Health-and-Nutrition/C2/Kangaroo-Mother-Care/Telugu
From Script | Spoken-Tutorial
|
|
00:00 | పిల్లల కొరకు అవసరమైన పోషకాహార చర్యల పై ఈ స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్‌లో మనం పోషకాహార లోపాన్ని నివారించడానికి ఉత్తమమైన మార్గాల గురించి తెలుసుకుందాం. |
00:15 | అవసరమైన పోషకాహార చర్యలు అనేవి పోషకాహార లోపాన్ని పరిష్కరించడానికి నివారణ విధానాలు. |
00:21 | మొదటి 1,000 రోజుల సమయంలో అవి అవసరం. |
00:26 | మొదటి 1,000 రోజులు అనేవి గర్భం దాల్చినప్పటి నుండి ప్రారంభమయ్యి శిశువు యొక్క రెండవ పుట్టినరోజు వరకు ఉన్న రోజులు. |
00:34 | అవసరమైన పోషకాహార చర్యలని ENA అని కూడా అంటారు. |
00:39 | నవజాత శిశువుకు, బొడ్డు త్రాడు బిగించడంలో ఆలస్యం చేయడమనేదే మొదటి ENA. |
00:47 | బొడ్డు తాడును ప్రసవం అయిన వెంటనే కత్తిరించకూడదు. |
00:53 | నర్సు మొదట బొడ్డు త్రాడు యొక్క రక్తనాళ స్పందనను తెలుసుకోవాలి. |
00:58 | రక్తనాళ స్పందన ఆగినప్పుడు బొడ్డుతాడును కత్తిరించాలి. |
01:02 | ఆలస్యంగా బొడ్డుత్రాడు బిగించడం అనేది మావి మరియు బిడ్డల మధ్య రక్త ప్రవాహానికి అనుమతిస్తుంది. |
01:09 | ఇది శిశువులో మొదటి 6 నెలల కొరకు ఐరన్ నిల్వను మెరుగుపరుస్తుంది. |
01:16 | ఇలా చేయడం వల్ల ఈ నెలల్లో శిశువులలో రక్తహీనత రాకుండా ఉంటుంది. |
01:21 | బొడ్డు త్రాడును బిగించిన తర్వాత, శిశువుకు తల్లిపాలు పట్టించాలి. |
01:26 | అలా చేయాలంటే, బిడ్డను తల్లియొక్క ఉత్తి పొత్తికడుపుపైన ఉంచాలి. |
01:32 | ఒక శిశువు సహజంగానే తల్లిపాలను త్రాగ గల లక్షణముతో పుడుతుంది. |
01:38 | ఈ లక్షణం వలన బిడ్డ తల్లి యొక్క రొమ్మును కనుగొంటుంది |
01:41 | మరియు తల్లిపాలను త్రాగడం ప్రారంభిస్తుంది. |
01:45 | ఈ మొత్తం ప్రక్రియను బ్రెస్ట్ క్రాల్ అంటారు. |
01:50 | బ్రెస్ట్ క్రాల్ గురించి మరింత వివరంగా మరొక ట్యుటోరియల్‌లో వివరించబడింది. |
01:55 | ఈ ట్యుటోరియల్ కోసం దయచేసి మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. |
01:59 | బిడ్డ పుట్టిన ఒక గంటలోపు తల్లిపాలివ్వడాన్ని ప్రారంభించడం అనేది చాలా ముఖ్యం. |
02:06 | మొదటి పాలను కొలస్ట్రమ్ అని అంటారు. |
02:09 | ఇది నవజాత శిశువు కొరకు పోషకాల యొక్క ప్రాథమిక వనరు. |
02:14 | కొలస్ట్రమ్ లో ఇన్ఫెక్షన్-పోరాట మూలకాలు మరియు మంచి కొవ్వులు ఉన్నాయి. |
02:20 | ఒక బిడ్డ కొరకు తల్లి పాలు అనేవి విటమిన్ A యొక్క మొదటి వనరు కూడా. |
02:26 | విటమిన్ A అనేది ఆరోగ్యవంతమైన కళ్ళు మరియు రోగనిరోధక శక్తి కొరకు చాలా ముఖ్యమైనది. |
02:33 | మొదటి 6 నెలల కొరకు విటమిన్ A అవసరాలను తీర్చడానికి తల్లిపాలు సరిపోతాయి. |
02:40 | 6 నెలల వయసు తర్వాత, విటమిన్ A సమృద్ధిగా ఉండే ఆహారాన్ని ఇవ్వాలి. |
02:47 | సమర్థవంతంగా తల్లిపాలను అందించడానికి, బిడ్డ తల్లి రొమ్మును సరిగ్గా పట్టుకోవడం చాలా ముఖ్యం. |
02:52 | శిశువు యొక్క నోటిని రొమ్మును సరిగ్గా పట్టుకోకపోవడం వలన చనుమొన నుండి మాత్రమే ఆహరం అందుతుంది. |
03:00 | ఇది బిడ్డకు చాలా తక్కువ పాలను ఇస్తుంది. |
03:04 | శిశువు యొక్క నోరు అరియోలా యొక్క దిగువ భాగానికి జోడించబడి ఉండాలి. |
03:09 | ఈ విధంగా చేస్తే శిశువుకు తగినన్ని పాలు అందుతాయి. |
03:13 | అరియోలా అనేది చనుమొన చుట్టూ ఉండే నల్లని ప్రదేశం. |
03:18 | తల్లిపాలను అందించే పద్ధతులు అనేవి ఇతర ట్యుటోరియల్‌లలో చర్చించబడ్డాయి. |
03:22 | 6 నెలలు పూర్తయిన తర్వాత, శిశువుకు పోషకాల అవసరం వేగంగా పెరుగుతుంది. |
03:29 | ఈ దశలో ప్రత్యేకంగా తల్లిపాలను మాత్రమే ఇస్తే బిడ్డకు అవి సరిపోవు. |
03:34 | అందువలన, తల్లిపాలతో పాటు పరిపూరకరమైన ఆహారాన్ని పరిచయం చేయాలి. |
03:40 | శిశువుకు 6 నెలల వయస్సు వచ్చిన వెంటనే దాన్నిఇవ్వడం ప్రారంభించాలి. |
03:46 | 6 నెలల వయస్సు అంటే శిశువు యొక్క జీవితంలో 6వ నెల ప్రారంభం అని అర్ధం కాదు. |
03:53 | అంటే దాని అర్ధం బిడ్డకు 6 నెలలు పూర్తి అయ్యి 7వ నెల ప్రారంభమైందని. |
04:02 | అలాగే, వయస్సును బట్టి కూడా ఆహారం యొక్క పరిమాణం మరియు చిక్కదనాన్ని మార్చాలి. |
04:10 | శిశువు యొక్క ఆహారం తప్పనిసరిగా వివిధ రకాల ఆహార వర్గాలను కలిగి ఉండాలి. |
04:15 | మొదటి ఆహార వర్గం అనేది తల్లిపాలు. |
04:19 | ధాన్యాలు, మూలాలు మరియు దుంపలు అనేవి రెండవ వర్గం. |
04:24 | చిక్కుళ్ళు, విత్తనాలు మరియు గింజలు అనేవి మూడవ వర్గం. |
04:30 | నాల్గవ వర్గం అనేది పాల ఉత్పత్తులు. |
04:34 | మాంసం, చేపలు మరియు కోడి ఇవి ఐదవ వర్గం. |
04:38 | గుడ్డు ఆరవ వర్గం. |
04:41 | విటమిన్ A అధికంగా ఉండే పండ్లు మరియు కూరగాయలు అనేవి ఏడవ వర్గం. |
04:47 | చివరగా, ఎనిమిదవ వర్గం అనేది ఇతర పండ్లు మరియు కూరగాయలు. |
04:53 | ఇంచుమించుగా, శిశువు యొక్క ఆహారం అనేది మొత్తం 8 ఆహార వర్గాలను కలిగి ఉండాలి. |
04:59 | ఈ ఆహారాలన్నీ శిశువు యొక్కపెరుగుదలకు సహాయపడే పోషకాలను అందిస్తాయి. |
05:05 | పరిపూరకమైన ఆహరం యొక్క వివరాలు అనేవి మరొక ట్యుటోరియల్‌లో చర్చించబడ్డాయి. |
05:11 | ఇప్పుడు మనం శిశువులకు ఇవ్వాల్సిన సప్లిమెంట్ లు ఏమిటి అనేది చూద్దాం. |
05:16 | 6 నెలల నుండి 5 సంవత్సరాల వరకు, ఐరన్-ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లను ఇవ్వాలి. |
05:23 | శిశువులకు ఇది ఒక వారానికి రెండుసార్లు ఆరోగ్య కార్యకర్తల చేత ఇవ్వాలి. |
05:29 | విటమిన్ A సప్లిమెంట్ ను సంవత్సరానికి రెండుసార్లు ఇవ్వాలి. |
05:34 | ఈ సప్లిమెంట్ అనేది 9 నెలల నుండి 5 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఇవ్వబడుతుంది. |
05:40 | ఈ సప్లిమెంట్లను ఆరోగ్య సంరక్షణ ప్రదాత మార్గదర్శకత్వంలో ఇవ్వాలి. |
05:46 | అతిసారం ఉన్న శిశువుకు చికిత్స చేయడానికి ENA ను మనం ఇప్పుడు చూస్తాము. |
05:52 | పోషకాహార లోపానికి అతిసారం అనేది ఒక ప్రధాన కారణం. |
05:56 | ఇది శరీరంలో నీటి నష్టాన్ని అలాగే సోడియం మరియు పొటాషియం ల అసమతుల్యతను కలిగిస్తుంది. |
06:03 | కొన్ని తీవ్రమైన పరిస్థితుల్లో, శిశు మరణాలు కూడా సంభవించవచ్చు. |
06:08 | అందువల్ల, అతిసారానికి చికిత్స చేయడం అనేది చాలా ముఖ్యం. |
06:13 | ORS మరియు జింక్ సప్లిమెంట్లు అనేవి అతిసారం చికిత్సలో సహాయపడతాయి. |
06:18 | ORS అంటే Oral rehydration salts. |
06:22 | ఇది శరీరంలోని నీటిని అలాగే సోడియం మరియు పొటాషియం లను తిరిగి నింపుతుంది. |
06:29 | ఇది ప్యాకెట్లలో పొడి రూపంగా మార్కెట్‌లో సులభంగా దొరుకుతుంది. |
06:35 | దీన్ని ఉపయోగించడానికి, కాచి చలార్చిన 1 లీటరు నీటిలో ఒక ప్యాకెట్ ORS ను కలపండి. |
06:43 | ORSతో పాటుగా, జింక్' సప్లిమెంట్ అనేది కూడా అవసరం. |
06:48 | జింక్ అనేది సమయాన్నితగ్గిస్తుంది, |
06:51 | పిల్లలలో అతిసారం యొక్క తరచుదనం, |
06:53 | మరియు తీవ్రతను తగ్గిస్తుంది. |
06:57 | ఇది శిశువు యొక్క రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. |
07:00 | ఇది 14 రోజుల పాటు రోజుకు ఒకసారి చొప్పున ఇవ్వాలి. |
07:06 | 6 నెలల వయస్సు లోపు పిల్లలకు రోజుకు 10 మిల్లీగ్రాముల జింక్ ఇవ్వాలి. |
07:13 | 6 నెలలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి రోజుకు 20 మిల్లీగ్రాముల జింక్ ఇవ్వాలి. |
07:21 | ఒక చిన్న చెంచాలో, జింక్ మాత్రలను తల్లి పాలలో లేదా ORSలో వేసి కరిగించండి. |
07:27 | మీరు మరిగించి చల్లార్చిన నీటిని కూడా ఉపయోగించవచ్చు. |
07:31 | ఆరోగ్య సంరక్షణ ప్రదాతని సంప్రదించిన తర్వాత మాత్రమే ORS మరియు జింక్' మాత్రలను ఇవ్వాలి. |
07:38 | ORS మరియు జింక్'తో పాటు, 6 నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు తల్లిపాలు ఇవ్వాలి. |
07:45 | 6 నుండి 24 నెలల వయసున్న పిల్లలకు తల్లిపాలను మరియు పరిపూరకరమైన ఆహారాన్ని ఇవ్వాలి. |
07:53 | అనారోగ్యం ఉన్న సమయంలో శిశువుకు తరచుగా తల్లిపాలు ఇవ్వాలని గుర్తుంచుకోండి. |
07:59 | ఇది వేగంగా కోలుకోవడానికి మరియు బరువు పెరగడానికి సహాయపడుతుంది. |
08:04 | ఇది అనారోగ్యంతో ఉన్న శిశువుకు ఓదార్పుని కూడా ఇస్తుంది. |
08:07 | తల్లిపాలివ్వడం తో పాటు, కంగారూ మదర్ కేర్ ను ప్రతి శిశువుకు అందించాలి. |
08:14 | కంగారూ మదర్ కేర్ అనేది తక్కువ బరువుతో పుట్టిన పిల్లలకు కూడా సిఫార్సు చేయబడింది. |
08:20 | కంగారూ మదర్ కేర్ గురించి మరొక ట్యుటోరియల్‌లో వివరంగా చర్చించబడింది. |
08:26 | ఒకవేళ శిశువుకు 6 నెలల కంటే ఎక్కువ వయస్సు ఉన్నట్లయితే, ఇచ్చే ఆహారాన్ని ఒకటిన్నర రెట్లు పెంచండి. |
08:34 | కోలుకునే సమయంలో శిశువు యొక్క ఆకలి తిరిగి వచ్చినప్పుడు దీన్ని చేయండి. |
08:40 | వివిధ రకాల ఆహారాలను అందించడం ద్వారా శిశువును వాటిని తినేలా ప్రోత్సహించండి. |
08:46 | బిడ్డ ఆకలి సూచనల ప్రకారం బిడ్డకు టైప్ 1 మరియు టైప్ 2 పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని ఇవ్వండి. |
08:53 | టైప్ 1 మరియు టైప్ 2 పోషకాల గురించి మరొక ట్యుటోరియల్‌లో మరింత చర్చించబడింది. |
09:01 | తీవ్రమైన ఆరోగ్య పరిస్థితుల్లో, తల్లి తక్షణమే ఆరోగ్య కార్యకర్తను సంప్రదించాలి. |
09:07 | ఆరోగ్య కార్యకర్తలు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్న శిశువులను NRCకి రిఫర్ చేయాలి. |
09:14 | NRC' అనేది ఒక పోషకాహార పునరావాస కేంద్రం (nutrition rehabilitation center). |
09:20 | ఇది తీవ్రమైన పోషకాహార లోపం ఉన్న పిల్లల యొక్క ఆరోగ్యాన్ని పునరుద్ధరించే యూనిట్. |
09:27 | ఈ కేంద్రం పిల్లలకు ప్రత్యేక పోషకాహార చికిత్సను అందిస్తుంది. |
09:33 | ఒక వేళ 6 నెలల వయస్సు పూర్తి అయితే ఇది వారిని ఇంట్లో వండిన ఆహారాన్ని తినడానికి సిద్ధం చేస్తుంది. |
09:40 | ఇది తల్లులకు తల్లిపాలను గురించి కూడా అవగాహన కల్పిస్తుంది, |
09:44 | పిల్లల పోషణలో మరియు |
09:46 | పిల్లల సంరక్షణలో కూడా. |
09:48 | శిశువు ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన పోషకాహార చర్యలను అనుసరించండి. |
09:54 | శిశువులలో పోషకాహార లోపాన్ని నివారించడంలో కూడా ఇవి సహాయపడతాయి. |
09:59 | ఇది మనల్నిఈ ట్యుటోరియల్ యొక్క చివరకు తీసుకువస్తుంది.
మాతో చేరినందుకు ధన్యవాదాలు. |