Linux/C2/Redirection-Pipes/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:00 | రీడైరక్షన్ మరియు పైప్స్ గురించి తెలియ బరిచే స్పోకెన్ ట్యుటోరియల్‌కు స్వాగతం. |
00:07 | నేను ఉబంటు 10.04 ఉపయోగిస్తున్నాను. |
00:09 | లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మరియు కమాండ్ల గురించి, ప్రాధమిక అవగాహన ఉందని భావిస్తున్నాము. |
00:16 | మీకు ఆసక్తి ఉంటే, అది క్రింది వెబ్సైట్లో, మరొక స్పోకెన్ ట్యుటోరియల్ ద్వారా లభ్యమవుతుంది. |
00:22 | లైనక్స్ కేస్ సెన్సిటివ్ అని కూడా గమనించండి. |
00:25 | ప్రత్యేకంగా తెలుపబడితే తప్ప, ఈ ట్యుటోరియల్‌లోని అన్ని కమాండ్లు లోయర్ కేసులో ఉంటాయి. |
00:32 | లైనక్స్లో ఎక్కువ భాగం పనిని టెర్మినల్ ద్వారా చేస్తాము. |
00:35 | ఒక కమాండ్‌ను అమలు చేయాలంటే, సాధారణంగా కీబోర్డ్ ద్వారా టైప్ చేస్తాం. |
00:39 | ఉదాహరణకు, తేదీ మరియు సమయంను కనుకొనేడుకు, |
00:41 | కీబోర్డ్ ద్వారా "date" అని టైప్ చేసి ఎంటర్ నొక్కుదామ్. |
00:46 | సాధారణంగా కీబోర్డ్ ద్వారా ఇన్పుట్ అందిస్తాం. |
00:48 | అదేవిధంగా, కమాండ్ యొక్క అవుట్‌పుట్ కూడా టెర్మినల్ పై కనిపిస్తుంది. |
00:56 | ఏదో ఒక్క కమాండ్‌ను అమలు పరచి నప్పుడు కొన్ని తప్పులు దొర్లాయని అనుకుందాం. |
00:59 | ఉదాహరణకు "cat space aaa" అని టైప్ చేసి ఎంటర్ నొక్కుదాం. |
01:05 | 'aaa' అనే పేరు గల ఫైల్ అసలు లేదు. |
01:08 | అది తెలుపుతూ ఒక ఎర్రర్ కనిపిస్తుంది. |
01:10 | ఎర్రర్ కూడా టెర్మినల్ విండో పైన కనిపిస్తుంది. అందుకే టెర్మినల్ వద్ద ఎర్రర్ రిపోర్టింగ్ కూడా చూస్తాం. |
01:20 | ఇన్పుటింగ్, అవుట్పుటింగ్, ఎర్రర్ రిపోర్టింగ్ అనేవి కమాండ్లకు సంబంధించిన మూడు ప్రత్యేక చర్యలు. |
01:24 | రీడైరక్షన్ గురించి నేర్చుకునే ముందు రెండు ముఖ్యమైన విషయాల గురించి నేర్చుకోవాలి. అవి stream మరియు file descriptor. |
01:31 | Bash వంటి ఒక లైనక్స్ షెల్, ఇన్ పుట్ అందుకొని, అవుట్ పుట్ని ఒక సీక్వెన్స్ లేదా క్యారెక్టర్ల ప్రవాహంల పంపుతుంది. |
01:37 | ప్రతి క్యారెక్టర్ దాని ముందు, వెనుక ఉన్నదాని నుండి స్వతంత్రంగా ఉంటుంది. |
01:41 | IO పరిజ్ఞ్యనము ఉపయోగించడం వలన స్ట్రీమ్స్ (Streams) గ్రహించబడతాయి. |
01:44 | అసలైన క్యారెక్టర్ల వరుస ఫైల్, కీ బోర్డ్, విండో మొదలైన వాటిలో ఎక్కడ నుండి వచ్చింది, లేదా వెళ్లింది అనేది ముఖ్యం కాదు. |
01:51 | లైనక్స్లో, తెరవ బడ్డ ప్రతి ప్రాసెస్‌కు ఒక పూర్ణసంఖ్యతో సంబంధం ఉంటుంది. |
01:57 | ఈ సంఖ్యా విలువలు file descriptorsగా పిలువబడతాయి. |
02:05 | లైనక్స్ షెల్స్ మూడు ప్రామాణిక I/O streams ఉపయోగిస్తాయి. |
02:08 | వాటిలో ప్రతి దానికి ఒక ప్రసిద్ధి చెందిన file descriptorతో సంబంధం ఉంటుంది. |
02:12 | Stdin ప్రామాణిక ఇన్ పుట్ స్ట్రీమ్ (input stream). |
02:15 | అది కమాండ్లకు ఇన్పుట్ అందిస్తుంది. |
02:17 | దాని file descriptor 0. |
02:19 | Stdout ప్రామాణిక ఔట్ పుట్ స్ట్రీమ్(output stream). |
02:22 | అది కమాండ్ల నుండి అవుట్‌పుట్‌లను చూపుతుంది. దాని file descriptor 1. |
02:26 | stderr ప్రామాణిక ఎరర్ స్ట్రీమ్(error stream).
అది కమాండ్ల నుండి ఎరర్ అవుట్‌పుట్(error output) చూపుతుంది. దాని file descriptor 2. |
02:36s | Input streams ప్రోగ్రాములకు ఇన్ పుట్ అందిస్తుంది. |
02:40 | అప్రమేయంగా అది టెర్మినల్ కీస్ట్రోక్స్ నుండి తీసుకుంటుంది. |
02:44 | Output streams టెక్స్ట్ కారక్టర్లను అప్రమేయంగా టెర్మినల్ వద్ద ముద్రిస్తుంది. |
02:47 | వాస్తవానికి ఈ టెర్మినల్ ఒక ASCII టైప్‌రైటర్ లేదా డిస్ప్లే టెర్మినల్. |
02:52 | కానీ అది ఒక గ్రాఫికల్ డస్క్ టాప్ పై టెక్స్ట్ విండోగా కనిపిస్తుంది. |
02:56 | అప్రమేయంగా 3 streams కొన్ని ఫైళ్లతో జతకూడి ఉన్నాయని చూస్తాము. |
03:01 | లైనక్స్లో ఈ సాధారణ రీతిని మార్చవచ్చు. |
03:04 | 3 streamsను ఇతర ఫైళ్లతో కలుపవచ్చు. |
03:07 | ఈ ప్రక్రియ రీడైరక్షన్ గా పిలువబడుతుంది. |
03:09 | 3 స్ట్రీమ్‌లలో రీడైరక్షన్ ఏ విధంగా చేస్తామో చూద్దాం. |
03:14 | ముందు స్టాండర్డ్ ఇన్పుట్ ఏ విధంగా రీడైరెక్ట్ చేయబడుతుందో చూద్దాం. |
03:17 | < (left angled bracket) operator ను ఉపయోగించి,
ఒక ఫైల్ నుండి standardin ను రిడైరెక్ట్ చేద్దాం. ఇది ఎలా చెయ్యాలో చూద్దమ్. |
03:22 | ఒక ఫైల్లోని, వరసలు పదాలు మరియు క్యారెక్టర్ల సంఖ్యను కనుగొనడానికి wc కమాండ్ ఉపయోగపడుతుందని తెలుసు. |
03:28 | టెర్మినల్ విండో పై wc అని టైప్ చేయండి. |
03:31 | ఎంటర్ నొక్కండి. |
03:32 | ఏం జరుగుతుంది ? ఒక బ్లింకింగ్ కర్సర్ కనిపిస్తుంది. అంటే కీబోర్డ్ ను ఉపయోగించి ఎంటర్ చేయాలి. |
03:37 | ఉదాహరణకు "This tutorial is very important" అని టైప్ చేయండి. |
03:46 | ఎంటర్ నొక్కండి. |
03:48 | Ctrl మరియు d కీ లను కలిపి నొక్కండి. |
03:52 | ఎంటర్ చేసిన లైన్ల పై కమాండ్ పనిచేస్తుంది. |
03:55 | ఈ కమాండ్ టెర్మినల్ పై అవుట్‌పుట్ చూపుతుంది. |
03:57 | "wc" కమాండ్ తరువాత ఏ పైలూ ఇవ్వబడలేదు. |
04:01 | అందువలన, ప్రామాణిక ఇన్పుట్ స్ట్రీమ్ నుండి ఇన్పుట్ తీసుకుంటుంది. |
04:04 | ప్రామాణిక ఇన్పుట్ స్ట్రీమ్ సాధారణంగా కీబోర్డ్‌తో జతకూడి ఉంటుంది.
అందువలన wc కీబోర్డ్ నుండి ఇన్పుట్ తీసుకుంటుంది. |
04:12 | "wc space 'left-angled bracket" space test1 dot txt" టైపు చేస్తే, |
04:19 | wc ఫైల్ test1 dot txtలోని వరుసలు, పదాలు మరియు అక్ష రాల సంఖ్యను తెలుపుతుంది. |
04:27 | "wc space test1 dot txt" అని టైప్ చేయండి |
04:34 | అదే ఫలితం వస్తుంది. |
04:37 | అయితే తేడా ఏమిటి? |
04:39 | "wc space test1dot txt" అని రాసినపుడు, కమాండ్ test1dot txt ఫైల్‌ను తెరచి చదువుతుంది. |
04:46 | కానీ "wc space 'left-angled bracket' test1 dot txt" అని రాసినపుడు, ఏ ఫైలు తెరుచుకోదు. |
04:53 | బదులుగా, అది standardin నుండి ఇన్పుట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. |
04:57 | standardinను ఫైల్ test1dot txtకి డైరెక్ట్ చేసాం. |
05:01 | అందువలన కమాండ్ test1 నుండి రీడ్ చేస్తుంది. |
05:04 | నిజానికి standardinకు డేటా ఎక్కడ నుండి వస్తుందో తెలియదు. |
05:10 | కనుక, ప్రామాణిక ఇన్ పుట్ ఎలా రీడైరక్ట్ చేయాలో చూసాం. |
05:12 | standard output మరియు standard errorను ఏ విధంగా రీడైరక్ట్ చేయాలో చూద్దాం. |
05:17 | output లేదా errorను ఒక ఫైల్‌కు రీడైరక్ట్ చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయి. |
05:20 | ఉదాహరణకు n అనేది file descriptorను సూచిస్తుందనుకోండి.
n సింగల్ రైట్-ఆంగల్డ్ బ్ర్యాకెట్ ఔట్ పుట్ (n single right-angled bracket output)ను file descriptor n నుండి ఒక ఫైల్‌కు బదిలీ చేస్తుంది. |
05:29 | మీకు ఫైల్ లో వ్రా యుటకు అధికారం ఉండాలి. |
05:32 | ఒకవేళ ఫైల్ ఉనికిలో లే కపోతే, అది సృష్టించబడుతుంది. |
05:35 | అది ఉనికిలో ఉంటే, సాధారణంగా ఏ విధమైన హెచ్చరిక లేకుండానే అందులో విషయాలు పోతాయి. |
05:40 | 'n'డబల్ రైట్-ఆంగల్డ్ బ్ర్యాకెట్(' n 'double right-angled bracket') కూడా outputను file descriptor n నుండి ఫైల్‌కు రీడైరక్ట్ చేస్తుంది. |
05:47 | మరలా, మీకు ఫైల్ లో వ్రాయుటకు అధికారం ఉండాలి. |
05:50 | ఫైల్ ఉనికిలో లేకపోతే, అది సృష్టించబడుతుంది. |
05:52 | అది ఉనికిలో ఉంటే, ఉనికిలో ఉన్న ఫైల్‌కు అవుట్‌పుట్ కూర్చబడుతుంది. |
05:59 | n సింగిల్ రైట్ ఏంగిల్ బ్రాకెట్లోని లేదా, n డబుల్ రైట్ ఏంగిల్ బ్రాకెట్స్ లోని n file descriptorను సూచిస్తుంది. |
06:05 | అది వదలివేయబడితే, అప్పుడు standard output అనగా file descriptor 1 తీసుకోబడుతుంది. |
06:10 | అందుకే, ఒక right angle bracket మరియు 1 double right angle bracket ఒకటే. |
06:15 | కానీ error streamను రీడైరక్ట్ చేయడానికి, 2 right angle bracket లేదా 2 double right angle bracket ఉపయోగించాలి. |
06:22 | దీనిని ప్రయోగపూర్వకంగా చూద్దాం. |
06:24 | గత ఉదాహరణలో ఒక ఫైల్ లేదా standardin పై wc కమాండ్ యొక్క ఫలితం టెర్మినల్ పై ప్రదర్శిం పబడుతుందని చూశాం. |
06:31 | ఇది టెర్మినల్ వద్ద కనబడకూడదంటే ఏమి చేయాలి? |
06:34 | సమాచారాన్ని తరువాత వాడుటకు, దానిని ఫైల్లో స్టోర్ చేయాలనుకుంటాం. |
06:38 | అప్రమేయంగా wc దాని అవుట్‌పుట్‌ను standardoutలో రాస్తుంది. |
06:42 | Standardout డీఫాల్ట్ గా టెర్మినల్ లో కలుపబడి ఉంటుంది. |
06:45 | అందవలన అవుట్‌పుట్‌ను టెర్మినల్‌లో చూస్తాం. |
06:48 | అయితే standardoutను ఒక ఫైల్‌కు రీడైరక్ట్ చేయగలిగితే, wc కమాండ్ నుండి అవుట్‌పుట్ ఆ ఫైల్లో వ్రాయబడుతుంది. |
06:57 | "wc space test1 dot txt 'right-angled bracket' wc_results dot txt" అని వ్రాసి. |
07:09 | ఎంటర్ నొక్కండి. |
07:11 | ఇది నిజంగా జరిగిందా అని చూడటానికి మనం wc_results dot txtలోని విషయాలను c-a-t కమ్యాండ్ డిస్ప్లే చెయ్యవచ్చు. |
07:23 | అది జరిగింది. |
07:24 | ఒకవేళ, అదే డైరక్టరీలో మరొక ఫైల్ test2 ఉంటే. |
07:30 | మరలా test2 ఫైల్ తో కమ్యాండ్ను ఎగ్జిక్యూట్ చేయవచ్చు.
"wc space test2 dot txt 'right-angled bracket' wc_results dot txt" అని టైప్ చేద్దాం. |
07:44 | wc_results ఫైల్ లోని విషయాలు ఓవర్ రైట్ కావచ్చు. |
07:48 | మనం దానిని చూద్దాం. |
07:56 | దీనికి బదులుగా "wc space test1 dot txt 'right-angled bracket' twice wc underscore results dot txt" అని రాస్తే, |
08:07 | కొత్త వివరాలు అప్పటికే ఉనికిలో ఉన్న wc underscore results dot txt ఫైల్లో ఉన్న విషయాలను ఓవర్ రైట్ చేయవు, అవి అపెండ్ చేయబడతాయి. |
08:15 | దీనిని కూడా చూద్దాం. |
08:26 | standard error ను, రీడైరక్ట్ చేయడం కూడా ఇదే విధంగా చేయబడుతుంది. |
08:29 | ఒకే ఒక్క తేడా ఏంటంటే, రైట్-ఆంగల్డ్ బ్ర్యాకెట్ లేదా డబల్ రైట్-ఆంగల్డ్ బ్ర్యాకెట్ గుర్తుకు ముందు standard error యొక్క file descriptor సంఖ్యను తెలు పవలసి ఉంటుంది. |
08:38 | 'aaa' అనే పేరుతో ఏ ఫైలూ ఉనికిలో లేదని మనకు తెలుసు, "wc space aaa" అని వ్రాయండి. |
08:46 | షెల్ “No such file or directory” అనే error చూపుతుంది. |
08:50 | మనకు స్క్రీన్ పై error messages రావడం ఇష్టం లేదనుకుందాం. వాటిని మరొక ఫైల్‌కు రీడైరక్ట్ చేయవచ్చు. |
08:55 | దీని కోసం "wc space aaa space 2 'right-anged bracket' errorlog dot txt" కమాండ్ ఇవ్వవచ్చు. |
09:06 | ఇప్పుడు టెర్మినల్ పై ఎర్రర్ కనిపించదు, కానీ అది errorlog dot txt ఫైల్లో రాయబడుతుంది. |
09:12 | దీనిని "cat space errorlog dot txt" కమాండ్ ద్వారా చూడవచ్చు. |
09:22 | "cat space bbb space 2 'right-angled bracket' errorlog dot txt" కమాండ్ ఇవ్వడం ద్వారా మరొక error చేసాననుకుంటే, |
09:34 | పాత error ఓవర్ రైట్ అయి కొత్త error కనిపిస్తుంది. |
09:39 | "cat space errorlog dot txt" చూడండి. |
09:46 | ఈ ఎర్రర్లను అన్నిటినీ మనం లిస్ట్ చేయాలంటే ఎలా?? "wc space aaa space 2 'right-angled bracket' twice errorlog dot txt" కమాండ్‌ను ఇవ్వాలి. |
09:58 | దీనిని cat commandను ఉపయోగించి పరిశీలిద్దాం. |
10:06 | standard out, standard in, standard error ఏవిధంగా రీడైరక్ట్ చేయబడ్డాయో మరియు వేర్వేరుగా మ్యానిప్యులేట్ చెయ్యబడ్డాయో చూసాం.
streamsను ఒకేసారి మార్చగలిగినపుడు, అంటే వేర్వేరు streams జతచేసినపుడు ఈ విషయం యొక్క వాస్తవ సామర్ధ్యం నిర్ధారించబడుతుంది. |
10:20 | ఈ ప్రక్రియ పైప్ లైనింగ్‌గా పిలువబడుతుంది. |
10:22 | కమాండ్ల యొక్క వరుసలను సృష్టించడానికి Pipes ఉపయోగిస్తాము. |
10:25 | ఒక పైప్, వరుసలోని ఒక కమాండ్ యొక్క అవుట్‌పుట్‌ను తరువాతి కమాండ్ యొక్క ఇన్‌పుట్‌తో కలుపుతుంది. |
10:30 | అది command1 vertical bar command2 hyphen option vertical bar command3 hyphen option1 hyphen option2 vertical bar command4 గా కనిపిస్తుంది. |
10:46 | ఉదాహరణకు ప్రస్తుత డైరక్టరీలోని ఫైళ్లు మరియు డైరక్టరీలు మొత్తం సంఖ్యను తెలుసుకోవాలంటే, |
10:51 | అందు కొరకు "ls space minus l" ప్రస్తుత డైరక్టరీలోని అన్ని ఫైళ్లు మరియు డైరక్టరీల జాబితాను చూపుతుంది అని మనకు తెలుసు. |
10:58 | ఒక ఫైల్ యొక్క అవుట్‌పుట్‌ను రీడైరక్ట్ చేయవచ్చు "ls space minus l 'right-angled bracket' files dot txt" కమాండు ద్వారా. |
11:08 | "cat space files dot txt" రన్ చేయండి. |
11:14 | ఇప్పుడు ప్రతిలైను ఒక ఫైల్ లేదా డైరక్టరీ యొక్క పేరు అవుతుంది. |
11:17 | ఈ ఫైల్ లోని మొత్తం వరుసలను లెక్కించాలంటే, files dot txtని ఉపయోగించవచ్చు. |
11:24 | దీనికి "wc space minus l files dot txt" కమాండ్‌ను ఉపయోగించవచ్చు. |
11:32 | మన పనికి ఉపయోగపడినప్పటికీ దీనితో కొన్ని సమస్యలు ఉన్నాయి. |
11:35 | ఇక్కడ files dot txt ఉన్నట్లు దీనికి ఒక మధ్యంతర ఫైల్ అవసరమౌతుంది. |
11:40 | ఒకవేళ మొదటి కమాండ్ చాలా సమాచారాన్ని తయారుచేసినట్లయితే, అది డిస్క్ మెమొరీని అనవసరంగా వృధా చేయవచ్చు. |
11:46 | అంతేకాక, అనేక వరుసలను కలపాలంటే, ఈ పద్ధతి చాలా నిదానంగా చేస్తుంది. |
11:50 | ఈ రకమైన పైప్‌లను ఉపయోగించడం ద్వరా, దీనిని తేలికగా చేయవచ్చు.
"ls space minus l 'vertical bar' wc space minus l" అని రాస్తాం. |
12:01 | ఇదే ఫలితాన్ని ఎంతో తేలికగా పొందవచ్చు. |
12:06 | ls కమాండ్ నుండి వచ్చిన అవుట్‌పుట్ wc కమాండ్ యొక్క ఇన్పుట్ అవుతుంది. |
12:10 | పైప్‌లను ఉపయోగించి కమాండ్ల యొక్క యింకా పొడవైన వరుసలను కలుపవచ్చు. |
12:15 | మల్టీపేజ్ డిస్ ప్లేలను చదవడం పైప్స్ యొక్క సాధారణ ఉపయోగం. |
12:19 | "cd space slash user slash bin" అని టైప్ చేయండి. |
12:24 | ఇప్పుడు బిన్ డైరక్టరీలో ఉన్నాం. |
12:28 | "ls minus l" రన్ చేయండి. |
12:31 | అవుట్‌పుట్‌ను సరిగా చూడలేము. కానీ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పైప్ లను కలిపి ఉపయోగించితే, దానిని చూడగలం. |
12:37 | జాబితాను స్క్రోల్ చేయడానికి ఎంటర్ నొక్కండి. |
12:41 | బయటకు రావడానికి "q" నొక్కండి. |
12:45 | ఇవి ఫైల్స్ తో పనిచేయడంలో మనకు సహాయపడే కొన్ని కమాండ్లు. |
12:48 | ఇంకా చాలా కమాండ్లు ఉన్నాయి. |
12:50 | అంతేకాక, రాసిన ప్రతి కమాండ్‌కి అనేక ఆప్షన్లు ఉన్నాయి. |
12:54 | man కమాండ్ ను ఉపయోగించి వీటి గురించి మరింత తెలుసుకోవాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. |
1 2:58 | కమాండ్లను నేర్చుకోవడానికి వాటిని మళ్ళి మళ్ళి ఉపయోగించడమే ఉత్తమమైన మార్గం. |
13:04 | దీనితో ఈ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం. |
13:07 | స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్‌లో భాగం, దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆ న్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది. |
13:15 | ఈ విషయం పై మరింత సమాచారం క్రింద ఉన్న లింక్‌లో ఉంది. |
13:19 | ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శ్రీహర్ష ఏ ఎన్, నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. |