Advance-C/C2/Command-line-arguments-in-C/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | స్పోకెన్ ట్యుటోరియల్ లో కమాండ్ లైన్ ఆర్గుమెంట్స్ ఇన్ C అనే ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో మనం ఆర్గుమెంట్స్ తో main ఫంక్షన్ గురించి ఒక ఉదాహరణ తో నేర్చుకొంటాము. |
00:15 | ఈ ట్యుటోరియల్ కోసం నేను ఉపయోగిస్తున్నది Ubuntu OS వర్షన్ 11.10 మరియు Ubuntu పై gcc కంపైలర్ వర్షన్ 4.6.1. |
00:27 | ఈ ట్యుటోరియల్ ను నేర్చుకొనుటకు, మీకు C ట్యుటోరియల్స్ గురించి తెలుసుండాలి. |
00:33 | లేకపోతే సంబంధిత ట్యుటోరియల్స్ కోసం చూపిన మా వెబ్-సైట్ ను చూడండి. |
00:39 | మనము ఒక ప్రోగ్రాం తో మొదలు పెడదాం. నేను ఎడిటర్ నందు కోడ్ టైప్ చేసి ఉంచాను. నేను ఇప్పుడు అది ఓపెన్ చేస్తాను. |
00:45 | మన ఫైల్ పేరు main hyphen with hyphen args.c |
00:50 | ఇప్పుడు నేను కోడ్ ను వివరిస్తాను. |
00:53 | ఇవి మన header files. stdio.h అనేది ఇన్పుట్ మరియు ఔట్పుట్ కోసం, |
01:01 | stdlib.h header file ను, Numeric conversion function,Pseudo-random numbers, Generation function, Memory allocation, మరియు Process control functions వంటి వాటి కోసం ఉపయోగించాము. |
01:16 | ఇది మన main () ఫంక్షన్. దీనికి మనం రెండు ఆర్గుమెంట్స్ పంపించాము. అవి int argc, char asterisk asterisk argv (**argv ) |
01:28 | argc అనేది కమాండ్ లైన్ ఆర్గుమెంట్స్ ద్వారా, మనం పంపిన ఆర్గుమెంట్స్ సంఖ్యను తెలుపును. |
01:34 | ఈ ఆర్గుమెంట్స్ లో మన ప్రోగ్రాం పేరు కూడా కలిపి ఉంటుంది. |
01:38 | argv నందు అసలు ఆర్గుమెంట్స్ ను కలిగివుండి, index 0 నుండి మొదలు అవుతాయి. |
01:44 | index 0 నందు ప్రోగ్రాం పేరు ఉండును. |
01:48 | index 1 అనేది ప్రోగ్రాం కు మనం పంపించిన మొదటి ఆర్గుమెంట్. |
01:53 | index 2 అనేది ప్రోగ్రాం కు మనం పంపించిన రెండవ ఆర్గుమెంట్ మరియు మొదలైనవి. |
01:59 | ఈ స్టేట్మెంట్ మనం ఆర్గుమెంట్స్ గా పంపించిన సంఖ్యల మొత్తం ను డిస్ప్లే చేయును. |
02:05 | ఇది ప్రోగ్రాంకు మనం పంపించిన మొదటి ఆర్గుమెంట్ ను డిస్ప్లే చేయును. |
02:09 | 1 అనేది index 1 వద్ద గల విలువను తెలుపును. |
02:13 | while కండిషన్ ఆర్గుమెంట్స్ సంఖ్య విలువను తగ్గిస్తూ ఉంటుంది. |
02:18 | ఈ స్టేట్మెంట్ ఫంక్షన్ కు మనం పంపు అన్ని ఆర్గుమెంట్స్ విలువలను ప్రింట్ చేస్తుంది. |
02:23 | చివరగా మనకు return 0 ఉన్నది. |
02:27 | Ctrl, Alt మరియు T లను కీబోర్డ్ పై ఒకేసారి ఉపయోగించి టెర్మినల్ విండో తెరుద్దాం. |
02:35 | కంపైల్ చేయుటకు gcc space main hyphen with hyphen args.c space hyphen o space args అని టైప్ చేసి, ఎంటర్ నొక్కండి. |
02:49 | dot slash args అని టైప్ చేసి, ఎంటర్ నొక్కండి. |
02:54 | output ఈ విధంగా డిస్ప్లే చేయబడుతుంది.
Total number of arguments are 1. The first argument is null. arguments are ./args. |
03:06 | కమాండ్ లైన్ ఆర్గుమెంట్స్ ఎగ్జిక్యూషన్ సమయంలో ఇవ్వబడును. |
03:11 | మొత్తం ఆర్గుమెంట్స్ సంఖ్య 1, ఎందువలనంటే filename అనేది మన 0th ఆర్గుమెంట్ కాబట్టి. |
03:19 | ప్రోగ్రాం కు ఇంకా ఎటువంటి ఆర్గుమెంట్స్ పంపలేదు కనుక, మొదటి అర్గుమెంట్ null అగును. |
03:26 | ఆర్గుమెంట్ ఒకేఒకటి అగును, అది dot slash args |
03:31 | ఇప్పుడు తిరిగి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. |
03:34 | up-arrow కీ నొక్కి, space Sunday space Monday space Tuesday అని టైప్ చేయుము. |
03:47 | output ఈ విధంగా డిస్ప్లే చేయబడుతుంది.
Total number of arguments are 4. The first argument is Sunday. Arguments are ./args Sunday Monday and Tuesday. |
04:04 | ఔట్పుట్ ను వివరిస్తాను. |
04:06 | మొత్తం ఆర్గుమెంట్స్ 4 అవి ./args, Sunday, Monday మరియు Tuesday. |
04:14 | మొదటి ఆర్గుమెంట్ Sunday. |
04:17 | oth ఆర్గుమెంట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్న ఫైల్ పేరు అగును. |
04:22 | Sunday మొదటి ఆర్గుమెంట్ కు అసైన్ చేయబడును. |
04:25 | Monday రెండవ ఆర్గుమెంట్ కు అసైన్ చేయబడును. |
04:28 | Tuesday మూడవ ఆర్గుమెంట్ కు అసైన్ చేయబడును. |
04:31 | మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము. సంక్షిప్తముగా, |
04:37 | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకొన్నది.
Command line arguments, argc, argv |
04:45 | అసైన్మెంట్ గా ప్రోగ్రాం ను వివిధ రకాలైన ఆర్గుమెంట్స్ తో ఎగ్జిక్యూట్ చెయ్యండి. |
04:51 | ఈ లింక్ వద్ద అందుబాటులో వున్న వీడియో చూడండి. |
04:54 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. |
04:57 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
05:02 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది. |
05:08 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికీ సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది. మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgకు మెయిల్ చెయ్యండి. |
05:18 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము. |
05:22 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
05:30 | ఈ మిషన్ గురించి మరింత సమాచారము ఈ లింక్ లో అందుబాటులో ఉంది. |
05:36 | ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది స్వామి మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు. |