Moodle-Learning-Management-System/C2/Blocks-in-Admin-Dashboard/Telugu
Time | Narration |
00:01 | Blocks in Admin's Dashboard అను స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:08 | ఈ ట్యుటోరియల్ లో మనం:
blocks ను జోడించడం మరియు తొలగించడం ఇంకా Front page ను సెట్ చేయడం ఎలా చేయాలో నేర్చుకుంటాము. |
00:18 | ఈ ట్యుటోరియల్ ని రికార్డు చేయటానికి,
నేను ఉబుంటు లైనక్స్ OS 16.04 |
00:26 | Apache, MariaDB మరియు XAMPP 5.6.30 ద్వారా పొందిన PHP |
00:35 | Moodle 3.3 మరియు Firefox వెబ్ బ్రౌజర్ లను ఉపయోగిస్తున్నాను. |
00:41 | మీరు మీకు నచ్చిన ఏదయినా ఇతర వెబ్ బ్రౌజర్ ను ఉపయోగించవచ్చు.
ఏమైనప్పటికీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ తప్పించబడాలి, ఎందుకంటే అది కొన్ని ప్రదర్శనా అసమానతలకు కారణమవుతుంది కనుక |
00:54 | ఈ టుటోరైల్ యొక్క అభ్యాసకులకు Admin’s dashboard యొక్క ప్రాధమిక అవగాహన ఉండాలి
ఒకవేళ లేకపోతే,దయచేసి ఈ వెబ్సైట్ పై సంబంధిత Moodle ట్యుటోరియల్స్ ను చూడండి |
01:08 | బ్రౌజర్ కు మారి మీ Moodle site ను తెరవండి.
XAMPP service అనేది నడుస్తుందని నిర్దారించుకోండి. |
01:17 | మీ admin username మరియు password వివరాలతో లాగిన్ అవ్వండి. |
01:22 | మనం ఇప్పుడు Admin’s dashboard లో ఉన్నాము. |
01:26 | గుర్తు చేసుకోండి: బ్లాక్స్ ఒక ప్రత్యేక ఉద్దేశ్యం లేదా సమాచారాన్ని అందిస్తాయి.
మరియు అవి Moodle యొక్క అన్ని పేజీలలో కనిపిస్తాయి. |
01:38 | ఇప్పుడు మనము Moodle Blocks తో ఎలా పనిచేయగలమో అనేది అర్థం చేసుకుందాం. |
01:44 | ఉపయోగించబడిన థీమ్ పై ఆధారపడి, బ్లాక్స్ కుడిభాగం పైన లేదా రెండు భాగాలపైనా ఉండవచ్చు. |
01:52 | ఏదయితే సమాచారాన్ని ప్రజలు వారు లాగిన్ అయినపుడు చూడాలని అనుకుంటున్నామో, దానిని బ్లాక్స్ కలిగి ఉంటాయి. |
01:58 | Moodle లో అనేక రకాల బ్లాక్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.
మరియు వాటిని మన ప్రాధాన్యతల ప్రకారం సులభంగా తరలించవచ్చు లేదా ఏర్పాటు చేయవచ్చు. |
02:09 | మనము ఇప్పుడు మన డాష్బోర్డ్ కు కొన్ని బ్లాక్స్ ను జోడిస్తాము. |
02:14 | పేజీ యొక్క ఎడమవైపున ఉన్న navigation menu పై క్లిక్ చేయండి. |
02:19 | డాష్బోర్డ్ యొక్క కుడి చేతి భాగం పై ఉన్న Customise this page బటన్ పై క్లిక్ చేయండి. |
02:26 | కొత్త మెను ఐటమ్ Add a block ఇప్పుడు కనిపిస్తుందని గమనించండి.
Add a block పై క్లిక్ చేయండి. |
02:35 | ఒక కొత్త పాప్-అప్ విండో తెరుచుకుంటుంది.
మనము జోడించాలి అనుకుంటున్నబ్లాక్ యొక్క రకాన్ని ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. |
02:43 | ఉదాహరణ కొరకు, Messages పై క్లిక్ చేయండి,
Messages block ఇప్పుడు డాష్బోర్డ్ లో కనిపిస్తుందని మీరు చూడవచ్చు. |
02:53 | ప్రస్తుతం అక్కడ ఎటువంటి సందేశాలు లేవు. |
02:56 | అప్రమేయంగా, అన్ని క్రొత్త బ్లాక్స్ కుడి-నిలువు వరుసకు జోడించబడతాయి. |
03:02 | మనం మరొక బ్లాక్ ను జోడిద్దాం.
ఎడమవైపు ఉన్న Add a block మెనూ పై క్లిక్ చేయండి. |
03:09 | menu types యొక్క జాబితా నుండి HTMLను ఎంచుకోండి.
HTML block అనేది, ఒకరు కస్టమ్ HTML ను రాసుకోగలిగే ఒక బ్లాక్. |
03:19 | దీన్ని ఉపయోగించి, మనము విడ్జెట్లు, లైబ్రరీ విడ్జెట్లు, న్యూస్ ఫీడ్ లు, ట్విట్టర్, ఫేస్బుక్, మొదలైనటువంటి వాటిని పొందుపరచవచ్చు. |
03:30 | ఒక NEW HTML BLOCK ఇపుడు Messages block క్రింద జోడించబడింది అని గమనించండి. |
03:37 | . HTML బ్లాక్ లో గేర్ ఐకాన్ పై క్లిక్ చేయండి.
తరువాత Configure (NEW HTML BLOCK) block పై క్లిక్ చేయండి. |
03:46 | Configure HTML block:
Block settings, Where this block appears మరియు On this page అనే 3 విభాగాలను కలిగి ఉంటుంది. |
03:57 | అప్రమేయంగా, మొదటి విభాగం విస్తరించబడింది. |
04:02 | అన్ని విభాగాలను విస్తరించడానికి Expand all పై క్లిక్ చేయండి. |
04:07 | block టైటిల్ లో Things to do అని టైప్ చేద్దాం. |
04:12 | Content area లో, ఈ admin user కొరకు కొన్ని టాస్క్ లను జోడిద్దాం. |
04:19 | ఈ క్రింది వాటిని టైప్ చేయండి: Create a new course, Create new users, Add users to the course |
04:30 | editor అనేది ఒక HTML editor మరియు దీనిని ఏదయినా ఇతర word processor లేదా editor గా ఉపయోగించవచ్చు. |
04:39 | Where this block appears క్రింద ఉన్న ఎంపికలను చూడడానికి స్క్రోల్ చేయండి. |
04:45 | Default region కింద Content ను ఎంచుకోండి.
Default weight లో, -10 ని ఎంచుకోండి. |
04:54 | ఒక బ్లాక్ యొక్క బరువు తక్కువ ఉంటే, ఆ ప్రాంతంలో అది అంత పైన కనిపిస్తుంది.
-10 అనేది చాలా తక్కువ. |
05:03 | -10 ఎంచుకోవడం ద్వారా, నేను అది కంటెంట్ ప్రాంతం యొక్క పైభాగం వద్ద ఉందని నిర్దారిస్తున్నాను. |
05:12 | ఈ బ్లాక్ Admin’s dashboard పైన కనిపిస్తుంది. |
05:17 | ఇప్పుడు On this page విభాగం వస్తుంది.
ఎక్కడ ఈ బ్లాక్ జోడించబడిందో ఆ పేజీ కొరకు మీరు ఆకృతీకరణను ఇక్కడ నిర్వచించవచ్చు. |
05:28 | మన కేసు లో అది ఈ dashboard.
ఈ కాన్ఫిగరేషన్ పై విభాగంలో నిర్వచించిన అప్రమేయ ఆకృతీకరణను భర్తీ చేస్తుంది. |
05:40 | అంటే అది Where this block appears విభాగం.
మనం ఈ విభాగంలో Region లో Content ను మరియు Weight లో -10 ని ఎంచుకుందాం. |
05:53 | దయచేసి గమనించండి, బ్లాక్ యొక్క రకంపై ఆధారపడి, కాన్ఫిగరేషన్ సెట్టింగులు మారుతాయి. |
06:01 | మార్పులను సేవ్ చేయడానికి Save Changes ను క్లిక్ చేయండి మరియు dashboard కు తిరిగి వెళ్ళండి. |
06:07 | కొత్త HTML block, Things to do అనే శీర్షిక తో కనిపిస్తుంది చుడండి
మరియు ఇది కంటెంట్ ప్రాంతంలో అగ్రస్థానం లో ఉన్న బ్లాక్. |
06:18 | Move ఐకాన్ ను ఉపయోగించి దాన్ని లాగడం ద్వారా బ్లాక్ యొక్క స్థానాన్ని కూడా మనం మార్చవచ్చు. |
06:25 | Things to do block ని Course Overview block క్రిందకి డ్రాగ్ మరియు డ్రాప్ ద్వారా తరలిద్దాం |
06:34 | మనము కొన్ని నిముషాల ముందు అమర్చిన ఆకృతీకరణను ఇది ఎలా మారుస్తుందో చూద్దాం. |
06:40 | gear ఐకాన్ పై క్లిక్ చేసి ఆపై Configure Things to do block పై తరువాత Expand All పై క్లిక్ చేయండి. |
06:49 | On this page విభాగాన్ని చూడడానికి క్రిందికి స్క్రోల్ చెయ్యండి. బరువు -2 కు మార్చబడింది.
default weight ఏమయినా, అదే విధంగా ఉంటుంది. |
07:03 | dashboard కు తిరిగి వెళ్ళడానికి Cancel ను క్లిక్ చేయండి. |
07:07 | మనకు ఈ Learning Plans block అవసరం లేదు, కనుక దీనిని తొలగిద్దాం.
gear ఐకాన్ పై క్లిక్ చేసి ఆపై Delete Learning plans block పై క్లిక్ చేయండి. |
07:19 | Confirm పాప్ అప్ విండో కన్పిస్తుంది మరియు ఈ తొలగింపు గురించి నిర్ధారించడానికి మనల్ని ప్రాంప్ట్ చేస్తుంది.
ఇక్కడ Yes బటన్ పై క్లిక్ చేయండి. |
07:29 | Learning Plans block ఇకపై అందుబాటులో ఉండదని గమనించండి.
తరువాత ఒకవేళ అవసరమైతే మనము ఈ బ్లాక్ ను జోడించవచ్చు. |
07:40 | ఇప్పుడు మనము మన Moodle ఇన్స్టాలేషన్ యొక్క front page ని కస్టమైజ్ చేద్దాం. |
07:46 | ఎడమ వైపు మెనులో Site Administrationలింకుపై క్లిక్ చేయండి. |
07:51 | Front page విభాగం లో Front Page settings ను కనుగొనడానికి స్క్రోల్ చేసి దానిపై క్లిక్ చేయండి. |
08:00 | Full Site Name ను Digital India Learning Management System కు మార్చుదాం. |
08:08 | ఈ టెక్స్ట్ ప్రతి పేజీ ఎగువభాగం వద్ద breadcrumbs పైన కనిపిస్తుంది. |
08:15 | Short name అనే టెక్స్ట్, పేజియొక్క శీర్షికలో కనిపిస్తుంది. |
08:20 | మనము ఉన్న పేజీ యొక్క పేరు చేత అనుసరిస్తూ ఈ పేజీ యొక్క శీర్షిక Digital India LMS ఉంటుంది గమనించండి. |
08:29 | మనము ఏ లోగో చిత్రం అందించకపోతే, Short name లోగో చిహ్నంగా కూడా ఉపయోగించబడుతుంది.
మనము దానిని ఎలా ఉన్నది ఆలా వదిలివేస్తాము. |
08:40 | Front page ఐటమ్ ల కొరకు డ్రాప్ డౌన్ లను చూడటానికి స్క్రోల్ చేయండి.
ఇవి front page పై చూపగల ఐటమ్ ల యొక్క జాబితా. |
08:50 | సందర్శకులు అందరూ, వారు లాగిన్ ఆయిన్ అవ్వకపోయినా,ఈ ఐటమ్ లను చూడగలరు. |
08:57 | ఈ క్రమం అనేది ఒక combination box చేత నిర్ణయించబడుతుంది.
మనము దానిని ఎలా ఉన్నది ఆలా వదిలివేస్తాము. |
09:05 | కనుక అందరు యూజర్ లు కోర్సుల జాబితా (అందుబాటులో ఉంటే) ను చూడగలరు అంతకంటే ఏమీ లేదు. |
09:13 | తరువాతది Front page items when logged in.
ఈ ఐటమ్ ల యొక్క జాబితా అనేది ఎవరైతే లాగిన్ అయిన యూజర్లు ఉంటారో వారికి కనిపిస్తుంది. |
09:24 | మొదటి డ్రాప్ డౌన్ లో Enrolled courses ను ఎంచుకుందాం. |
09:29 | మనము మిగిలిన ఎంపికలను వాటియొక్క అప్రమేయ విలువలతో అలాగే వదిలివేస్తాము. |
09:35 | స్క్రోల్ చేసి Save Changesపై క్లిక్ చేయండి. |
09:40 | సారాంశం చూద్దాం. |
09:43 | ఈ ట్యుటోరియల్ లో, మనము:
Things to doఅని పిలవబడే ఒకHTML block ను జోడించడం మరియు పేజిపైన ఎక్కడ కనిపించాలో నిర్దేశించడం నేర్చుకున్నాము. |
09:54 | మనము అతిథులు మరియు లాగ్-ఇన్ చేసిన యూజర్ల కొరకు frontpage సెటప్ ని కూడా నేర్చుకున్నాము. |
10:00 | ఇక్కడ మీ కొరకు ఒక అసైన్మెంట్:
Private files block ను తొలగించండి. Code files లింక్ లో ఇవ్వబడిన మార్గదర్శకాలను ఉపయోగించి ఒక కొత్త HTML block ను జోడించండి. |
10:14 | ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.
దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
10:23 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది
మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి. |
10:33 | దయచేసి ఈ ఫోరమ్లో మీ ప్రశ్నలను సమయం తో పాటు పోస్ట్ చేయండి. |
10:37 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
10:51 | నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు. |