Java/C2/while-loop/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 20:59, 16 November 2017 by Simhadriudaya (Talk | contribs)
Time | Narration |
00:02 | జావా లోని వైల్ లూప్ అనే స్పోకెన్ టుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ టుటోరియల్ లో మీరు వైల్ లూప్ గురించి మరియు దానిని ఎలా ఉపయోగించాలి అనేది నేర్చుకుంటారు. |
00:12 | ఈ టుటోరియల్ కొరకు మనం ఉబంటు 11.10, జేడికే1.6 మరియు ఎక్లిప్స్3.7.ఉపయోగిస్తున్నాం. |
00:21 | ఈ టుటోరియల్ ను అనుసరించడానికి మీకు జావా లోని రిలేషనల్ ఆపరేటర్స్ పై అవగాహన ఉండాలి. |
00:26 | లేదంటే, తత్సంభందిత టుటోరియల్ కొరకు మా వెబ్సైట్ ని సంప్రదించండి. [1] |
00:36 | ఇది వైల్ లూప్ అమరిక. ఇక్కడ ఒక వైల్ లూప్ యొక్క నిర్మాణం ఉంది. |
00:39 | ఇది రెండు భాగాలను కలిగిఉంది |
00:41 | ఒకటి లూప్ రన్నింగ్ కండిషన్ మరియు రెండవది లూప్ వేరియబుల్. |
00:48 | ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం.ఎక్లిప్స్ కు మారండి. |
00:55 | ఇక్కడ మనకు ఎక్లిప్స్IDE మరియు మిగిలినకోడ్ కి అవసరమైన స్కేలిటన్ కలిగి ఉన్నాం |
01:00 | నేను వైల్ డెమో అనే క్లాస్ సృష్టించి, దానికి మెయిన్ మెథడ్ జతచేసాను. |
01:05 | మనం వైల్ లూప్ ని ఉపయోగించి 1 నుండి 10 వరకు సంఖ్యలని ముద్రిస్తాము. int n = 1;అని టైప్ చేయండి. |
01:15 | ఈ వేరియబుల్’ n అనేది మన లూప్ వేరియబుల్’ గా ఉండబోతుంది. |
01:21 | while పరాంతసిస్ లో n less than or equal to 10 ఓపెన్ మరియు క్లోజ్ బ్రెసెస్ ని టైప్ చేయండి. |
01:33 | ఈ కండిషన్ ని లూప్ రన్నింగ్ కండిషన్ అంటారు. |
01:37 | దీని అర్ధం కండిషన్ ఎంతవరకు సత్యం అవుతుందో అంత వరకు loop రన్ అవుతూ ఉంటుంది. |
01:42 | మన సందర్భంలో, ఇది n యొక్క విలువ 10 కన్నా తక్కువ లేక సమానం అయినంతవరకు రన్ అవుతూవుంటుంది. |
01:47 | మరియు అది n యొక్క విలువ10 కన్నా ఎక్కువ అయినప్పుడు మాత్రమే ఆగుతుంది. |
01:53 | లూప్ లోపల మనం n యొక్క విలువ ను ముద్రిద్దాం. |
01:58 | System.out.println(n); తర్వాత దానిని పెంచండి n = n + 1; |
02:12 | ఈ విధంగా ,ముందు1 ముద్రించబడి తర్వాత n విలువ 2 అవుతుంది. |
02:18 | తర్వాత లూప్ కండిషన్ పరీక్షించబడుతుంది. |
02:21 | అది సత్యం కనుక,2 ముద్రించబడుతుంది మరియు n విలువ 3 అవుతుంది. |
02:25 | ఆపై .. లూప్ 10 ముద్రించబడే వరకు కొనసాగుతుంది. ఆ తరువాత n, 11 అవటం వలన కండిషన్ అసత్యం అవుతుంది మరియు లూప్ ని నిలిపివేస్తుంది. |
02:37 | కనుక, కోడ్ ని చర్యలో చూద్దాము. |
02:39 | సేవ్ చేసి రన్ చేయండి. |
02:47 | మనము చూస్తున్నట్లుగా, 1 నుండి 10 వరకు సంఖ్యలు ముద్రించబడతాయి. |
02:52 | ఇప్పుడు మనం 50 నుండి 40 వరకు సంఖ్యలను ముద్రిస్తాము. |
02:58 | కనుక, మనం 50 తో ప్రారంభిద్దాం. n = 1 ని n = 50 కి మార్చండి. |
03:03 | మరియు మనం 40 వచ్చేవరకు వెళ్తాము. |
03:05 | ఇంకోలా చెప్పాలంటే, n విలువ 40 కంటే ఎక్కువ లేక 40 కి సమానం అయ్యేవరకు. కనుక ,కండిషన్ ని n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40 కి మార్చండి. |
03:16 | మనం గరిష్టసంఖ్యనుండి కనిష్టసంఖ్యకు లూపింగ్ చేస్తున్నాంకాబట్టి మనం లూప్ వేరియబుల్ విలువను తగ్గించాం. |
03:22 | కావున n=n+1 ని n=n-1 కు మార్చండి. |
03:27 | సేవ్ చేసి రన్ చేయండి.మనము చూస్తున్నట్లుగా, 50 నుండి 40 వరకు సంఖ్యలు ముద్రించబడతాయి. |
03:42 | ఇప్పుడు మనం 7 యొక్క మొదటి పది గుణిజాలను ముద్రిస్తాము. |
03:48 | ఆలా చేయడానికి, మనం 7 తో ప్రారంభిస్తాం. |
03:50 | కనుక,n = 50 ని n = 7 కి మార్చండి. తరువాత మనం 70 తో ముగిస్తాం. |
03:57 | కండిషన్ ను n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 70 కి మార్చండి. |
04:03 | ఈ విధంగా, మనం లూప్ 70 దగ్గర ఆగేలా చూసుకోవాలి. |
04:07 | గుణిజాలను పొందటానికి,మనం లూప్ వేరియబుల్ ని 7 చేత పెంపుచేస్తాం. |
04:12 | కనుక, n=n-1 ని n= n+7; కి మార్చుదాం. |
04:18 | ఈ విధంగా ముందు 7 ముండ్రించబడి తర్వాత అది 14 అవుతుంది.14 ముద్రించబడి అది అలాగే 70 వచ్చేవరకు కొనసాగుతుంది..సేవ్ చేసి రన్ చేయండి. |
04:33 | మనం చూస్తున్నట్లుగా,7 యొక్క మొదటి 10 గుణిజాలు ముద్రించబడతాయి. |
04:43 | మనం ఒక సంఖ్య యొక్క అంకెల మొత్తాన్ని తెలుసుకోవడానికి కూడా వైల్ లూప్ ని ఉపయోగించవచ్చు |
04:47 | అది ఎలా చేయాలో చూద్దాం. |
04:49 | ముందు,మెయిన్ మెథడ్ ని తొలగించండి. |
04:54 | int n equal to 13876;. ఇది మన సంఖ్య. |
05:02 | తర్వాత, int dSum ఈక్వల్ టు 0 అవుతుంది.dsum వేరియబుల్ అనేది అంకెల మొత్తానికి గుర్తు ఇది అంకెల మొత్తాన్ని కలిగి ఉంటుంది. |
05:18 | while n గ్రేటర్ దాన్ 0 ఓపెన్ క్లోజ్ పరాంతసిస్ ను టైప్ చేయండి |
05:27 | ఈ కండిషన్ ను ఉపయోగిస్తున్న కారణం అనేది ఒక సమయంలో స్పష్టమౌతుంది. |
05:32 | అంకెల యొక్క మొత్తాన్ని పొందటానికి,మనం ముందు అంకెలను పొందాలి. |
05:36 | దాన్ని చేయడానికి,మనం మాడ్యూలోఆపరేటర్ ను ఉపయోగిస్తాం. |
05:40 | dSum = dSum + (n % 10) అని టైప్ చేయండి. కనుక, మనం యూనిట్ యొక్క అంకెను పొందుతాం దానిని dsum కు జత చేయండి. |
05:52 | తర్వాత మనం 10 తో భాగించడం చేత ఆ అంకెను తొలగిస్తాం.n = n / 10 |
06:08 | కనుక, లూప్ మొదటిసారి రన్ అయినప్పుడు dSum అనేది 6 అవుతుంది మరియు n 1387అవుతుంది. |
06:15 | ఇంకా,లూప్ రెండవ సారి రన్ అయినప్పుడు dSum అనేది 7 మరియు 6 ల మొత్తం అది 13 మరియు n విలువ 138అవుతుంది. |
06:22 | అలా లూప్ కొనసాగుతూ, అంకెలు n’ నుండితొలగించబడి చివరికి |
06:28 | n సున్నా అవుతుంది.ఆ తర్వాత కండిషన్ n గ్రేటర్ దాన్ 0 అనేది అసత్యం అయి లూప్ ముగుస్తుంది. |
06:36 | కనుక,ఇప్పుడు ప్రింట్ స్టేట్మెంట్ చేర్చుదాం. |
06:42 | System.out.println(dSum) |
06:51 | కోడ్ ని చర్యలో చూద్దాం.సేవ్ చేసి రన్ చేద్దాం. |
06:59 | మనం చూస్తున్నట్లుగా, అంకెల యొక్క మొత్తం 25 ముద్రించబడింది. |
07:06 | ఈ విధంగా, చాల ప్రాధమిక constructs లో ఒకటి అయిన while loop ను మనం ప్రోగ్రామింగ్ లో ఉపయోగించవచ్చు. |
07:16 | మనం ఈ టుటోరియల్ చివరకు వచ్చాం |
07:20 | ఈ టుటోరియల్ లో మనం నేర్చుకున్నవి:వైల్ లూప్ గురించి, ఎలా ఉపయోగించాలి అనేదాని గురించి. |
07:26 | ఈ టుటోరియల్ కొరకు ఒక అసైన్మెంట్ గా:ఈ క్రింది సమస్యను సాధించండి. |
07:29 | ఇచ్చిన సంఖ్యను వ్యతిరేకంగా వైల్ లూప్ ను ఉపయోగించి గణించండి. Example: 19435 => 53491 |
07:37 | స్పోకెన్ టుటోరియల్ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలకోసం, ఈ క్రింది లింక్ లో గల వీడియో చూడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. |
07:45 | మంచి బాండ్ విడ్త్ లేదంటే , డౌన్ లోడ్ చేసి చూడగలరు. |
07:50 | స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్టు టీమ్: స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్ నిర్వహిస్తుంది.ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికట్ ఇస్తుంది. |
07:57 | మరిన్ని వివరాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ org ను సంప్రదించండి. |
08:03 | స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం. |
08:07 | దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది |
08:12 | దీనిపై మరింత సమాచారం ఈ క్రింద లింక్ లో ఉంది.Spoken హైఫన్ tutorial డాట్ org స్లాష్ ఎన్ ఎం ఈ ఐసి టి హైఫన్ ఇంట్రో |
08:17 | ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష మరియు ఉదయ లక్ష్మి. ధన్యవాదములు. |