Java/C2/Strings/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | జావా లోని స్ట్రింగ్స్ అనే అంశం పై స్పోకెన్ టుటోరియల్ కు స్వాగతం. |
00:05 | ఈ టుటోరియల్ లో మీరు నేర్చుకునేవి: |
00:08 | స్ట్రింగ్స్ ని సృష్టించడం, స్ట్రింగ్స్ ను జోడించడం మరియు లోవర్ కేస్ మరియు అప్పర్ కేస్ మధ్య మార్పిడి వంటి స్ట్రింగ్ ప్రాథమిక ప్రక్రియలు. |
00:18 | ఈ టుటోరియల్ కొరకు, మనం ఉబంటు 11.0 JDK1.6 మరియు Eclipse3.7 ఉపయోగిస్తున్నాం. |
00:26 | ఈ టుటోరియల్ ను అనుసరించడానికి, మీకు జావాలోని డాటాటైప్ల పై అవగాహన ఉండాలి. |
00:32 | కాకపోతే సంబంధిత ట్యుటోరియల్ కోసం మా వెబ్-సైట్ ను దర్శించండి. |
00:40 | జావా లో స్ట్రింగ్స్ అనేది క్యారెక్టర్ ల వరుస క్రమం. |
00:44 | స్ట్రింగ్స్ ని ప్రారంభించే ముందు, క్యారెక్టర్ డాటాటైప్ గురించి తెలుసుకుందాం. |
00:50 | ఇప్పుడు ఎక్లిప్స్ కు మారుదాం. |
00:55 | ఇక్కడ మనకు ‘ఎక్లిప్స్IDE’ మరియు మిగిలినకోడ్ కు అవసరమైన స్కేలిటటన్ కలిగి ఉన్నాం |
01:00 | ఇక్కడ మనం StringDemo అనే క్లాస్ ని సృష్టించి , మెయిన్ మెథడ్ ను జతచేశాం |
01:07 | మెయిన్ మెథడ్ లో, char star ఈక్వల్ టూ సింగిల్ కోట్స్ లో asterisk అని టైప్ చేయండి. |
01:19 | ఈ స్టేట్మెంట్ star అనే పేరుగల వేరియబుల్ char మాదిరిగా ఉండేది సృష్టిస్తుంది. |
01:25 | అది ఒక క్యారెక్టర్ ని మాత్రమే నిల్వ చేయగలదు. |
01:28 | కొన్ని క్యారెక్టర్లు గల ఒక పదాన్ని ముద్రిద్దాం. |
01:33 | char లైన్ ని తీసివేసి టైప్ చేయండి. |
01:36 | char c1 ఈక్వల్ టూ సింగిల్ కోట్స్ లో 'c'; |
01:43 | char c2' ఈక్వల్ టూ సింగిల్ కోట్స్ లో 'a '; |
01:49 | char c3 ఈక్వల్ టూ సింగిల్ కోట్స్ లో 'r '; |
01:55 | మనం car అనే పదం చేయడానికి కావలసిన క్యారెక్టర్లను సృష్టించాం. |
01:59 | పదాన్ని ముద్రించడానికి వాటిని ఉపయోగిద్దాం. |
02:02 | టైప్ చేయండి, |
02:04 | సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ (c1) |
02:12 | సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ (c2) |
02:22 | సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ (c3) |
02:31 | నేను అన్నీ క్యారెక్టర్లు ఒకే వరుసలో ప్రచురించబడడానికి, println కు బదులుగా print వాడుతున్నాను. |
02:39 | ఫైల్ ని సేవ్ చేసి రన్ చేయండి. |
02:43 | ఔట్పుట్, మనం అనుకున్నదే. |
02:46 | కానీ ఈ పద్ధతి కేవలం పదాలని ప్రచురిస్తుంది అంతే, వాటిని సృష్టించదు. |
02:50 | ఒక పదాన్ని సృష్టించడానికి మనం స్ట్రింగ్ డాటాటైప్ ను ఉపయోగిస్తాం. |
02:54 | ఇప్పుడు దాన్ని చేసి చూద్దాం. |
02:57 | మెయిన్ మెథడ్ లోపల ఉన్నదంతా తొలగించి, |
03:03 | String greet ఈక్వల్ టూ Hello Learner; అని టైప్ చేయండి. |
03:16 | String పదం లో Sఅనేది అప్పర్ కేస్ లో ఉండాలి. |
03:19 | ఇంకా మనం సింగిల్ కోట్స్ కి బదులుగా డబుల్ కోట్స్ డీలిమీటర్ గా ఉపయోగిస్తున్నాం. |
03:25 | ఈ స్టేట్మెంట్ greet అనే పేరుగల String వేరియబుల్ ను సృష్టిస్తుంది. |
03:31 | ఇప్పుడు సందేశాన్ని ప్రచురిద్దాం. |
03:33 | సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println గ్రీట్ |
03:44 | ఫైల్ ను సేవ్ చేసి రన్ చేయండి. |
03:51 | సందేశం వేరియబుల్ లో నిల్వచేయబడి ప్రచురించబడడం మనం చూడవచ్చు. |
03:57 | జావా లో స్ట్రింగ్స్ ని జోడించవచ్చు(కలపవచ్చు) కూడా. |
04:00 | అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. |
04:04 | నేను సందేశం లో Learner ను తొలగిస్తున్నాను. |
04:08 | మనం పేరుని వేరే వేరియబుల్ లో నిల్వ చేద్దాం. |
04:14 | String name ఈక్వల్ టూ Java. |
04:22 | ఇప్పుడు మనం స్ట్రింగ్స్ ను జోడించి సందేశం తయారు చేద్దాం. |
04:28 | String msg ఈక్వల్ టూ greet plus name; |
04:42 | ప్రింట్ స్టేట్మెంట్ (println(greet)) లోని greet ను message (println(msg)) గా మార్చి, ఫైల్ ను సేవ్ చేసి రన్ చేయండి. |
04:56 | ఔట్పుట్ గ్రీటింగ్ మరియు పేరు ను ప్రదర్శించడం చూడవచ్చు. |
05:00 | కానీ వాటి మధ్య ఖాళీ లేదు. |
05:02 | అందుకని, మనం space అనే క్యారెక్టర్ ను సృష్టిద్దాం. |
05:08 | char SPACE ఈక్వల్ టూ (space); |
05:17 | వేరియబుల్ పేరు స్పష్టంగా ఉండేందుకు, నేను అన్ని లెటర్స్ అప్పర్ కేస్ లోనే వాడాను. |
05:23 | మీరు మీకు నచ్చినట్టుగా మార్చుకోవచ్చు. |
05:26 | ఇప్పుడు సందేశానికి SPACE ని జోడిద్దాం. |
05:29 | greet plus SPACE plus name; |
05:36 | ఫైల్ ను సేవ్ చేసి రన్ చేయండి. |
05:40 | ఔట్పుట్ స్పష్టంగా మరియు మనం అనుకున్న విధంగా ఉండును. |
05:45 | ఇప్పుడు కొన్ని స్ట్రింగ్ ఆపరేషన్స్ చూద్దాం. |
05:50 | నేను Hello పదంలోని కొన్ని క్యారెక్టర్ లను మరియు java లోని వాటిని కూడా అప్పర్ కేస్ లోకి మారుస్తున్నాను. |
06:05 | తరచుగా, వినియోగదారులు ఇచ్చే ఇన్పుట్ లో విలువలు రెండు రకలూ కలిసి ఉంటాయి, |
06:11 | ఫైల్ ని రన్ చేసి ఔట్పుట్ చూద్దాం. |
06:18 | ఔట్పుట్ స్పష్టంగా లేదని చూడవచ్చు. |
06:22 | స్ట్రింగ్ మెథడ్స్ ఉపయోగించి ఔట్పుట్ ని స్పష్టంగా చేద్దాం. |
06:27 | greet equal to greet.toLowerCase(); అని టైప్ చేయండి. |
06:41 | ఈ స్టేట్మెంట్ స్ట్రింగ్ greet లోని ప్రతీ క్యారెక్టర్ ని లోవర్ కేస్ లోకి మారుస్తుంది. |
06:47 | nameఈక్వల్ టూ name.toUpperCase(); |
06:58 | ఈ స్టేట్మెంట్ స్ట్రింగ్ name లోని ప్రతీ క్యారెక్టర్ ని అప్పర్ కేస్ లోకి మారుస్తుంది. |
07:03 | ఫైల్ ని సేవ్ చేసి రన్ చేయండి. |
07:08 | స్ట్రింగ్ మెథడ్స్ ఉపయోగంతో ఔట్పుట్ స్పష్టంగా ఉండడం మనం చూడవచ్చు. |
07:13 | ఈ విధంగా మనం స్ట్రింగ్స్ ని సృష్టించి, స్ట్రింగ్ ఆపరేషన్స్ చేయవచ్చు. |
07:18 | స్ట్రింగ్ మెథడ్స్ ఇంకా చాలా రకాలు ఉన్నాయి. |
07:19 | మనం వాటిని ఇంకా సంక్లిష్ట అంశాలను గురించి చర్చించి నప్పుడు చూద్దాం. |
07:26 | దీనితో, ఈ టుటోరియల్ ముగింపుకు వచ్చాము. |
07:29 | ఈ టుటోరియల్ లో మనం నేర్చుకున్నవి, |
07:31 | స్ట్రింగ్స్ ని సృష్టించడం మరియు జోడించడం, |
07:33 | స్ట్రింగ్ ఆపరేషన్ లైన లోవర్ కేస్ మరియు అప్పర్ కేస్ కు మార్పిడి. |
07:39 | ఈ టుటోరియల్ సంబంధించిన,ఒక అసైన్మెంట్ |
07:41 | concat method గురించి చదివి, స్ట్రింగ్స్ జోడించడం మరియు contact మెథడ్ ల మధ్య తేడాలు కనుగొనుము. |
07:50 | స్పోకెన్ టుటోరియల్ ప్రాజెక్ట గురించి మరిన్ని వివరాలకోసం ఈ క్రింది లింక్ లో గల వీడియో చూడండి. |
07:55 | ఇది Spoken Tutorial ప్రాజెక్టు సారాంశం. |
07:58 | మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు. |
08:03 | స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్టు టీమ్: |
08:05 | స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్ నిర్వహిస్తుంది |
08:07 | ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికేట్ ఇస్తుంది.
మరిన్ని వివరాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ org |
08:17 | స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం. |
08:21 | దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది |
08:28 | మరిన్ని వివరాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ orgస్లాష్ NMEICT హైఫన్ఇంట్రో ను సంప్రదించండి |
08:33 | ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష మరియు స్వామి. పాల్గొన్నందుకు ధన్యవాదములు. |