LibreOffice-Suite-Calc/C2/Introduction-to-LibreOffice-Calc/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 10:49, 30 August 2013 by Madhurig (Talk | contribs)

Jump to: navigation, search

Resources for recording Introduction to Calc

Visual Cue Narration
00:00 లిబ్రేఆఫీస్ Calc యొక్క పరిచయము పైన స్పోకెన్ ట్యుటోరియల్ కు మీకు స్వాగతము.
00:06 ఈ ట్యుటోరియల్లో మీరు ఈ క్రింది వాటి గురించి నేర్చుకుంటారు:
00:08 లిబ్రేఆఫీస్ Calc యొక్క పరిచయము
00:12 లిబ్రేఆఫీస్ Calc లోని వివిధ టూల్ బార్ లు.
00:16 Calc లో ఒక క్రొత్త డాక్యుమెంట్ ను ఎలా ఓపెన్ చేయాలి.
00:18 అప్పటికే ఉన్న డాక్యుమెంట్ ను ఎలా ఓపెన్ చేయాలి.
00:21 Calc లో ఒక డాక్యుమెంట్ ను ఎలా సేవ్ మరియు క్లోజ్ చేయాలి?
00:26 లిబ్రేఆఫీస్ సూట్ లో లిబ్రేఆఫీస్ Calc ఒక స్ప్రెడ్ షీట్ కాంపోనెంట్.
00:32 Writer ఎక్కువగా టెక్స్ట్ సమాచారముతో పని చేసిన విధముగా స్ప్రెడ్ షీట్ ఎక్కువగా సంఖ్యలకు సంబంధించిన సమాచారముతో పని చేస్తుంది.
00:40 దీనిని సంఖ్యల భాష యొక్క సాఫ్ట్ వేర్ అని చెప్పవచ్చు. ఇది సంఖ్యల భాష కోసం ఒక సాఫ్ట్వేర్.
00:44 అది మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్ లోని మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ తో సమానము అయింది.
00:49 అది ఉచితముగా లభించేది మరియు ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ కనుక దానిని ఉచితముగా కాపీ చేయగలము, మరలా వినియోగించుకోగలము మరియు ఉచితముగా పంపిణీ కూడా చేయగలము.
00:57 లిబ్రేఆఫీస్ సూట్ ను మొదలు పెట్టడము కొరకు మీరు Microsoft Windows 2000 లేదా MS Windows XP లేదా MS Windows 7 వంటి దాని హైయ్యర్ వెర్షన్లు లేదా GNU/Linux ను కానీ మీ ఆపరేటింగ్ సిస్టమ్ గా ఉపయోగించుకోవచ్చు.
01:14 ఇక్కడ మనము Ubuntu Linux version 10.04 ను మన ఆపరేటింగ్ సిస్టమ్ గా మరియు లిబ్రేఆఫీస్ సూట్ 3.3.4. ను వాడుతున్నాము.
01:27 మీ వద్ద లిబ్రేఆఫీస్ సూట్ ఇన్స్టాల్ చేయబడి లేకపోయినట్లు అయితే మీరు Calc ను సినాప్టిక్ పాకేజ్ మానేజర్ ను వాడి ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
01:35 సినాప్టిక్ పాకేజ్ మానేజర్గురించి మరింత సమాచారము కొరకు మీరు

ఈ వెబ్ సైట్ లో Ubuntu Linux ట్యుటోరియల్ ను రిఫర్ చేయండి మరియు

వెబ్ సైట్ లో ఇచ్చిన సూచనలు అనుసరిస్తూ లిబ్రేఆఫీస్ సూట్ ను డౌన్ లోడ్ చేయండి.

01:50 లిబ్రేఆఫీస్ సూట్ పైన ఉన్న మొదటి ట్యుటోరియల్లో సూచనలు వివరముగా ఇవ్వబడ్డాయి.
01:56 ఇన్స్టాల్ చేసేటప్పుడు Calc కొరకు “Complete” ఇన్స్టలేషన్ ను వాడడము మరచిపోకండి.
02:01 మీరు ఇప్పటికే లిబ్రేఆఫీస్ సూట్ ను ఇన్స్టాల్ చేసుకుని ఉన్నట్లు అయితే మీ స్క్రీన్ లో ఎడమ వైపు పైన “Applications” ఆప్షన్ ను క్లిక్ చేసి మరియు తరువాత “Office” ను,

ఆ తరువాత “LibreOffice” ఆప్షన్ ను క్లిక్ చేయడము ద్వారా మీరు లిబ్రే ఆఫీస్ Calc ను కనుగొనగలుగుతారు.

02:17 వివిధ లిబ్రే ఆఫీస్ కాంపోనెంట్ లతో ఒక క్రొత్త డయలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది.
02:22 లిబ్రే ఆఫీస్ Calc ను యాక్సెస్ చేయడము కొరకు క్రొత్త డయలాగ్ బాక్స్ లో “Spreadsheet” కాంపోనెంట్ పైన క్లిక్ చేయండి
02:30 ఇది main Calc window లో ఒక ఖాళీ డాక్యుమెంట్ ను ఓపెన్ చేస్తుంది.
02:35 ఇప్పుడు Calc window లోని ముఖ్యమైన కాంపోనెంట్ ల గురించి నేర్చుకుందాము.
02:40 Calc లోని ఈ డాక్యుమెంట్ ను ఒక వర్క్ బుక్ అని పిలుస్తారు. ఒక వర్క్ బుక్ లో చాలా షీట్ లు స్ప్రెడ్ షీట్ లుగా ఉంటాయి.
02:48 ప్రతి స్ప్రెడ్ షీట్ కూడా రో లు మరియు కాలమ్ లుగా అమర్చబడిన సెల్ లను కలిగి ఉంటుంది. ప్రతి రో కూడా ఒక సంఖ్య చేత మరియు ఒక ప్రతి కాలమ్ కూడా ఒక ఆల్ఫాబెట్ చేత గుర్తించబడతాయి.
02:58 ఒక రో మరియు ఒక కాలమ్ ల ఇంటర్సెక్షన్ గా సూచింపబడే ఒక ప్రత్యేకమైన సెల్ దానికి సంబంధించిన రో యొక్క సంఖ్య మరియు కాలమ్ యొక్క ఆల్ఫాబెట్ లతో సూచింపబడుతుంది.
03:09 సెల్ లు టెక్స్ట్, సంఖ్యలు, ఫార్ములాలు మరియు ఎన్నో రకముల డేటా ఎలిమెంట్లను కలిగి ఉండి వాటిని డిస్ప్లే చేయగలుగుతాయి మరియు వాటితో పని చేసే, సరి చేసే అవకాశమును కూడా కల్పిస్తాయి.
03:18 ప్రతి స్ప్రెడ్ షీట్ కూడా చాలా షీట్ లను కలిగి ఉంటుంది మరియు ప్రతి షీట్ కూడా ఒక మిలియన్ కంటే కొంచెము ఎక్కువ రో లను మరియు ఒక వేయి కాలమ్ లను కలిగి ఉంటుంది, దీని వలన ఒక షీట్ లో ఒక బిలియన్ లేదా ఒక వంద కోట్ల కంటే ఎక్కువ సెల్ లను ఇస్తుంది.
03:33 Calc విండో లో title bar, the menu bar, the standard toolbar, the formatting bar, the formula bar మరియు the status bar వంటి వివిధ టూల్ బార్ లు ఉంటాయి.
03:45 ఈ టూల్ బార్ లు కాకుండా “Input line” మరియు “Name box” అని పిలవబడే రెండు ఇతర ఫీల్డ్ లు పైన ఉంటాయి.
03:54 టూల్ బార్ లు ఎక్కువగా వాడబడే ఆప్షన్లను కలిగి ఉంటాయి, ట్యుటోరియల్ లో ముందుకు వెళ్ళే కొద్దీ మనము వాటిని నేర్చుకుంటాము.
04:03 ఇప్పుడు స్ప్రెడ్ షీట్ క్రింద ఎడమ మూల లో “Sheet1”, “Sheet 2” మరియు “Sheet 3” అని పిలవబడే మూడు షీట్ టాబ్ లను మీరు చూడవచ్చు.
04:13 ఈ టాబ్ లు ప్రతి ఒక్క విడి షీట్ ను కూడా మీరు యాక్సెస్ చేయగలిగే వీలును కల్పిస్తాయి, మీకు అప్పుడు కనిపించే షీట్ ఒక తెల్ల టాబ్ ను కలిగి ఉంటుంది.
04:21 మరొక షీట్ టాబ్ ను క్లిక్ చేస్తే ఆ షీట్ డిస్ప్లే అవుతుంది మరియు ఆ టాబ్ తెల్లగా అవుతుంది.
04:28 స్ప్రెడ్ షీట్ లో డేటా ఎంటర్ చేయబడే ముఖ్యమైన సెక్షన్ లో వివిధ సెల్ లు ఒక గ్రిడ్ ను తయారు చేస్తాయి. ప్రతి సెల్ కూడా ఒక కాలమ్ మరియు ఒక రో ల ఇంటర్సెక్షన్ గా ఉంటుంది.
04:41 కాలమ్ ల పైన మరియు రో ల ఎడమ చివర అంకెలు మరియు సంఖ్యలను కలిగి ఉన్న ఒక గ్రే బాక్స్ ల వరుస ఉంటుంది. వీటిని కాలమ్ మరియు రో ల హెడర్ లు అని అంటారు.
04:53 కాలమ్ “A” వద్ద మొదలు అవుతుంది మరియు కుడి వైపుకు వెళుతుంది మరియు రో లు “1” వద్ద మొదలు అవుతాయి మరియు క్రిందకు వెళతాయి.
05:01 ఈ కాలమ్ మరియు రో హెడర్ లు సెల్ రిఫరెన్స్ లను ఫామ్ చేస్తాయి మరియు అవి “Name Box” ఫీల్డ్ లో కనిపిస్తాయి.
05:07 Calc లోని వివిధ కాంపోనెంట్ ల గురించి నేర్చుకున్న తరువాత మనము ఇప్పుడు లిబ్రేఆఫీస్ Calc లో ఒక క్రొత్త డాక్యుమెంట్ ను ఎలా ఓపెన్ చేయాలో నేర్చుకుందాము.
05:17 standard toolbar లో “New” ఐకాన్ పైన క్లిక్ చేయడము ద్వారా మీరు ఒక క్రొత్త డాక్యుమెంట్ ను ఓపెన్ చేయవచ్చు లేదా menu bar “File” ఆప్షన్ ను క్లిక్ చేయడము ద్వారా మరియు చివరగా “Spreadsheet” ఆప్షన్ ను క్లిక్ చేయడము ద్వారా క్రొత్త డాక్యుమెంట్ ను క్లిక్ చేయవచ్చు.
05:33 రెండు సందర్భములలో కూడా ఒక క్రొత్త Calc window ఓపెన్ అవ్వడమును మీరు గమనించవచ్చు.
05:39 ఇప్పుడు ఒక స్ప్రెడ్ షీట్ లో ఒక “వ్యక్తిగత ఆర్ధిక ట్రాకర్” ను ఎలా నిర్మించాలో నేర్చుకుందాము.
05:45 ఇప్పుడు ఒక స్ప్రెడ్ షీట్ లోని కొన్ని సెల్ లలో డేటా ను ఎలా ఎంటర్ చేయాలో చూద్దాము.
05:50 కనుక స్ప్రెడ్ షీట్ యొక్క మొదటి షీట్ లో A1 అని రిఫర్ చేయబడే సెల్ మీద క్లిక్ చేయండి.
05:56 ఇప్పుడు హెడింగ్ ను “SN” అని టైపు చేయండి, ఇది ఐటమ్ ల వరుస సంఖ్యను సూచిస్తుంది, దీనిని మనము స్ప్రెడ్ షీట్ లో సూచిస్తాము.
06:05 ఇప్పుడు B1 అని రిఫర్ చేయబడిన సెల్ పైన క్లిక్ చేయండి మరియు మరొక హెడింగ్ గా “Items” ను టైప్ చేయండి.
06:11 మనము స్ప్రెడ్ షీట్ క్రింద వాడబోతున్న అన్ని ఐటమ్ లు ఈ హెడింగ్ క్రింద ఉంటాయి.
06:18 అలాగే, C1, D1, E1, F1 మరియు G1 సెల్స్ ను ఒకదాని తరువాత ఒకటి క్లిక్ చేయండి మరియు వాటికి వరుసగా “Cost”, “Spent”, “Received”, “Date” మరియు “Account” అనే హెడింగ్ లను టైప్ చేయండి.
06:33 మనముఈ కాలమ్ ల క్రింద డేటాను తరువాత ఇన్సర్ట్ చేద్దాము.
06:39 వ్రాయడము పూర్తి అయిన తరువాత భవిష్యత్తులో ఆ స్ప్రెడ్ షీట్ ను వాడుకోవడము కొరకు దానిని సేవ్ చేయండి.
06:44 ఈ ఫైల్ ను సేవ్ చేయడము కొరకు మెనూ బార్ లో ఉన్న “File” పైన మరియు ఆ తరువాత “Save As” ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
06:51 మీ ఫైల్ పేరును మీరు “Name” ఫీల్డ్ క్రింద ఎంటర్ చేయవలసి ఉంటుంది, మీరు ఎక్కడ అయితే దానిని ఎంటర్ చేయాలో అక్కడ స్క్రీన్ మీద ఒక డయలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
06:59 కనుక ఫైల్ పేరును “Personal Finance Tracker” అని ఎంటర్ చేయండి.
07:04 “Name” ఫీల్డ్ క్రింద మీకు “Save in folder” ఫీల్డ్ ఫోల్డర్ కనిపిస్తుంది, ఇక్కడ మీరు ఫోల్డర్ పేరు ఎంటర్ చేయవలసి ఉంటుంది, మీరు సేవ్ చేసిన ఫైల్ అందులో ఉంటుంది.
07:14 కనుక “Save in folder” ఫీల్డ్ లో క్రింది యారో ను క్లిక్ చేయండి
07:18 ఒక ఫోల్డర్ ఆప్షన్ ల లిస్ట్ కనిపిస్తుంది. ఇక్కడ మనము మన ఫైల్ ను ఎక్కడ సేవ్ చేయాలి అని అనుకుంటున్నామో ఆ ఫోల్డర్ ను ఎంచుకోవలసి ఉంటుంది.
07:26 మనము “Desktop” ఆప్షన్ పైన క్లిక్ చేద్దాము.
07:28 కనుక ఫైల్ డెస్క్ టాప్ మీద సేవ్ చేయబడుతుంది.
07:34 ఇప్పుడు డయలాగ్ బాక్స్ లోని “File type” ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
07:37 అది మీకు ఫైల్ టైప్ ఆప్షన్ల ఒక లిస్ట్ ను చూపిస్తుంది లేదా మీరు మీ ఫైల్ ను ఏ ఎక్స్ టెన్షన్ క్రింద సేవ్ చేయవచ్చో వాటిని చూపిస్తుంది
07:46 లిబ్రేఆఫీస్ Calc లోని డీఫాల్ట్ ఫైల్ టైప్ “ODF Spreadsheet” , ఇది “dot ods” అనే ఎక్స్ టెన్షన్ ను అందిస్తుంది.
07:56 ODF అనేది ఒక ఓపెన్ స్టాండర్డ్ మరియు ఇది ఓపెన్ డాక్యుమెంట్ ఫార్మాట్ యొక్క సంక్షిప్త రూపము.
08:01 లిబ్రేఆఫీస్ Calc లో ఓపెన్ చేయగలిగిన dot ods ఫార్మాట్ లో సేవ్ చేయడముతో పాటు మీరు మీ ఫైల్ ను dot xml, dot xlsx మరియు dot xls ఫార్మాట్ లలో కూడా సేవ్ చేయవచ్చు, దీనిని MSOffice Excel ప్రోగ్రామ్ లో కూడా ఓపెన్ చేయవచ్చు
08:20 చాలా ప్రోగ్రాములలో ఉండే మరొక పేరు పొందిన ఫైల్ ఎక్స్ టెన్షన్ dot csv.
08:28 ఇది స్ప్రెడ్ షీట్ డేటాను ఒక టెక్స్ట్ ఫైల్ ఫార్మాట్ రూపములో స్టోర్ చేయడము కొరకు తరచుగా వాడబడుతుంది, ఇది ఫైల్ సైజును గణనీయముగా తగ్గిస్తుంది మరియు తేలికగా తీసుకుని వెళ్ళే వీలు కలిగి ఉంటుంది.
08:38 మనము “ODF Spreadsheet” ఆప్షన్ పైన క్లిక్ చేద్దాము.
08:43 ఫైల్ టైప్ “ODF స్ప్రెడ్ షీట్ అండ్ వితిన్ బ్రాకెట్స్, dot ods” “File type” ఆప్షన్ ప్రక్కన డిస్ప్లే చేయబడడము మీరు చూడవచ్చు.
08:53 “Save” బటన్ పైన క్లిక్ చేయండి.
08:55 టైటిల్ బార్ పైన మీరు కోరుకున్న ఫైల్ పేరు మరియు ఎక్స్ టెన్షన్ లతో ఇది మిమ్మల్ని వెను తిరిగి Calc window కు తీసుకుని వెళుతుంది.
09:03 పైన చర్చించిన ఫార్మాట్ లతో పాటుగా స్ప్రెడ్ షీట్ ను “dot html” ఫార్మాట్ లో కూడా సేవ్ చేయవచ్చు, ఇది ఒక వెబ్ పేజ్ ఫార్మాట్ లో ఉంటుంది.
09:13 ఇది ఇంతకు మునుపు వివరించిన విధముగానే చేయవచ్చు.
09:18 కనుక మెనూ బార్ లోని “File” ఆప్షన పైన క్లిక్ చేయండి మరియు ఆ తరువాత “Save As” ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
09:24 ఇప్పుడు ”File Type” ఆప్షన్ పైన క్లిక్ చేయండి మరియు ఆ తరువాత “HTML Document and within braces OpenOffice dot org Calc” ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
09:36 ఈ ఆప్షన్ డాక్యుమెంట్ కు “dot html” ఎక్స్ టెన్షన్ ను ఇస్తుంది.
09:41 “Save” బటన్ పైన క్లిక్ చేయండి
09:44 ఇప్పుడు డయలాగ్ బాక్స్ లోని “Ask when not saving in ODF format” ఆప్షన్ పైన క్లిక్ చేయండి
09:50 చివరగా “Keep Current Format” ఆప్షన్ పైన క్లిక్ చేయండి
09:54 డాక్యుమెంట్ dot html ఎక్స్ టెన్షన్ తో సేవ్ అవ్వడమును మీరు గమనించండి
10:00 మనము మన స్ప్రెడ్ షీట్ ను ఒక వెబ్ పేజ్ గా చూపించాలి అని అనుకున్నప్పుడు ఈ ఫార్మాట్ ఉపయోగపడుతుంది, దీనిని ఒక వెబ్ బ్రౌజర్ ప్రోగ్రామ్ లో ఓపెన్ చేయవచ్చు
10:10 Tస్టాండర్డ్ టూల్ బార్ లో “Export Directly as PDF” ఆప్షన్ పైన క్లిక్ చేయడము ద్వారా ఆ డాక్యుమెంట్ ను PDF ఫార్మాట్ కు ఎక్స్పోర్ట్ చేయవచ్చు. ఇంతకూ పూర్వము లాగా,
10:20 మీరు ఎక్కడ సేవ్ చేయాలి అని అనుకుంటున్నారో ఆ స్థానమును ఎంచుకోండి.
10:24 మరొక విధముగా కావాలి అంటే మీరు మెనూ బార్ లోని “File” ఆప్షన్ పైన క్లిక్ చేయండి మరియు ఆ తరువాత “Export as pdf” ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
10:33 అప్పుడు కనిపించే డయలాగ్ బాక్స్ లో “Export” ఆప్షన్ పైన క్లిక్ చేయండి మరియు ఆ తరువాత “Save” బటన్ పైన క్లిక్ చేయండి
10:40 ఒక pdf ఫైల్ క్రియేట్ చేయబడుతుంది.
10:44 File పైన మరియు ఆ తరువాత Close పైన క్లిక్ చేసి డాక్యుమెంట్ ను క్లోజ్ చేయండి.
10:50 ఆ తరువాత అప్పటికే ఉన్న ఒక డాక్యుమెంట్ ను మనము లిబ్రే ఆఫీస్ Calc లో ఎలా ఓపెన్ చేయాలో నేర్చుకుందాము
10:56 అప్పటికే ఉన్న ఒక డాక్యుమెంట్ ను ఓపెన్ చేయడము కొరకు మెనూ బార్ లోని “File” మెనూ పైన క్లిక్ చేయండి మరియు ఆ తరువాత “Open” ఆప్షన్ పైన క్లిక్ చేయండి
11:06 స్క్రీన్ మీద ఒక డయలాగ్ బాక్స్ కనిపిస్తుంది
11:09 ఇక్కడ మీ డాక్యుమెంట్ ను మీరు ఏ ఫోల్డర్ లో సేవ్ చేయాలి అని అనుకుంటున్నారో దానిని కనుగొనండి.
11:14 కనుక డయలాగ్ బాక్స్ యొక్క పై భాగము లోని ఎడమ మూల లో ఉన్న చిన్న పెన్సిల్ బటన్ పైన క్లిక్ చేయండి. దానిలో “Type a file name” అని పేరు ఉంటుంది.
11:23 ఇది “Location Bar” ఫీల్డ్ ను ఓపెన్ చేస్తుంది
11:25 ఇక్కడ, మీరు కావాలి అని అనుకున్న ఫైల్ యొక్క పేరును టైప్ చేయండి
11:30 కనుక మనము ఫైల్ పేరును “Personal Finance Tracker” అని టైప్ చేద్దాము.
11:35 ఇప్పుడు కనిపిస్తున్న ఫైల్ నేమ్ లలో “Personal Finance Tracker dot ods” ను ఎంచుకోండి
11:43 ఇప్పుడు “Open” బటన్ పైన క్లిక్ చేయండి.
11:45 Personal Finance Tracker.ods ఫైల్ ఓపెన్ అవ్వడమును మీరు చూడవచ్చు
11:51 మరో మార్గములో చెప్పాలి అంటే టూల్ బార్ పైన ఉన్న “Open” ఐకాన్ ను క్లిక్ చేసి మరియు మిగిలిన పద్ధతిని అలాగే చేయడము ద్వారా మీరు అప్పటికే ఉన్న ఫైల్ ను ఓపెన్ చేయవచ్చు.
12:02 మీరు ఫైల్ లను “dot xls” మరియు “dot xlsx” ఎక్స్ టెన్షన్ లతో కూడా ఓపెన్ చేయవచ్చు, వీటిని Calc లో Microsoft Excel తో వాడతారు.
12:13 ఆ తరువాత మీరు ఒక ఫైల్ ను మాడిఫై చేసి అదే ఫైల్ నేమ్ క్రింద ఎలా సేవ్ చేయాలో చూస్తారు
12:20 కనుక హెడింగ్ లను బోల్డ్ చేయడము మరియు ఫాంట్ సైజ్ ను పెంచడము వంటి వాటితో ఫైల్ ను మాడిఫై చేద్దాము.
12:26 కనుక ముందుగా A1 అని రిఫర్ చేయబడిన సెల్ పైన క్లిక్ చేద్దాము. “SN”, “Cost”, “Spent”, “Received”, “Date” మరియు “Account” అనే హెడింగ్ లను ఎడమ మౌస్ బటన్ ను క్లిక్ చేయడము ద్వారా మరియు దానిని అన్ని హెడింగ్ ల మీదుగా డ్రాగ్ చేయడము ద్వారా ఎంచుకుందాము.
12:42 ఇది టెక్స్ట్ ను సెలెక్ట్ చేస్తుంది మరియు దానిని హైలైట్ చేస్తుంది. ఇప్పుడు ఎడమ మౌస్ బటన్ ను వదలి పెట్టండి. ఇప్పుడు స్టాండర్డ్ టూల్ బార్ లోని “Bold” ఐకాన్ పైన క్లిక్ చేయండి.
12:56 కనుక హెడింగ్ లు బోల్డ్ అవుతాయి.
12:59 ఇప్పుడు హెడింగ్ ల ఫాంట్ సైజును పెంచుదాము.
13:03 కనుక హెడింగ్ లను ఎంచుకున్దాము మరియు టూల్ బార్ లోని “Font Size” ఫీల్డ్ పైన క్లిక్ చేద్దాము.
13:09 డ్రాప్ డౌన్ మెనూ లో “14” ను ఎంచుకోండి.
13:13 ఇప్పుడు మీరు హెడింగ్ యొక్క ఫాంట్ సైజ్ పెరగడమును గమనించవచ్చు
13:17 ఇప్పుడు మనము వాడుతున్న ఫాంట్ స్టైల్ ను మారుద్దాము
13:21 ఇప్పుడు “Font Name” ఫీల్డ్ లోని డౌన్ యారో పైన క్లిక్ చేయండి మరియు ఆ తరువాత “Bitstream Charter” ను ఫాంట్ నేమ్ గా ఎంచుకోండి
13:31 అవసరము అయిన మార్పులు చేసిన తరువాత “Save” ఐకాన్ పైన క్లిక్ చేయండి.
13:36 మీరు ఒకసారి డాక్యుమెంట్ ను సేవ్ చేసిన తరువాత మీరు దానిని క్లోజ్ చేయాలి అని అనుకుంటే మీరు మెనూ బార్ లోని “File” మెనూ పై క్లిక్ చేయండి మరియు ఆ తరువాత అందులోని “Close” ఆప్షన్ పైన క్లిక్ చేయండి
13:46 అది మీ ఫైల్ ను క్లోజ్ చేస్తుంది.
13:50 దీనితో మనము లిబ్రేఆఫీస్ Calc. అనే స్పోకెన్ ట్యుటోరియల్ చివరకు వచ్చేసాము.
13:54 మనము నేర్చుకున్నది సంగ్రహముగా చెప్పాలి అంటే:
13:57 లిబ్రేఆఫీస్ Calc తో పరిచయము.
14:01 లిబ్రేఆఫీస్ Calc లోని వివిధ టూల్ బార్ లు
14:04 Calc లో ఒక క్రొత్త డాక్యుమెంట్ ను ఎలా ఓపెన్ చేయాలి
14:07 అప్పటికే ఉన్న డాక్యుమెంట్ ను ఎలా ఓపెన్ చేయాలి
14:10 Calc లో ఒక డాక్యుమెంట్ ను ఎలా ఓపెన్ చేయాలి మరియు ఎలా క్లోజ్ చేయాలి.

సంగ్రహముగా పరీక్ష : Calc లో ఒక క్రొత్త డాక్యుమెంట్ ను ఓపెన్ చేయండి. దానిని “SpreadsheetPractice.ods” అనే పేరుతో సేవ్ చేయండి. హెడింగ్ లను “Serial number”, “Name”, “Department” మరియు “Salary” లుగా వ్రాయండి. హెడింగ్ లను అండర్ లైన్ చేయండి. హెడింగ్ ల ఫాంట్ సైజ్ ను 16 కు పెంచండి. ఫైల్ ను క్లోజ్ చేయండి.

14:14 ఈ క్రింది లింక్ లో అందుబాటులో ఉన్న వీడియోను చూడండి
14:17 అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంగ్రహముగా తెలుపుతుంది.
14:20 మీకు మంచి బాండ్ విడ్త్ కనుక లేకపోయినట్లు అయితే మీరు దానిని డౌన్ లోడ్ చేసుకుని చూడవచ్చు.
14:24 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్.
14:26 స్పోకెన్ ట్యుటోరియల్ ల పైన వర్క్ షాప్ లు నిర్వహిస్తుంది.
14:30 ఆన్ లైన్ టెస్ట్ లో ఉత్తీర్ణులు అయిన వారికి సర్టిఫికెట్లు అందిస్తుంది.
14:34 మరిన్ని వివరముల కొరకు contact@spoken-tutorial.org ను కు వ్రాయండి.
14:40 ఈ స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో భాగము
14:45 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది
14:53 ఈ మిషన్ గురించి మరింత సమాచారము
14:55 spoken - tutorial.org/NMEICT -Intro వద్ద అందుబాటులో ఉన్నది
15:03 ఈ రచనకు సహాయపడినవారు లక్ష్మి, మరియు నిఖిల. ఇంక విరమిస్తున్నాము.
15:08 మాతో కలిసినందుకు కృతజ్ఞతలు.

Contributors and Content Editors

Chaithaya, Madhurig, Sneha, Yogananda.india