Git/C2/Merging-and-Deleting-branches/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time NARRATION
00:01 Merging and deleting branches పై spoken tutorial కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో, మనం 'Merging' గురించి,
00:10 'merging' తీసివేయుట , మరియు branches తొలగించడం గురించి నేర్చుకుంటాము.
00:14 ఈ ట్యుటోరియల్ కొరకు నేను 'Ubuntu Linux 14.04 ఉపయోగిస్తున్నాను.
00:20 అలాగే Git 2.3.2 ' మరియు gedit Text Editor.
00:26 మీరు మీకునచ్చిన ఏ editor ను అయినా ఉపయోగించవచ్చు.
00:29 ఈ ట్యుటోరియల్ని అనుసరించడానికి, మీకు 'Git 'commands మరియు 'Git లో branching గురించి చేయడం అవగాహన ఉండాలి.
00:37 లేకపోతే, సంబంధిత Linux ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
00:42 ముందు సిరీస్ లో మనం “branches” ను సృష్టించే విధానం నేర్చుకున్నాము.


00:47 ఇప్పుడు మనము రెండు "branches" ని ఎలా విలీనం చేయాలో నేర్చుకుందాం.
00:51

ఈ రేఖాచిత్రం "new-module" "branch" "master" branch తో ఎలా విలీనం అవుతుందో వివరిస్తుంది.

00:58 ఇది 'C9' commit లో జరుగుతుంది.
01:01 విలీనం తర్వాత' 'new-module' యొక్క commits master 'branch కు జోడించబడతాయి.
01:06 ఇది ఎలా పనిచేస్తుందో వివరిస్తాను.
01:09 మొదట, మనము ముందుగా సృష్టించిన 'Git repository mywebpage ను తెరుస్తాము.
01:16 'Terminal' తెరవడానికి 'Ctrl + Alt + T' కీస్  లను కలిపి  నొక్కండి.
01:20 మన 'Git repository' లోకి వెళ్లడానికి, 'cd space mywebpage' అని టైప్ చేసి   Enter  నొక్కండి.
01:29 నేను ప్రదర్శన కోసం html ఫైల్లను ఉపయోగించడం కొనసాగిస్తాను.
01:33 మీరు వేరే ఫైల్ టైప్ ని అయినా ఉపయోగించవచ్చు.
01:38 ఇక్కడ నుంచి, 'Terminal' పై ప్రతి 'command' ను టైప్ చేసిన తర్వాతEnter key ని నొక్కండి.
01:45 మనం "Git branch" లిస్ట్ ను "git space branch" టైప్ చేసి తనిఖీ చేద్దాం.


01:51

మనం “master” and new-chapter అను రెండు బ్రాంచెస్ ని చూడవచ్చు

01:57 'new-chapter' ' branch ఈ శ్రేణిలో ముందుగా సృష్టించబడింది మరియు' 'master' 'అనేది డిఫాల్ట్ branch.
02:05 ప్రస్తుతం, మనము 'master' 'శాఖలో ఉన్నాము.
02:08 మనం 'Git space log space hyphen hyphen oneline' టైప్ చేయడం ద్వారా 'Git log' ను తనిఖీ చేస్తాము.
02:17 'new-chapter' 'branch కు వెళ్లి,' Git log 'తనిఖీ చేద్దాం.
02:21 “git space checkout space new-chapter” అని టైప్ చేయండి.
02:27 “‘git space log space hyphen hyphen oneline”’ అని టైప్ చేయండి.
02:33 ఇప్పుడు, మనము 'master' 'మరియు' 'new-chapter' branches యొక్క commits పోల్చుదాము.
02:38

ఈ నాలుగు “‘commits”’ రెండు branches కు ఉమ్మడి బ్రాంచెస్.

02:42 Added story.html in new-chapter branch అనేది new-chapter బ్రాంచ్ లోనిది.



02:48

మరియు "Added chapter two in history.html”, master బ్రాంచ్ లోనిది.

02:54 మెర్జింగ్ చేసిన తరువాత, “Added story.html in new-chapter branch” commit master branch" "లోనికి జోడించబడుతుంది.
03:02 ఇప్పుడు నేను “merge” ఎలా చేస్తారో వివరిస్తాను.
03:05 “git space merge space master” అని టైప్ చేయండి.
03:09 “Commit message” స్వీకరించడానికి "gedit" స్వయంచాలకంగా ఓపెన్ అవుతుంది
03:14 “gedit” ను “Git” యొక్క “core editor” గా ఆకృతీకరించామని గుర్తుకుతెచ్చుకొనండి.
03:20 మీరు మరొక 'editor' ను ఆకృతీకరించి ఉంటే ఆ ఎడిటర్ ఓపెన్ అవుతుంది.
03:26 మీరు '1.9' కంటే తక్కువ Git వెర్షన్ ను వాడుతుంటే, editor' ఓపెన్ అవకపోవచ్చు. 03:33 కాబట్టి, మీరు తదుపరి దశను వదిలి వేయవచ్చు .
03:36 నేను డిఫాల్ట్ "commit message" ని అలాగే ఉపయోగిస్తాను.



03:40

మీరు 'merging' కు సంబంధించిన ఏదైనా ఇతర సందేశమును ఇవ్వాలనుకుంటే, వాటిని ఇక్కడ టైప్ చేయండి.

03:46 ఇప్పుడు “editor” ని save చేసి close చేయండి. 03:50 'Git log' ని మళ్ళీ తనిఖీ చేద్దాము.
03:54 మీరు “Master” branch లో ని “commits”,new-chapter branch కి merge అయ్యిందని చూడవచ్చు.
04:00 మీరు 'merging' కి సంబంధించిన "commit” సందేశం కూడా చూడవచ్చు.'
04:04 తరువాత “‘master branch”’ కి వెళ్లి “‘commits”’తనిఖీ చేద్దాము.
04:09
04:14 'Git log' ను తనిఖీ చేద్దాం.
04:17 ఇక్కడ “new-chapter commits” తో పాటు “master branch commits” ని చూస్తాము.
04:22 కానీ, 'Git log' 'master branch commits' 'మాత్రమే చూపిస్తుంది .
04:27 నిజంగా చెప్పాలంటే , 'master' 'branch కు ' 'new-chapter' branch ను merge చేయాలి.
04:32 కానీ మనం మరొక విధంగా merge చేసాం.
04:36 అందువల్ల మనము Master”’ branch లో ' merging commit" ని చూడలేము.
04:41 ఈ “‘merging’ ని తిరిగి ఎలా తీసివేయగలము?
04:45 దీని కోసం, 'new-chapter' 'బ్రాంచికి తిరిగి వెళ్లాలి.
04:50 git space checkout space new-chapterఅని టైప్ చేయండి.
04:54 git space reset space hyphen hyphen hard space HEAD tilde టైప్ చేసి “merge” చేసినవి  ని తిరిగి పొందవచ్చు
05:04 లేటెస్ట్ రివిషన్ ను "HEAD" గాను మరియు లేటెస్ట్ minus 1 రివిషన్ "HEAD tilde" గాను పిలుస్తామని గుర్తుకు తెచుకొనండి.
05:12 కాబట్టి, మనం ‘merging' యొక్క మునుపటి రివిషన్ పొందడానికి 'HEAD tilde' ని  ఉపయోగించాము.
05:18 మళ్ళీ ఒకసారి 'Git log' తనిఖీ చేద్దాం.
05:22 “merging” విస్మరించడం మనం చూడవచ్చు.


05:26 ఇప్పుడు మనము “‘new-chapter”’ branch ను “‘master” branch కు “merge” చేద్దాము .
05:31 మనము“‘git space checkout space master అని టైప్ చేసి మొదటి “‘master” branch కి వెళదాము.
05:38 మరల “‘Git log”’ ని తనిఖీ చేద్దాం.
05:42 “‘merge”’చేయడానికి git space merge space new-chapter అని టైప్ చేద్దాము.
05:48 'gedit' లో మీ 'merging commit message' ఇవ్వండి.
05:52 తరువాత ఎడిటర్ ని "save" చేసి "close" చేయండి.
05:55 మరల "'Git log"' ని తనిఖీ చేయండి
05:58 "master" బ్రాంచ్ తో “‘new-chapter”’ బ్రాంచ్ విజయవంతముగా merge అవ్వడం చూడవచ్చు
06:05 మళ్ళీ"merge" చేయడానికి ప్రయత్నించుదాం.
06:08 git space merge space new-chapterఅని టైప్ చేయండి
06:13 ఇప్పుడు, మనం "Already up-to-date" అనే సందేశాన్ని చూడవచ్చు .
06:17 Merge అయినది లేనిది ధృవీకరించడానికి ఇది మంచి మార్గం.
06:22 'merging తరువాత,' new-chapter 'శాఖను' Git repository” నుండి తొలగించవచ్చు.


06:28 git space branch space hyphen d space new-chapter టైప్ చేసి శాఖ ని తొలగించవచ్చు.
06:36 ఇప్పుడు ' 'git space branch' టైప్ చేసి 'branch list' ని తనిఖీ చేదాం
06:43 'new-chapter' బ్రాంచ్ ను తొలగించినందున మనం దానిని చూడలేము.
06:48 Merging చేయకుండా బ్రాంచ్ ని తొలగించేందుకు “hyphen d" చిన్న అక్షరాలకు బదులు "hyphen D" పెద్ద అక్షరాలలో ఉపయోగించాలి
06:56 దీనితో ట్యుటోరియల్ చివరికి వచ్చాము
07:00 ట్యుటోరియల్ సారాంశం.
07:02 ఈ ట్యుటోరియల్ లో, 'merging' , mergingతీసివేయటం మరియు branches 'తొలగించడం గురించి మనము తెలుసుకున్నాము.



07:09 ఒక అసైన్మెంట్ గా, మునుపటి కార్యక్రమంలో మనం సృష్టించిన branch chapter-two యొక్క 'commits”’ తనిఖీ చేయండి.
07:16 దానిని 'master branch' 'తో merge చేసి,' chapter -2 శాఖను తొలగించండి.
07:22 ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ గురించి తెలుపుతుంది.
07:27 దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
07:30 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.


07:38 మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి.
07:41 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
07:48 ఈ మిషన్ కి సంబంధించి మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది.
07:53 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం. మీకు ధన్యవాదాలు.


Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Pratik kamble, Yogananda.india