Moodle-Learning-Management-System/C2/Quiz-in-Moodle/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 22:22, 2 May 2019 by Simhadriudaya (Talk | contribs)
Time | Narration |
00:01 | Quiz in Moodle అను స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో మనము ఎలా , Moodleలో ఒక క్విజ్ ని సృష్టించడం మరియు క్విజ్ లో ప్రశ్నల బ్యాంక్ నుండి ప్రశ్నలను ఉపయోగించడం నేర్చుకుంటాము. |
00:16 | ఈ ట్యుటోరియల్ : ఉబుంటు లైనక్స్ OS 16.04,
XAMPP 5.6.30 ద్వారా పొందిన Apache, MariaDB మరియు PHP, Moodle 3.3 మరియు ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ను ఉపయోగించి రికార్డు చేయబడింది. మీరు మీకు నచ్చిన ఏ ఇతర బ్రౌజర్ ని అయినా ఉపయోగించవచ్చు. |
00:40 | ఏమైనప్పటికీ, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ ని వాడకూడదు, ఎందుకంటే అది కొన్ని ప్రదర్శన అసమానతలకు కారణమవుతుంది కనుక. |
00:48 | మేము మీ సైట్ అడ్మినిస్ట్రేటర్, మిమల్ని ఒక టీచర్ గా నమోదు చేసి ఉన్నారని,
మరియు మీకు కనీసం ఒక కోర్స్ ని అసైన్ చేసి ఉన్నారని అనుకుంటాము. |
00:59 | మీరు మీ కోర్స్ యొక్క question bankకి కొన్ని ప్రశ్నలను జోడించారని అనుకుంటాము.
లేక పొతే సంభందిత Moodle ట్యుటోరియల్స్ కోసం ఈ వెబ్సైటు సందర్శించండి. |
01:12 | బ్రౌసర్ కు మారి మీ Moodle site కు లాగిన్ అవ్వండి. |
01:18 | ఎడుమ వైపు ఉన్న navigation మెనూ లో నుండి Calculus course ని క్లిక్ చేయండి. |
01:22 | ఎగువ కుడి వైపు ఉన్న gear ఐకాన్ పై క్లిక్ చేసి ఆపై Turn Editing On ని క్లిక్ చేయండి. |
01:29 | Basic Calculus సెక్షన్ యొక్క దిగువ కుడి భాగం వద్ద ఉన్న Add an activity or resource ని క్లిక్ చేయండి. |
01:37 | క్రిందికి స్క్రోల్ చేసి activity chooser లో Quiz ఎంచుకోండి. |
01:42 | activity chooser యొక్క దిగువ భాగం వద్ద ఉన్న 'Add బటన్ పై క్లిక్ చేయండి. |
01:47 | నేమ్ ఫీల్డ్ లో నేను Quiz 1 - Evolutes and involutes అని టైపు చేస్తాను. |
01:54 | Description ఫీల్డ్ లో నేను చూపించిన విధంగా టెక్స్ట్ ని టైపు చేస్తాను. |
02:00 | Display description on course page అనే చెక్ బాక్స్ ని చెక్ చేయండి. దీని తర్వాత మనము Timing విభాగాన్ని విస్తరిస్తాము. |
02:09 | ఆపై Open the quiz, Close the quiz మరియు Time limitచెక్ బాక్స్ లను ఎనేబుల్ చేస్తాము |
02:17 | ఇది ఇచ్చిన తేదీలలో క్విజ్‌ను ఒక నిర్దిష్ట సమయం వ్యవధి కోసం తెరుస్తుంది మరియు మూసివేస్తుంది. |
02:25 | మీ అవసరాలకు అనుగుణంగా తేదీలను మరియు సమయాన్ని సెట్ చేయండి. నేను ఇక్కడ చూపిన విధంగా వాటిని సెట్ చేశాను. |
02:32 | నేను సమయ పరిధిని 10 నిముషాలు గా సెట్ చేస్తాను. |
02:37 | When time expires ఫీల్డ్ లో మూడు ఎంపిక లు ఉన్నాయి. మీ క్విజ్ కు సరిపోయేది మీరు ఎంచుకోండి. |
02:47 | నేను Open attempts are submitted automaticallyని ఎంచుకుంటాను. ఒక వేళ విద్యార్థి సమర్పించని విఫలమైతే, క్విజ్ 10 నిమిషాల తరువాత స్వయంచాలకంగా సమర్పించబడుతుంది. |
03:01 | మనము గ్రేడ్ విభాగాన్ని విస్తరిద్దాం |
03:05 | Grade to pass ఫీల్డ్ లో నేను, passing grade కోసము 2 టైపు చేస్తాను. ఒక విద్యార్థి ఈ క్విజ్ లో పాస్ అవ్వడానికి కనీసం 2 మార్కులు అవసరమని దీని అర్ధం. |
03:18 | Attempts allowed ఫీల్డ్ లో నేను 1 ఎంచుకుంటాను. మనం అధిక సంఖ్య ను ఎంచుకుంటే, విద్యార్థి అదే క్విజ్‌ను అనేక సార్లు ప్రయత్నించవచ్చు. |
03:32 | Grading method డ్రాప్ డౌన్ డిసేబుల్ చేయబడిందని గమనించండి. |
03:37 | ఇది ఒకటి కంటే ఎక్కువ ప్రయత్నాలు అనుమతించినప్పుడు మాత్రమే ఎనేబుల్ అవుతుంది. ఉపాద్యాయులు ఏ ప్రయత్నాన్ని గ్రేడ్ చేయాలో ఎంచుకోవచ్చు. |
03:47 | ఇప్పుడు Layout సెక్షన్ ని విస్తరించండి. ఇక్కడ, క్విజ్ యొక్క లేఅవుట్‌ను పేర్కొనడానికి ఎంపికలు ఉన్నాయి. |
03:56 | డిఫాల్ట్ గా New page ఫీల్డ్ డ్రాప్ డౌన్ లో Every question అనే ఎంపిక ఎంచుకోబడుతుంది. |
04:04 | అన్ని ఎంపికలను చూడడానికి New page field డ్రాప్ డౌన్ ని క్లిక్ చేయండి. |
04:09 | నేను Every 2 questions ఎంపికని ఎంచుకుంటాను. మీరు మీకు నచ్చిన ఏ ఇతర ఎంపిక నైనా ఎంచుకోవచ్చు. |
04:17 | ఆ తర్వాత Question behaviour సెక్షన్ ని విస్తరిస్తాము. |
04:22 | Shuffle within questions డ్రాప్ డౌన్ కోసం Yes ఎంచుకోండి. |
04:27 | ఆలా చేయడం వలన ప్రతి ప్రశ్నలోని అన్ని ఎంపికలు, షఫుల్ చేయబడతాయి. |
04:33 | దాని వలన, ప్రతి విద్యార్థి వారి క్విజ్ లో వేర్వేరు ప్రశ్నలు మరియు ఎంపికల యొక్క వివిధ అమరిక ను చూస్తారు. |
04:40 | How questions behave డ్రాప్ డౌన్ కోసం ఉన్న help ఐకాన్ పై క్లిక్ చేసి, వివరాలు చదవండి. |
04:47 | నేను Deferred feedback అనే ఎంపిక ని ఎంచుకుంటాను. దీనితో నా విద్యార్ధులు వారి ప్రయత్నాన్ని సమర్పించిన తర్వాత నే ఫీడ్ బ్యాక్ ని చూస్తారు. |
04:57 | తర్వాత Overall feedback సెక్షన్ ని విస్తరించుటకు దాని పై క్లిక్ చేయండి. |
05:02 | Overall feedback అనే టెక్స్ట్ ఒక విద్యార్థికి క్విజ్ సమర్పించిన మరియు స్వీయ-గ్రేడ్ అయిన తర్వాత చూపబడుతుంది. |
05:10 | విద్యార్థి పొందిన గ్రేడ్ ఆధారంగా ఉపాధ్యాయులు విభిన్న ఫీడ్‌బ్యాక్ లు ఇవ్వగలరు. |
05:17 | నేను గ్రేడ్ boundary 100% కోసం ఫీడ్‌బ్యాక్ Excellent performance గా టైప్ చేస్తాను. |
05:25 | 50% మరియు 100% మధ్య స్కోర్ చేసిన విద్యార్థులు 'Excellent performance అనే సందేశాన్ని చూస్తారు. |
05:33 | మరియు గ్రేడ్ boundary 50% కోసం ఫీడ్‌బ్యాక్ You need to work harder అని చూస్తారు. |
05:40 | 0% మరియు 49.99% మధ్య స్కోర్ చేస్తున్న విద్యార్దులు మీరు You need to work harder అని చూస్తారు. |
05:49 | ఇప్పుడు క్రిందికి స్క్రోల్ చేసి Activity completionసెక్షన్ పై క్లిక్ చేయండి. |
05:54 | Completion Tracking field డ్రాప్ డౌన్ ని క్లిక్ చేయండి. Show activity as complete when conditions are met అనే ఎంపిక ని ఎంచుకోండి. |
06:05 | Require grade మరియు Require passing grade అనే చెక్-బాక్స్ లు చెక్ చేయండి. |
06:13 | చివరిగా పేజీ యొక్క దిగువ భాగం వద్ద ఉన్న Save and display బటన్ పై క్లిక్ చేయండి. |
06:20 | మనము ఇచ్చిన క్విజ్ శీర్షికతో ఒక క్రొత్త పేజీకి మళించబడుతాము . ఇంతకు ముందు ఇవ్వబడిన అన్ని వివరాలు ఇక్కడ చూపబడినవి ధృవీకరించండి. |
06:31 | ఇక్కడ మీరు No questions have been added yet అని ప్రముఖంగా ప్రదర్శించబడే ఒక సందేశాన్ని చూడవచ్చు |
06:38 | క్విజ్ కు ప్రశ్నలను జోడించడానికి Edit quiz బటన్ ని క్లిక్ చేయండి. |
06:44 | ఎగువ కుడి భాగం లో Maximum grade గా 4 టైపు చేయండి. |
06:50 | క్విజ్ విభాగం యొక్క ఎడమవైపున ఉన్న పెన్సిల్ ఐకాన్, ఈ క్విజ్ శీర్షికను సవరించడానికి మీకు అనుమతిస్తుంది.
క్విజ్ లో బహుళ విభాగాలు ఉన్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది. |
07:03 | నేను Section 1 అని టైపు చేసి 'Enter నొక్కుతాను. |
07:08 | కుడి వైపు ఉన్న Shuffle చెక్ బాక్స్ ని చెక్ చేయండి. ఇది క్విజ్ ని ప్రయత్నించిన ప్రతిసారీ ప్రశ్నలు యాదృచ్చికంగా క్రమం చేయబడుతాయని నిర్ధారిస్తుంది. |
07:20 | Shuffle చెక్ బాక్స్ క్రింద ఉన్న Add లింక్ ని క్లిక్ చేయండి. |
07:25 | ఇక్కడ a new question, from question bank, a random question అనే మూడు ఎంపిక లు ఉన్నాయి. |
07:34 | పేరుకు తగినట్లు గా a new question లింక్, ఒక కొత్త ప్రశ్న ను జోడించుటకు వీలు కలిగిస్తుంది. కాబట్టి నేను ఈ ఎంపిక ను ఎంచుకొను. |
07:44 | from question bank లింక్ ని క్లిక్ చేయండి. |
07:48 | pop-up విండో తెరుచుకుంటుంది. ఈ ఎంపిక ప్రతి విద్యార్థి కి ఒక నిర్దిష్ట ప్రశ్నల సెట్ కావాలనుకుంటే ఉపయోగపడుతుంది. |
07:58 | ఎంచుకున్న క్యాటగిరీ ఆ కోర్స్ కోసం డిఫాల్ట్ క్యాటగిరీ అవుతుంది. |
08:04 | Also show questions from subcategories అనే ఎంపిక డిఫాల్ట్ గా ఎంచుకోబడుతుంది. |
08:12 | Also show old questions ఎంపిక మునుపటి క్విజ్లు లో ఉపయోగించిన ప్రశ్నలను చూపుతుంది. |
08:19 | నేను ఇప్పుడు చేస్తున్నట్లుగా, మీరు జోడించదలిచిన ప్రశ్నలను ఎంచుకోవచ్చు. ఆపై దిగువ భాగం వద్ద ఉన్న Add selected questions to the quiz పై క్లిక్ చేయండి. |
08:32 | అయిన్పటికీ అది నేను చేయను. కుడి ఎగువ భాగం వద్ద ఉన్న X ఐకాన్ పై క్లిక్ చేసి ఈ విండో ని మూసి వేస్తాను |
08:40 | Shuffle క్రింద ఉన్న Add లింక్ ని మళ్ళీ క్లిక్ చేయండి. a random question లింక్ ని క్లిక్ చేయండి. మరో పాప్ అప్ విండో తెరుచుకుంటుంది. |
08:51 | ఈ ఎంపిక తో ప్రతి విద్యార్థి ఒక భిన్నమైన ప్రశ్నల సెట్ ను చూస్తారు. క్విజ్‌ను ప్రయత్నిస్తున్నప్పుడు సమాధానాలను చర్చించడానికి వారికి వీలుపడదు. |
09:03 | Random question from an existing category క్రింద నేను కేటగిరీ గా Evolutes ని ఎంచుకుంటాను. |
09:11 | Number of random questions లో నేను 2 ఎంచుకుంటాను. |
09:16 | ఈ డ్రాప్ డౌన్ క్రింద ఉన్న Add random question ని క్లిక్ చేయండి. |
09:23 | Evolutes క్యాటగిరీ నుండి ఈ క్విజ్ కు రెండు యాదృచ్చిక ప్రశ్నలు జోడించబడ్డాయి. |
09:29 | దిగువ కుడి భాగం నుండి మళ్ళి Add లింక్ ని క్లిక్ చేయండి. |
09:34 | a random question లింక్ ను క్లిక్ చేయండి. క్యాటగిరీ ని Involutes గా మరియు Number of random questions ని 2 గా ఎంచుకోండి. |
09:44 | ఆపై Add random question బటన్ క్లిక్ చేయండి |
09:48 | ఈ క్విజ్ కు Involutes నుండి మరో రెండు ప్రశ్నలు జోడించ బడ్డాయి. |
09:55 | క్విజ్ స్వయంచాలకంగా రెండు పేజీ లు గా విభజించబడినదని గమనించండి. ఎందుకంటే మనం ఇదివరకే ఈ ఎంపిక ని Quiz Settings లో ఇచ్చియున్నాము. |
10:07 | కుడి భాగం లో, రెండవ ప్రశ్న క్రిందన ఉన్న add లింక్ పై క్లిక్ చేయండి. |
10:13 | a new section heading లింక్ ని క్లిక్ చేయండి. |
10:18 | heading యొక్క పేరు ను సవరించడానికి pencil ఐకాన్ ని క్లిక్ చేయండి. |
10:23 | నేను Section 2 అని టైపు చేసి Enter నొక్కుతాను. |
10:27 | క్విజ్ ని సేవ్ చేయడానికి కుడి ఎగువన ఉన్న Save బటన్ ని క్లిక్ చేయండి. |
10:32 | ప్రతి క్విజ్ ప్రశ్న యొక్క కుడి వైపున 2 చిహ్నాలు ఉన్నాయి, అవి Preview question మరియు Delete
అవి స్వీయ-వివరణాత్మకమైనవి. |
10:43 | Delete question ఎంపిక ఈ ప్రశ్న ని క్విజ్ నుండి తొలగిస్తుంది, కానీ ఆ ప్రశ్న, ప్రశ్నల బ్యాంకులో ఇంకా ఉనికిలోనే ఉంటుంది |
10:51 | breadcrumbs లో క్విజ్ యొక్క పేరు ని క్లిక్ చేయండి. |
10:56 | కుడి వైపున gear మెనూ లో ఉన్న Preview quiz బటన్ ని క్లిక్ చేయండి. |
11:02 | ఇది నిర్ధారణ విండో తెరుచుకుంటుంది. అది విద్యార్థులకు క్విజ్ సమయం తో కూడినదని మరియు వారు క్విజ్ కోసం Start లేదా Cancel ఎంపికలు కలిగి ఉన్నారని తెలియచేస్తుంది. |
11:14 | నేను Start attempt బటన్ ని క్లిక్ చేస్తాను. |
11:18 | Quiz navigation block క్విజ్ యొక్క కుడి భాగం లో ఉంది. |
11:23 | ఇది ప్రశ్నలను విభాగాల-వారీగా టైమర్ తో పాటు చూపుతుంది. |
11:29 | ఈ ఫీల్డ్ నుండి ప్రశ్నని నేరుగా సవరించడానికి ఒక ఎంపిక కూడా ఉంది. |
11:35 | నేను navigation block లో Finish attempt లింక్ ను క్లిక్ చేస్తాను. |
11:40 | ప్రతి ప్రశ్న యొక్క స్థితి ప్రశ్న పేరు పక్కన చూపబడుతుంది. |
11:45 | పేజీ యొక్క దిగువన ఉన్న Submit all and finish బటన్ ని క్లిక్ చేయండి. |
11:51 | నిర్ధారణ పాప్-అప్ లో మళ్ళి Submit all and finish బటన్ పై క్లిక్ చేయండి. |
11:58 | grade, overall feedback మరియు ప్రశ్నయొక్క నిర్దిష్ట feedback ఇక్కడ చూపబడుతున్నాయి. |
12:06 | క్రిందికి స్క్రోల్ చేసి Finish review లింక్ పై క్లిక్ చేయండి. |
12:11 | మనము Quiz summary పేజీ కి మళ్ళి వచ్చాము. |
12:15 | పేజీ యొక్క ఎగువ కుడి భాగం వద్ద ఉన్న gear ఐకాన్ ని క్లిక్ చేయండి. Edit quiz లింక్ ని క్లిక్ చేయండి. మీరు క్విజ్ నుండి ప్రశ్నలను జోడించవచ్చు లేదా తొలగించవచ్చు. |
12:28 | ఏమైనప్పటికీ, ఇది ఏ విద్యార్ధి క్విజ్ ని ప్రయత్నించక ముందు మాత్రమే చేయబడుతుంది. |
12:35 | ఒక్క విద్యార్ధి కూడా క్విజ్ ప్రయత్నించినప్పటికీ, క్విజ్ లాక్ చేయబడింది. ఏమైనప్పటికీ ప్రశ్నలను , సవరించవచ్చు లేదా లేదా అవసరమైతే జోడించబవచ్చు. |
12:47 | దీని తో మనము ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము. సారాంశం చూద్దాం. |
12:53 | ఈ ట్యుటోరియల్ లో మనము ఎలా
Moodle లో ఒక క్విజ్ ని సృష్టించడం క్విజ్ లో Question బ్యాంకు లో నుండి ప్రశ్నలను ఉపయోగించడం నేర్చుకున్నాము. |
13:03 | ఇక్కడ మీకు ఒక అసైన్మెంట్ ఉంది.
evolutes కోసం ఒక క్విజ్ ని జోడించండి. వివరాల కోసం ఈ ట్యుటోరియల్ యొక్క అసైన్మెంట్ లింక్ ని చూడండి. |
13:16 | ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
13:25 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి. |
13:34 | ఈ ఫోరమ్ లో మీ సమయంతో కూడిన సందేహాలను పోస్ట్ చేయండి. |
13:38 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.
ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
13:52 | ఈ రచన కు సహాయ పడినవారు మాధురి మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. |
14:03 | మాతో చేరినందుకు ధన్యవాదములు. |