PERL/C3/Referencing-and-Dereferencing/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 15:51, 6 October 2017 by Yogananda.india (Talk | contribs)

Jump to: navigation, search
Time
Narration
00:01 Referencing and Dereferencing in Perl పై Spoken Tutorial కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనము Scalar References Array References Hash References Dereferences మరియు array/hash references యొక్క elements లను జోడించడం, తొలగించడం, పొందడం నేర్చుకుంటాము.
00:22 ఈ ట్యుటోరియల్ కొరకు నేను: Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం Perl 5.14.2 gedit Text Editor ను ఉపయోగిస్తున్నాను.
00:33 మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయినా ఉపయోగించవచ్చు.
00:37 మీకు Perl ప్రోగ్రామింగ్ Array functions మరియు Hash functions గురించి ప్రాధమిక అవగాహన ఉండాలి.
00:43 ఒకవేళ లేకపోతే, సంబంధిత Perl ట్యుటోరియల్స్ కోసం ఈ వెబ్ సైట్ కు వెళ్ళండి.
00:49 Reference అంటే ఏమిటి?
00:51 reference అనేది ఒక pointer లేదా variable, array, hash లేదా subroutine కు ఒక address.
00:58 ఇది నేరుగా డేటాను కలిగి ఉండదు.
01:01 Reference అనేది ఒక సులభమైన, కాంపాక్ట్ scalar విలువ.
01:05 పెద్ద డేటా డేటా స్ట్రక్చర్ లను పంపినప్పుడు లేదా తిరిగి పొందినప్పుడు Reference Perl కోడ్ యొక్క ఎగ్జిక్యూషన్ యొక్క పనితనంను అభివృద్ధి చేస్తుంది.
01:12 ఇది subroutine కు విలువను పంపకుండా reference ను పంపి మెమొరీని ఆదా చేస్తుంది
01:18 సంక్లిష్టమైన Perl డేటా స్ట్రక్చర్ లను నిర్వహించడం సులభం.
01:22 మనం reference ను ఎలా సృష్టించాలో చూద్దాం.
01:25 మనము backslash (\) ను ఏదైనా variable, subroutine లేదా value ముందు ఉంచడం ద్వారా వాటికి reference లను సృష్టించవచ్చు.
01:33 ఇక్కడ చూపిన విధంగా బాక్ స్లాష్ మరియు డాలర్ ($)గుర్తు ద్వారా scalar variable reference చేయబడుతుంది.
01:39 array variable బాక్ స్లాష్ మరియు at the rate(@) గుర్తు ను ఉపయోగించి, reference చేయబడుతుంది.
01:45 ఇక్కడ ఉదాహరణలో చూపిన విధంగా ఒక hash variable బాక్ స్లాష్ మరియు percentage(%) గుర్తు ను ఉపయోగించి, reference చేయబడుతుంది.
01:53 dereference అంటే ఏమిటి?
01:55 ఒక reference ను dereference చేసినప్పుడు దాని అసలు విలువ రిటర్న్ అవుతుంది.
02:00 Dereference అనేది కర్లీ బ్రాకెట్లలో reference వేరియబుల్ ను ఉంచుట ద్వారా చేస్తాము.
02:06 అదేవిధంగా, ఎడమ కర్లీ బ్రాకెట్ ముందు reference రకాన్ని సూచిస్తూ, ఒక క్యారెక్టర్ ఇవ్వాలి.
02:12 మనం వేరియబుల్స్ ను dereference ఎలా చేయాలో చూద్దాము.
02:16 డాలర్ గుర్తు($) మరియు కర్లీ బ్రాకెట్స్ ద్వారా scalar వేరియబుల్ dereference చేయబడుతుంది.
02:21 array వేరియబుల్ at the rate(@) గుర్తు మరియు కర్లీ బ్రాకెట్స్ ద్వారా dereference చేయబడుతుంది.
02:27 hash వేరియబుల్ percentage(%) గుర్తు మరియు కర్లీ బ్రాకెట్స్ ద్వారా dereference చేయబడుతుంది.
02:33 మనం Scalar reference మరియు dereference కోసం ఒక సాధారణ ప్రోగ్రాం ను చూద్దాము.
02:38 నన్ను gedit Text editor లో ఒక నమూనా ప్రోగ్రాం ను తెరవనివ్వండి.
02:43 terminal ను తెరచి, gedit scalarRef dot pl ampersand అని టైప్ చేసి Enter నొక్కండి.
02:50 స్క్రీన్ పై ప్రదర్శింపబడిన విధంగా క్రింది కోడ్ ను టైప్ చేయండి.
02:55 నన్ను కోడ్ ను వివరించనివ్వండి.
02:57 మొదటి లైన్ scalar variable $a ను డిక్లేర్ చేసి, 10 విలువతో ఇనిష్యలైజ్ చేస్తుంది
03:03 ముందు చెప్పినట్లుగా, బాక్ స్లాష్ మరియు డాలర్ గుర్తు ద్వారా స్కేలార్ వేరియబుల్ reference చేయబడుతుంది.
03:10 ఈ లైన్ reference గా సృష్టించబడిన వేరియబుల్ యొక్క memory address ను ప్రింట్ చేస్తుంది.
03:16 వాస్తవ విలువను ప్రింట్ చేయడానికి, variable, కర్లీ బ్రాకెట్ల ముందు $ ద్వారా dereference చేయబడుతుంది.
03:23 ఇక్కడ ref() ఫంక్షన్ reference రకాన్ని అనగా scalar లేదా array లేదా hash రిటర్న్ చేస్తుంది.
03:30 ఇప్పుడు, ఫైల్ ను సేవ్ చేయడానికి Ctrl+S ను నొక్కండి.
03:34 మనం ప్రోగ్రాం ను ఎగ్జిక్యూట్ చేద్దాం.
03:36 terminal కు మారి, perl scalarRef dot pl అని టైప్ చేసి Enter నొక్కండి.
03:43 అవుట్ పుట్ చూపబడిన విధంగా ప్రదర్శింపబడుతుంది.
03:46 మొదటి లైన్ విలువ 10 నిల్వ చేసిన memory address ను చూపిస్తుంది
03:51 రెండవ లైన్, వాస్తవ విలువ 10 ని రిటర్న్ చేస్తుంది.
03:55 Ref() ఫంక్షన్ "SCALAR" ను అవుట్ పుట్ గా రిటర్న్ చేస్తుంది.
03:59 తరువాత, మనం నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి array కు reference మరియు dereference లను ఎలా సృష్టించాలో అర్ధం చేసుకుందాం.
04:07 నేను ఇప్పటికే నమూనా ప్రోగ్రాం ను కలిగి ఉన్నాను . నన్ను దానిని gedit టెక్స్ట్ ఎడిటర్ లో తెరవనివ్వండి.
04:13 terminal లో gedit arrayRef dot pl ampersand అని టైప్ చేసి, Enter నొక్కండి.
04:20 స్క్రీన్ పై ప్రదర్శించబడిన కోడ్ ను క్రింది విధంగా arrayRef dot pl ఫైల్ లో టైప్ చేయండి.
04:26 ఇప్పుడు నన్ను కోడ్ ను వివరించనివ్వండి.
04:28 ఇక్కడ మొదటి లైన్ లో నేను @color అను array ను మూడు విలువలతో డిక్లేర్ చేసితిని.
04:35 ఇది backslash @color తో reference చేయబడి, $colorRef కు కేటాయించబడింది.
04:42 print స్టేట్మెంట్ reference విలువను మరియు dereference విలువను ముద్రిస్తుంది.
04:47 ఇప్పుడు, ఫైల్ సేవ్ చేయడానికి Ctrl+S ను నొక్కండి.
04:51 మనం ప్రోగ్రాం ను ఎగ్జిక్యూట్ చేద్దాం.
04:53 తిరిగి terminal కు మారి, perl arrayRef dot pl అని టైప్ చేసి Enter నొక్కండి.
05:00 ఇక్కడ చూపిన విధంగా అవుట్ పుట్ ప్రదర్శింపబడుతుంది.
05:04 మొదటి లైన్ referenceగా సృష్టించబడిన వేరియబుల్ యొక్క memory address ను అవుట్ పుట్ గా చూపిస్తుంది .
05:10 రెండవ లైన్ వాస్తవ విలువను అంటే dereferenced ను చూపిస్తుంది.
05:16 తరువాత, మనం array కు ఒక direct referenceను ఎలా డిక్లేర్ చేయాలో చూద్దాము.
05:21 తిరిగి మన ప్రోగ్రాం కు వద్దాం.
05:24 array కు direct reference ను చూపించటానికి నేను ఇప్పటికే ఉన్న ప్రోగ్రాం ను మార్చాను.
05:29 మీరు చూపిన విధంగా స్క్వేర్ బ్రాకెట్స్ [] ను ఉపయోగించి array కు direct referenceను సృష్టించవచ్చు.
05:35 dereference కు arrow operator (->) ను ఉపయోగించండి.
05:39 print స్టేట్మెంట్ "Green" ను అవుట్ పుట్ గా ప్రదర్శిస్తుంది.
05:43 ఇక్కడ, print స్టేట్మెంట్ ఇండెక్స్ [1] విలువను తీసుకుంటుంది, అంటే మన ప్రోగ్రాం లో Green అని అర్ధం.
05:50 ఫైల్ ని సేవ్ చేయడానికి Ctrl+S ను నొక్కండి.
05:54 తిరిగి terminal కు మారి, ఎగ్జిక్యూట్ చేయడానికి perl arrayRef dot pl అని టైప్ చేసి Enter నొక్కండి.
06:03 అదే కోడ్ ఫైల్ లో, direct hash reference ను ఎలా ఉపయోగించాలో ఒక ఉదాహరణతో చూపిస్తాను. కాబట్టి geditకు మారండి.
06:11 ఇక్కడ చూపిన విధంగా కర్లీ బ్రాకెట్స్ ను ఉపయోగించి మీరు హాష్ కు direct reference ను సృష్టించవచ్చు.
06:18 దీనిని dereference చేయడానికి arrow operator (->) ని ఉపయోగించండి. “Name” అనేది hash key .
06:24 ఈ బ్లాక్ కోడ్ ను అమలు చేస్తే, రెండూ print స్టేట్మెంట్ లు "Sunil" ను అవుట్ పుట్ గా ముద్రిస్తాయి.
06:31 తరువాత మనం array reference కు elements ను జోడించడం, తొలగించడం, పొందడం ఎలానో నమూనా ప్రోగ్రాం తో చూద్దాం .
06:39 నేను ఇప్పటికే నమూనా ప్రోగ్రాం ను కలిగి ఉన్నాను నన్ను దానిని gedit టెక్స్ట్ ఎడిటర్ లో తెరవనివ్వండి.
06:45 terminal ను తెరచి, gedit arrayRefadd dot pl ampersand అని టైప్ చేసి Enter నొక్కండి.
06:54 arrayRefadd.pl ఫైల్ ఇప్పుడు gedit లో తెరుచుకుంటుంది. ఇక్కడ చూపించిన విధంగా కోడ్ ను మీ ఫైల్ లో టైప్ చేయండి.
07:02 మొదటి లైన్ array కు విలువలను అందిస్తుంది.
07:06 మనము ఇప్పుడు backslash @numarray తో ఒక అర్రే ను రిఫరెన్స్ చేసి, దానిని $ref కు కేటాయించాము.
07:13 ఇప్పుడు , మనం array reference నుండి ఒక ప్రత్యేక element ను ఎలా పొందాలో చూద్దాం.
07:19 మనం ప్రత్యేక విలువను ను పొందడానికి మనం array index ను స్క్వేర్ బ్రాకెట్స్ లో ఉపయోగించి, దానిని dereference చేయడానికి arrow operator (“->”) ను ఉపయోగించాలి.
07:28 print స్టేట్మెంట్ ఇండెక్స్ [0] యొక్క విలువను ముద్రిస్తుంది.
07:32 push() ఫంక్షన్ elements ను array reference యొక్క చివరి స్థానం వద్ద జోడిస్తుంది. మన కేసు లో 5, 6, 7 లు ప్రస్తుత array 1, 2, 3, 4 యొక్క చివరిస్థానం వద్ద జోడించబడతాయి.
07:47 array reference కు జోడించిన తరువాత print స్టేట్మెంట్ అవుట్ పుట్ ను చూపిస్తుంది.
07:53 pop() ఫంక్షన్ element ను array reference యొక్క చివరి స్థానం నుండి తొలగిస్తుంది.
07:58 మన ఉదాహరణలో, array reference నుండి 7 తొలగించబడుతుంది.
08:03 array reference నుండి తొలగించిన తరువాత print స్టేట్మెంట్ అవుట్ పుట్ ను చూపిస్తుంది.
08:08 ఫైల్ ను సేవ్ చేయడానికి Ctrl+S నొక్కండి.
08:11 మనం ప్రోగ్రాం ను ఎగ్జిక్యూట్ చేద్దాం.
08:14 తిరిగి terminal కు మారి, perl arrayRefadd dot pl అని టైప్ చేసి Enter నొక్కండి.
08:22 ఇక్కడ చూపిన విధంగా అవుట్ పుట్ ప్రదర్శింపబడుతుంది.
08:26 ఇప్పుడు మనం hash reference యొక్క elements ను జోడించడానికి, తొలగించడానికి, మరియు పొందడానికి మరొక నమూనా ప్రోగ్రాం ను చూద్దాం.
08:34 terminal పై, gedit hashRefadd dot pl ampersand అని టైప్ చేసి, Enter నొక్కండి.
08:42 ఇది hashRefadd.pl ఫైల్ ను gedit లో తెరుస్తుంది.
08:47 నన్ను నమూనా ప్రోగ్రాం ను వివరించనివ్వండి.
08:50 నేను scalar వేరియబుల్ $weektemp ను నిల్వ చేయగల direct hash reference ను డిక్లేర్ చేసాను.
08:57 నేను hash reference ను సూచించడానికి కర్లీ బ్రాకెట్స్ ను మరియు dereference ను సూచించడానికి arrow operator ను ఉపయోగిస్తాను.
09:04 ఈ కోడ్ సోమవారం నుండి శుక్రవారం వరకు ఉష్ణోగ్రత విలువలను నిల్వ చేస్తుంది.
09:09 నేను “keys” built-in functionను, హాష్ కీస్ ద్వారా లూప్ కు ఉపయోగిస్తాను.
09:15 print స్టేట్మెంట్ హాష్ యొక్క ప్రతి ఎలిమెంట్ ను ముద్రిస్తుంది.
09:19 ఇక్కడ చూపించిన విధంగా మనం element యొక్క ప్రత్యేక విలువను పొందవచ్చు.
09:25 print స్టేట్మెంట్ సోమవారం ఉష్ణోగ్రతను ముద్రిస్తుంది.
09:29 ఇప్పుడు, ఫైల్ ను సేవ్ చేయండి.
09:32 టెర్మినల్ కు మారి, అవుట్ పుట్ చూడడానికి perl hashRefadd dot pl అని టైప్ చేసి Enter నొక్కండి.
09:41 hash keys మరియు hash values యాదృచ్చిక క్రమంలో నిల్వ చేయబడతాయి.
09:46 ప్రదర్శించబడిన అవుట్పుట్ అవి జోడించిన క్రమానికి సంబంధించినవి కావు.
09:52 దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము. మనం సారాంశం చూద్దాం.
09:57 ఈ ట్యుటోరియల్ లో మనము Scalar References, Array References, Hash References Dereferences మరియు array/hash references కు elements లను జోడించడం, తొలగించడం, పొందడం నేర్చుకుంటాము.
10:14 ఇక్కడ మీ కొరకు ఒక అసైన్మెంట్ మన hashRefadd dot pl file లో, weektemp హాష్ కు కొత్త కీస్ “Saturday” మరియు “Sunday” లను జోడించండి.
10:24 చివరికి “Saturday” కీ ని డిలీట్ చేయండి.
10:27 హాష్ weektemp ను ముద్రించండి.
10:30 ప్రోగ్రాం ను Save మరియు execute చేయండి. ఇప్పుడు ఫలితాన్ని పరీక్షించండి.
10:35 క్రింద లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ను సారాంశం చేస్తుంది. దయచేసి దానిని డౌన్ లోడ్ చేసి చూడండి.
10:42 మేము వర్క్ షాప్ లను నిర్వహిస్తాము మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లను ఇస్తాము. మర్రిన్ని వివరాల కోసం దయచేసి మాకు రాయండి.
10:51 NMEICT, MHRD, భారత ప్రభుత్వం స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. ఈ మిషన్ పై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది.
11:02 ట్యుటోరియల్ ను అనువదించిన వారు నాగూర్ వలి మరియు రచనకు సహకరించిన వారు కృష్ణ కుమార్. మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india