BASH/C2/Conditional-execution/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 13:50, 22 November 2017 by Yogananda.india (Talk | contribs)
Time | Narration |
00:01 | ప్రియమైన స్నేహితులారా, BASH లోని Conditional execution పై spoken tutorial కు స్వాగతం. |
00:08 | ఈ ట్యుటోరియల్ లో మనం |
00:10 | test కమాండ్ యొక్క ఉపయోగం మరియు |
00:13 | Conditional స్టేట్మెంట్స్ గురించి నేర్చుకుంటాము. |
00:15 | మనం దీన్ని కొన్ని ఉదాహరణలను ఉపయోగించి చేద్దాం. |
00:19 | ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి మీకు, |
00:21 | GNU/Linux Operating System గురించి కొంత అవగాహన ఉండాలి. |
00:26 | ఒక వేళ లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి. |
00:32 | ఈ ట్యుటోరియల్ కోసం నేను, |
00:35 | Ubuntu Linux 12.04 OS ఆపరేటింగ్ సిస్టం మరియు |
00:39 | GNU BASH వర్షన్ 4.1.10 ను ఉపయోగిస్తున్నాను. |
00:43 | GNU Bash వర్షన్ 4 లేదా దానికన్నా పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి. |
00:49 | మనం test యొక్క పరిచయంతో ప్రారంభిద్దాం. |
00:52 | test అనేది built-in కమాండ్. ఇది exit status కు తిరిగి ఇస్తుంది. |
00:57 | ఇది True కు 0(సున్నా)ని మరియు False కు 1(ఒకటి )ని తిరిగి ఇస్తుంది. |
01:02 | Return విలువ expression యొక్క మూల్యంకనం పై ఆధారపడి ఉంటుంది. |
01:07 | return స్థితిని డాలర్ మరియు ప్రశ్న గుర్తులను ($?) కలిపి టైప్ చేయడం ద్వారా పొందవచ్చు. |
01:14 | expressionsను రెండు విధాలుగా విశ్లేషించవచ్చు. |
01:18 | ఒకటి- కీవర్డ్ test ఉపయోగించి. |
01:21 | రెండు- చదరపు బ్రాకెట్లలో ఉంచబడిన expression ను ఉపయోగించి. |
01:27 | ఇప్పుడు, Ctrl+Alt మరియు T కీలను కలిపి నొక్కడం ద్వారా terminal ను తెరవండి. |
01:35 | test space 4 space hyphen eq space 4 semicolon space echo space dollar sign and a question mark గుర్తుని టైప్ చేయండి. Enter నొక్కండి. |
01:53 | ఇది సున్నాను అంటే, True ను తిరిగి ఇస్తుంది. |
01:57 | 4 అనేది 4 కు సమానం. |
02:00 | తరువాత |
02:02 | opening square bracket space 4 space hyphen eq space 4 space closing square bracket semicolon space echo space dollar sign మరియు ఒక ప్రశ్న గుర్తును టైప్ చేసి, Enter నొక్కండి. |
02:22 | ఇది సున్నాను అంటే Trueను తిరిగి ఇస్తుంది. |
02:25 | అంటే 4 అనేది 4 కు సమానం. |
02:28 | మరొక expressionను తీసుకుందాం. test space 4 space hyphen eq space 5 semicolon space echo space dollar sign question mark అని టైప్ చేసి, Enter నొక్కండి. |
02:48 | ఇది ఒకటిని తిరిగి ఇస్తుంది అంటే False అని అర్ధం. |
02:52 | అంటే 4 అనేది 5 కు సమానం కాదు. |
02:56 | ఇప్పుడు అదే expressionను చదరపు బ్రాకెట్ లలో వ్రాద్దాము. |
03:01 | opening square bracket space 4 space hyphen eq space 5 space closing square bracket semicolon space echo space dollar sign and a question mark అని టైప్ చేసి, Enter నొక్కండి. |
03:21 | ఇది కూడా ఒకటిని తిరిగి ఇస్తుంది అంటే False అని అర్ధం. |
03:25 | అంటే 4 అనేది 5 కు సమానం కాదు. |
03:29 | దీనిని ఇతర రకాల పరీక్షల కోసం పొడిగించవచ్చు. |
03:33 | దయచేసి , man space test అని టైప్ చేసి, దాని వినియోగాన్ని అన్వేషించండి. |
03:40 | ఇప్పుడు మన slides కు తిరిగి వెళ్దాము. |
03:43 | ఇప్పుడు మనం if స్టేట్మెంట్ సింటాక్స్ ని చూద్దాం- |
03:48 | if space opening square bracket space expression space closing square bracket semicolon space then |
03:59 | తరువాత లైన్ పై, మీరు execute చేయాలనుకుంటున్న commands లేదా statements ను టైప్ చేయండి. |
04:05 | చివరగా, if లూప్ ను fi తో ముగించండి. |
04:11 | condition యొక్క ప్రాధమిక నియమాలు |
04:14 | ఎల్లప్పుడూ బ్రాకెట్లు మరియు expressions మధ్య ఖాళీలు ఉంచడం. |
04:19 | ఎల్లప్పుడూ then కీవర్డ్ ముందు లైన్ ను ముగించడానికి, సెమికోలన్ ను ఉపయోగించడం. |
04:25 | సెమికోలన్ ను స్టేట్మెంట్ లేదా expressionను ముగించడానికి ఉపయోగిస్తారు. |
04:31 | మీరు string variablesను condition లో ఉపయోగిస్తే, వాటిని కోట్ నందు ఉంచడం మంచిది. |
04:38 | conditional block ను fi తో ముగించడం మర్చిపోవద్దు. |
04:43 | మనం if స్టేట్మెంట్ పై ఒక ఉదాహరణ చూద్దాం. |
04:46 | తిరిగి మన terminal కు వెళ్ళండి. |
04:49 | నేను ఇప్పటికే ఉన్న simpleif.sh అనే పేరుగల script fileను తెరుస్తాను. |
04:58 | ఈ బాష్ స్క్రిప్ట్ count విలువ 100 కు సమానం అయినప్పుడు count is 100 అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది. |
05:06 | ఇది shebang line గా పిలువబడు, Bash shell script యొక్క మొదటి లైన్. |
05:12 | వేరియబుల్ count కు పూర్ణాంకం 100 కేటాయించబడింది. |
05:17 | count, = మరియు 100 మధ్య ఎటువంటి ఖాళీ ఉండకూడదు గమనించండి. |
05:24 | ఈ expression count విలువ వంద కు సమానమా అని తనిఖీ చేస్తుంది. |
05:30 | ఇక్కడ -eq అనేది పోలిక ఆపరేటర్. |
05:35 | ఒకవేళ condition నిజం అయితే, అది count is 100 అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది. |
05:41 | fi అనేది if బ్లాక్ ను ముగిస్తుంది. |
05:45 | ఇప్పుడు Ctrl + S నొక్కడం ద్వారా ఫైలును save చెయ్యండి. |
05:49 | తిరిగి Terminal కు వెళ్ళండి. |
05:51 | ఫైల్ ను ఎగ్జిక్యూటబుల్ చేయడానికి, chmod space plus x space simpleif.sh అని టైప్ చేసి, Enter నొక్కండి. |
06:04 | నేను prompt ను క్లియర్ చేస్తాను. |
06:06 | ఇప్పుడు డాట్ స్లాష్ simpleif.sh అని టైప్ చేసి Enter నొక్కండి. |
06:14 | ఇక్కడ ఇది |
06:16 | Count is 100 అని ప్రదర్శిస్తుంది. |
06:18 | వేరియబుల్ count యొక్క విలువను మార్చి, స్క్రిప్ట్ ను execute చేయుటకు ప్రయత్నించండి. |
06:24 | ఇప్పుడు మన slides కు మారండి. |
06:26 | మనం if-else కండిషన్ ని చూద్దాం. |
06:30 | సాధారణ సింటాక్స్ if space opening square bracket space condition space closing square bracket space semicolon space then |
06:44 | తరువాత లైన్ పై, కమాండ్స్ టైప్ చేయండి. |
06:47 | తరువాత లైన్ పై, else స్టేట్మెంట్, |
06:51 | ఇంకొన్ని, కమండ్స్ ని మళ్ళీ టైప్ చేయండి. |
06:55 | తరువాత లైన్ పై, if బ్లాక్ ముగించుటకు, fi ను టైప్ చేయండి. |
07:00 | if-else యొక్క ఉపయోగమును ఒక ఆసక్తికరమైన పాస్వర్డ్ ప్రోగ్రామ్ తో తెలుసుకుందాం. |
07:06 | తిరిగి terminal కు మారండి. |
07:09 | నేను ifelse.sh ఫైల్ ను తెరుస్తాను. |
07:14 | ఇది shebang line . |
07:17 | ఇక్కడ, PASS అనే వేరియబుల్ లో abc123 నిల్వ చేయబడింది. |
07:23 | abc123 అనేది ఒక స్ట్రింగ్, కాబట్టి దానిని తప్పక డబుల్ కోట్స్ లో వ్రాయాలి. |
07:29 | read కమాండ్ standard input నుండి ఒక లైన్ డేటా ను చదువుతుంది. |
07:35 | ఇక్కడ, standard input మన కీబోర్డ్. |
07:39 | హైఫన్ s ను silent mode కొరకు ఉపయోగించాము. |
07:43 | అంటే పాస్ వర్డ్ మనము టైప్ చేసినప్పుడు అది ప్రదర్శించబడదని అర్ధం. |
07:48 | ఇతరులు మన పాస్ వర్డ్ ని చూడాలని మనం కోరుకోము. |
07:52 | హైఫన్ p అనేది prompt కొరకు ఉపయోగించాం. |
07:55 | ఇది వినియోగదారుడు నుండి inputను తీసుకునే ముందు Enter password అనే స్ట్రింగ్ ను ప్రదర్శిస్తుంది. |
08:01 | mypassword అనేది ఒక వేరియబుల్. |
08:04 | ఇది string ను భద్రపరుస్తుంది, ఇక్కడ అది యూజర్ చే ఎంటర్ చేయబడిన password. |
08:10 | ఇది ఎంటర్ చేయబడ్డ పాస్ వర్డ్ ను, PASS వేరియబుల్ యొక్క విలువతో పోల్చుతుంది. |
08:17 | ఇది mypassword అనే వేరియబుల్ లో భద్రపరచబడును. |
08:21 | ఒక వేళ పాస్ వర్డ్ మ్యాచ్ అయితే, ఇది Password accepted |
08:25 | అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది. |
08:27 | లేదంటే ఇది Access denied ను ప్రదర్శిస్తుంది. |
08:31 | fi అనేది if-else loop యొక్క ముగింపు. |
08:34 | ఇప్పుడు ఫైల్ ని Ctrl, s నొక్కడం ద్వారా save చేయండి. |
08:38 | terminal కు వెళ్ళండి. ఫైల్ ని ఎగ్జిక్యూటబుల్ చేయడానికి, chmod space plus x space ifelse.sh అని టైప్ చేసి, Enter నొక్కండి. |
08:52 | dot slash ifelse.sh అని టైప్ చేసి, Enter నొక్కండి. |
08:57 | ఇక్కడ అది Enter password : ను ప్రదర్శిస్తుంది. |
08:59 | నేను abc టైప్ చేసి, Enter చేస్తాను. |
09:05 | పాస్ వర్డ్ ను తప్పుగా ఎంటర్ చేయగానే, ఇది సందేశాన్ని Access denied గా ప్రదర్శిస్తుంది. |
09:11 | మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. కానీ ఈసారి పాస్ వర్డ్ ను abc123 గా ఎంటర్ చేద్దాం. |
09:21 | ఇది ఇలాగా ప్రదర్శిస్తుంది: Password accepted . |
09:25 | దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాం. |
09:28 | తిరిగి మన slides కు వెళ్దాం మరియు సారాంశం చూద్దాం. |
09:31 | ఈ ట్యుటోరియల్లో, మనం test కమాండ్ యొక్క ఉపయోగం, if స్టేట్మెంట్ మరియు if-else స్టేట్మెంట్, ల గురించి నేర్చుకున్నాం. |
09:41 | ఒక అసైన్మెంట్ గా- |
09:43 | మీ పేరు ను ఇన్ పుట్ గా తీసుకొని, |
09:46 | దానిని మీ సిస్టమ్ యొక్క యూజర్ పేరుతో తనిఖీ చేయుటకు ఒక స్క్రిప్ట్ ను వ్రాయండి. |
09:51 | ఒకవేళ యూజర్ పేరు తో పోలిక కలిగిఉంటే, ఇది Hello ప్రదర్శించడం ద్వారా మిమ్మల్ని అభినందించాలి. |
09:56 | లేదంటే, ఇది Try again ను ప్రదర్శించాలి. |
10:00 | సూచన: మీ సిస్టమ్ యొక్కయూజర్ పేరు $USER వేరియబుల్ లో నిల్వ చేయబడి ఉంటుంది. |
10:06 | క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
10:09 | ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. |
10:11 | ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
10:16 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం |
10:18 | స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. |
10:22 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
10:26 | మరింత సమాచారం కోసం దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. |
10:33 | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం. |
10:37 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
10:45 | ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. |
10:51 | FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది. |
10:56 | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. |
11:01 | మీకు ధన్యవాదాలు. |