LibreOffice-Suite-Impress/C4/Presentation-Notes/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 13:31, 19 April 2017 by Simhadriudaya (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:00 LibreOffice Impress లో Presentation Notes అను స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో, మనం Notes గురించి మరియు వాటిని ఎలా print చేయాలో నేర్చుకుంటాము.
00:12 Notes రెండు ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతాయి:
00:14 ప్రేక్షకుల కోసం, ప్రతీ slide పై అదనపు విషయం లేదా సూచనలుగాను.
00:20 ప్రేక్షకులకు స్లయిడ్లను ప్రదర్శిస్తున్నపుడు reference notes తో ప్రదర్శకుడికి సహాయం చేయటానికి.
00:27 ప్రదర్శన నమూనా Sample-Impress.odp ని తెరవండి.
00:33 Slides పేన్ నుండి ఎడమవైపు, Overview పేరుతో ఉన్న స్లయిడ్ ను ఎంచుకోండి.
00:38 టెక్స్ట్ ను ఇలా మార్చండి,
00:40 To achieve 30% shift to OpenSource software within 1 year.

(1 సంవత్సరం లోపల ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ 30% మార్పు సాధించడానికి.)

00:46 To achieve 95% shift to OpenSource Software within 5 years.

(5 సంవత్సరాల లోపల ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ 95%మార్పు సాధించడానికి.)

00:53 ఈ పేజీకి కొన్ని గమనికలను జోడించండం వలన అది ప్రింట్ అవుతున్నప్పుడు, పాఠకుడికి కొంత విషయసూచన వస్తుంది.
01:01 గమనికలను సవరించడానికి, Notes టాబ్ పై క్లిక్ చేయండి.
01:04 ఒక Notes టెక్స్ట్- బాక్స్ స్లయిడ్ క్రింద ప్రదర్శించబడుతుంది. ఇక్కడ, మనము గమనికలు టైప్ చేయవచ్చు.
01:12 Click to Add Notes పై క్లిక్ చేయండి.
01:15 మీరు ఈ బాక్స్ ను edit చేయవచ్చని గమనించండి.
01:19 ఈ టెక్స్ట్ -బాక్స్ లో, ఇలా టైప్ చేయండి,
01:22 Management would like to explore cost saving from shifting to Open Source Software.

(మేనేజిమెంట్ ఖర్చు ఆదా కొరకు, ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ కు మారడాన్ని ఇష్ట పడతారు.)

01:28 Open source software has now become a viable option to proprietary software.

(ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ప్రస్తుతం యాజమాన్య సాఫ్ట్వేర్ కు ఒక ఆచరణీయ ఎంపికగా మారింది.)

01:35 Open source software will free the company from arbitrary software updates of proprietary software.

ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ యాజమాన్య సాఫ్ట్వేర్ యొక్క ఏకపక్ష సాఫ్ట్వేర్ నవీకరణాలనుండి కంపెనీకి స్వేఛ్చ ఇస్తుంది.

01:46 మనము, మన మొదటి Note ను సృష్టించాము.
01:49 Notes లో టెక్స్ట్ ను ఎలా అమర్చాలో నేర్చుకుందాం.
01:54 టెక్స్ట్ ని ఎంచుకోండి.
01:56 Impress విండో పైన ఎడమవైపు మూలనుండి, Font Type డ్రాప్ -డౌన్ పై క్లిక్ చేసి TlwgMono ను ఎంచుకోండి.
02:05 తరువాత, Font size డ్రాప్ -డౌన్ లో, 18 ను ఎంచుకోండి.
02:10 అదే Taskbar నుండి, Bullet ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు టెక్స్ట్ bullet point లు కలిగిఉంటుంది.
02:18 ఇప్పుడు అన్ని నోట్స్ లను ఒక ప్రామాణిక ఫార్మాట్ లో అమర్చటానికి ఒక Notes Master ని ఎలా సృష్టించాలో నేర్చుకుందాం.
02:25 Main మెనూ నుండి, View క్లిక్ చేయండి, తరువాత Master పై క్లిక్ చేసి Notes Master క్లిక్ చేయండి.
02:33 Notes Master వ్యూ కనిపిస్తుంది.
02:36 రెండు స్లయిడ్లు ప్రదర్శించబడ్డాయి గమనించండి.
02:40 అంటే, ప్రతీ Master Slide కు presentation లో ఉపయోగించబడేందుకు ఒక Notes Master ఉంటుంది,
02:47 Notes Master slide ఒక టెంప్లేట్ లా ఉంటుంది.
02:51 ప్రెజెంటేషన్ లో ఏవయితే notes ఉపయోగించబడ్డాయో వాటన్నిటి ఫార్మాటింగ్ ప్రాధాన్యతలను మీరు ఇక్కడ సెట్ చేయవచ్చు.
02:58 Slides పేన్ నుండి, మొదటి స్లయిడ్ ను ఎంచుకోండి.
03:01 Notes ప్లేస్ హోల్డర్ పై క్లిక్ చేయండి, ఇంకా దానిపైన ప్రదర్శించబడిన టెక్స్ట్ ను ఎంచుకోండి.
03:08 Impress విండో పైన ఎడమవైపు మూల నుండి, Font Size డ్రాప్ -డౌన్ పై క్లిక్ చేసి, 32 ను ఎంచుకోండి.
03:16 Main menu నుండి, Format ఇంకా Character ను క్లిక్ చేయండి.
03:21 Character డైలాగ్ - బాక్స్ కనిపిస్తుంది.
03:24 Font Effects టాబ్ పై క్లిక్ చేయండి.
03:28 Font color డ్రాప్ -డౌన్ క్లిక్ చేయండి ఇంకా Red ను ఎంచుకుని OK క్లిక్ చేయండి.
03:35 నోట్స్ కు ఒక logo ను జోడిద్దాం.
03:38 ఒక త్రిభుజాన్ని జోడిద్దాం.
03:40 Drawing టూల్ బార్ నుండి, Basic Shapes పై క్లిక్ చేయండి ఇంకా Isosceles Triangle ను ఎంచుకోండి.
03:48 Notes టెక్స్ట్ -బాక్స్ కు పైన ఎడమవైపు మూలలో త్రిభుజాన్ని చేర్చండి
03:53 కాంటెక్స్ట్ మెనూ కొరకు త్రిభుజాన్ని ఎంచుకుని రైట్ -క్లిక్ చేయండి. Area క్లిక్ చేయండి.
03:59 Area డైలాగ్ -బాక్స్ కనిపిస్తుంది.
04:02 Area టాబ్ పై క్లిక్ చేయండి.
04:05 Fill డ్రాప్ -డౌన్ క్లిక్ చేసి Color క్లిక్ చేయండి. ఇప్పుడు, Blue 7 ను ఎండుచుకోండి.
04:12 ఈ ఫార్మాటింగ్ మరియు లోగో సృష్టించబడిన అన్నినోట్స్ కు అప్రమేయంగా ఉంటాయి.
04:18 OK క్లిక్ చేయండి.
04:20 Master View టూల్ బార్ లో, Close Master View క్లిక్ చేయండి.
04:25 మెయిన్ పేన్ లో, Notes టాబ్ క్లిక్ చేయండి.
04:29 ఎడమ వైపు ఉన్న Slides పేన్ నుండి, Overview పేరుతో ఉన్న స్లయిడ్ ను ఎంచుకోండి.
04:35 Notes, Master Notes లో సెట్ చేయబడిన విధంగా ఫార్మాట్ చేయబడ్డాయని గమనించండి.
04:42 ఇప్పుడు, Notes ప్లేస్ హోల్డర్ మరియు Slide ప్లేస్ హోల్డర్ ను ఎలా రీ-సైజ్ చేయాలో నేర్చుకుందాం.
04:48 Slide Placeholder ను ఎంచుకోండి, ఎడమ mouse button ను నొక్కిపట్టుకుని దాన్ని స్క్రీన్ పైభాగానికి కదిలించండి.
04:56 ఇది Notes ప్లేస్ హోల్డర్ ను రీ- సైజ్ చేయటానికి ఎక్కువ స్థలాన్ని సృష్టిస్తుంది.
05:02 ఇప్పుడు, Notes text ప్లేస్ హోల్డర్ యొక్క బోర్డర్ క్లిక్ చేయండి.
05:06 సైజ్ ను పెంచటానికి ఎడమ మౌస్ -బటన్ ను నొక్కిపట్టుకుని పైకి లాగండి.
05:13 ఇప్పుడు మనం ప్లేస్ హోల్డర్స్ ను మనకి కావాల్సినవిధంగా ఎలా రీ-సైజ్ చేయాలో నేర్చుకున్నాం.
05:18 ఇప్పుడు, notes ను ఎలా print చేయాలో చూద్దాం.
05:22 Main మెనూ నుండి, File క్లిక్ చేసి Print ను ఎంచుకోండి.
05:27 Print డైలాగ్ -బాక్స్ కనిపిస్తుంది.
05:30 ప్రింటర్స్ జాబితా నుండి, మీ సిస్టం కు కనెక్ట్ చేసియున్న ప్రింటర్ ను ఎంచుకోండి.
05:35 Number of Copies ఫీల్డ్ లో, 2 ని ఎంటర్ చేయండి.
05:40 Properties పై క్లిక్ చేయండి ఇంకా Orientation కింద, Landscape ఎంచుకోండి. OK క్లిక్ చేయండి.
05:48 Print కింద Document లో, డ్రాప్ -డౌన్ మెనూ నుండి Notes ను ఎంచుకోండి.
05:53 ఇప్పుడు, LibreOffice impress టాబ్ ఎంచుకోండి.
05:58 Contents కింద,
06:00 Slide Name బాక్స్ చెక్ చేయండి.
06:02 Date and Time బాక్స్ చెక్ చేయండి.
06:05 Original Color బాక్స్ చెక్ చేయండి.
06:08 Print క్లిక్ చేయండి.
06:11 మీ ప్రింటర్ సెట్టింగ్స్ సరిగ్గా కాన్ఫిగర్ అయ్యుంటే, స్లైడ్స్ యొక్క ప్రింటింగ్ ఇప్పుడు ప్రారంభం కావాలి.
06:18 ఇక్కడి తో మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
06:21 ఈ ట్యుటోరియల్ లో, మనం Notes గురించి ఇంకా వాటిని ఎలా ప్రింట్ చేయాలి అన్నది నేర్చుకున్నాం.
06:27 ఇక్కడ మీకోసం ఒక అసైన్మెంట్.
06:30 ఒక కొత్త ప్రెజెంటేషన( ప్రదర్శనను) తెరవండి.
06:32 నోట్స్ ప్లేస్ హోల్డర్ లోకంటెంట్స్ జోడించండి ఇంకా,
06:36 ఒక దీర్ఘ చతురస్రం జోడించండి.
06:38 కంటెంట్స్ యొక్క ఫాంట్ 36 ఇంకా దాని కలర్ బ్లూ గా ఉండేలా చూడండి.
06:44 దీర్ఘచతురస్రాన్ని గ్రీన్ లోకి మార్చండి.
06:48 Notes ప్లేస్ హోల్డర్ యొక్క సైజ్ ను స్లయిడ్ టెక్స్ట్ హోల్డర్ తో సరిపోల్చి సర్దుబాటు చేయండి.
06:54 నోట్స్ ని బ్లాక్ అండ్ వైట్ లో ఇంకా Portrait ఫార్మాట్ లో ప్రింట్ చేయండి.
06:59 మీకు నోట్స్ యొక్క ప్రింట్ 5 కాపీలు అవసరం.
07:03 ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది.
07:09 మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
07:13 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం,

స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.

07:22 మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి,

contact at spoken hyphen tutorial dot org.

07:28 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం. దీనికి నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది.
07:41 ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది,

spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.

07:51 ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయలక్ష్మి మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya