Inkscape/C4/Warli-art-for-Textle-design/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 08:12, 29 August 2017 by Simhadriudaya (Talk | contribs)
Time | Narration |
00:01 | Inkscape ను ఉపయోగించి Warli art for Textile design అను స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో మనం సరిహద్దుల కోసం ఒక వర్లీ నమూనా రూపకల్పనను సృష్టించడం, క్లోనింగ్ ఉపయోగించి పునరావృత నమూనాలు చేయడం నేర్చుకుంటాం. |
00:17 | ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయటానికి, నేను
Ubuntu Linux 12.04 OS, Inkscape వర్షన్ 0.91 ఉపయోగిస్తున్నాను. |
00:27 | Inkscape ను తెరుద్దాం.ముందుగా వర్లీ పాటర్న్ ను రూపొందిద్దాం. |
00:32 | File కి వెళ్ళీ Document Properties పై క్లిక్ చేయండి.Orientation ను Landscape కు మార్చి డైలాగ్ బాక్స్ ను మూసివేయండి. |
00:42 | rectangle tool ను ఎంచుకుని మొత్తం canvas ని కప్పి ఉంచేలా ఒక దీర్ఘచతురస్రాన్ని గీసి దాన్ని నీలంరంగు చేయండి. |
00:53 | Ellipse tool పై క్లిక్ చేసి canvas బయటి భాగంలో ఒక వృత్తాన్ని గీయండి.ఆపై Selector tool పై క్లిక్ చేయండి. |
01:02 | Tool controls bar పైన విడ్త్ (వెడల్పు)మరియు హైట్ (ఎత్తు)లను 15 కు మార్చండి. |
01:08 | దాని రంగును నారింజకు మార్చండి.చుపిస్తున్నట్లుగా దానిని canvas యొక్క దిగువభాగానికి కదిలించండి. |
01:15 | వృత్తాన్ని నకిలీ చేయడానికి Ctrl + D ను నొక్కండి. |
01:19 | Tool controls bar పైన విడ్త్ (వెడల్పు)మరియు హైట్(ఎత్తు)లను 7 కు మార్చండి. |
01:25 | నకిలీ వృత్తాన్ని అసలు వృత్తం యొక్క ఎడమ దిగువకు కదిలించండి. |
01:31 | ఇది వర్లీ ఆకారం యొక్క తల. |
01:34 | తరువాత, Object menu కి వెళ్ళి Symbols ఎంపికలపై క్లిక్ చేయండి.Symbol set డ్రాప్ -డౌన్ మెనూ పై క్లిక్ చేసి, Flow Chart Shapes ను ఎంచుకోండి. |
01:46 | జ్యామితీయ ఆకృతుల యొక్క ఒక జాబితా కనిపిస్తుంది.త్రిభుజం ఆకారంపై క్లిక్ చేసి దానిని canvas దగ్గరకు లాగండి.రంగును నారింజకు మార్చి Stroke ను తొలగించండి. |
02:00 | Tool controls bar పైన విడ్త్ (వెడల్పు)మరియు హైట్(ఎత్తు)లను 20 కు మార్చండి. |
02:07 | త్రిభుజాన్ని నకిలీ చేయటానికి Ctrl + D ని నొక్కి దానిని ఫ్లిప్ చేయడానికి V ని నొక్కండి. |
02:14 | చూపించినట్లుగా, త్రిభుజాలను తల కింద సర్దుబాటుచేయండి. |
02:21 | ఇది వర్లీ ఆకారం యొక్క శరీరం. |
02:24 | Rectangle tool ను ఎంచుకుని తల మరియు శరీరం మధ్యలో ఒక గీతను గీయండి. |
02:30 | ఇప్పుడు ఆకారం యొక్క మెడ గీయబడింది. |
02:33 | తరువాత మనం చేతులు మరియు కాళ్ళు గీద్దాం.దీనికోసం, మనం Bezier tool ను ఎంచుకుందాం. |
02:41 | ప్రదర్శిస్తున్నట్టుగా చేతులు మరియు కాళ్ళు గీయండి. |
02:47 | హ్యాండ్స్(చేతులు)మరియు లెగ్స్(కాళ్ళు)రెండిటిని ఎంచుకోండి.Fill and Stroke పైన Picker tool ను ఉపయోగించి, వర్లీ ఆర్ట్(కళ)యొక్క బోడీ(శరీరం)నుండి నారింజరంగును ఎంచుకోండి. |
02:59 | స్ట్రోక్ వెడల్పు(విడ్త్)ను 2 కు మార్చండి. |
03:02 | ఇప్పుడు అన్ని అంశాలని(ఎలెమెంట్స్)ఎంచుకుని వాటిని అన్నింటినీ సమూహం చేయడానికి Ctrl + G ని నొక్కండి. |
03:09 | ఇప్పుడు వర్లీ ఆకారం సిద్ధమైనది.ఇప్పుడు ఈ వర్లీ ఫిగర్(ఆకారం)తో ఒక గుండ్రని పాటర్న్(నమూనా)ను సృష్టిద్దాం. |
03:17 | తరువాతి వాటికి వెళ్లేముందు, నేను ఈ ఫిగర్(ఆకారం)యొక్క ఒక కాపీ( నకలు )చేసి దానిని ఒక్క పక్కన ఉంచుతాను. |
03:22 | ఇప్పుడు అసలు (ఒరిజినల్)వర్లీ ఆర్ట్(కళ)ను ఎంచుకోండి.యాంకర్ పాయింట్ (బిందువు )కనిపించేలా చేయడానికి ఇప్పుడు, ఫిగర్(ఆకారం)పై ఇంకోసారి క్లిక్ చేయండి |
03:30 | యాంకర్ పాయింట్ మీద క్లిక్ చేసి ప్రదర్శించినట్లుగా దానిని కిందికి కదిలించండి. |
03:36 | ఇప్పుడు Edit కి వెళ్లి Clone పై తరువాత Create Tiled Clones పై క్లిక్ చేయండి. |
03:42 | డైలాగ్ బాక్స్ లో, Symmetry tab కింద డ్రాప్ -డౌన్ మెనూ లో Simple translation ఎంపిక తప్పకుండా ఉఁడాలి. |
03:51 | ఆపై Shift tab కి వెళ్ళండి.Per column ఎంపిక కింద, X విలువను -100 కి మార్చండి. |
03:58 | తరువాత Rotation tab కి వెళ్ళండి.Per row మరియు Per column పారామీటర్స్ యొక్క కోణాన్ని 30 కు మార్చండి. |
04:07 | దిగువన, rows యొక్క సంఖ్యను 1గా ఉంచుదాం.columns యొక్క సంఖ్యను 12 కు మార్చుదాం. |
04:14 | ఆపై Create బటన్ పై క్లిక్ చేయండి. |
04:16 | canvas పైన గుండ్రని పాటర్న్(నమూనా)సృష్టించబడింది గమనించండి. |
04:21 | ఇప్పుడు మనం కొన్ని ఇతర ఎంపికలను ప్రయత్నిద్దాం. |
04:24 | Rotation tab కింద Per row మరియు Per column పారామీటర్స్ యొక్క కోణాన్ని 10 కి మార్చి Create పై క్లిక్ చేయండి. |
04:33 | canvas పైన సృష్టించబడిన పాటర్న్(నమూనా)ను గమనించండి.దానిని పూర్తి గుండ్రని పాటర్న్(నమూనా)గా చేయడానికి Rows ను 40 కి మార్చండి. |
04:41 | Create పై క్లిక్ చేసి canvas పై మార్పులను గమనించండి. |
04:46 | అదే విధంగా మీరు వివిధ కోణాల్లో పాటర్న్స్(నమూనాలను)పొందడానికి Rotation పారామీటర్స్ ను మార్చవచ్చు. |
04:53 | గుండ్రని పాటర్న్(నమూనా)ను ఎంచుకుని వాటన్నిటిని కలిపి సమూహం చేయడానికి Ctrl + G ని నొక్కండి. |
04:59 | ఇప్పుడు మన canvas పై మనం ఒక మనోహరమైన వర్లీ ఆర్ట్(కళ)ను కలిగిఉన్నాము. |
05:04 | ఈ విధంగా, దానిని ఒక పక్కకి కదిలిద్దాం. |
05:08 | ఇప్పుడు, కొన్ని ఇతర ఎంపికలను ప్రయత్నిద్దాం. |
05:11 | తరువాత, Create Spirals టూల్ ను ఉపయోగించి, చూపించిన విధంగా canvas పై,ఒక చక్కని పెద్ద సర్పిలాన్ని గీయండి. |
05:20 | Selector tool పై క్లిక్ చేసి, ఒకే ఒక్క వర్లీ ఆకారంను ఎంచుకుని, చూపినవిధంగా, దానిని(స్పైరల్ )సర్పిలం యొక్క మధ్యభాగంలో ఉంచండి. |
05:27 | ఇప్పుడు Tool Controls bar పైన Raise to top ఎంపికపై క్లిక్ చేయండి. |
05:32 | అప్పుడు,( స్పైరల్)సర్పిలాన్ని కూడా ఎంచుకోండి. |
05:35 | Extensions menu పై క్లిక్ చేసి Generate from path ఎంపికను ఎంచుకోండి. |
05:41 | కనిపించే సబ్-మెనూ లో Scatter ను ఎంచుకోండి. |
05:45 | స్క్రీన్ పైన ఒక డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.ఇక్కడ, Follow path orientation చెక్ బాక్స్ ను చెక్ చేయండి. |
05:54 | Space between copies లో, మనం 5 అని ఇస్తాం. |
05:58 | దానిని నిర్ధారించడానికి-Original pattern will be అనేది Moved కు సర్దబడింది మరియు Duplicate the pattern before deformation అనేది కూడా తనిఖీ చేయబడింది. |
06:08 | Apply బటన్ పై క్లిక్ చేసి డైలాగ్ బాక్స్ మూసివేయండి. |
06:12 | సర్పిల మార్గాన్ని బహిర్గతంచేయడానికి సర్పిల వర్లీ పాటర్న్(నమూనా)ను ఒక పక్కకి కొంచం కదిలిద్దాం.ఇప్పుడు, సర్పిల మార్గాన్ని(పాత్ ను)ఎంచుకుని దానిని తొలగించండి. |
06:21 | ఇలా Inkscape లో ఒక అందమైన సర్పిల వర్లీ పాటర్న్(నమూనా)ను ఎవరైనా గీయవచ్చు. |
06:26 | అదేవిధంగా, మనం ఎన్నో మనోహరమైన వర్లీ(పాటర్న్స్)నమూనాలను సృష్టించవచ్చు. |
06:31 | తరువాత, సరిహద్దును ఎలా సృష్టించాలో నేర్చుకుందాం. |
06:35 | Object menu కి వెళ్లి Symbols పై క్లిక్ చేయండి.త్రిభుజం ఆకారంపై క్లిక్ చెయిన్ దానిని canvas వద్దకు లాగండి. |
06:42 | Tool controls bar పైన విడ్త్(వెడల్పు)మరియు హైట్ (ఎత్తు)లను 30కి మార్చండి. |
06:47 | ఇప్పుడు త్రిభుజాన్ని canvas యొక్క ఎగువ ఎడమకు కదిలించండి. |
06:52 | నేను త్రిభుజాన్ని ఉపయోగించి ఒక వరుస (రో)పాటర్న్(నమూనా)ను సృష్టించాలి అనుకుంటున్నాను. |
06:56 | Edit కి వెళ్లి Clone పై క్లిక్ చేసి తరువాత Create Tiled Clones పై క్లిక్ చేయండి.మునుపటి అన్నిసెట్టింగులు ఇక్కడ కనిపిస్తాయి. |
07:06 | Rotation ట్యాబ్ లో, Per Row మరియు Per Column యొక్కAngle పారామీటర్ ను 0 కి మార్చండి. |
07:13 | Shift ట్యాబ్ లో, Per column ఎంపిక కింద, X విలువను 0 కి మార్చండి. |
07:19 | చివరగా, ఇక్కడ చుపిస్తున్నట్లుగా, దిగువభాగం వద్ద Column ను 35కు మార్చండి. ఆపై Create బటన్ పై క్లిక్ చేయండి. |
07:27 | canvas పైన వరుస (రో)పాటర్న్(నమూనా)సృష్టించబడింది గమనించండి. |
07:31 | అన్ని త్రిభుజాలను ఎంచుకుని వాటన్నిటిని కలిపి సమూహం చేయడానికి Ctrl + G ని నొక్కండి. |
07:37 | త్రిభుజం పాటర్న్(నమూనా)ను నకిలీ చేయడానికి Ctrl + D ని నొక్కండి.దానిని ఫ్లిప్ చేయడానికి V ని నొక్కండి. |
07:43 | ఇప్పుడు పాటర్న్(నమూనా)ను canvas యొక్క దిగువభాగానికి కదిలించండి. |
07:48 | ఇప్పుడు మన వర్లీ పాటర్న్(నమూనా)సిద్ధమైనది.మనం వివిధ వస్త్ర రూపకల్పన కార్యక్రమాలలో ఈ నమూనాను సరిహద్దులుగా ఉపయోగించవచ్చు. |
07:55 | ఒక కుర్తీ పై అది ఇలా కనిపించాలి. |
07:58 | మనం దీనిని ఒక దిండు కవర్ డిజైన్ గా కూడా ఉపయోగించవచ్చు. |
08:02 | మరియు ఈ వర్లీ ఆర్ట్(కళ)ఒక వస్త్ర సంచిపై కూడా చాల గొప్పగా కనిపిస్తుంది. |
08:06 | కనుక, ఇదేవిధంగా, మీరు వర్లీ కళారూపాన్ని ఉపయోగించి వివిధ రకాల వస్త్ర నమూనాలను సృష్టించవచ్చు. |
08:13 | మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము, సారాంశం చూద్దాం. |
08:18 | ఈ ట్యుటోరియల్ లో మనం వస్తాల కొరకు వర్లీ పాటర్న్(నమూనా)ను,క్లోనింగ్ ఉపయోగించి (పాటర్న్స్) నమూనాలను సృష్టించడం నేర్చుకున్నాం. |
08:27 | ఇక్కడ మీకోసం ఒక అసైన్మెంట్, ఒక నెమలి పాటర్న్(నమూనా)డిజైన్ ను సృష్టించండి. |
08:33 | మీ పూర్తి అయిన అసైన్మెంట్ చూడటానికి ఇలా ఉండాలి. |
08:37 | ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది దయచేసి దానిని చూడండి. |
08:43 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది.ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి: contact@spoken-tutorial.org. |
08:53 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు NMEICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది.ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది: http://spoken-tutorial.org/NMEICT-Intro. |
09:03 | ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయలక్ష్మి మాతో చేరినందుకు ధన్యవాదములు. |