Moodle-Learning-Management-System/C2/Blocks-in-Admin-Dashboard/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 21:43, 10 March 2019 by Madhurig (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 Blocks in Admin's Dashboard అను స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్ లో మనం:

blocks ను జోడించడం మరియు తొలగించడం ఇంకా Front page ను సెట్ చేయడం ఎలా చేయాలో నేర్చుకుంటాము.

00:18 ఈ ట్యుటోరియల్ ని రికార్డు చేయటానికి,

నేను ఉబుంటు లైనక్స్ OS 16.04

00:26 Apache, MariaDB మరియు XAMPP 5.6.30 ద్వారా పొందిన PHP
00:35 Moodle 3.3 మరియు Firefox వెబ్ బ్రౌజర్ లను ఉపయోగిస్తున్నాను.
00:41 మీరు మీకు నచ్చిన ఏదయినా ఇతర వెబ్ బ్రౌజర్ ను ఉపయోగించవచ్చు.

ఏమైనప్పటికీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ తప్పించబడాలి, ఎందుకంటే అది కొన్ని ప్రదర్శనా అసమానతలకు కారణమవుతుంది కనుక.

00:54 ఈ టుటోరైల్ యొక్క అభ్యాసకులకు Admin’s dashboard యొక్క ప్రాధమిక అవగాహన ఉండాలి.

ఒకవేళ లేకపోతే, దయచేసి ఈ వెబ్సైట్ పై సంబంధిత Moodle ట్యుటోరియల్స్ ను చూడండి.

01:08 బ్రౌజర్ కు మారి మీ Moodle site ను తెరవండి.

XAMPP service అనేది నడుస్తుందని నిర్దారించుకోండి.

01:17 మీ admin username మరియు password వివరాలతో లాగిన్ అవ్వండి.
01:22 మనం ఇప్పుడు Admin’s dashboard లో ఉన్నాము.
01:26 గుర్తు చేసుకోండి: బ్లాక్స్ ఒక ప్రత్యేక ఉద్దేశ్యం లేదా సమాచారాన్ని అందిస్తాయి.

మరియు అవి Moodle యొక్క అన్ని పేజీలలో కనిపిస్తాయి.

01:38 ఇప్పుడు మనము Moodle Blocks తో ఎలా పనిచేయగలమో అనేది అర్థం చేసుకుందాం.
01:44 ఉపయోగించబడిన థీమ్ పై ఆధారపడి, బ్లాక్స్ కుడిభాగం పైన లేదా రెండు భాగాలపైనా ఉండవచ్చు.
01:52 ఏదయితే సమాచారాన్ని ప్రజలు వారు లాగిన్ అయినపుడు చూడాలని అనుకుంటున్నామో, దానిని బ్లాక్స్ కలిగి ఉంటాయి.
01:58 Moodle లో అనేక రకాల బ్లాక్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.

మరియు వాటిని మన ప్రాధాన్యతల ప్రకారం సులభంగా తరలించవచ్చు లేదా ఏర్పాటు చేయవచ్చు.

02:09 మనము ఇప్పుడు మన డాష్బోర్డ్ కు కొన్ని బ్లాక్స్ ను జోడిస్తాము.
02:14 పేజీ యొక్క ఎడమవైపున ఉన్న navigation menu పై క్లిక్ చేయండి.
02:19 డాష్బోర్డ్ యొక్క కుడి చేతి భాగం పై ఉన్న Customise this page బటన్ పై క్లిక్ చేయండి.
02:26 కొత్త మెను ఐటమ్ Add a block ఇప్పుడు కనిపిస్తుందని గమనించండి.

Add a block పై క్లిక్ చేయండి.

02:35 ఒక కొత్త పాప్-అప్ విండో తెరుచుకుంటుంది.

మనము జోడించాలి అనుకుంటున్నబ్లాక్ యొక్క రకాన్ని ఎంచుకోవాల్సిన అవసరం ఉంది.

02:43 ఉదాహరణ కొరకు, Messages పై క్లిక్ చేయండి,

Messages block ఇప్పుడు డాష్బోర్డ్ లో కనిపిస్తుందని మీరు చూడవచ్చు.

02:53 ప్రస్తుతం అక్కడ ఎటువంటి సందేశాలు లేవు.
02:56 అప్రమేయంగా, అన్ని క్రొత్త బ్లాక్స్ కుడి-నిలువు వరుసకు జోడించబడతాయి.
03:02 మనం మరొక బ్లాక్ ను జోడిద్దాం.

ఎడమవైపు ఉన్న Add a block మెనూ పై క్లిక్ చేయండి.

03:09 menu types యొక్క జాబితా నుండి HTMLను ఎంచుకోండి.

HTML block అనేది, ఒకరు కస్టమ్ HTML ను రాసుకోగలిగే ఒక బ్లాక్.

03:19 దీన్ని ఉపయోగించి, మనము విడ్జెట్లు, లైబ్రరీ విడ్జెట్లు, న్యూస్ ఫీడ్ లు, ట్విట్టర్, ఫేస్బుక్, మొదలైనటువంటి వాటిని పొందుపరచవచ్చు.
03:30 ఒక NEW HTML BLOCK ఇపుడు Messages block క్రింద జోడించబడింది అని గమనించండి.
03:37 HTML బ్లాక్ లో గేర్ ఐకాన్ పై క్లిక్ చేయండి.

తరువాత Configure (NEW HTML BLOCK) block పై క్లిక్ చేయండి.

03:46 Configure HTML block:

Block settings, Where this block appears మరియు On this page అనే 3 విభాగాలను కలిగి ఉంటుంది.

03:57 అప్రమేయంగా, మొదటి విభాగం విస్తరించబడింది.
04:02 అన్ని విభాగాలను విస్తరించడానికి Expand all పై క్లిక్ చేయండి.
04:07 block టైటిల్ లో Things to do అని టైప్ చేద్దాం.
04:12 Content area లో, ఈ admin user కొరకు కొన్ని టాస్క్ లను జోడిద్దాం.
04:19 ఈ క్రింది వాటిని టైప్ చేయండి: Create a new course, Create new users, Add users to the course
04:30 editor అనేది ఒక HTML editor మరియు దీనిని ఏదయినా ఇతర word processor లేదా editor గా ఉపయోగించవచ్చు.
04:39 Where this block appears క్రింద ఉన్న ఎంపికలను చూడడానికి స్క్రోల్ చేయండి.
04:45 Default region కింద Content ను ఎంచుకోండి.

Default weight లో, -10 ని ఎంచుకోండి.

04:54 ఒక బ్లాక్ యొక్క బరువు తక్కువ ఉంటే, ఆ ప్రాంతంలో అది అంత పైన కనిపిస్తుంది.

-10 అనేది చాలా తక్కువ.

05:03 -10 ఎంచుకోవడం ద్వారా, నేను అది కంటెంట్ ప్రాంతం యొక్క పైభాగం వద్ద ఉందని నిర్దారిస్తున్నాను.
05:12 ఈ బ్లాక్ Admin’s dashboard పైన కనిపిస్తుంది.
05:17 ఇప్పుడు On this page విభాగం వస్తుంది.

ఎక్కడ ఈ బ్లాక్ జోడించబడిందో ఆ పేజీ కొరకు మీరు ఆకృతీకరణను ఇక్కడ నిర్వచించవచ్చు.

05:28 మన కేసు లో అది ఈ dashboard.

ఈ కాన్ఫిగరేషన్ పై విభాగంలో నిర్వచించిన అప్రమేయ ఆకృతీకరణను భర్తీ చేస్తుంది.

05:40 అంటే అది Where this block appears విభాగం.

మనం ఈ విభాగంలో Region లో Content ను మరియు Weight లో -10 ని ఎంచుకుందాం.

05:53 దయచేసి గమనించండి, బ్లాక్ యొక్క రకంపై ఆధారపడి, కాన్ఫిగరేషన్ సెట్టింగులు మారుతాయి.
06:01 మార్పులను సేవ్ చేయడానికి Save Changes ను క్లిక్ చేయండి మరియు dashboard కు తిరిగి వెళ్ళండి.
06:07 కొత్త HTML block, Things to do అనే శీర్షిక తో కనిపిస్తుంది చుడండి.

మరియు ఇది కంటెంట్ ప్రాంతంలో అగ్రస్థానం లో ఉన్న బ్లాక్.

06:18 Move ఐకాన్ ను ఉపయోగించి దాన్ని లాగడం ద్వారా బ్లాక్ యొక్క స్థానాన్ని కూడా మనం మార్చవచ్చు.
06:25 Things to do block ని Course Overview block క్రిందకి డ్రాగ్ మరియు డ్రాప్ ద్వారా తరలిద్దాం.
06:34 మనము కొన్ని నిముషాల ముందు అమర్చిన ఆకృతీకరణను ఇది ఎలా మారుస్తుందో చూద్దాం.
06:40 gear ఐకాన్ పై క్లిక్ చేసి ఆపై Configure Things to do block పై తరువాత Expand All పై క్లిక్ చేయండి.
06:49 On this page విభాగాన్ని చూడడానికి క్రిందికి స్క్రోల్ చెయ్యండి. బరువు -2 కు మార్చబడింది.

default weight ఏమయినా, అదే విధంగా ఉంటుంది.

07:03 dashboard కు తిరిగి వెళ్ళడానికి Cancel ను క్లిక్ చేయండి.
07:07 మనకు ఈ Learning Plans block అవసరం లేదు, కనుక దీనిని తొలగిద్దాం.

gear ఐకాన్ పై క్లిక్ చేసి, Delete Learning plans block పై క్లిక్ చేయండి.

07:19 Confirm పాప్ అప్ విండో కన్పిస్తుంది మరియు ఈ తొలగింపు గురించి నిర్ధారించడానికి మనల్ని ప్రాంప్ట్ చేస్తుంది.

ఇక్కడ Yes బటన్ పై క్లిక్ చేయండి.

07:29 Learning Plans block ఇకపై అందుబాటులో ఉండదని గమనించండి.

తరువాత ఒకవేళ అవసరమైతే మనము ఈ బ్లాక్ ను జోడించవచ్చు.

07:40 ఇప్పుడు మనము మన Moodle ఇన్స్టాలేషన్ యొక్క front page ని కస్టమైజ్ చేద్దాం.
07:46 ఎడమ వైపు మెనులో Site Administrationలింకుపై క్లిక్ చేయండి.
07:51 Front page విభాగం లో Front Page settings ను కనుగొనడానికి స్క్రోల్ చేసి దానిపై క్లిక్ చేయండి.
08:00 Full Site Name ను Digital India Learning Management System కు మార్చుదాం.
08:08 ఈ టెక్స్ట్ ప్రతి పేజీ ఎగువభాగం వద్ద breadcrumbs పైన కనిపిస్తుంది.
08:15 Short name అనేది టెక్స్ట్, పేజియొక్క శీర్షికలో కనిపిస్తుంది.
08:20 మనము ఉన్న పేజీ యొక్క పేరు చేత అనుసరిస్తూ ఈ పేజీ యొక్క శీర్షిక Digital India LMS ఉంటుంది గమనించండి.
08:29 మనము ఏ లోగో చిత్రం అందించకపోతే, Short name లోగో చిహ్నంగా కూడా ఉపయోగించబడుతుంది.

మనము దానిని ఎలా ఉన్నది ఆలా వదిలివేస్తాము.

08:40 Front page ఐటమ్ ల కొరకు డ్రాప్ డౌన్ లను చూడటానికి స్క్రోల్ చేయండి.

ఇవి front page పై చూపగల ఐటమ్ ల యొక్క జాబితా.

08:50 సందర్శకులు అందరూ, వారు లాగిన్ ఆయిన్ అవ్వకపోయినా, ఈ ఐటమ్ లను చూడగలరు.
08:57 ఈ క్రమం అనేది ఒక combination box చేత నిర్ణయించబడుతుంది.

మనము దానిని ఎలా ఉన్నది ఆలా వదిలివేస్తాము.

09:05 కనుక అందరు యూజర్ లు అందుబాటులో ఉంటే కోర్సుల జాబితా ను చూడగలరు అంతకంటే ఏమీ లేదు.
09:13 తరువాతది Front page items when logged in.

ఈ ఐటమ్ ల యొక్క జాబితా అనేది ఎవరైతే లాగిన్ అయిన యూజర్లు ఉంటారో వారికి కనిపిస్తుంది.

09:24 మొదటి డ్రాప్ డౌన్ లో Enrolled courses ను ఎంచుకుందాం.
09:29 మనము మిగిలిన ఎంపికలను వాటియొక్క అప్రమేయ విలువలతో అలాగే వదిలివేస్తాము.
09:35 స్క్రోల్ చేసి Save Changes పై క్లిక్ చేయండి.
09:40 సారాంశం చూద్దాం.
09:43 ఈ ట్యుటోరియల్ లో, మనము:

Things to doఅని పిలవబడే ఒక HTML block ను జోడించడం మరియు పేజిపైన ఎక్కడ కనిపించాలో నిర్దేశించడం నేర్చుకున్నాము.

09:54 మనము అతిథులు మరియు లాగ్-ఇన్ చేసిన యూజర్ల కొరకు frontpage సెటప్ ని కూడా నేర్చుకున్నాము.
10:00 ఇక్కడ మీ కొరకు ఒక అసైన్మెంట్:

Private files block ను తొలగించండి. Code files లింక్ లో ఇవ్వబడిన మార్గదర్శకాలను ఉపయోగించి ఒక కొత్త HTML block ను జోడించండి.

10:14 ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.

దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.

10:23 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.

మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి.

10:33 దయచేసి ఈ ఫోరమ్లో మీ ప్రశ్నలను సమయం తో పాటు పోస్ట్ చేయండి.
10:37 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.
10:51 నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya