Inkscape/C4/Mango-pattern-for-Textile-design/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 16:59, 5 September 2017 by Yogananda.india (Talk | contribs)
Time | Narration |
00:01 | Inkscape ను ఉపయోగించి Mango Pattern for textile design అను స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:08 | ఈ ట్యుటోరియల్ లో మనం Pattern along Path ను ఉపయోగించి ఒక మామిడి కాయ ఆకృతి ని (మేంగో పాటర్న్) సృష్టించడం నేర్చుకుంటాం. |
00:17 | ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయటానికి, నేను:Ubuntu Linux 12.04 OS, Inkscape వర్షన్ 0.91 ఉపయోగిస్తున్నాను. |
00:26 | Inkscape ను తెరుద్దాం. |
00:28 | Bezier tool ను ఎంచుకోండి ,Tool Controls bar పైన, Mode ను Create Spiro path కు మరియు Shape ను Ellipse కు మార్చండి. |
00:38 | ఇప్పుడు ప్రదర్శిస్తున్నట్టుగా canvas పై ఒక మామిడి కాయ వంటి డిజైన్ గీయండి. ఇది చూడటానికి ఒక మామిడి కాయ ఆకృతి(మేంగో పాటర్న్) లాగానే ఉండాలి. |
00:47 | తరువాత Star tool ని ఎంచుకోండి. |
00:50 | ఇప్పుడు canvas పై ఒక నక్షత్రం ఆకారాన్ని గీసి, Selector tool పై క్లిక్ చేయండి. |
00:55 | Tool controls bar పై, Width మరియు Height లను 30 కి మార్చండి. |
01:00 | రంగును ఎరుపుకి మార్చండి. |
01:03 | తరువాత మనం నక్షత్రం యొక్క ఒక వరుస(పాటర్న్)ఆకృతులను సృష్టించాలి. |
01:07 | ఆలా చేయడానికి, Edit menu కి వెళ్ళి, Clone పై ,ఇంకా Create Tiled Clones పై క్లిక్ చేయండి. |
01:16 | Reset పై క్లిక్ చేయండి. |
01:18 | Rows యొక్క సంఖ్యను 1 కి మరియు Columns యొక్క సంఖ్యను 46 కి మార్చండి. |
01:24 | Columns సంఖ్య మామిడి కాయ ఆకారం యొక్క పరిమాణం ప్రకారం మారవచ్చు. |
01:28 | Create పై క్లిక్ చేయండి.ఇప్పుడు వరుస ఆకృతులు సృష్టించబడ్డాయి. |
01:33 | అన్ని నక్షత్రాలను ఎంచుకుని వాటిని సమూహం చేయడానికి Ctrl + G ని నొక్కండి. |
01:38 | ఇప్పుడు మామిడి కాయ ఆకారం మరియు నక్షత్రం ఆకృతి రెండిటిని ఎంచుకోండి. |
01:42 | Go to Extensions కి వెళ్ళి Generate from Path పై,తరువాత Pattern along Path పై క్లిక్ చేయండి. |
01:49 | Apply పై క్లిక్ చేసి డైలాగ్ బాక్స్ ను మూసివేయండి. |
01:53 | ఆకారం పైన నక్షత్రం ఆకృతి ఏర్పడింది గమనించండి. |
01:57 | ఇప్పుడు మామిడి కాయ ఆకారాన్ని మరియు నక్షత్రం వరుసను ఎంచుకుని వాటిని తొలగించండి. |
02:01 | నక్షత్రం ఆకృతిని ఎంచుకుని దానిని నకిలీ చేయటానికి Ctrl + D ని నొక్కండి. |
02:07 | ఇప్పుడు నకిలీ ఆకృతిని ఎంచుకుని Ctrl key నొక్కడం ద్వారా దానిని పునఃపరిమాణం చేయండి. |
02:13 | దానిని అసలు ఆకృతి యొక్క మధ్యలో ఉంచండి. |
02:16 | ఇప్పుడు మామిడి కాయ ఆకృతి లోపల ఉన్న ఖాళీ ప్రదేశాన్ని వేరొక డిజైన్ తో నింపుదాం. |
02:21 | Bezier tool ను ఎంచుకుని ప్రదర్శిస్తున్నట్టు గా ఒక డిజైన్ గీయండి. |
02:28 | Path menu కి వెళ్ళి, Path Effects ను ఎంచుకోండి. |
02:32 | Pattern along Path కింద మనం, అనేక ఎంపికలను చూస్తాము. |
02:37 | Pattern source లో, మొదటి ఎంపిక Edit on-canvas, దానిపై క్లిక్ చేయండి. |
02:43 | canvas యొక్క ఎగువ ఎడమవైపున సృష్టించబడిన 4 nodes ఉన్నాయి గమనించండి. |
02:48 | nodes బాగా కనిపించడానికి నేను జూమ్ చూస్తాను.వాటిని ఆకృతికి దగ్గరగా కదిలించండి. |
02:54 | ఇప్పుడు nodes పై క్లిక్ చేసి లాగండి.ఇప్పుడు ఆకారంలో వచ్చిన మార్పును గమనించండి. |
03:00 | Selector tool పై క్లిక్ చేయండి.ఇప్పుడు Path menu కి వెళ్ళి, Object to Path పై క్లిక్ చేయండి. |
03:06 | పునఃపరిమాణం చేస్తున్నప్పుడు ఆకృతిలో ఎటువంటి మార్పు రాకుండా ఉండటానికి ఇది చేస్తాము. |
03:12 | చూపిన విధంగా ఆకృతిని పునఃపరిమాణం చేయండి.దానిని నకిలీ చేసి మామిడి కాయ ఆకృతిలో ఉంచండి. |
03:20 | తరువాత చిన్న మామిడి కాయ ఆకృతిలో ఉన్న ఖాళీ ప్రదేశాన్ని నింపుదాం. |
03:25 | Star tool పై క్లిక్ చేసి, ఒక నక్షత్రాన్ని గీయండి. |
03:28 | లోపలి హ్యాండిల్ పై క్లిక్ చేసి, ఇలాంటి ఆకారాన్ని పునఃసృష్టించండి.రంగును నీలంగా మార్చండి. |
03:34 | Selector tool పై క్లిక్ చేసి, ఆకారాన్ని పునఃపరిమాణం చేయండి. |
03:38 | ఈ ఆకృతిని నకిలీ చేసి, చిన్న మామిడి కాయ ఆకృతిని నింపండి. |
03:47 | అన్ని ఆబ్జెక్ట్ లను ఎంచుకోవడానికి Ctrl + A ను నొక్కి వాటిని సమూహం చేయడానికి Ctrl + G ని నొక్కండి. |
03:53 | ఆకృతిని పునఃపరిమాణం చేసి దానిని canvas యొక్క ఎగువ, ఎడమవైపు పైన ఉంచండి. |
03:58 | మనం క్లోనింగ్ ను ఉపయోగించి ఈ ఆకృతిని పునరావృతం చేయవచ్చు.Edit menu కి వెళ్ళి Clone పై క్లిక్ చేసి, తరువాత Create Tiled clones పై క్లిక్ చేయండి. |
04:07 | Symmetry tab కిందన Simple translation అనే మోడ్ ఉండాలి. |
04:12 | అడ్డు వరుసల యొక్క సంఖ్యను 8 కు మరియు నిలువు వరుసల సంఖ్యను 5 కు మార్చండి |
04:17 | Shift tab పై క్లిక్ చేయండి.Per column యొక్క Shift X విలువను 30 కి మార్చండి. |
04:24 | Create బటన్ పై క్లిక్ చేయండి.ఇప్పుడు canvas పై పునరావృతం సృష్టించబడింది. |
04:32 | ఈ ఆకృతి ఒక కుర్తాపై ఇలా కనిపిస్తుంది. |
04:35 | సారాంశం చూద్దాం.ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి. Pattern along Path ను ఉపయోగించి(మేంగో పాటర్న్)మామిడి కాయ ఆకృతిని గీయడం. |
04:44 | ఇక్కడ మీ కోసం ఒక అసైన్మెంట్. ఒక ఆకు ఆకృతిని (పాటర్న్)సృష్టించండి |
04:47 | మీ పూర్తి అయిన అసైన్మెంట్ చూడటానికి ఇలా ఉండాలి. |
04:52 | ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది దయచేసి దానిని చూడండి. |
04:58 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి:contact@spoken-tutorial.org. |
05:07 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు NMEICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది.ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది:http://spoken-tutorial.org/NMEICT-Intro. |
05:16 | ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయలక్ష్మి మాతో చేరినందుకు ధన్యవాదములు. |