Jmol-Application/C3/Crystal-Structure-and-Unit-Cell/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 12:45, 8 February 2018 by Simhadriudaya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 Jmol లో Crystal Structure and unit cell ఫై ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో, మనము CIFఅంటే Crystallographic Information File ను Crystallography Open Database నుండి డౌన్లోడ్ చేయడం,
00:17 Jmol లో CIF ను తెరుచుట,
00:20 Jmol ప్యానెల్లో unit cell మరియు unit cell parameters ప్రదర్శించుట మరియు
00:25 వివిధ క్రిస్టల్ వ్యవస్థల యొక్క crystal structures ప్రదర్శించడం నేర్చుకుంటాము. ఉదాహరణకు -Cubic, Hexagonal మరియు Rhombohedral.
00:34 ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, మీరు హైస్కూల్ కెమిస్ట్రీ గురించి అవగాహన కలిగి ఉండాలి.
00:39 అదేవిధంగా Jmol window పై కార్యాచరణ కూడా తెలిసిఉండాలి.
00:42 లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్సైట్ ను సందర్శించండి.
00:48 ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి, నేను Ubuntu Operating System వర్షన్ 14 .04 ను
00:54 Jmol వర్షన్ 12 .2.32
00:57 Java వర్షన్ 7 మరియు
01:01 Mozilla Firefox browser 35.0 ను ఉపయోగిస్తున్నాను
01:04 Crystal structure లు, ఏడు క్రిస్టల్ వ్యవస్థల క్రింద సమూహం చేయబడ్డాయి.
01:08 ఈ పట్టిక, crystal system లు మరియు వాటికి సంబంధిత lattice parameter ల జాబితాను చూపిస్తుంది.
01:14 వివిధ సమ్మేళనాలు మరియు ఖనిజాల స్ఫటికాలకు ఉదాహరణలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
01:20 మనం Jmol panel పై Sodium chloride, Graphite మరియు Calcite యొక్క క్రిస్టల్ నిర్మాణాలు ప్రదర్శిస్తాము.
01:27 Jmol ప్యానెల్లో క్రిస్టల్ నిర్మాణం ప్రదర్శించడానికి,
01:31 మనము ఒక నిర్దిష్ట crystal యొక్క Crystallographic Information File ను డౌన్లోడ్ చేసుకోవాలి.
01:37 CIF అనేది crystallographic సమాచారాన్ని సూచించడానికి ప్రామాణిక text file format
01:43 CIF ఫార్మాట్ ఫైల్ .cif ను ఫైల్ పొడిగింపు గా కలిగి ఉంటుంది.
01:48 Crystallography Open Database ఒక ఓపెన్ యాక్సెస్ డేటాబేస్.
01:53 డౌన్ లోడ్ చేయగల CIF ఫైల్స్ COD వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయి.
01:58 ఆ వెబ్సైట్ ను ఇచ్చిన ఈ లింక్ ద్వారా యాక్సిస్ చెయ్యవచ్చు.
02:03 మనము COD డేటాబేస్ వెబ్సైట్ ను తెరిచి కొన్ని CIF ఫైళ్ళను డౌన్ లోడ్ చేద్దాము.
02:10 ఇక్కడ, నేను COD వెబ్సైట్ ను తెరిచాను.
02:13 page యొక్కఎడమ వైపున, సమాచారం వివిధ శీర్షికల్లో విభజించబడింది.
02:19 Accessing COD Data శీర్షిక క్రింద Browse, Searcz వంటి ఉప శీర్షికలు ఉన్నాయి.
02:27 Search ఎంపిక పై క్లిక్ చేయండి. అది ఒక క్రొత్త page ను తెరుస్తుంది.
02:31 Search పేజీలో, CIF ఫైళ్ళను వెతకడం కోసం అనేక ఎంపికలు ఉన్నాయి.
02:36 hints and tips లింకు పై క్లిక్ చేయండి.search ఎంపికలను సమర్థవంతంగా ఎలా ఉపయోగించాలనే సమాచారంతో ఒక పుట తెరుస్తుంది.
02:46 Search పేజీకి తిరిగి వెళ్ళండి.
02:49 మనము COD ID ఉపయోగించి క్రిస్టల్ నిర్మాణం కోసం వెతకవచ్చు,
02:54 టెక్స్ట్-బాక్స్లో OpenBabel Fastsearch ను లేదా రసాయన లేదా ఖనిజాల పేరును టైప్ చేయండి.
03:01 ఉదాహరణకు, సోడియం క్లోరైడ్ యొక్క CIF ఫైల్ కోసం శోధించడానికి:
03:06 టెక్స్ట్-బాక్స్లో, సోడియం క్లోరైడ్ కోసం ఖనిజ నామం అయిన Halite అని టైప్ చేయండి.
03:12 elements బాక్స్కు క్రిందికి స్క్రోల్ చేయండి.
03:15 సోడియం కోసం,Na మరియు క్లోరైడ్ కోసం, Cl గుర్తును టైప్ చేయండి.
03:20 Number of distinct elements.. బాక్స్ వద్ద కు స్క్రోల్ చేయండి .
03:24 ఇక్కడ, కనీస మరియు గరిష్ట అంశాలను టైప్ చేయడానికి ఒక ఎంపికను కలిగి ఉన్నాము.
03:29 మీరు క్రిస్టల్ నిర్మాణం కేవలం రెండు అంశాలతో, అంటే సోడియం మరియు క్లోరైడ్ లతో మాత్రమే కావాలనుకుంటే minimum పెట్టెలో 2 అని టైప్ చేయండి,
03:37 Send బటన్ పై క్లిక్ చేయండి.
03:40 సోడియం క్లోరైడ్ యొక్క క్రిస్టల్ స్ట్రక్చర్ డేటా ఫైళ్ళతో ఒక వెబ్ పేజీ ను తెరుస్తుంది.
03:45 COD ID పై రైట్-క్లిక్ చేసి,open the link in a new tab పై క్లిక్ చేయండి.
03:51 ఈ పేజీ నిర్దిష్ఠ క్రిస్టల్ నిర్మాణం గురించి వివరమైన సమాచారం కలిగి ఉంది.
03:57 డేటాబేస్ వెబ్ పేజీకి తిరిగి వెళ్ళండి.
04:00 పేజీ యొక్క కుడి వైపున ఉన్నarchive of CIF files లింకుపై క్లిక్ చేయండి.
04:08 screen పై ఒక డైలాగ్-బాక్స్ తెరుచుకుంటుంది. Open with ఎంపిక ను ఎంచుకొనండి. OK బటన్ పై క్లిక్ చేయండి.
04:17 సోడియం క్లోరైడ్ క్రిస్టల్ యొక్క అనేక CIF ఫైళ్ళ తో ఉన్న ఫోల్డర్ తెరపై తెరుచుకుంటుంది.
04:23 మీరు డౌన్లోడ్ చేయదలిచిన ఫైళ్ళను వాటిపై క్లిక్ చేయడం ద్వారాఎంచుకోండి.
04:28 టూల్ బార్ లో Extract బటన్ పై క్లిక్ చేయండి.
04:32 మీ సిస్టమ్ పై మీకు అనుకూలమైన ప్రదేశంలో, ఫైల్స్ ను సేవ్ చేయండి.
04:37 Extract పై క్లిక్ చేయండి. విండోను మూసివేయండి.
04:41 Search పేజీకు తిరిగి వెళ్ళండి.
04:43 ఇప్పుడు, పై పద్దతిని ఉపయోగించి graphite మరియు calcite లకు CIF ఫైళ్ళ ను డౌన్ లోడ్ చేసుకోండి.
04:51 మనము ఇప్పుడు Jmol లో సోడియం క్లోరైడ్ యొక్క CIF ఫైల్ ను తెరుస్తాము.
04:55 ఇక్కడ, నేను Jmol విండ' తెరిచాను.
04:59 టూల్ బార్ లో Open a file చిహ్నాన్ పై క్లిక్ చేయండి.
05:03 మనం COD డేటాబేస్ నుండి డౌన్లోడ్ చేసిన sodium chloride యొక్క CIF ఫైల్ వద్దకు వెళ్ళి,
05:12 Open పై క్లిక్ చేయండి.
05:14 ఇది సోడియం క్లోరైడ్ క్రిస్టల్ యొక్క యూనిట్ సెల్ ను screen పై తెరుస్తుంది.
05:19 Unit cell అనేది క్రిస్టల్ లో అతి చిన్న పునరావృత unit
05:23 ఈ యూనిట్ కణాలను 3 dimensions లో Stack చేయుట ద్వారా crystal structure యొక్క ఆధారమును ఏర్పర్చవచ్చు.
05:29 Jmol panel కు తిరిగి వెళ్ళండి.
05:32 unit cell కు సంబంధించిన డేటా, ప్యానెల్ యొక్క ఎడమ వైపున ప్రదర్శించబడుతుంది.
05:37 ఇది space group వర్గీకరణతో ప్రారంభమవుతుంది.
05:41 సోడియం క్లోరైడ్ cubic lattice system నకు చెందినది. అందువల్ల వెక్టార్స్ a, b మరియు c లు సమానంగా ఉంటాయి.
05:50 alpha, beta మరియు gamma కోణాలు 90 డిగ్రీలు కలిగి ఉంటాయి.
05:55 pop-up menu తెరవడానికి రైట్-క్లిక్ చేయండి.
05:59 Symmetry ఎంపిక కు స్క్రోల్ చేయండి.
06:01 ఉప మెనులో element లు ప్రదర్శించటానికి మనకు ఎంపికలు ఉన్నాయి.
06:05 ఉప కూర్ప(sub-menu)లోని ఎంపికలను ఉపయోగించి unit cell ల block లు కూడా ప్రదర్శించబడతాయి.
06:10 ఉదాహరణకు,Reload {1 1 1} ఎంపికపై క్లిక్ చేయండి.
06:15 ప్యానెల్లో, మనము face center cubic lattice ను చూపుతున్న, ఒక యూనిట్ సెల్ బ్లాక్ ను కలిగి ఉన్నాము.
06:21 ప్రదర్శనను మార్చడానికి - పాప్-అప్ మెనుని తెరిచి, Style కు, ఆపై Scheme కు స్క్రోల్ చేసి,CPK Spacefill పై క్లిక్ చేయండి.
06:29 ఇక్కడ, ప్యానెల్లో, CPK డిస్ప్లేలో స్ఫటిక నిర్మాణం ను కలిగి ఉన్నాము.
06:34 పాప్-అప్ మెనుని మళ్లీ తెరచి, సిమ్మెట్రీ కు పైకి స్క్రోల్ చేసి, Reload {4 4 4 6 6 6 1} ఎంపిక పై క్లిక్ చేయండి.
06:44 ఈ ఎంపిక Jmol ప్యానెల్లో 27 సెల్ బ్లాక్ ను load చేస్తుంది.
06:49 పాప్-అప్ మెనుని తెరచి, symmetry కు వెళ్ళి, Reload {1 1 1} ఎంపికకు వెళ్ళండి.
06:56 symmetry elements ను ప్రదర్శించడానికి, మళ్ళీ పాప్-అప్ మెనూను తెరవండి.
07:00 Symmetry ఉప మెనులో స్క్రోల్ చేసి, mirrorplane (x z y) ఎంపికపై క్లిక్ చేయండి.
07:08 ప్యానెల్లో, మనము mirrorplane (x z y) తో ఒక cubic lattice ను కలిగి ఉంటాము.
07:16 ఇప్పుడు hexagonal crystal system చెందిన graphite యొక్క CIF ఫైల్ ను load చేద్దాం.
07:22 ముందుగా చూపించిన విధంగా, ప్యానెల్ పై గ్రాఫైట్ యొక్క CIF ఫైల్ ను load చేయడానికి, Open a file ఎంపికను ఎంచుకొనండి.
07:29 ఇది graphite యొక్క Unit cell ను ప్యానెల్ లో తెరుస్తుంది.
07:33 యూనిట్ సెల్ పరామితులను గమనించండి:
07:35 a, b వెక్టార్లు సమానం కానీ c కాదు.
07:40 కోణాలు alpha మరియు beta లు 90 డిగ్రీలకు, gamma 120 డిగ్రీలకు సమానం.
07:47 పాప్-అప్ మెనుని తెరిచి, Symmetry వరకు స్క్రోల్ చేసి, Reload {444 666 1} ఎంపిక పై క్లిక్ చేయండి.
07:56 పరమాణువుల యొక్కHexagonal lattice అమరిక, తెరపై చూపబడింది.
08:01 ప్రదర్శనను మార్చడానికి: పాప్-అప్ మెనుని తెరచి,Style కు వెళ్ళండి, ఆపై scheme కి వెళ్ళి, Wireframe ఎంపికపై క్లిక్ చేయండి.
08:10 అదేవిధంగా, నేను ప్యానెల్లో ఖనిజ calcite యొక్క CIF ఫైల్ ను తెరిచాను.
08:16 Calcite, rhombohedral క్రిస్టల్ వ్యవస్థకు చెందినది.
08:20 మీరు ఏదైనా క్రిస్టల్ వ్యవస్థ యొక్క CIF ను తెరిచి,structure మరియు symmetry ఎంపికలను అన్వేషించవచ్చు.
08:27 ట్యుటోరియల్ యొక్క సారాంశం ను చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో మనము Crystallography Open Database నుండి CIF ను డౌన్లోడ్ చేయడం
08:35 Jmol లో CIF తెరవడం,
08:38 unit cell మరియు unit cell parameters లను ప్రదర్శన మరియు
08:41 sodium chloride, graphite మరియు calcite యొక్క crystal structure ప్రదర్శించడం నేర్చుకున్నాము.
08:47 అసైన్మెంట్ గా COD డేటాబేస్ నుండి quartz క్రిస్టల్ యొక్క CIF ఫైల్ ను డౌన్లోడ్ చేయండి.
08:53 Jmol ప్యానెల్లో యూనిట్ సెల్ ను ప్రదర్శించి, సమరూప ఎంపికలు అన్వేషించండి.
08:59 ఈ వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశాన్ని ఇస్తుంది.
09:02 మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
09:06 మేము స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తున్నాము మరియు సర్టిఫికెట్లు ఇస్తాము. దయచేసి మమ్మల్ని సంప్రదించండి.
09:12 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు భారతదేశం ప్రభుత్వం యొక్క NMEICT-MHRD నిధులు సమకూరుస్తుంది.
09:18 దీనిని అందించినది స్నేహలత. అనువదించినది స్వామి. ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya