Synfig/C3/Basic-bone-animation/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 14:05, 19 November 2020 by Simhadriudaya (Talk | contribs)
|
|
00:01 | Synfig ను ఉపయోగించి Basic bone animation పై ఈ Spoken Tutorial కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్‌లో, మనం Synfig లో Skeleton ఎంపికను ఉపయోగించి ఒక కేరక్టర్ ను యానిమేట్ చేయడం నేర్చుకుంటాము. |
00:13 | మనం వీటిని కూడా నేర్చుకుంటాము: బోన్స్ ను జోడించడం, |
00:17 | శరీరానికి బోన్స్ ను అటాచ్ చేయడం మరియు బోన్స్ నుయానిమేట్ చేయడం. |
00:22 | ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను ఉపయోగిస్తున్నాను: ఉబుంటు లైనక్స్ 14.04 OS |
00:31 | Synfig వర్షన్ |
00:36 | మనం ఇప్పుడు ప్రారంభిద్దాం. మనం Synfig లో ఉన్నాము. |
00:40 | నా మెషీన్ పైన సేవ్ చేయబడిన Synfig-character ఫైల్ ను నేను తెరుస్తాను. |
00:47 | ఈ ఫైల్ మీకు Code Files లింక్‌లో అందించబడింది. దయచేసి దానిని డౌన్‌లోడ్ చేసి ఉపయోగించండి. |
00:57 | శరీరం యొక్క అన్ని భాగాలు వేర్వేరు లేయర్స్ లో ఉన్నాయని నిర్ధారించుకోండి. |
01:02 | ఇప్పుడు, మనం Skeleton ను ఉపయోగించి, స్థిరమైన (జాయింట్స్) కీళ్ళతో శరీరం యొక్క ఎగువ భాగాన్ని రిగ్ చేయడం నేర్చుకుంటాము. |
01:11 | దానికంటే ముందు, మనం గ్రూప్స్ ను సృష్టించాలి. ఉదాహరణకు - ఎడమ చేయిని ఎగువ ఎడమ మోచేయి, దిగువ ఎడమ మోచేయి మరియు ఎడమ అరచేతితో తయారు
చేయాలి. |
01:25 | కనుక, మనం ఈ మూడు లేయర్స్ ను గ్రూప్ చేయాలి మరియు దానికి L-hand అని పేరును పెట్టాలి. |
01:32 | అదేవిధంగా, ఇతర లేయర్స్ ను గ్రూప్ చెయ్యండి. |
01:36 | ఇక్కడ చూపిన విధంగా గ్రూప్ లేయర్స్ కు L-hand, R-hand, Head, Neck మరియు Trunk గా పేర్లను పెట్టండి. |
01:46 | మనం ఈ ఫైల్ ను Save As ఎంపికను ఉపయోగించి సేవ్ చేద్దాం. |
01:50 | File కు వెళ్లి, Save As పై క్లిక్ చేయండి. |
01:54 | మీకు ఇష్టమైన స్థానాన్ని ఎంచుకుని, ఆపై ఫైల్ పేరును Basic hyphen bone hyphen animation అని టైప్ చేయండి |
02:03 | తరువాత Save బటన్ పై క్లిక్ చేయండి. |
02:06 | ఇప్పుడు, Layers pane కు వెళ్లండి |
02:10 | గ్రూప్ చేసిన ఈ అన్నిlayers తో మరొక గ్రూప్ ని తయారు చేసి, దానికి Character అని పేరును పెట్టండి. |
02:17 | ఇప్పుడు, త్రిభుజాకార షేప్ పై క్లిక్ చేయడం ద్వారా Character గ్రూప్ ని తెరవండి. |
02:23 | Character layer యొక్క ఎగువ లేయర్ పైన రైట్ క్లిక్ చేయండి. |
02:27 | New layer కు వెళ్లి, తర్వాత Other కు వెళ్లి, Skeleton పై క్లిక్ చేయండి. |
02:33 | మనం కాన్వాస్‌పై ఒక bone ను పొందుతాము. |
02:37 | Transform tool పై క్లిక్ చేసి, bone యొక్క ఆకుపచ్చరంగు బిందువును ఎంచుకోండి. |
02:42 | mouse ని పట్టుకుని లాగండి మరియు బోన్ ను కేరక్టర్ యొక్కTrunk పార్ట్ వైపుకు తరలించండి. |
02:49 | ఇప్పుడు ప్రదర్శించిన విధంగా bone ను ఉంచండి. |
02:53 | తరువాత, bone యొక్క లెన్త్ ను సర్దుబాటు చేయడానికి bone యొక్క orange డాట్ ను ఉపయోగించండి. |
03:00 | దీని తరువాత, bone యొక్క నారింజరంగు బిందువుపై రైట్ క్లిక్ చేయండి. |
03:04 | ఆపై Create child bone ఎంపిక పై క్లిక్ చేయండి. |
03:10 | ఇంతకు ముందు వివరించిన విధంగా Trunk యొక్క పై భాగంలోని child bone యొక్క లెన్త్ ను సర్దుబాటు చేయండి. |
03:17 | ఇదే పద్ధతిలో, (మెడ, తల మరియు చేతుల) నెక్, హెడ్ మరియు హాండ్స్ కొరకు bones ను జోడించండి మరియు సర్దుబాటు చేయండి. |
03:41 | ఇప్పుడు Skeleton layer అనేది శరీరం లోపల ఉంచబడింది. |
03:45 | తరువాత, మనం శరీరంలోని ప్రతి భాగానికి బోన్స్ ను అటాచ్ చేస్తాము. |
03:50 | దాని కొరకు, Layers panel కి వెళ్లండి. R-upper-arm layer పై రైట్ క్లిక్ చేసి, ఆపై Select all child layers పైన చేయండి. |
04:00 | కాన్వాస్‌కు వెళ్లండి. కుడి ఎగువ మోచేయి యొక్క అన్ని nodes ను ఎంచుకోవడానికి, Shift కీని ఉపయోగించి మౌస్ ని పట్టుకొని లాగండి. |
04:11 | Ctrl కీని నొక్కండి, ఆపై Skeleton layer ను ఎంచుకోండి. |
04:18 | R-upper-arm యొక్క bone యొక్క ఏదైనా node పైన రైట్ క్లిక్ చేయండి |
04:23 | Link to bone ఎంపికపై క్లిక్ చేయండి. |
04:28 | అదేవిధంగా, Link to bone ను ఉపయోగించడం ద్వారా శరీరం యొక్క ప్రతీ ఒక్క భాగాన్ని దాని సంబంధిత bone ను అటాచ్ చేయాలి. |
04:50 | శరీరం యొక్క ప్రతీ ఒక్క భాగాన్ని Skeleton కు తప్పనిసరిగా అటాచ్ చేయాలి. |
04:56 | అప్పుడే మనం శరీరం యొక్క అన్ని భాగాలను bones ను ఉపయోగించి యానిమేట్ చేయగలము. |
05:02 | ఫైల్‌ను సేవ్ చేయడానికి Ctrl మరియు S కీలను నొక్కండి. |
05:06 | ఇప్పుడు మనం యానిమేట్ చేయడం ప్రారంభిద్దాం. |
05:09 | Layers panel కు వెళ్లి, Skeleton layer ను ఎంచుకోండి. |
05:13 | animate editing mode ఐకాన్ ను టర్న్ ఆన్ చేయండి. |
05:16 | Time track panel కు వెళ్లి, cursor ను 20th ఫ్రేమ్‌లో ఉంచండి. |
05:22 | వివిధ రంగులలో ఉన్న డాట్స్ ను గమనించండి. |
05:25 | బ్లూ డాట్ అనేది రొటేషన్ కోసం. |
05:27 | ఆరెంజ్ డాట్ అనేది స్కేలింగ్ కోసం. |
05:30 | ఇంకా, గ్రీన్ డాట్ అనేది Skeleton లో స్థానభ్రంశం (డిస్ప్లేస్మెంట్) కోసం. |
05:35 | మనం canvas కు వెళ్దాం. |
05:38 | కుడి చేతి యొక్క దిగువ మోచేయి భాగంలో ఉన్నbone యొక్క నీలంరంగు బిందువును ఎంచుకోండి. |
05:44 | ప్రదర్శించిన విధంగా బ్లూ డాట్ ను కదిలించడం ద్వారా దిగువ మోచేయి ఎముకను కదపండి. |
05:49 | Time track panel కు వెళ్లి, cursor ను 32nd</sup ఫ్రేమ్‌లో ఉంచండి. |
05:56 | Canvas కు తిరిగి వెళ్లి, ప్రదర్శించిన విధంగా దిగువ మోచేయి ఎముకను కదపండి. |
06:02 | మళ్ళీ, Time track panel కు వెళ్లి, cursor ను 48nd</sup ఫ్రేమ్‌లో ఉంచండి. |
06:09 | Canvas కు వెళ్లి, ప్రదర్శించిన విధంగా దిగువ మోచేయి ఎముకను కదపండి. |
06:15 | తరువాత, అదే ఫ్రేమ్ లోని అరచేతి ఎముక యొక్క నీలంరంగు బిందువును ఎంచుకోండి. |
06:21 | తరువాత ప్రదర్శించిన విధంగా అరచేతి ఎముకని కదపండి. |
06:25 | మళ్ళీ ఇంకోసారి, Time track panel కు వెళ్లి, cursor ను 63nd</sup ఫ్రేమ్‌లో ఉంచండి. |
06:34 | Canvas కు తిరిగి వెళ్లి, చూపించిన విధంగా దిగువ మోచేయి ఎముకను కదపండి. |
06:40 | మనం L-hand ను కూడా అదే పద్దతిలో యానిమేట్ చేస్తాము. |
06:43 | canvas కు వెళ్లి, ఎడమ చేతి యొక్క మోచేయి క్రింది ఎముకపైన నీలిరంగు బిందువును ఎంచుకోండి. |
06:50 | Time track panel కు వెళ్లి, cursor ను 20th ఫ్రేమ్‌లో ఉంచండి. |
06:56 | Canvas కి వెళ్ళండి. |
06:59 | నీలిరంగు బిందువును లాగి, ఎడమ చేతి యొక్క మోచేయి క్రింది bone ని ప్రదర్శించినట్లుగా తరలించండి. |
07:06 | చివరగా,Turn off animate editing mode ఐకాన్ పై క్లిక్ చేయండి. |
07:11 | canvas యొక్క దిగువభాగం వద్ద ఉన్న Seek to begin పై క్లిక్ చేయండి. |
07:15 | Play బటన్‌ను క్లిక్ చేయడం ద్వారా యానిమేషన్‌ను ప్లే చేయండి. |
07:28 | మళ్ళీ ఇంకోసారి ఫైల్ ను save చెయ్యండి. |
07:31 | ఇప్పుడు మనం preview ను తనిఖీ చేద్దాం. |
07:36 | File కు వెళ్లి, ఆపై Preview పై క్లిక్ చేయండి. |
07:40 | Quality ను 0.5 గా మరియు Frame per second ను 24 గా సెట్ చేయండి. |
07:45 | Preview బటన్ పై క్లిక్ చేసి, ఆపై Play బటన్ పై క్లిక్ చేయండి. |
07:51 | యానిమేషన్ యొక్క ప్రివ్యూను మనం screen పైన చూడవచ్చు. |
07:56 | Preview window ని మూసివేద్దాం. |
07:58 | ఇప్పుడు, మనం యానిమేషన్‌ను రెండర్ చేద్దాం. |
08:02 | అలా చేయడానికి, File పై క్లిక్ చేసి, ఆపై Render పై క్లిక్ చేయండి. |
08:08 | Render setting విండోకు వెళ్ళండి. |
08:10 | Choose పై క్లిక్ చేసి, Save render as విండోను తెరవండి. |
08:15 | ఫైల్‌ను సేవ్ చేయడానికి లొకేషన్ ను ఎంచుకోండి. నేను Desktop ను ఎంచుకుంటున్నాను. |
08:21 | ఫైల్ పేరును Basic hyphen bone hyphen animation dot avi కు మార్చండి. |
08:27 | Target డ్రాప్ డౌన్ మెనుపై క్లిక్ చేసి, ఎక్సటెన్షన్ ను ffmpeg గా ఎంచుకోండి. |
08:35 | Time టాబ్‌పై క్లిక్ చేసి, End time ను 70 కి మార్చండి. |
08:40 | చివరగా, Render పై క్లిక్ చెయ్యండి. |
08:45 | ఇప్పుడు మనం మన యానిమేషన్‌ను తనిఖీ చేద్దాం. |
08:48 | Desktop కు వెళ్లి, Basic-bone-animation. avi ను ఎంచుకోండి. |
08:56 | Firefox web browser ని ఉపయోగించి, రైట్ క్లిక్ చేసి యానిమేషన్‌ను ప్లే చేయండి. |
09:03 | దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. సారాంశం చూద్దాం. |
09:10 | ఈ ట్యుటోరియల్‌లో, మనం Synfig లోని basic bone యానిమేషన్ గురించి నేర్చుకున్నాము. |
09:16 | మనం బోన్స్ ను జోడించడం, బోడి కి బోన్స్ ను అటాచ్ చేయడం మరియు బోన్స్ ను యానిమేట్ చేయడం కూడా నేర్చుకున్నాము. |
09:24 | మీ కొరకు ఇక్కడ ఒక అసైన్మెంట్. |
09:26 | Code files లింక్‌లో మీకు ఇవ్వబడిన సిన్‌ఫిగ్ ఫైల్‌ను తెరవండి. |
09:31 | బోన్స్ ను జోడించి హ్యాండ్ ని యానిమేట్ చేయండి. |
09:35 | మీరు పూర్తి చేసిన అసైన్‌మెంట్ చూడటానికి ఇలా ఉండాలి. |
09:40 | ఈ వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దీనిని చూడండి. |
09:47 | మేము Spoken Tutorials ఉపయోగించి వర్కుషాప్స్ నిర్వహించి సర్టిఫికెట్ లు ఇస్తాము. దయచేసి మమ్మల్ని సంప్రదించండి. |
09:55 | దయచేసి మీ సమయం తో కూడిన సందేహాలను ఈ ఫోరమ్‌లో పోస్ట్ చేయండి. |
09:59 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT ,MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. |
10:06 | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది ఉదయలక్ష్మి నేను మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు. |