Advance-C/C2/Storage-class-specifiers/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 18:25, 24 July 2017 by Yogananda.india (Talk | contribs)
Time | Narration | |
00:01 | స్పోకెన్ ట్యుటోరియల్ లో స్టోరేజ్ క్లాస్ స్పెసిఫయర్స్ ఇన్ C అనే ట్యుటోరియల్ కు స్వాగతం . | |
00:07 | ఈ ట్యుటోరియల్ లో మనం స్టోరేజ్ క్లాస్ స్పెసిఫయర్స్ , auto కీవర్డ్ , static కీవర్డ్ , extern కీవర్డ్ , register కీవర్డ్ గురించి ఒక ఉదాహరణ తో నేర్చుకొంటాము. | |
00:22 | ఈ ట్యుటోరియల్ కోసం నేను ఉపయోగిస్తున్నది Ubuntu OS వర్షన్ 11.10 మరియు Ubuntu పై gcc కంపైలర్ వర్షన్ 4.6.1. | |
00:34 | ఈ ట్యుటోరియల్ ను నేర్చుకొనుటకు , మీకు C ట్యుటోరియల్స్ గురించి తెలుసుండాలి. | |
00:41 | లేకపోతే సంబంధిత ట్యుటోరియల్స్ కోసం చూపిన మా వెబ్-సైట్ ను చూడండి . | |
00:47 | నేను స్టోరేజ్ క్లాస్ యొక్క పరిచయంతో మొదలు పెడతాను. | |
00:52 | స్పెసిఫయర్స్ కంపైలర్ కు వేరియబుల్స్ ఎక్కడ స్టోర్ కావాలో , | |
00:57 | ఎలా స్టోర్ కావాలో చెబుతుంది. | |
00:59 | అదేవిధంగా వేరియబుల్స్ యొక్క ప్రారంభ విలువ మరియు | |
01:03 | వేరియబుల్స్ యొక్క జీవిత కాలం గురించి చెబుతుంది. | |
01:06 | సింటాక్స్ : storage_specifier data_type variable _name | |
01:13 | స్టోరేజ్ క్లాస్ స్పెసిఫయర్స్ లో రకాలు
auto static extern register | |
01:21 | ముందుగా auto కీవర్డ్ తో మొదలు పెడదాం. | |
01:24 | auto కీవర్డ్ automatic వేరియబుల్ ను డిక్లేర్ చేస్తుంది. | |
01:28 | దానికి లోకల్ స్కోప్ ఉంటుంది. | |
01:30 | keywaords ఆటోమేటిక్ గా అసైన్ చేయబడవు. | |
01:34 | మీరు డిక్లేర్ చేస్తున్నపుడు తప్పనిసరిగా keywaords కు విలువలు అసైన్ చేయాలి. | |
01:39 | కీవర్డ్స్ యొక్క స్టోరేజ్ స్పేస్ CPU మెమొరీ | |
01:43 | మనము ఒక ప్రోగ్రాం తో చూద్దాం. నేను ఎడిటర్ నందు కోడ్ టైప్ చేసి ఉంచాను. నేను ఇప్పుడు అది ఓపెన్ చేస్తాను. | |
01:49 | మన ఫైల్ పేరు auto.c అని గమనించండి. | |
01:54 | మనం increment() అను ఫంక్షన్ ను డిక్లేర్ చేశాము. | |
01:58 | ఇది మన main () ఫంక్షన్ | |
02:00 | main () ఫంక్షన్ నందు increament() ఫంక్షన్ 4 సార్లు పిలువబడింది. | |
02:06 | తరువాత return 0 కలదు. | |
02:10 | ఫంక్షన్ డెఫినిషన్ గురించి చూద్దాం. | |
02:14 | ఇక్కడ మనం i వేరియబుల్ ను auto int గా డిక్లేర్ చేశాము. అది లోకల్ స్కోప్ కలిగియున్నది. | |
02:21 | తరువాత మనం printf ను ఉపయోగించి i విలువ ను ప్రదర్శిస్తాము. | |
02:26 | i విలువ ఇక్కడ ఇంక్రిమెంట్ చేయబడినది. | |
02:30 | Ctrl, Alt మరియు T లను కీబోర్డ్ పై ఒకేసారి ఉపయోగించి టెర్మినల్ విండో తెరుద్దాం. | |
02:38 | కంపైల్ చేయుటకు gcc space auto.c space hyphen o space auto అని టైప్ చేసి , ఎంటర్ నొక్కండి. | |
02:48 | dot slash autoఅని టైప్ చెయ్యండి. | |
02:51 | వచ్చిన ఔట్పుట్ 0 | |
02:54 | తిరిగి మన ప్రోగ్రాం కు వద్దాం . | |
02:57 | ప్రోగ్రాం లో main కు పైన auto వెరియేబుల్ కు ప్రారంభవిలువ ను ఇద్దాం. | |
03:02 | నేను ఈ డిక్లరేషన్ మరియు ఇనీషియాలైసేషన్ ను ఇక్కడ నుండి కట్ చేసి పైన పేస్ట్ చేస్తాను. మరియు save పై క్లిక్ చేస్తాను. | |
03:14 | టెర్మినల్ నందు ఎగ్జిక్యూట్ చేద్దాం. అప్-యారో కీ రెండు సార్లు ప్రెస్ చేసి ఎంటర్ నొక్కండి. | |
03:22 | మనకు file-scope declaration of 'i' specifies 'auto' అను ఎర్రర్ ఇస్తుంది. | |
03:29 | ఇది ఎందువలన అంటే auto వేరియబుల్ ఫంక్షన్ కు లోకల్ అగును కనుక. | |
03:34 | కాబట్టి మనం గ్లోబల్ గా ఇనీషియాలైజ్ చేయలేము. | |
03:37 | ఎర్రర్ ను సరిచేద్దాం. తిరిగి మన ప్రోగ్రాం లోనికి రండి. | |
03:42 | దీనిని ఇక్కడ నుండి తీసివేసి ఇక్కడ పేస్ట్ చెయ్యండి. | |
03:47 | save పై క్లిక్ చేసి టెర్మినల్ వద్ద ఎగ్జిక్యూట్ చెయ్యండి. | |
03:52 | అప్-యారో కీ ప్రెస్ చేసి ఇంతకు ముందు కమాండ్ ను పిలవండి. | |
03:57 | ఎంటర్ నొక్కడి dot slash auto అని టైప్ చేసి తిరిగి ఎంటర్ నొక్కండి. | |
04:03 | అవును ఇది పనిచేస్తుంది వచ్చిన ఔట్పుట్ 0 | |
04:07 | ఇది ఎందువలనంటే మనం దానికి జీరో (0) విలువ ను ఇచ్చాము కాబట్టి. | |
04:13 | ఇప్పుడు static వేరియబుల్ గురుంచి చూద్దాం. | |
04:16 | ఇంత క్రితం ట్యుటోరియలోనే మనం static వేరియబుల్ గురించి చదువుకొనినను , నేను ఇక్కడ దానిగురించి సంక్షిప్తంగా వివరిస్తాను. | |
04:24 | static వేరియబుల్స్ 0 తో ఇనీషియాలైజ్ చేయబడతాయి. | |
04:28 | ప్రోగ్రాం కంట్రోల్ బ్లాక్ ను దాటిన తరువాత కూడా అవి నాశనం కావు. | |
04:35 | వేరియబుల్ యొక్క విలువ ఫంక్షన్ యొక్క వేరువేరు కాల్స్ మధ్య అందుబాటులో ఉండును. | |
04:41 | వీటి స్టోరేజ్ స్పేస్ CPU మెమొరీ | |
04:45 | ఒక ఉదాహరణ చూద్దాం. నేను అదే కోడ్ ఫైల్ ను ఎడిట్ చేస్తాను. | |
04:51 | తిరిగి మన ప్రోగ్రాంకు వద్దాం. | |
04:54 | Ctrl Shift మరియు S ఒకేసారి ప్రెస్ చెయ్యండి. | |
05:01 | ఇప్పుడు నేను ఫైల్ పేరు ను static అని మారుస్తాను. save పై క్లిక్ చెయ్యండి. | |
05:10 | ఇప్పుడు నేను i యొక్క ఇనీషియాలైసేషన్ ను static int i equals to zeroకు మారుస్తాను. save పై క్లిక్ చెయ్యండి. | |
05:23 | ఏమి జరుగునో గమనించండి. టెర్మినల్ వద్ద ఫైల్ ను ఎగ్జిక్యూట్ చెయ్యండి. | |
05:30 | gcc space static.c space hyphen o space stat అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. | |
05:41 | dot slash stat అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. | |
05:46 | 0, 1, 2, 3 అని ఔట్పుట్ డిస్ప్లే అగును. | |
05:51 | ఇది ఎందువలనంటే static వేరియబుల్స్ గ్లోబల్ వేరియబుల్స్ కాబట్టి | |
05:56 | ఒక ఫంక్షన్ లో డిక్లేర్ చేయబడ్డ స్టాటిక్ వేరియబుల్ యొక్క స్కోప్ ఆ ఫంక్షన్ కు లోకల్ అగును. | |
06:03 | అవి వాటి విలువను ఫంక్షన్ యొక్క వేరువేరు కాల్స్ మధ్య కోల్పోవు. | |
06:08 | ఇప్పుడు extern కీవర్డ్ గురించి నేర్చుకొందాం. | |
06:12 | extern వేరియబుల్స్ యొక్క scope ప్రోగ్రాం అంతా ఉంటుంది. | |
06:17 | extern వేరియబుల్స్ యొక్క డెఫినిషన్ Cప్రోగ్రాం లో ఎక్కడైనా ఉండవచ్చు. | |
06:23 | extern వేరియబుల్స్ అప్రమేయంగా 0 తో ఇనీషియాలైజ్ చేయబడతాయి. | |
06:28 | అవి ప్రోగ్రాం నందు అన్ని ఫంక్షన్స్ లలో పొందబడును. | |
06:33 | ఇవి CPU మెమొరీ నందు స్టోర్ చేయబడతాయి | |
06:36 | ఒక ఉదాహరణను చూద్దాం. | |
06:38 | నేను ఎడిటర్ నందు కోడ్ టైప్ చేసి ఉంచాను. నేను ఇప్పుడు అది ఓపెన్ చేస్తాను. | |
06:42 | మన ఫైల్ పేరు extern.c అనిగమనించండి. | |
06:47 | నేను integer variable x to 10 అని ఒక వేరియబుల్ ను ఇనీషిలైజ్ చేశాను. | |
06:54 | ఇది మన main () ఫంక్షన్ . ఈ main () ఫంక్షన్ నందు నేను ఒక extern integer వేరియబుల్ y ను డిక్లేర్ చేశాను. | |
07:03 | printf ()స్టేట్మెంట్ ను ఉపయోగించి x మరియు,y ల యొక్క విలువను ప్రదర్శిస్తాము. ఇది మన return స్టేట్మెంట్. | |
07:12 | main () ఫంక్షన్ క్లోజ్ అయిన తరువాత నేను y కు 50 ను ఇచ్చాను. | |
07:18 | టెర్మినల్ కు వెళ్ళి , ouput ఏమిటో చూద్దాం. | |
07:24 | gcc space extern.c space hyphen o space ext అని టైప్ చేసి , ఎంటర్ నొక్కండి. | |
07:35 | dot slash ext అని టైప్ చేసి , ఎంటర్ నొక్కండి. | |
07:40 | ఔట్పుట్ ఈ విధంగా ఉండును .
The value of x is 10 The value of y is 50 | |
07:48 | మనం చదువు కొనినట్టు extern కీవర్డ్ యొక్క విలువ main ప్రోగ్రాం అంతను ఉంటుంది. | |
07:55 | దీనిని మనం మన ప్రోగ్రాం లో ఎక్కడైనా డిఫైన్ చెయ్యవచ్చు. | |
07:59 | కానీ స్టేట్మెంట్స్ జస్టిఫై చెయ్యాలి | రెండు వాక్యాలు జస్టిఫై చేయబడ్డాయి. |
08:02 | ఇప్పుడు register కీవర్డ్ గురించి చూద్దాం | |
08:06 | register వేరియబుల్స్ మాములు వేరియబుల్స్ కంటే వేగంగా access చేయబడతాయి. | |
08:13 | అవి మెయిన్ మెమొరీ నందు కాకుండా రిజిస్టర్ మెమొరీ నందు స్టోర్ అగును. | |
08:19 | రిజిస్టర్ మెమొరీ సైజ్ తక్కువ కావున మనం కొన్ని వేరియబుల్స్ ను మాత్రమే స్టోర్ చేయగలము. | |
08:25 | అవి 16bit , 32bit, లేదా 64bit లలో ఉండును. | |
08:30 | ఒక ఉదాహరణను చూద్దాం. నేను ఎడిటర్ నందు కోడ్ టైప్ చేసి ఉంచాను. నేను ఇప్పుడు అది ఓపెన్ చేస్తాను. | |
08:37 | మన ఫైల్ పేరు register.c అనిగమనించండి. | |
08:42 | ఇక్కడ మనం ఒక register integer వారియేబుల్ ను డిక్లేర్ చేశాము . | |
08:47 | ఈ వేరియబుల్ డైరెక్ట్ గా రిజిస్టర్ మెమొరీ లో స్టోర్ చేయబడును. | |
08:53 | ఇది for లూప్ . అది i విలువను 1 నుండి 5 వరకు డిస్ప్లే చేయును. | |
08:59 | ఇది i యొక్క విలువ ను ప్రింట్ చేస్తుంది. | |
09:03 | మనం ప్రోగ్రాం కోడ్ ను ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. | |
09:07 | కంపైల్ చేయుటకు gcc space register.c space hyphen o space register అని టైప్ చేసి , | |
09:17 | ఎంటర్ నొక్కండి. dot slash register అని టైప్ చేసి , ఎంటర్ నొక్కండి. | |
09:25 | output ఈ క్రింది విధంగా డిస్ప్లే చేయబడుట చూడవచ్చు Values stored in register memory 1 2 3 4 5 | |
09:34 | మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము. సంగ్రహంగా | |
09:39 | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకొన్నది. స్టోరేజ్ క్లాస్ స్పెసిఫయర్స్
auto కీవర్డ్ static కీవర్డ్ extern కీవర్డ్ register కీవర్డ్ | |
09:52 | అసైన్మెంట్ గా మొదటి 5 సంఖ్యల మొత్తం కనుగొనుటకు ప్రోగ్రాం వ్రాయండి. | |
09:59 | ప్రోగ్రాం నందు auto మరియు static కీవర్డ్స్ ను డిక్లేర్ చేయుము. | |
10:04 | ఈ లింక్ వద్ద అందుబాటులో వున్న వీడియో చూడండి. | |
10:07 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది . | |
10:11 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. | |
10:16 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది. | |
10:22 | ఆన్ లైన్ పరీక్ష లో ఉత్తీర్ణులైన వారికీ సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది. మరిన్ని వివరాలకు , దయచేసి contact@spoken-tutorial.orgకు మెయిల్ చెయ్యండి. | |
10:33 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము. | |
10:38 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. | |
10:45 | ఈ మిషన్ గురించి మరింత సమాచారము ఈ లింక్ లో అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org\NMEICT-Intro. | |
10:52 | ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది స్వామి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు. |