LibreOffice-Suite-Impress/C3/Custom-Animation/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 13:28, 19 April 2017 by Simhadriudaya (Talk | contribs)
Time | Narration |
00:00 | LibreOffice Impress లో Custom Animation ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో మనం, Impress లో Custom Animation గురించి నేర్చుకుంటాం. |
00:12 | ఇక్కడ, మనము ఉపయోగిస్తున్నది, Ubuntu Linux 10.04 మరియు LibreOffice Suite వర్షన్ 3.3.4. |
00:21 | ముందుగా, Sample-Impress.odp ప్రెజెంటేషన్ ను తెరవండి. |
00:26 | Slides పేన్ నుండి పొటన్షియల్ ఆల్టర్నేటివ్స్ thumbnail పై క్లిక్ చేయండి. |
00:32 | ఇప్పుడు ఈ స్లయిడ్ Main పేన్ పై ప్రదర్శించబడుతుంది. |
00:36 | మన presentation ను మరింత ఆకర్షణీయంగా చేయటానికి custom animation ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాం. |
00:43 | స్లయిడ్ లో ఎడమవైపు మొదటి టెక్స్ట్- బాక్స్నిఎంచుకోండి. |
00:47 | ఇది చేయటానికి, text పై క్లిక్ చేసి, ఆపై కనిపించే బోర్డర్ పై క్లిక్ చేయండి. |
00:54 | Impress విండో కుడి వైపు నుండి, Tasks పేన్ లో, Custom Animation పై క్లిక్ చేయండి. |
01:01 | Add పై క్లిక్ చేయండి. |
01:03 | Custom Animation డైలాగ్- బాక్స్ కనిపిస్తుంది. |
01:07 | Entrance టాబ్ తెరచి ఉందని గమనించండి. |
01:10 | Entrance టాబ్, స్క్రీన్ పై ఉన్న అంశం కనిపించే విధానాన్ని నియంత్రిస్తుంది. |
01:15 | మనం ఈ సిరీస్ లో తర్వాత వచ్చే ట్యుటోరియల్స్ లో ఇతర tabల గూర్చి నేర్చుకుంటాం. |
01:21 | Basic కింద, Diagonal Squaresను ఎంచుకోండి. |
01:25 | మీరు మీ యానిమేషన్ కనిపించే వేగాన్ని కూడా నియంత్రించవచ్చు. |
01:30 | Speed ఫీల్డ్ లో, డ్రాప్ -డౌన్ బాక్స్ పై క్లిక్ చేయండి, Slowను ఎంచుకుని OK క్లిక్ చేయండి. |
01:37 | Effect ఫీల్డ్ మీకు యానిమేషన్స్ ఎంపికలను అమర్చటానికి అనుమతిస్తుంది. |
01:43 | Effect ఫీల్డ్ కు దిగువన ఉన్న బాక్స్, ప్రెజెంటేషన్ కు జోడించిన యానిమేషన్స్ ను ప్రదర్శిస్తుంది. |
01:51 | మొదటి యానిమేషన్, యానిమేషన్ జాబితాలో చేర్చబడింది అని గమనించండి. |
01:56 | స్క్రోల్ చేసి Play పై క్లిక్ చేయండి |
02:00 | మీరు ఎంచుకున్న అన్ని యానిమేషన్ల preview, ఇప్పుడు మెయిన్ పేన్ పై ప్లే అవుతాయి. |
02:08 | ఇప్పుడు, స్లయిడ్ లో రెండవ టెక్స్ట్ బాక్స్ ఎంచుకోండి. Custom Animation కింద Add క్లిక్ చేయండి. |
02:18 | కనిపిస్తున్న Custom Animation డైలాగ్ -బాక్స్ లో, Basic Animation కింద Wedge ను ఎంచుకోండి. |
02:25 | వేగాన్ని Medium వద్ద సెట్ చేసి OK క్లిక్ చేయండి. |
02:31 | ఈ యానిమేషన్, boxకు జతచేయబడింది అని గమనించండి. |
02:36 | జాబితా లోని యానిమేషన్ లు మీరు ఏర్పాటు చేసిన క్రమంలో ఉన్నాయని గమనించండి. |
02:42 | రెండవ యానిమేషన్ ను ఎంచుకోండి. Play బటన్ పై క్లిక్ చేయండి. |
02:47 | మీరు preview కొరకు ఒకటి కంటే ఎక్కువ యానిమేషన్లను కూడా ఎంచుకోవచ్చు. |
02:51 | ఇది చేయటానికి, యానిమేషన్ ను ఎంచుకునే సమయంలో Shift కీ ని నొక్కి ఉంచండి. |
02:57 | Play క్లిక్ చేయండి. మీరు ఎంచుకున్న అన్ని యానిమేషన్ల ప్రివ్యూ చూపబడింది. |
03:05 | ఇప్పుడు మూడవ టెక్స్ట్- బాక్స్ ఎంచుకోండి. Layouts లో Add క్లిక్ చేయండి. |
03:10 | Entrance టాబ్ లో, Basic కింద, Diamond ఎంచుకోండి. |
03:17 | వేగాన్ని Slow వద్ద సెట్ చేసి. OK క్లిక్ చేయండి. |
03:22 | ప్రతీ యానిమేషన్ కొన్ని డీఫాల్ట్ లక్షణాలతో వస్తుంది |
03:26 | మీరు Change Order బటన్లను ఉపయోగించి యానిమేషన్ క్రమాన్ని మార్చవచ్చు. |
03:32 | ప్రతీ యానిమేషన్ కు ఉన్న డిఫాల్ట్ లక్షణాలు చూద్దాం మరియు వాటిని ఎలా సవరించాలో నేర్చుకుందాం. |
03:40 | జాబితాలో మొదటి యానిమేషన్ పై డబల్ క్లిక్ చేయండి. ఇది Diagonal Squares ఎంపిక. |
03:46 | Effects Options డైలాగ్ -బాక్స్ కనిపిస్తుంది. |
03:50 | అప్రమేయంగా, Effect టాబ్ ప్రదర్శించబడుతుంది. |
03:54 | Settings కింద, Direction డ్రాప్ -డౌన్ క్లిక్ చేయండి మరియు From right to top ను ఎంచుకోండి. |
04:01 | దీనిలో, యానిమేషన్ కుడి నుండి ప్రారంభమవటం మరియు కొనసాగేకొద్దీ పైకి కదలటం వంటి ఎఫెక్ట్ లను కలిగిఉంది. |
04:08 | డైలాగ్ -బాక్స్ ను మూసివేయటానికి OK క్లిక్ చేయండి. |
04:12 | మీరు జత చేసిన యానిమేషన్ ను చూచుటకు Play బటన్ పై క్లిక్ చేయండి. |
04:17 | మళ్ళీ ఈ యానిమేషన్ పై డబల్ క్లిక్ చేయండి. Effect Options డైలాగ్-బాక్స్ కనిపిస్తుంది. |
04:24 | Timing టాబ్ క్లిక్ చేయండి. |
04:26 | Delay ఫీల్డ్ లో, ఆలస్యాన్ని 1.0 sec కు పెంచండి. ఇది యానిమేషన్ ప్రారంభం ఒక క్షణం తర్వాత జరిగేలా ప్రభావం చూపుతుంది. OK క్లిక్ చేయండి. |
04:39 | ఇప్పుడు, మొదటి యానిమేషన్ ఎంచుకోండి. |
04:43 | Play బటన్ క్లిక్ చేయండి. |
04:45 | మీరు యానిమేషన్ లో చేసిన మార్పు ప్రభావం మీరు పరిశీలించగలరు. |
04:50 | జాబితాలో రెండవ యానిమేషన్ పై డబుల్ క్లిక్ చేయండి. ఇది మనం సర్దుబాటు చేసిన Wedges ఎంపిక. |
04:54 | Effects Options డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
05:02 | Text Animation టాబ్ క్లిక్ చేయండి. |
05:05 | టెక్స్ట్ ను యానిమేట్ చేయడానికి Text Animation టాబ్ వివిధ రకాల ఎంపికలు అందిస్తుంది. |
05:12 | Group text ఫీల్డ్ లో, By 1st level paragraphs ఎంచుకోండి. |
05:16 | ఈ ఎంపిక ప్రతి bullet point ను విడిగా ప్రదర్శిస్తుంది. |
05:20 | తరువాతి దానికి వెళ్ళే ముందు, మీరు ఒక అంశాన్ని పూర్తిగా చర్చించాలి అనుకుంటే మీరు ఈ ఎంపికను ఉపయోగించవచ్చు. |
05:28 | OK క్లిక్ చేయండి. |
05:29 | Play క్లిక్ చేయండి. |
05:32 | ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి, ఈ assignment ను చేయండి. |
05:36 | వివిధ యానిమేషన్లు సృష్టించండి, మరియు ప్రతి యానిమేషన్ కోసం Effect options ను చెక్ చేయండి. |
05:43 | ఇప్పుడు మనం చేసిన యానిమేషన్ ఎఫెక్ట్స్ ను చూడటం ఎలాగో నేర్చుకుందాం. |
05:48 | Slide Show బటన్ పై క్లిక్ చేయండి. తరువాత యానిమేషన్ ను చూడటానికి స్క్రీన్ పై ఎక్కడైనా క్లిక్ చేయండి. |
05:59 | ప్రదర్శన లోని మార్పును విచ్చిన్నం చేయటానికి యానిమేషన్ ఒక మంచి మార్గం, మరియు ఉదహరించడానికి కష్టమైన కొన్ని విషయాలను వర్ణించటానికి సహాయం చేస్తుంది. |
06:09 | అయితే, జాగ్రత్తగా ఉండండి ఇది అతిగా చేయవద్దు! |
06:13 | అతిగా చేసే యానిమేషన్ వల్ల అది ప్రేక్షకుల దృష్టిని చర్చిస్తున్న విషయం నుండి దూరంగా తీసుకెళ్తుంది. |
06:20 | ఇక్కడితో మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము. |
06:23 | ఈ ట్యుటోరియల్ లో, మనం Custom animation, Effect options గురించి నేర్చుకున్నాం. |
06:30 | ఇక్కడ మీకోసం ఒక అసైన్మెంట్. |
06:33 | మూడు bullet point లతో ఒక టెక్స్ట్- బాక్స్ ను సృష్టించండి. |
06:36 | టెక్స్ట్ ను యానిమేట్ చేయండి, ఆలా చేయటం వలన టెక్స్ట్ లైన్ తర్వాత లైన్ గా కనిపిస్తుంది. |
06:41 | ఈ యానిమేషన్ని Play చేయండి. |
06:44 | ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది. |
06:51 | మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. |
06:55 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం,
స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది. |
07:04 | మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి,
contact at spoken hyphen tutorial dot org. |
07:11 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం. దీనికి నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది. |
07:22 | ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది,
spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro. |
07:33 | ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయలక్ష్మి |
07.38 | మాతో చేరినందుకు ధన్యవాదములు. |