:33 ‘Save as’ ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
03:36 స్క్రీన్ మీద డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.

"Name Field"('నేమ్ ఫీల్డ్’)లో మీరు మీ ఫైల్ పేరును నమోదు చేయాలి.

03:44 ఫైల్ యొక్క పేరును Resume(‘రెజ్యూం’)గా ఎంటర్ చేయండి.
03:48 ‘Name’ ఫీల్డ్ కు దిగువన 'Save in folder”(‘సేవ్ ఇన్ ఫోల్డర్’) ఉంటుంది.
03:53 ఫోల్డర్ పేరు ఎంటర్ చేసే ఫీల్డ్ లో మీరు సేవ్ చేసిన ఫైల్ ఉంటుంది.
03:58 కనుక “Save in folder”(‘సేవ్ ఇన్ ఫోల్డర్)’ ఫీల్డ్ లో డౌన్ యారో క్లిక్ చేసి ‘డెస్క్ టాప్’ ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
04:02 మెనూలో ఫోల్డర్ల జాబితా చూస్తారు, వీటిలో ఫైల్ను సేవ్ చేయవచ్చు.
04:08 ‘డెస్క్ టాప్’ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. ఫైల్ డెస్క్ టాప్ మీద సేవ్ అవుతుంది.
04:14 “Browse for other folders”(‘బ్రౌజ్ ఫర్ అదర్ ఫోల్డర్స్’)ని కూడా క్లిక్ చేయవచ్చు.
04:18 ఎక్కడైతే మీ డాక్యుమెంట్ను సేవ్ చేయాలనుకుంటున్నారో, ఆ ఫోల్డర్ను ఎంచుకోండి.
04:23 డైలాగ్ బాక్స్ లో “File type”‘ ఫైల్ టైప్’ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
04:27 ఇది ఫైల్ టైప్ ఆప్షన్ల జాబితాను లేదా ఫైల్ ఎక్స్టెన్షన్స్ చూపిస్తుంది, వీటి ద్వారా మీరు మీ ఫైల్ను సేవ్ చేయగలుగుతారు.
04:34 లీబ్రే ఆఫీస్ రైటర్లో డిఫాల్ట్ ఫైల్ టైప్ ‘ODF' "Text Document"('టెక్ట్స్ డాక్యుమెంట్’).

ఇది "dot ODt" ఎక్స్టెన్షన్ను కల్పిస్తుంది.

04:45 ODT ఓపెన్డాక్యుమెంట్ ఫార్మెట్ లేదా ODF ఫార్మెట్,కి సంభందించినది ఇది ప్రపంచవ్యాప్తంగా ఆమోదించిన ఓపెన్ స్టాండర్డ్ ఫోర్ వర్డ్ డాక్యుమెంటస్.
04:56 ఇది భారత ప్రభుత్వ పాలసీ అయిన ఓపెన్స్టాండర్డ్స్ లోని e-గవర్నెన్స్ చేత కూడా ఆమోదించబడింది
05:04 “dot odt” టెక్ట్స్ డాక్యుమెంట్లగా సేవ్ చేయడంతో పాటు లీబ్రే ఆఫీస్ రైటర్లో ఓపెన్చేయవచ్చు.
05:11 మీ ఫైల్ను as “dot doc” మరియు “dot docx” ఫార్మెట్లలో సేవ్ చేయవచ్చు. దీన్ని MS ఆఫీస్ వర్డ్ ప్రోగ్రామ్లో ఓపెన్చేయవచ్చు.
05:23 చాలా ప్రోగ్రామ్స్ లో వినియోగించే మరో పాపులర్ ఫైల్ ఎక్స్టెన్షన్ “dot rtf" దీన్ని రిచ్ టెక్ట్స్ పార్మెట్ అని అంటారు.
05:33 ‘ODF' "Text Document" ('టెక్ట్స్ డాక్యుమెంట్') ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
05:37 ఫైల్ టైపును ODF టెక్ట్స్ డాక్యుమెంట్గా చూడవచ్చు మరియు ఫైల్ టైప్ ఆప్షన్ తరువాత బ్రాకెట్ల లోపల dotODF అని కనిపిస్తుంది.
05:48 ఇప్పుడు "Save"(సేవ్) బటన్ మీద క్లిక్ చేయండి.
05:50 ఇది ఫైల్ పేరు మరియు టైటిల్ బార్ మీద మీరు ఎంచుకున్న ఎక్స్ టెన్షన్తో మిమ్ముల్ని తిరిగి రైటర్కు తీసుకెళుతుంది.
05:58 రైటర్ విండోలో టెక్ట్స్ డాక్యుమెంట్ రాసేందుకు మీరు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు.
06:03 పైన చర్చించిన ఫార్మెట్లకు అదనంగా, రైటర్ డాక్యుమెంట్లను “dot html” ఫార్మెట్లో సేవ్ చేయవచ్చు.

ఇది వెబ్ పేజీ ఫార్మెట్.

06:13 ఇంతకు ముందు వివరించినట్లుగానే దీనిని చేస్తారు.
06:17 కనుక మెనూబార్లో "File"(‘ఫైల్’) ఆప్షన్ మీద క్లిక్ చేసి తరువాత “Save as”(‘సేవ్ యాజ్’) ఆప్షన్ పై క్లిక్ చేయండి.
06:24 "File Type"(‘ఫైల్ టైప్’ )ఆప్షన్ మీద క్లిక్ చేసి తరువాత (ఒపెన్ ఆఫీస్) Open Office dot org రైటర్ ఆప్షన్ యొక్క బ్రాకెట్ల మధ్య HTML డాక్యుమెంట్ ఎంచుకోండి.
06:35 ఈ ఆప్షన్ డాక్యుమెంట్ను “dot html” ఎక్స్ టెన్షన్ను ఇస్తుంది.
06:40 "Save"('సేవ్') బటన్ మీద క్లిక్ చేయండి.
06:42 డైలాగ్ బాక్స్ లోని "Ask when not saving in”( ‘ఆస్క్ వెన్ నాట్ సేవింగ్ ఇన్ ODF ఫార్మెట్’) ఆప్షన్ మీద చెక్ను పెట్టండి.
06:50 చివరగా “Copy Current Format” (‘కీప్ కరెంట్ ఫార్మెట్’) ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
06:55 డాక్యుమెంట్లు “dot html " ఎక్స్ టెన్షన్లో సేవ్ కావడాన్ని మీరు చూడవచ్చు.
07:00 స్టాండర్డ్ టూల్ బార్లోని “Export Direct as PDF”(‘ఎక్స్ పోర్ట్ డైరెక్ట్లీ యాజ్ PDF’) ఆప్షన్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు డాక్యుమెంట్ను PDF ఫార్మెట్లోకి ఎక్స్ పోర్ట్ చేయవచ్చు.
07:10 ఇంతకు ముందులానే, ఎక్కడైతే సేవ్ చేయాలనుకుంటున్నారో ఆ లొకేషన్ ఎంచుకోండి.,
07:15 ప్రత్యామ్నాయంగా, మెనూబార్లోని “File”( ‘ఫైల్’ ) ఆప్షన్ను మీరు క్లిక్ చేసి, తరువాత ‘ఎక్స్ పోర్ట్ యాజ్ pdf” ఆప్షన్ మీద క్లిక్ చేయడం ద్వారానూ చేయవచ్చు.
07:24 డైలాగ్బాక్స్ లో కనిపించే ఎక్స్ పోర్ట్ మీద క్లిక్ చేసి తరువాత ‘సేవ్’ బటన్ మీద క్లిక్ చేయండి.
07:32 ఒక 'pdf' ఫైల్ ఏర్పడుతుంది.
07:35 “File”(‘ఫైల్’ )మరియు “Close”(‘క్లోజ్’ )మీద క్లిక్ చేయడం ద్వారా, ఈ డాక్యుమెంట్ను క్లోజ్ చేద్దాం.
07:40 ఇప్పటికే సృష్టించిన ఒక డాక్యుమెంట్ను లీబ్రే ఆఫీస్ రైటర్లో ఎలా ఓపెన్చేయాలో చూద్దాం.
07:47 ఇప్పుడు "Resume.odt" డాక్యుమెంట్ను ఓపెన్చేద్దాం.
07:51 ఇప్పటికే ఉన్న డాక్యుమెంట్ను ఓపెన్ చేయడం కోసం పైన ఉండే మెనూ బార్లోని “File”(‘ఫైల్’)మెనూ మీద క్లిక్ చేయాలి,

తరువాత "Open”‘(ఓపెన్’) ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.

08:00 స్క్రీన్ మీద డైలాగ్ బాక్స్ కనపడటాన్ని మీరు చూడవచ్చు.
08:04 మీ డాక్యుమెంట్ను ఎక్కడ సేవ్ చేశారో, ఆ ఫోల్డర్ను ఇక్కడ కనుగొనండి.
08:08 డైలాగ్ బాక్స్ యొక్క ఎడమవైపు పైన ఉండే చిన్న పెన్సిల్ బటన్ను క్లిక్ చేయండి
08:14 “Type a file name”(‘టైప్ ఎ ఫైల్ నేమ్’) అనే పేరు దీనికి ఉన్నది.
08:16 ఇది Location bar‘(లొకేషన్ బార్’) ఫీల్డ్ ను తెరుస్తుంది.
08:19 ఇక్కడ, ఏ ఫైల్ను అయితే వెతుకుతున్నారో, ఆ ఫైల్ యొక్క పేరు టైప్ చేయండి.
08:24 కనుక, ఫైల్ యొక్క పేరును "Resume"(‘రెజ్యూం’)గా రాస్తాం.
08:27 రెజ్యూంతో కనిపించే ఫైల్ పేర్ల నుంచి ‘Resume.odt”ని ఎంచుకోండి.
08:34 “Open”(‘ఓపెన్’) బటన్ మీద క్లిక్ చేయండి.
08:37 ఫైల్ “Resume.odt” ఓపెన్కావడాన్ని గమనించవచ్చు.
08:41 ప్రత్యామ్నాయంగా మీరు పైన ఉన్న టూల్బార్లోని “Open”(‘ఓపెన్’) ఐకాన్ మీద క్లిక్ చేసి,

తరువాత పైన పేర్కొన్న విధంగా కొనసాగించడం ద్వారా ఇప్పటికే ఉన్న ఫైల్ను ఓపెన్చేయవచ్చు.

08:52 మైక్రోసాఫ్ట్ వర్డ్ లో ఉపయోగించే, dot doc”మరియు “dot docx” ఎక్స్ టెన్షన్ ఫైల్స్ ను రైటర్లోనూ ఓపెన్చేయవచ్చు.
09:03 తరువాత అదే ఫైల్ పేరు కింద ఒక ఫైల్ను ఎలా మార్చాలి మరియు సేవ్ చేయాలన్న అంశాలను మనం చూద్దాం.
09:10 మొదట ఎడమ ‘మౌస్' బటన్ ను క్లిక్ చేసి ‘Resume’ టెక్ట్స్ ను సెలక్ట్ చేసుకోండి, తరువాత టెక్ట్స్ తో పాటు దానిని డ్రాగ్ చేయండి.
09:17 ఇది టెక్ట్స్ ను ఎంచుకొని దాన్ని హైలెట్ చేస్తుంది. ఇప్పుడు ఎడమ మౌస్ బటన్ను రిలీజ్ చేయండి.
09:24 టెక్స్ట్ ఇంకనూ హైలైట్ చేయబడి ఉంది.
09:26 స్టాండర్డ్ టూల్ బార్లోని “Bold”(‘బోల్డ్’‘)ఐకాన్ మీద క్లిక్ చేస్తే టెక్ట్స్ బోల్డ్ అవుతుంది.
09:33 పేజీ మధ్యలో ఈ టెక్స్ట్ అలైన్ చేయడానికి, టూల్బార్లో ని "Centered" చిహ్నం పై క్లిక్ చెయ్యండి.
09:41 మీరు చూడవచ్చు టెక్స్ట్ పేజ్ మధ్య లోకి అలైన్ అయింది
09:45 టెక్ట్స్ యొక్క ఫాంట్ సైజును పెంచుదాం.
09:48 దీనికి టూల్బార్లోని “Font Size”(‘ఫాంట్ సైజ్’) ఫీల్డ్ లోని డౌన్ యారో మీద క్లిక్ చేయండి.
09:53 డ్రాప్ డౌన్ మెనూలో మనం 14 మీద క్లిక్ చేద్దాం.
09:57 తద్వారా 'Font size'(టెక్ట్స్ ఫాంట్ సైజు) 14కు పెరుగుతుంది.
10:01 “Font Name”(‘ఫాంట్ నేమ్’) ఫీల్డ్ లో డౌన్ యారో మీద క్లిక్ చేసి, ఫాంట్ పేరును “UnDotum” గా ఎంచుకోండి.
10:09 టూల్బార్లోని “Save”(‘సేవ్’)ఐకాన్ మీద క్లిక్ చేయండి
10:13 మార్పు చేసిన తరువాత, అదే ఫైల్ పేరు మీద సేవ్ కావడాన్ని గమనించవచ్చు.
10:21 డాక్యుమెంట్ను సేవ్ చేసిన తరువాత,క్లోస్ చేయాలంటుటే.
10:25 మెను బార్ లోని “File”("ఫైల్")మెను పై క్లిక్ చేసి తరువాత “Close”("క్లోస్") ఆప్షన్ పై క్లిక్ చేయండి.

దీనితో ఫైల్ క్లోస్ అవుతుంది.

10:33 దీనితో ఈ లీబ్రె ఆఫీస్ రైటర్ స్పోకన్ ట్యూటోరియల్ చివరకు వచ్చాం.

సంక్షిప్తంగా చేపలంటే మనం ఈ విషయాలను నేర్చుకొన్నం.

10:41 రైటర్ యొక్క పరిచయం.

రైటర్లోని వివిధ టూల్బార్లు.

10:45 కొత్త డాక్యుమెంట్ మరియు రైటర్ లో ఇప్పటికే ఉన్న డాక్యుమెంట్ని ఎలా తెరావలి. డాక్యుమెంట్ను ఎలా సేవ్ చేయాలి.
10:52 రైటర్లో ఒక డాక్యుమెంట్ను ఎలా క్లోజ్ చేయాలి.
10:55 కాంప్రెహెన్సివ్ అసైస్న్‌మెంట్. రైటర్లో కొత్త డాక్యుమెంట్ తెరవండి
11:01 Practice.odt అనే పేరు మీద దాన్ని సేవ్ చేయండి.
11:05 "ఇది న మొదటి అస్సీన్మెంట్"అనే టెక్స్ట్ రాయండి
11:08 ఫైల్ ని సేవ్ చేయండి

టెక్ట్స్ను అండర్లైన్ చేయండి.

ఫాంట్ పరిమాణం 16కు పెంచండి.

ఫైల్ను క్లోజ్ చేయండి

11:18 ఈ దిగువ లింకు వద్ద లభ్యమయ్యే వీడియోను చూడండి.ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ను సంక్షిప్తీకరిస్తుంది.
11:24 మీకు సరైన బ్యాండ్విడ్త్ లేనట్లయితే, దానిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
11:29 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్,స్పోకెన్ ట్యుటోరియల్స్ను వినియోగించి వర్క్ షాపులను నిర్వహిస్తుంది. ఆన్లైన్ టెస్టు పాసైన వారికి సర్టిఫికేట్లు ఇవ్వబడతాయి.
11:38 మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.org కి వ్రాయండి
11:45 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్ టూ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగం
11:48 ఇది జాతీయ విద్య మిషన్ ద్వారా ICT, MHRD, భారత ప్రభుత్వం చే మద్దతు పొందింది
11:56 ఈ మిషన్కు సంబంధించిన మరింత సమాచారాన్ని spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro లో పొందవచ్చు.
12:07 ఈ ట్యూటోరియల్ ని తెలుగు లో కి అనువదించింది దేశిక్రు సల్యూషన్స్. అనుకరణ చేసింది చైతన్య ధన్యవాదములు

Contributors and Content Editors

Chaithaya, Gaurav, Madhurig, Udaya