Python-3.4.3/C3/Getting-started-with-for/Telugu
|
|
00:01 | ప్రియమైన స్నేహితులారా, Getting started with for loops అనే ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:08 | ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు, మీరు
for loopని ఉపయోగించడం range() functionని ఉపయోగించడం చేయగలుగుతారు. |
00:17 | ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను
Ubuntu Linux 14.04 ఆపరేటింగ్ సిస్టమ్ |
00:25 | Python 3.4.3 మరియు IPython 5.1.0 లను ఉపయోగిస్తున్నాను. |
00:32 | ఈ ట్యుటోరియల్ ను సాధన చేయటానికి, మీకు lists ను ఎలా ఉపయోగించాలో తెలిసిఉండాలి. |
00:37 | ఒకవేళ లేకపోతే, సంబంధిత Python ట్యుటోరియల్స్ ను ఈ వెబ్సైట్ పై చూడండి. |
00:42 | ముందు మనం for loop యొక్క సింటాక్స్ ను చూద్దాం. |
00:46 | for statement ఒక శ్రేణి యొక్క సభ్యులను ఒక క్రమంలో పునరావృతం చేస్తుంది మరియు ప్రతిసారీ block ను అమలు చేస్తుంది. |
00:54 | ఇక్కడ loop variable ప్రతి పునరావృతం పై శ్రేణి లోపల ఉన్న item యొక్క విలువను తీసుకుంటుంది. |
01:01 | ప్రతి item కొరకు, loop body అమలు అవుతుంది. |
01:05 | మనం for loop యొక్క ఒక ఉదాహరణను మరియు దానిని ఎలా అమలు చేయాలో చూద్దాం. |
01:10 | ముందుగా మనం Ctrl + Alt + T కీలను ఒకేసారి కలిపి నొక్కడం ద్వారా terminal ను తెరుద్దాం. |
01:17 | ఇప్పుడు, ipython3 అని టైప్ చేసి Enter నొక్కండి. |
01:22 | మనం pylab ప్యాకేజి ని ప్రారంభిద్దాం.
%pylab అని టైప్ చేసి Enter నొక్కండి. |
01:30 | మీ text editor ను తెరవండి. |
01:33 | మనం ఒక for loop ను వ్రాద్దాం. ఇక్కడ చూపిన విధంగా కోడ్‌ను టైప్ చేయండి: |
01:39 | ఇక్కడ లూప్ వేరియబుల్ సంఖ్యల యొక్క లిస్ట్ ను క్రమంలో పునరావృతం చేసి ప్రతి సంఖ్య యొక్క వర్గమూలాన్ని కనుగొంటుంది. |
01:46 | సంఖ్యలు: 4, 9, 16, 25, మరియు 36. |
01:52 | ఇక్కడ మనం రెండు వేరియబుల్స్ ను ఉపయోగించామని గమనించండి, numbers ఇది సంఖ్యల యొక్క ఒక list. |
02:00 | for loop యొక్క ప్రతి ఆవృత్తిలో, num - ఇది పరిశీలనలో ఉన్న లిస్ట్ యొక్క ఒక ఎలిమెంట్
వేరియబుల్ పేర్లు మీకు నచ్చినవి కావచ్చు. |
02:11 | for statement తర్వాత ఒక colon అనేది loop body యొక్క ప్రారంభాన్ని సూచిస్తుందని గమనించండి. |
02:18 | లూప్‌లోని ప్రతి statement 4 ఖాళీలతో మొదలవుతుంది. |
02:24 | దీని అర్థం, లైన్ అనేది for loop లోని కోడ్ యొక్క ఒక block. |
02:29 | ఈ ఉదాహరణలో, ఇది block లో ఒకే ఒక statement మాత్రమే. |
02:35 | print("This is outside for-loop") అనే లైన్ ఇండెంట్ చేయబడలేదు అని గమనించండి.
ఇది ఈ for loop యొక్క భాగం కాదని దీని అర్ధం. |
02:46 | మరియు దాని తరువాత ఉన్న లైన్స్ for loop యొక్క పరిధిలోకి రావు. |
02:51 | ఈ విధంగా ప్రతీ block ఇండెంటేషన్ స్థాయి ద్వారా వేరు చేయబడుతుంది.
ఇది Python లో white-spaces యొక్క ప్రాముఖ్యతను సూచిస్తుంది. |
03:01 | ఫైల్‌ను హోమ్ డైరెక్టరీ లో sqrt_num_list.py గా సేవ్ చేయండి. |
03:13 | ఇప్పుడు మీ terminal కు తిరిగి మారండి.
మనం terminal ను క్లియర్ చేద్దాం. |
03:19 | స్క్రిప్ట్‌ను రన్ చేయడానికి run కమాండ్ ను percent run minus i filename గా ఉపయోగించి, Enter నొక్కండి. |
03:31 | మనము for loop ను అమలుచేయడం చేత ఇచ్చిన సంఖ్యల యొక్క వర్గమూలాన్ని పొందుతాము. |
03:37 | ఇది for loop తరువాత అమలు అయిన print statement యొక్క అవుట్‌పుట్. |
03:42 | మనము sqrt_num_list.py లో ఉపయోగించిన అదే ఉదాహరణను ఉపయోగించండి. |
03:48 | IPython interpreter prompt లో కోడ్ యొక్క ప్రతీ లైన్ ను టైప్ చేయండి. |
03:53 | print("This is outside for-loop") లైన్ ను వదిలివేయండి. |
03:58 | టెర్మినల్ కు మారండి. |
04:01 | Numbers equal to స్క్వేర్ బ్రాకెట్స్ లోపల 4 కామా 9 కామా 16 కామా 25 కామా 36 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
04:20 | for num in numbers colon ఎంటర్ నొక్కండి |
04:27 | prompt మూడు చుక్కలకు మారింది అని మీరు గమనిస్తారు.
మరియు కర్సర్ మూడు చుక్కల తరువాత లేదు, కానీ ఆ మూడు చుక్కల తర్వాత అక్కడ నాలుగు ఖాళీలు ఉన్నాయి. |
04:40 | దయచేసి గమనించండి IPython, block ను స్వయంచాలకంగా ఇండెంట్ చేస్తుంది.
ఆ మూడు చుక్కలు మీరు ఒక block లోపల ఉన్నారని చెబుతాయి. |
04:50 | ఇప్పుడు for loop యొక్క మిగిలిన కోడ్ ని టైప్ చేయండి.
Print పరాంతసిస్ ల లోపల కోట్స్ లోపల sqrt of కామా num కామా కోట్స్ లోపల is కామా num asterick asterick , ఏదైతే 0.5 యొక్క ఘాతానికి పెంచుతుంది మరియు Enter నొక్కండి. |
05:19 | ఇప్పుడు మనము block లోని statements ను పూర్తి చేసాము.
కానీ ఇప్పటికీ interpreter మూడు చుక్కలను చూపుతోంది. |
05:26 | మీరు ఇప్పటికీ block లోపలే ఉన్నారని దీని అర్థం. |
05:30 | .block నుండి నిష్క్రమించడానికి, మరేదీ ఎంటర్ చేయకుండా Enter కీని రెండుసార్లు నొక్కండి. |
05:37 | ఇది for loop లో అమలుచేయబడిన list లోని ప్రతీ సంఖ్య యొక్క వర్గమూలాన్ని ముద్రించింది. |
05:44 | తరువాత మనం Python లో range built-in function గురించి చూస్తాము. |
05:48 | range() ఫంక్షన్ integers(పూర్ణాంకాల) యొక్క ఒక list ను ఉత్పత్తి చేస్తుంది. |
05:52 | సింటాక్స్: range start కామా stop కామా step |
05:59 | ఉదాహరణకు: range పరాంతసిస్ ల లోపల one కామా twenty కామా two అనేది 2 యొక్క దశతో 1 నుండి 19 వరకు పూర్ణాంకాలను ఉత్పత్తి చేస్తుంది. |
06:11 | Range పరాంతసిస్ ల లోపల twenty అనేది 0 నుండి 19 వరకు పూర్ణాంకాలను ఉత్పత్తి చేస్తుంది. |
06:18 | మీరు పేర్కొన్న ముగింపు సంఖ్య అనేది list లో చేర్చబడదని గమనించండి. |
06:25 | ఒకటి నుండి పది వరకు ఉన్న అన్ని సంఖ్యల యొక్క ఘనాన్ని కనుగొనండి.
దీన్ని Python interpreter లో అమలు చేయండి. |
06:34 | ఇప్పుడు మనం ఒక Python terminal విండోలో for loop ను అమలు చేయడానికి ప్రయత్నిద్దాం. |
06:40 | ఒకేసారి Ctrl + Alt + T' కీలను కలిపి నొక్కడం ద్వారా ఒక క్రొత్త టెర్మినల్ ను తెరవండి. |
06:46 | కొత్త terminal లో command python ను జారీ చేయడం ద్వారా Python interpreter ను ప్రారంభించి, Enter నొక్కండి. |
06:54 | for i in range పరాంతసిస్ ల లోపల one కామా eleven colon అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
07:06 | ఈసారి అది మూడు చుక్కలను చూపిస్తుందని చూస్తాము, కాని కర్సర్ ఆ చుక్కలకు దగ్గరగా ఉంటుంది.
కనుక మనం block ను ఇండెంట్ చేయాలి. |
07:17 | Python interpreter కోడ్‌ను స్వయంచాలకంగా ఇండెంట్ చేయదు.
కనుక నాలుగు (ఖాళీలు) spaces ను ఎంటర్ చేసి, ఆపై కింది వాటిని టైప్ చేయండి. |
07:27 | Print పరాంతసిస్ ల లోపల i కామా కోట్స్ లోపల cube is కామాi 3 యొక్క ఘాతానికిపెంచబడింది మరియు Enter నొక్కండి. |
07:44 | ఇప్పుడు మనం Enter నొక్కినప్పుడు , మనకు ఇంకా ఇప్పటికి మూడు చుక్కలు కనిపిస్తాయి
Block నుండి బయటపడటానికి, మరోసారి Enter నొక్కండి. |
07:53 | సరే! అయితే మనము ఇక్కడ నేర్చుకున్న ప్రధాన విషయం ఏమిటంటే - Python interpreterని ఎలా ఉపయోగించాలి మరియు IPython interpreter లో blocks ను ఎలా పేర్కొనాలి. |
08:03 | 1 నుండి 50 వరకు అన్ని బేసి సంఖ్యలను ముద్రించండి. |
08:07 | వాడుకలో సౌలభ్యం కోసం దీన్ని మన IPython interpreter లో చేద్దాం. |
08:12 | range() ఫంక్షన్ ను ఉపయోగించడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు. |
08:17 | టెర్మినల్ ను క్లియర్ చేద్దాం. |
08:20 | for I in range పరాంతసిస్ ల లోపల one కామా fifty కామా two colon టైపు చేసి ఎంటర్ నొక్కండి.
Print పరాంతసిస్ ల లోపల i Enter నిరెండుసార్లు నొక్కండి |
08:40 | మొదటి parameter అనేది శ్రేణి యొక్క ప్రారంభ సంఖ్య. |
08:45 | రెండవ parameter అనేది range యొక్క ముగింపు. |
08:49 | sequence అనేది ముగింపు సంఖ్యను కలిగి ఉండదని గమనించండి.
మూడవ parameter అనేది sequence లో దశలను స్కిప్ చేయడం కొరకు. |
08:59 | ఇక్కడ మనము రెండు ఇచ్చాము, అంటే మనము ప్రతి ప్రత్యామ్నాయ element ను దాటవేస్తున్నాము అని అర్ధం. |
09:05 | ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు తీసుకువస్తుంది.
ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి , for ను ఉపయోగించి python లో blocks ను సృష్టించడం |
09:15 | కోడ్ యొక్క blocks ను ఇండెంట్ చేయడం |
09:17 | for loop ను ఉపయోగించి ఒక లిస్ట్ ను మళ్ళీ క్రమం చేయడం మరియు range() function ను ఉపయోగించడం. |
09:23 | ఇక్కడ మీరు పరిష్కరించడానికి కొన్ని స్వీయ అంచనా ప్రశ్నలు.
Python లో ఇండెంటేషన్ తప్పనిసరి కాదు తప్పా లేక ఒప్పా |
09:32 | 1 నుండి 20 వరకు అన్ని సహజ సంఖ్యల యొక్క గుణకారాన్ని ముద్రించడానికి ఒక for loop ను వ్రాయండి
range(1, 5) యొక్క అవుట్‌పుట్ ఏమిటి |
09:43 | మరియు సమాధానాలు,
1.తప్పు, python లో ఇండెంటేషన్ అవసరం. |
09:51 | 2. y equal to one
for x in range one కామా twenty one |
09:58 | Y into equal to x
print y |
10:03 | 3. range(1, 5) ,1 నుండి 4 వరకు పూర్ణాంకాల యొక్క ఒక లిస్ట్ ను ఉత్పత్తి చేస్తుంది, అనగా [1,2,3,4] |
10:14 | దయచేసి మీ సమయంతో కూడిన సందేహాలను ఈ ఫోరమ్ లో పోస్ట్ చేయండి. |
10:18 | దయచేసి మీ సాధారణ ప్రశ్నలను ఈ Python ఫోరంపై పోస్ట్ చేయండి. |
10:23 | FOSSEE టీం TBC ప్రాజెక్ట్ ను సమన్వయం చేస్తుంది. |
10:27 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. మరిన్ని వివరాల కొరకు, ఈ వెబ్సైటు ను సందర్శించండి. |
10:37 | నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు. |