Koha-Library-Management-System/C2/Set-Currency/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | సెట్ కరెన్సీ అనే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో, కోహ లో కరెన్సీ ని ఎలా ఏర్పాటు లో నేర్చుకుందాము. |
00:13 | ఈ ట్యుటోరియల్ను రికార్డ్ చేసేందుకు, నేను,
ఉబుంటు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టం 16.04 మరియు కోహా వర్షన్ 16.05 ఉపయోగిస్తున్నాను. |
00:26 | ఈ ట్యుటోరియల్ను అనుసరించడానికి, మీరు గ్రంథాలయ శాస్త్రం గురించి తెలుసి ఉండాలి. |
00:33 | ఈ ట్యుటోరియల్ని సాధన చేసేందుకు, మీ సిస్టమ్‌లో కోహ ఇన్స్టాల్ చేసి ఉండాలి.
మరియు, మీకు కోహాలో అడ్మిన్ యాక్సెస్ ఉండాలి. |
00:42 | మరిన్ని వివరాల కోసం దయచేసి ఈ వెబ్సైట్లో కోహా స్పోకెన్ ట్యుటోరియల్ సిరీస్‌ను చూడండి. |
00:49 | సూపర్లైబ్రిరియన్ యూసర్ నేమ్ బెల్లా మరియు తన పాస్ వర్డ్ తో లాగిన్ అవ్వండి. |
00:58 | ఆపై కోహ అడ్మినిస్ట్రేషన్ పై క్లిక్ చేయండి. |
01:03 | ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది. |
01:06 | అక్విజిషన్ పారామీటర్స్ విభాగం క్రింద, Currencies and exchange ratesపై క్లిక్ చేయండి. |
01:15 | ఈ డేటా స్వయంచాలకంగా నవీకరించబడదని గమనించండి. |
01:20 | అందువలన, డేటాను నవీకరించడం ముఖ్యం. ఇది సరైన అకౌంటింగ్ వివరాలను ఉంచడానికి సహాయపడుతుంది. |
01:30 | ఇప్పుడు, ప్లస్ న్యూ కరెన్సీపై క్లిక్ చేయండి. |
01:35 | తెరుచుకున్న కొత్త పేజీలో తప్పనిసరైన వివరాలను పూరించండి, అనగా, కరెన్సీ, రేటు మరియు సింబల్. |
01:47 | నా లైబ్రరీ భారతదేశంలో ఉన్నందున, నేను కరెన్సీ కోసం రూపాయిని ప్రవేశ పెడతాను.
రేట్ కొరకు 1 మరియు రూపీ (₹) గుర్తు. |
02:00 | తరువాత, ISO కోడ్ INR గా ప్రవేశ పెట్టండి. |
02:05 | కరెన్సీని సక్రియం చేయడానికి, చెక్ బాక్స్‌ని క్లిక్ చేయండి. Last updated కరెన్సీ సెటప్ తేదీని చూపుతుంది. |
02:14 | పేజీ దిగువన ఉన్న Submit బటన్‌పై క్లిక్ చేయండి. |
02:20 | తీర్చుకున్న కొత్త పేజీ లోని కరెన్సీ ట్యాబు క్రింద రూపాయి యొక్క వివరాలు కనిపిస్తాయి. |
02:27 | అవసరమైతే, దానినే సవరించవచ్చు. |
02:32 | అసైన్మెంట్ కోసం,
మీ అవసరానికి అనుగుణంగా ఏ కరెన్సీని అయినా సెట్ చేసుకోండి, కానీ దానిని 'సక్రియం' చేయవద్దు. |
02:41 | కోహ ఇంటర్ఫేస్కు తిరిగి వెళ్దాం. |
02:45 | అదే పేజీలో, Column visibility టాబ్ పై క్లిక్ చేయండి. |
02:50 | ఎంపికల నుండి, ISO కోడ్ పై క్లిక్ చేయండి. |
02:55 | రూపాయి కోసం ISO కాలమ్ టేబుల్లో కనిపిస్తుంది. |
03:00 | స్టేజింగ్ టూల్స్ ద్వారా MARC ఫైల్స్ ను దిగుమతి చేసుకున్నప్పుడు ప్రవేశ పెట్టిన ISO కోడ్ ఉపయోగించబడుతుందని గుర్తుంచుకోండి. |
03:09 | Tool ప్రస్తుత క్రియాశీల కరెన్సీ యొక్క ధరని కనుగొని, ఉపయోగించడానికి ప్రయత్నిస్తుంది. |
03:16 | కరెన్సీని సవరించడానికి, ఆ ప్రత్యేక కరెన్సీ యొక్క Edit ఎంపిక పై క్లిక్ చేయండి. నేను కరెన్సీ USD కోసం Edit పై క్లిక్ చేస్తాను. |
03:29 | Modify currency పేజీ తెరవబడుతుంది. |
03:32 | మీరు రేట్ మరియు గుర్తు యొక్క విలువను మార్చవచ్చు. నేను దానిని అలాగే విడిచిపెడతాను. |
03:40 | యాక్టివ్ ఫీల్డ్ కోసం చెక్ బాక్స్‌లో, నేను క్లిక్ చేయలేదని గమనించండి. |
03:46 | ఒక క్రియాశీల కరెన్సీ లైబ్రరీలో ఉపయోగపడే ప్రధాన కరెన్సీ. |
03:51 | నా గ్రంథాలయం భారతదేశం లో ఉన్నందున, రూపాయి క్రియాశీల కరెన్సీగా ఉపయోగించబడుతుంది. |
03:57 | తరువాత, పేజీ యొక్క దిగువ భాగంలోని Submit పై క్లిక్ చేయండి. |
04:02 | Currencies and exchange rates పేజీ మళ్ళి తెరుచుకుంటుంది. |
04:08 | ఇప్పుడు మీ కోహా సూపర్లైబ్రియన్ ఖాతా నుండి లాగ్ అవుట్ అవ్వండి. |
04:13 | మొదట, కుడి ఎగువ మూలలో వెళ్ళి, స్పోకెన్ ట్యుటోరియల్ లైబ్రరీపై క్లిక్ చేయండి. |
04:21 | ఆపై డ్రాప్-డౌన్ నుండి, లాగ్ అవుట్ ఎంచుకోండి. |
04:26 | దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. |
04:30 | సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో మనము కరెన్సీ ని ఎలా సెట్ చేయాలో నేర్చుకున్నాము. |
04:36 | ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
04:44 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.
మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి. |
04:54 | దయచేసి ఈ ఫోరమ్‌లో మీ ప్రశ్నలను సమయం తో కూడిన పోస్ట్ చేయండి. |
04:58 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. |
05:05 | ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
05:10 | ఈ ట్యుటోరియల్ ని అనువదించి మాధురి మరియు నేను ఉదయ లక్ష్మి. ధన్యవాదములు. |