Inkscape/C4/Special-effects-on-text/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 08:02, 29 August 2017 by Simhadriudaya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration'
00:01 Inkscape ను ఉపయోగించి Special Effects on Text అను స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లోమనం సృష్టించుట నేర్చుకునేవి,

ప్రతిబింబించబడిన టెక్స్ట్ లేబిల్ చేయబడిన టెక్స్ట్ మరియు టెక్స్ట్ యొక్కకేస్ ను మార్చడం

00:16 ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను Ubuntu Linux 12.04 OS ను ఉపయోగిస్తున్నాను.
00:22 ఈ సిరీస్ లోని మునుపటి అన్నిట్యుటోరియల్స్, 0.48.4 లో రికార్డ్ చేయబడ్డాయి.
00:28 ఈ ట్యుటోరియల్ నుండి, నేను తాజా స్థిరమైన సంస్కరణ అయిన వర్షన్ 0.91 లో రికార్డ్ చేస్తాను.
00:35 Inkscape ను తెరుద్దాం.ముందుగా, మనం ఒక ప్రతిబింబించబడిన టెక్స్ట్ ను సృష్టించడం నేర్చుకుంటాం.
00:41 Text టూల్ ను ఎంచుకుని SPOKEN అనే పదాన్ని టైప్ చేయండి.టెక్స్ట్ ను bold గా చేయండి.
00:49 టెక్స్ట్ ను పెద్దది(జూమ్)చేస్తాను, అందువల్ల మనం డెమో ను స్పష్టంగా చూడవచ్చు.
00:54 ఇప్పుడు, Object menu కి వెళ్ళి Fill and Stroke ఎంపికపై క్లిక్ చేయండి.
00:59 అప్పుడు, Fill ట్యాబ్ కింద, Linear gradient పై క్లిక్ చేయండి.
01:03 ఇప్పుడు చూపిన విధంగా ప్రవణత(గ్రేడియంట్ )handles పై క్లిక్ చేసి, ప్రవణత రంగులను ఎరుపు మరియు నీలంకు మార్చండి.
01:12 ప్రవణతని నిలువుగా సమలేఖనం చేయండి.కనుక ఇప్పుడు, స్క్రీన్(తెర)పై చూపిన విధంగా ప్రవణత(గ్రేడియంట్)ఎగువన ఎరుపు రంగులో మరియు క్రింద నీలంగా ఉండాలి.
01:21 టెక్స్ట్ ను నకిలీ(డూప్లికేట్)చేయడానికి Selector tool కి వెళ్ళి Ctrl + D ని నొక్కండి.
01:27 ఇప్పుడు, నకిలీ టెక్స్ట్ ను ఫ్లిప్(కుదర్చడానికి)చేయడానికి కీబోర్డ్ పై V ని నొక్కండి.
01:32 మనం ఫ్లిప్ చేయడానికి Tool controls bar పై అందుబాటులోఉన్నఎంపికను కూడా ఉపయోగించవచ్చు.
01:39 ఇప్పుడు, మనం నకిలీ టెక్స్ట్ ను అసలు టెక్స్ట్ క్రిందకి కదిలించడం వలన అది అద్దంలోని ప్రతిబింబం లాగా కనిపిస్తుంది.
01:46 ఇప్పుడు, Gradient tool ను ఎంచుకుని దిగువ గ్రేడియంట్ హేండిల్ పై క్లిక్ చేయండి.
01:52 Fill and Stroke డైలాగ్ బాక్స్ కు తిరిగి రండి.ఇక్కడ, మనము Alpha విలువను 0 కు మారుస్తాము.
01:59 మనం దిగువ హేండిల్ ని కూడా కొంచం ఎగువ దిశలో కదిలిస్తాము.
02:05 Selector tool పై క్లిక్ చేయండి.ఇప్పుడు, Opacity ని 80 కి తగ్గించి Enter నొక్కండి.
02:12 మన ప్రతిబింబించే టెక్స్ట్ ఇప్పుడు పూర్తయింది.దీన్ని మెరుగ్గా చూడడానికి కొద్దిగా జూమ్(పెద్దది)చేయండి.
02:20 తరువాత, మనం ఒక లేబుల్ చేయబడిన టెక్స్ట్ ను సృష్టించడం నేర్చుకుంటాం.
02:23 అన్నిటికంటే ముందు, మనం ఆకుపచ్చ రంగులో ఒక దీర్ఘచతురస్రాన్ని సృష్టిస్తాము.Alpha విలువ సున్నా కనుక, ఇది ఇప్పుడు కనిపించదు.
02:32 దానిని 255 కు మార్చి Enter నొక్కండి.
02:36 ఇప్పుడు, దీర్ఘచతురస్రం పై SPOKEN TUTORIAL అనే టెక్స్ట్ ను టైప్ చేయండి.
02:43 Selector టూల్ పై క్లిక్ చేసి దీర్ఘచతురస్రం పరిమాణాన్ని టెక్స్ట్ కు అనుగుణంగా మార్చండి.
02:48 తరువాత, టెక్స్ట్ ను ఎంచుకోండి.ఇప్పుడు, టెక్స్ట్ ను నకిలీ చేయడానికి Ctrl + D ని నొక్కండి.
02:54 నకిలీ టెక్స్ట్ సరిగ్గా అసలు టెక్స్ట్ పైన ఉంది.
02:58 టెక్స్ట్ యొక్క రంగును తెలుపుకు మార్చండి, ఆపై Path menu కి వెళ్ళి Object to path ఎంపికపై క్లిక్ చేయండి.
03:07 ఇప్పుడు Object menu పై క్లిక్ చేసి, ఆ తరువాత Ungroup ఎంపిక పై క్లిక్ చేయండి.
03:12 మళ్ళీ Path menu కి వెళ్ళి Union ఎంపికపై క్లిక్ చేయండి.
03:17 Tool controls bar పైన, Lower selection one step ఐకాన్(చిహ్నం)పై క్లిక్ చేయండి.
03:23 మళ్ళీ ఒకసారి, Path మెనూ కి వెళ్ళి, ఈసారి మనం Linked offset ఎంపికపై క్లిక్ చేస్తాము.
03:30 అవుట్ లైన్ ను పెద్దగా చేయడానికి, టెక్స్ట్ పై కనిపించే హేండిల్ పై క్లిక్ చేసి దాన్ని లాగండి.
03:37 Selector టూల్ పై క్లిక్ చేయండి, ఆపై టెక్స్ట్ మీద క్లిక్ చేసి దానిని క్రిందికి కదిలించండి.
03:43 అక్కడ సృష్టించబడిన మరో టెక్స్ట్ ని గమనించండి.టెక్స్ట్ ను ఎంచుకుని దాన్ని తొలగించండి.
03:49 ఇప్పుడు, అవుట్ లైన్ భాగాన్ని ఎంచుకుని, Nodes టూల్ పై క్లిక్ చేయండి.
03:53 Tool controls bar పైన, Convert selected object to path టూల్ పై క్లిక్ చేయండి.
03:58 ఇప్పుడు మీరు అవుట్ లైన్ పై నోడ్స్ ను చూడవచ్చు.ఇక్కడ ప్రదర్శించబడినట్టుగా, అనుకోకుండా మధ్యలో వచ్చిన నోడ్స్ ను ఎంచుకుని వాటిని తొలగించండి.
04:09 మళ్ళీ Selector tool పై క్లిక్ చేసి,టెక్స్ట్ ను దాని అసలు స్థానానికి తిరిగి తరలించండి.
04:14 టెక్స్ట్ యొక్క రంగును ఆకుపచ్చకు మార్చండి.
04:18 మళ్ళీ ఇంకోసారి, అవుట్ లైన్ భాగాన్ని ఎంచుకొని దాన్ని నకిలీ చేయడానికి Ctrl + D ని నొక్కండి.నకిలీ సరిహద్దు సరిగ్గా అసలైన సరిహద్దు పైన ఉందని గుర్తుంచుకోండి.
04:28 రంగును నలుపుకి మార్చండి.
04:31 అప్పుడు Tool controls bar పైన, Lower selection one step ఐకాన్(చిహ్నం)పై మూడుసార్లు క్లిక్ చేయండి.
04:38 చివరగా, Fill and stroke డైలాగ్ బాక్స్ లో, ఓపాసిటీ(పారదర్శకత)ను 60 కి తగ్గించి (అస్పష్టత )బ్లర్ ను 7కు పెంచండి.
04:47 ఇలా చేసిన తరువాత, మనం లేబిల్ కొరకు ఒక హేన్గర్ ను చేస్తాము.
04:50 కనుక, Ellipse టూల్ పై క్లిక్ చేయండి.లేబిల్ పైన ఒక రంధ్రాన్ని చేస్తున్నట్లుగా, Ctrl key ని నొక్కి దీర్ఘచతురస్రం యొక్క ఎడమ ఎగువలో ఒక వృత్తాన్ని గీయండి,
05:00 వృత్తాన్ని నకిలీ చేయడానికి Ctrl + D ని నొక్కండి.మరియు ఆ వృత్తాన్ని దీర్ఘచతురస్రం యొక్క మరొక చివరికి తరలించండి.
05:06 తరువాత, Bezier tool పై క్లిక్ చేసి, ప్రదర్శించినట్లుగా, ఒక వక్ర రేఖను గీయండి.
05:13 గీసిన లైన్ చూడటానికి హేన్గర్ లాగా ఉండాలి.
05:16 Fill and stroke డైలాగ్ బాక్స్ పైన, Stroke style క్రింద, వెడల్పును 5 కి మార్చండి.
05:22 ఇప్పుడు మన లేబిల్ చేయబడిన టెక్స్ట్ సిద్ధంగా ఉంది.బాగా కనిపించడానికి దాన్ని మనం జూమ్ అవుట్ చేద్దాం.
05:30 తరువాత, మనం Inkscape లో టెక్స్ట్ యొక్క కేస్(తరగతి)ని ఎలా మార్చాలో నేర్చుకుందాం.
05:34 Text టూల్ పై క్లిక్ చేసి canvas పై అక్షరాలను టైప్ చేయండి.టెక్స్ట్ మొత్తం లోవెర్-కేస్ లో ఉందని గమనించండి.
05:43 ఇప్పుడు, Extensions menu కి వెళ్ళి, తరువాత Text అనే పేరు గల ఎంపికపై క్లిక్ చేస్తే, మీరు కొన్ని ఎంపికలను చూస్తారు.
05:52 నేను UPPERCASE ఎంపికపై క్లిక్ చేస్తాను.టెక్స్ట్ అక్షరాల యొక్క కేస్(స్థితి)అప్పర్ -కేస్ కు మార్చబడింది గమనించండి.
05:59 మళ్ళీ టెక్స్ట్ పై క్లిక్ చేయండి.Extensions menu కు వెళ్ళి, ఆపై Text పై మరియు చివరగా Change Case పై క్లిక్ చేయండి.
06:07 ఈ సారి, Random Case ఎంపికను ఎంచుకోండి.టెక్స్ట్ యొక్క కేస్(స్థితి)లోని మార్పును గమనించండి.
06:13 మీరు మీ స్వంతంగా ఇతర ఎంపికలను ప్రయత్నించవచ్చు.
06:16 దీనితో, మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
06:19 సారాంశం చూద్దాం.ఈ ట్యుటోరియల్ లో మనం సృష్టించడం నేర్చుకున్నవి:

ప్రతిబించబడిన టెక్స్ట్ లేబుల్ చేయబడిన టెక్స్ట్ టెక్స్ట్ యొక్క కేస్ (స్థితి)ను lowercase నుండి uppercase మరియు random-case కు మార్చండి.

06:31 ఇక్కడ మీ కోసం ఒక అసైన్మెంట్.ఉపరితలంపై ప్రతిబింబించేలా INKSCAPE అనే టెక్స్ట్ ను సృష్టించండి.
06:37 Inkscape అనే టెక్స్ట్ ను సృష్టించండి మరియు టెక్స్ట్ కేస్(స్థితి)ను Flip case కు మార్చండి.
06:42 మీ పూర్తి అయిన అసైన్మెంట్ చూడటానికి ఇలా ఉండాలి.
06:45 ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది దయచేసి దానిని చూడండి.
06:51 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం:స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది.ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.
06:58 మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి:contact@spoken-tutorial.org.
07:01 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు NMEICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది.
07:06 ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది:http://spoken-tutorial.org/NMEICT-Intro.
07:10 ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయలక్ష్మి మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya, Yogananda.india