Linux-AWK/C2/Conditional-statements-in-awk/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 13:18, 4 July 2019 by Simhadriudaya (Talk | contribs)
Time | Narration |
00:01 | awk లోని Basics of single dimensional array అనే ఈ స్పొకెన్ ట్యుటొరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటొరియల్ లో మనం awk లో Arrays గురించి |
00:12 | array elements ని అసైన్ చేయడం. |
00:15 | ఇది ఇతర ప్రొగ్రామింగ్ భాశల లోని arrays తో ఎలా భిన్నంగా ఉంటుంది మరియు arrays యొక్క elements ను రెఫెర్ చేయడం గురించి నేర్చుకుంటాము. |
00:23 | మనం వీటిని కొన్ని ఉదాహరణలతో తెలుసుకుందాం. |
00:26 | ఈ ట్యుటొరియల్ ని రెకార్డ్ చేసేన్దుకు నేను ఉబంటు లినక్స్ 16.04 ఆపరేటింగ్ సిస్టం ను మరియు gedit text editor 3.20.1 ని ఉపయోగిస్తున్నాను. |
00:38 | మీరు మీకు నచ్చిన ఏ ఇతర టెక్స్ట్ ఎడిటర్ ని అయిన ఉపయోగించవచ్చు. |
00:42 | ఈ ట్యుటొరియల్ ను అభ్యసించడానికి మీకు మా వెబ్సైట్ లోని మునుపటి awk ట్యుటొరియల్ పై అవగాహన ఉండాలి. |
00:49 | మీకు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ భాశ C లేదా C++ లాంటి వాటిపై ప్రాధమిక అవగాహన ఉండాలి. |
00:56 | లేదంటే, తత్సంభందిత ట్యుటొరియల్స్ కొరకు మా వెబ్ సైట్ ని సంప్రదించండి. |
01:02 | ట్యుటొరియల్ లో ఉపయోగించిన ఫైల్ లు ఈ ట్యుటొరియల్ పేజ్ లో ఉన్నCode Files లింక్ లో అందుబాటులో ఉన్నాయి. దయచేసి డౌన్లోడ్ చేసి ఎక్సట్రాక్ట్ చేయండి. |
01:11 | awk లో array అంటే ఏమిటి?
awk సంబంధిత మూలకాలను నిల్వ చేయడానికి arrays కు మద్దతు ఇస్తుంది. |
01:18 | Elements అనేవి నంబర్ లేదా స్ట్రింగ్ కావచ్చు. |
01:21 | awk లో Arrays అనేవి associative |
01:24 | అంటే ప్రతి array element ఒక index-value pair అని అర్థం |
01:29 | ఇది వేరే ప్రోగ్రామింగ్ భాశలలోని arrays లాగానే కనిపిస్తుంటుంది. |
01:33 | కానీ ikkada కొన్ని ముఖ్యమైన తేడాలున్నాయి.
మనం అర్రే ని వాడకముండు దానిని డీక్లేర్ కి చేసే అవసరం లేదు. |
01:41 | అలాగే array లో ఎన్ని elements ( అంశాలు) ఉన్నాయో పేర్కొనవలసిన అవసరం లేదు. |
01:47 | ప్రోగ్రామింగ్ భాశలలోని array index సాధారణంగా ఒక ధన పూర్ణసంఖ్య గా ఉంటుంది. |
01:52 | మామూలుగా ఇండెక్స్ 0 నుండి మొదలై తర్వాత 1, తర్వాత 2 అలా ముందుకు కొనసాగుతుంది. |
01:58 | కానీ awk లో ఇండెక్స్ ఏదైనా సంఖ్య లేదా ఒక స్ట్రింగ్ కావచ్చు. |
02:03 | ఇది awk లో array element ని కేటాయించే సింటాక్స్. Array name ఏదైనా చెల్లుబాటు అయ్యే వేరియబుల్ పేరు కావచ్చు. |
02:11 | ఇక్కడ ఇండెక్స్, పూర్ణసంఖ్య లేదా స్త్రింగ్ కావచ్చు. |
02:16 | స్త్రింగ్స్ ని డబల్ కోట్ లోనే రాయాలి. అవి ఇండెక్స్ పేరు లేదా విలువ ఏదైనా కావచ్చు. |
02:23 | దీనిని ఒక ఉదాహరణ తో అర్థంచేసుకుందాం. |
02:27 | నేను ఇంతకుముందే కోడ్ ని రాసి దానిని array_intro.awk గా సేవ్ చేసాను. |
02:34 | ఈ ఫైల్ ఈ ప్లేయర్ కిందఉన్న Code Files లింక్ లో అందుబాటులో ఉంది. దానిని డౌన్ లోడ్ చేసుకోని వాడండి. |
02:41 | ఇక్కడ నేను వారం లోని రోజులను ఉదాహరణగా తీసుకుని దానిని BEGIN section లో రాశాను. |
02:48 | ఇక్కడ అర్రె పేరు day. |
02:52 | నేను ఇండెక్స్ 1 గా ఇంకా విలువ Sunday గా ఉంచాను. |
02:57 | ఈ array element లో, నేను string ని ఒక ndex గా ఉపయోగించాను. కాబట్టి index first, విలువ Sunday. |
03:06 | మొత్తం అర్రె ఇలాగే నిర్మించబడింది. |
03:10 | ఇక్కడ గమనించండి array elements క్రమం లో లేవు. నేను day four ని day three కంటే ముందే డిక్లేర్ చేశాను. |
03:18 | awk arrays లో ఇండెక్స్ లు క్రమ పద్దతిలో ఉండాల్సిన అవసరం లేదు. |
03:23 | associative array వల్ల లాభం ఏమిటంటే కొత్త జతలనుఏ సమయం లోనైనా చేర్చవచ్చు. |
03:29 | ఇప్పుడు నేను day 6 ని array లో జోడిస్తాను. |
03:33 | కర్సర్ ని చివరి వరుసలోని చివరిలో ఉంచి ఎంటర్ నొక్కండి. ఆపై క్రింది వాటిని టైపు చేయండి. |
03:42 | ఫైల్ ని సేవ్ చేయండి. |
03:44 | మనం అర్రె ని డిక్లేర్ (ప్రకటించాం)చేశాము. కానీ మనం array element ని ఎలా సిఫార్సు చేస్తాము? |
03:49 | ఒక నిర్దిష్ట ఇండెక్స్ వద్ద element ను సూచించడానికి arrayname మరియు ఇండెక్స్ ని చదరపు బ్రాకెట్లలో వ్రాయండి. దీని ప్రయత్నిద్దాం. |
03:58 | మరోసారి కోడ్ కి మారండి. |
04:01 | కర్సర్ ని క్లొజింగ్ కర్లీ బ్రెస్ దగ్గర ఉంచండి. |
04:05 | ఎంటర్ నొక్కి print space day చదరపు బ్రాకెట్ లలో 6 అని టైప్ చేయండి. |
04:13 | కోడ్ ని సేవ్ చేయండి. |
04:15 | Ctrl, Alt మరియు T కీలను నొక్కిటర్మినల్ ను తెరవండి. |
04:20 | మీరు cd command ద్వారా డౌన్ లోడ్ చేసి సంగ్రహించిన Code Files ఫోల్డర్ కి వెళ్ళండి. |
04:27 | ఇప్పుడు awk space hyphen small f space array_intro.awk అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
04:38 | మనకు ఔట్ పుట్ Friday వచ్చింది చూడండి. |
04:42 | తర్వాత మనం అర్రెలో ఏదైనా element ఒక నిర్దిశ్టమైన ఇండెక్స్ లో ఉందా అని పరిశీలిద్దాం. |
04:48 | దానికోసం మనం in operatorని ఉపయోగించాలి. దీనిని ఒక ఉదాహరణ తో వివరిస్తాను. |
04:55 | ఎడిటర్ విండోలోని కోడ్ కు మారండి. |
04:59 | కర్సర్ ని print statement చివరన ఉంచి ఎంటర్ నొక్కండి. తర్వాత ఇలా టైప్ చేయండి. |
05:09 | కోడ్ ని సేవ్ చేయండి. |
05:11 | ఇప్పుడు నేను రెండు if కండిషన్ లను చేర్చాను. |
05:15 | మొదటి if కండిశన్ ,index two అనేది ప్రస్తుతం day లో ఉందా లేదా అని పరిశీలిస్తుంది. |
05:21 | ఒకవేళ అది అవును ఐతే అప్పుడు తత్సంభంద print statement అమలు అవుతుంది. |
05:26 | తర్వాత రెండవ శరతు (condition ) అనేది, day లో index seven ఉందా లేదా అని పరిశీలిస్తుంది.
ఇది ట్రూ అయితే ప్రింట్ స్టేట్మెంట్ ను అమలు చేస్తుంది. |
05:35 | మనం చూస్తున్నట్టుగా index two అనేది array లొ ఉంది కానీ seven లేదు.
అవుట్ ఫుట్ ని ధృవీకరించడానికి ఈ ఫైల్‌ను అమలు చేద్దాం. |
05:44 | టర్మినల్ కు మారండి. అప్ యారో కీ ని నొక్కి ముందుగా అమలుచేసిన కమాండ్ కి వెళ్ళండి. |
05:51 | అమలుచేయడానికి ఎంటర్ నొక్కండి. |
05:54 | మనం అనుకున్నట్టుగానే ఔట్ పుట్ వచ్చింది. |
05:57 | మనం కోడ్ లో మరికొన్ని మార్పులను చేద్దాం. కోడ్ ని ఇక్కడ చూపినవిధంగా నవీకరించండి. |
06:04 | day కండిషన్ లో 7 కింద నేను మరొక కండిషన్ ను చేర్చాను. |
06:09 | ఇది index seven విలువ null అవునా కాదా అని పరిశీలిస్తుంది. |
06:14 | ఒకవేళ ట్రూ ఐతే అది Index 7 is not null అని ముద్రిస్తుంది. |
06:18 | మనకు7 తో ఇండెక్స్ లేదు అని ఇదివరకే తెలుసు. కనుక అది దేనిని ముద్రించదు. |
06:24 | తర్వాత మనం day లోని condition 7 యొక్క print statement ని మార్చాము. |
06:30 | కోడ్ ని సేవ్ చేయండి. మనం కోడ్ ని అమలు చేస్తే ఏమవుతుందో చూద్దాం. |
06:35 | టర్మినల్ కు మారండి. అప్ యారో కీ ని నొక్కి ముందుగా అమలుచేసిన కమాండ్ కి వెళ్ళండి. |
06:43 | అమలుచేయడానికి ఎంటర్ నొక్కండి. |
06:46 | మనకు అనుకోని ఔట్ పుట్ వచ్చింది. |
06:49 | Index 7 is present after null comparison అనే వాక్యం ముద్రించబడింది. ఇది ఎలా సాధ్యం? |
06:57 | మనం day[7] not equal to null అని రాసినప్పుడు, మనం index 7 వద్ద element ని అక్కెస్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. |
07:04 | ఈ యాక్సెస్ తనకుతానే మొదట ఇండెక్స్ 7 వద్ద ఒక ఎలిమెంట్ ని సృష్టిస్తుంది మరియు దానిని శూన్య విలువతో ప్రారంభిస్తుంది. |
07:12 | తరువాత, మనం వాస్తవానికి ఏదైనా ఎలిమెంట్ index 7 వద్ద ఉందో లేదో తనిఖీ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. |
07:18 | null element ముందే సృష్టిటించబడింది, కాబట్టి అది Index 7 is present after null comparison అని చూపిస్తుంది. |
07:26 | కాబట్టి గుర్తుంచుకొండి day at index 7 not equal to null అనేది ఒక ఎలిమెంట్ యొక్క ఉనికిని తనిఖీ చేయడానికి సరైన పధ్ధతి కాదు. |
07:34 | ఇది index 7 వద్ద ఒక null element ని సృష్టిస్తుంది. |
07:38 | దానికి బదులు,మనం in operator ను ఉపయోగించాలి. |
07:41 | అది అర్రె లో ఏ అదనపు ఎలిమెంట్ నూ సృష్టిటించదు. దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము. |
07:50 | ఈ ట్యుటొరియల్ లో మనం awk లో Arrays గురించి మరియు |
07:54 | array elements ని ఎలా అసైన్ చేయాలో తెలుసుకున్నాం. |
07:56 | ఇది ఇతర ప్రోగ్రామింగ్ భాశల లోని arrays కంటే ఎంత భిన్నం గా ఉంది. |
08:00 | array యొక్క elements ని సిఫార్సు చేయడం కూడా తెలుసుకున్నాము. |
08:03 | ఒక అస్సైన్మెంట్ గా -array flowerColor ని నిర్వచించండి. |
08:07 | ఇక్కడ ఇండెక్స్ అనేది పూల పేర్లు. |
08:10 | విలువ అనేది పువ్వుల యొక్క సంబంధిత రంగు అవుతుంది. |
08:14 | ఏవైనా ఐదు పువ్వుల పేర్లను దానిలో చేర్చండి. |
08:18 | నాల్గవ పువ్వు యొక్క రంగును ముద్రించండి. ఆ array లో Lotus (తామరపువ్వు) ఉందా అని పరిశీలించండి. |
08:25 | ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దీనిని డౌన్ లోడ్ చేసి చూడండి. |
08:33 | స్పొకెన్ ట్యుటొరియల్ ప్రాజెక్ట్ వర్క్ శాప్ లను నిర్వహిస్తుంది.ఆన్లైన్ పరీక్షలో పాసైన వారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
08:42 | మరింత సమాచారం కోసం మాకు రాయండి. |
08:46 | దయచేసి మీ సమాయంతో కూడిన సందేహాలను ఈ ఫోరమ్ లో పోస్ట్ చేయండి. |
08:50 | స్పొకన్ టుటోరియల్ ప్రాజెక్ట్ కి ఎన్ ఎం ఈ ఐ సి టి, ఎం హెచ్ అర్ డి, భారత ప్రభుత్వం నిధులను సమకూర్చుతుంది. ఈ లింక్ లొ ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఉంది. |
09:01 | ఈ ట్యుటొరియల్ ని తెలుగులోకి అనువదించినది కరణం స్రవంతి. నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు. |