LibreOffice-Suite-Impress/C3/Slide-Creation/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00.00 | లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ లో స్లైడ్ క్రియేషన్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం |
00.06 | ఈ ట్యుటోరియల్ లో మనము వీటి గురించి నేర్చుకుంటాము: స్లైడ్ షోలు, స్లైడ్ ట్రాన్సిషన్లు, ఆటోమాటిక్ షోలు |
00.16 | ప్రేక్షకుల ముందు స్లైడ్లను ప్రదర్శించుటకు మీరు స్లైడ్ షోలను ఉపయోగిస్తారు. |
00.21 | స్లైడ్ షోలు డెస్క్ టాప్స్ లేదా ప్రొజెక్టర్ల పై చూపవచ్చు. |
00.25 | స్లైడ్ షోలు కంప్యూటర్ స్క్రీన్ పై ఉన్న మొత్తము స్థలము ఆక్రమిస్తాయి. |
00.30 | స్లైడ్ షో మోడ్ లో ఉన్నప్పుడు ప్రెసెంటేషన్లను ఎడిట్ చేయలేము. |
00.34 | స్లైడ్ షోలు డిస్ప్లే కోసం మాత్రమే. |
00.38 | Sample.Impress.odp. ప్రెసెంటేషన్ ను ఓపెన్ చేయండి. |
00.43 | ఈ ప్రెసెంటేషన్ ను మనము ఒక స్లైడ్ షో గా చూద్దాము. |
00.47 | మెయిన్ మెనూ లో, Slide Show పై క్లిక్ చేయండి మరియు ఆ తరువాత స్లైడ్ షో పై క్లిక్ చేయండి. |
00.53 | మరొక విధంగా, మీరు ఫంక్షన్ కీ F5 ఉపయోగించి స్లైడ్ షో ను ప్రారంభించవచ్చు. |
01.00 | ప్రెసెంటేషన్ ఒక స్లైడ్ షో గా డిస్ప్లే అవుతుంది. |
01.04 | మీ కీ బోర్డు పై ఉన్న యారో బటన్స్ ఉపయోగించి మీరు స్లైడ్స్ మధ్య కదలవచ్చు. |
01.10 | మరొక విధంగా, కాంటెక్స్ట్ మెనూ కొరకు మౌస్ రైట్ క్లిక్ చేయండి మరియు Next సెలెక్ట్ చేసుకోండి. |
01.16 | ఇది మిమ్మల్ని తరువాత స్లైడ్ కు తీసుకువెళ్తుంది. |
01.20 | స్లైడ్ షో నుండి బయటికి వచ్చుటకు, కాంటెక్స్ట్ మెనూ కొరకు మౌస్ రైట్ క్లిక్ చేయండి. ఇందులో End Show ఎంచుకోండి. |
01.28 | బయటికి రావటానికి మరొక విధానము Escape బటన్ ప్రెస్ చేయడము. |
01.33 | Mouse pointer as pen ఆప్షన్ ఉపయోగిస్తూ మీరు ప్రేక్షకులతో పరస్పర చర్య జరపవచ్చు. |
01.40 | ఈ ఆప్షన్ ను ఎనేబుల్ చేద్దాము మరియు అది ఎలా పనిచేస్తుందో చూద్దాము. |
01.45 | మెయిన్ మెనూ నుండి, Slide Show పై క్లిక్ చేయండి మరియు ఆ తరువాత Slide Show Settings పై క్లిక్ చేయండి. |
01.51 | Slide Show డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. |
01.54 | Options క్రింద, Mouse Pointer Visible మరియు Mouse Pointer as pen బాక్సేస్ ను చెక్ చేయండి |
02.02 | డైలాగ్ బాక్స్ క్లోస్ చేయుటకు OK క్లిక్ చేయండి. |
02.06 | మళ్ళీ, మెయిన్ మెనూ నుండి, Slide Show క్లిక్ చేయండి మరియు తరువాత Slide Show పై క్లిక్ చేయండి. |
02.13 | కర్సర్ ఇప్పుడు ఒక పెన్ లాగా మారిందని గమనించండి. |
02.17 | ఒక ప్రెసెంటేషన్ స్లైడ్ షో మోడ్ లో ఉన్నప్పుడు, ఈ ఆప్షన్ మీకు వ్రాయుటకు లేదా గీయుటకు అవకాశము ఇస్తుంది. |
02.24 | లెఫ్ట్ మౌస్ బటన్ ప్రెస్ చేసినప్పుడు, మీరు పెన్ తో స్కెచ్ చేయవచ్చు. |
02.29 | మొదటి పాయింట్ ముందు ఒక టిక్ గుర్తును గీద్దాము. |
02.34 | ఈ ట్యుటోరియల్ లో విరామము తీసుకోండి మరియు ఈ క్రింది అభ్యాసమును చేయండి. |
02.38 | ఒక ఇంప్రెస్ స్లైడ్ పై ఒక చిన్న బొమ్మను గీయుటకు స్కెచ్ పెన్ ఉపయోగించండి. |
02.47 | ఇప్పుడు మౌస్ బటన్ పై లెఫ్ట్-క్లిక్ చేయండి. తరువాతి స్లైడ్ డిస్ప్లే అవుతుంది. |
02.52 | Space bar ప్రెస్ చేసినప్పుడు కూడా మీరు తరువాతి స్లైడ్ కు వెళ్ళవచ్చు. |
02.57 | ఇప్పుడు మనము స్లైడ్ షో నుండి బయటికి వద్దాము. కాంటెక్స్ట్ మెనూ కొరకు రైట్ క్లిక్ చేయండి మరియు End Show పై క్లిక్ చేయండి. |
03.05 | తరువాత, మనము Slide Transitions గురించి నేర్చుకుందాము. |
03.09 | Slide Transitions అంటే ఏమిటి? |
03.12 | ఒక ప్రెసెంటేషన్ లో మనము ఒక స్లైడ్ నుండి మరొక దానికి కదలినప్పుడు లేదా ట్రాన్సిషన్ జరిగినప్పుడు స్లైడ్స్ పై కలిగే ప్రభావాలను ట్రాన్సిషన్స్ అంటారు. |
03.22 | Main పేన్ నుండి, Slide Sorter ట్యాబ్ పై క్లిక్ చేయండి. |
03.26 | ప్రెసెంటేషన్ లోని అన్ని స్లైడ్లు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. |
03.31 | ఈ వ్యూలో మీరు ప్రెసెంటేషన్ లో స్లైడ్స్ యొక్క క్రమమును సులభంగా మార్చగలరు. |
03.37 | మనము స్లైడ్ 1 ని ఎంచుకుందాము. |
03.40 | ఇప్పుడు, లెఫ్ట్ మౌస్ బటన్ ప్రెస్ చేయండి. స్లైడ్స్ మూడు మరియు నాలుగు మధ్య స్లైడ్ ను డ్రాగ్ చేసి డ్రాప్ చేయండి. |
03.48 | స్లైడ్స్ రీ ఎరేంజ్ అవుతాయి. |
03.52 | ఈ చర్యను అన్ డూ చేయుటకు CTRL+Z కీలను ప్రెస్ చేయండి. |
03.57 | ఒకేసారి ఒక స్లైడ్ కు మీరు వేరువేరు ట్రాన్సిషన్లను చేర్చవచ్చు. |
04.02 | Slide Sorter వ్యూ నుండి, మొదటి స్లైడ్ ను సెలెక్ట్ చేసుకోండి. |
04.06 | ఇప్పుడు, Task పేన్ నుండి, Slide Transitions పై క్లిక్ చేయండి. |
04.13 | Apply to selected slides క్రింద, స్క్రోల్ చేయండి మరియు Wipe Up ను ఎంచుకోండి. |
04.19 | ట్రాన్సిషన్ ప్రభావము మెయిన్ పేన్ లో డిస్ప్లే అయిందని గమనించండి. |
04.24 | స్పీడ్ డ్రాప్ డౌన్ మెనూ నుండి ఆప్షన్లను ఎంచుకొని మీరు ట్రాన్సిషన్ స్పీడ్ ను కంట్రోల్ చేయవచ్చు. |
04.31 | Modify Transitions క్రింద, Speed డ్రాప్ డౌన్ బాక్స్ పై క్లిక్ చేయండి, Medium పై క్లిక్ చేయండి. |
04.39 | ఇప్పుడు, ట్రాన్సిషన్ లో ఒక దానిని ఏర్పాటు చేద్దాము. |
04.43 | Modify Transitions క్రింద, Sound డ్రాప్ డౌన్ బాక్స్ పై క్లిక్ చేయండి. బీం ను ఎంచుకోండి. |
04.52 | అలాగే, మనము రెండవ స్లైడ్ ను ఎంచుకుందాము. |
04.56 | Task పేన్ లో, Slide Transitions పై క్లిక్ చేయండి. |
05.00 | Apply to selected slides క్రింద, wheel clockwise, 4 spokes ను ఎంచుకోండి. |
05.08 | ఇప్పుడు Speed డ్రాప్ డౌన్ బాక్స్ పై క్లిక్ చేయండి. Medium ఎంచుకోండి. |
05.13 | తరువాత, Sound డ్రాప్ డౌన్ బాక్స్ పై క్లిక్ చేయండి. Applause ఎంచుకోండి. |
05.21 | ఇప్పుడు, మనము చేసిన ట్రాన్సిషన్ ఎఫెక్ట్ ను ప్రి వ్యూ చేద్దాము. |
05.25 | Play క్లిక్ చేయండి. |
05.28 | ఇప్పుడుమనము ఒక స్లైడ్ ట్రాన్సిషన్ ను ఎలా యానిమేట్ చేయాలి మరియు దానికి సౌండ్ ఎఫెక్ట్ ను ఎలా చేర్చాలి అని నేర్చుకున్నాము. |
05.35 | ఇప్పుడు మనము ఆటోమాటిక్ గా ముందుకు సాగే ఒక ప్రెసెంటేషన్ ను ఎలా సృష్టించాలో నేర్చుకుందాము. |
05.42 | Tasks పేన్ నుండి, Slide Transitions పై క్లిక్ చేయండి. |
05.46 | Transition రకము లో, Checkerboard Down సెలెక్ట్ చేసుకోండి. |
05.50 | Speed డ్రాప్-డౌన్ లో, Medium సెలెక్ట్ చేసుకోండి. |
05.55 | Sound డ్రాప్-డౌన్ నుండి, Gong సెలెక్ట్ చేసుకోండి. |
06.00 | Loop Until Next Sound చెక్ చేయండి. |
06.04 | రేడియో బటన్ Automatically After ను క్లిక్ చేయండి. |
06.09 | సమయాన్ని 1 sec అని సెలెక్ట్ చేయండి. |
06.14 | Apply to all Slides పై క్లిక్ చేయండి. |
06.18 | Apply to all Slides బటన్ పై క్లిక్ చేయడము వలన, అన్ని స్లైడ్స్ కు ఒకే ట్రాన్సిషన్ అప్ల్లై అవుతుందని గమనించండి. |
06.25 | ఈ విధంగా మనము ప్రతి ఒక్క స్లైడ్ కు ఒక్కొక్కటిగా ట్రాన్సిషన్లను చేర్చవలసిన పనిలేదు. |
06.31 | Main మెనూ నుండి, Slide Show పై క్లిక్ చేయండి మరియు తరువాత Slide Show సెలెక్ట్ చేసుకోండి. |
06.38 | స్లైడ్స్ ఆటోమాటిక్ గా ముందుకు సాగుతాయని గమనించండి. |
06.49 | ప్రెసెంటేషన్ నుండి బయటికి వచ్చుటకు మనము Escape కీ ను ప్రెస్ చేద్దాము. |
06.54 | ఇప్పుడు ప్రతి స్లైడ్ కొరకు డిస్ప్లే టైం వేరువేరుగా ఉంటూ ఆటోమాటిక్ గా ముందుకు సాగే ప్రెసెంటేషన్లను సృష్టించడము ఎలాగో నేర్చుకుందాము. |
07.03 | ప్రెసెంటేషన్ లో కొన్ని స్లైడ్స్ కంటెంట్ పెద్దవి లేదా మరింత క్లిష్టమైనవి అయినప్పుడు ఇది ఉపయోగకరముగా ఉంటుంది. |
07.13 | Main పేన్ నుండి, ముందుగా Slide Sorter Tab పై క్లిక్ చేయండి. |
07.18 | రెండవ స్లైడ్ ను సెలెక్ట్ చేసుకోండి. |
07.21 | Task పేన్ కు వెళ్ళండి. |
07.24 | Slide Transitions క్రింద, Advance slide ఆప్షన్ కు వెళ్ళండి. |
07.29 | Automatically after ఫీల్డ్ లో సమయాన్ని 2 సెకండ్స్ అని ఎంటర్ చేయండి. |
07.37 | Main పేన్ నుండి, మూడవ స్లైడ్ ను సెలెక్ట్ చేసుకోండి. |
07.42 | Task పేన్ కు వెళ్ళండి. |
7.44 | Slide Transitions క్రింద Advance slide ఆప్షన్ కు వెళ్ళండి. |
07.49 | Automatically after ఫీల్డ్ లో సమయాన్ని 3 సెకండ్స్ అని ఎంటర్ చేయండి. |
07.57 | ఇప్పుడు మనము నాల్గవ స్లైడ్ ను సెలెక్ట్ చేసుకుందాము మరియు మునుపటి స్లైడ్స్ కోసం అనుసరించిన విధానమునే పాటించుదాము. మరియు సమయాన్ని 4 సెకండ్స్ అని మార్చుదాము. |
08.08 | Main మెనూ నుండి, Slide Show పై క్లిక్ చేయండి మరియు ఆ తరువాత Slide Show పై క్లిక్ చేయండి. |
08.13 | ప్రతి ఒక్క స్లైడు వేరువేరు సమయానికి డిస్ప్లే అవుతుందని గమనించండి. |
08.19 | ప్రెసెంటేషన్ నుండి బయటికి రావటానికి Escape కీ ప్రెస్ చేయండి. |
08.24 | దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. ఈ ట్యుటోరియల్ లో మనము నేర్చుకున్నది: స్లైడ్ షో లు, స్లైడ్ ట్రాన్సిషన్ లు, ఆటోమాటిక్ షో |
08.37 | ఇక్కడ మీ కొరకు ఒక అభ్యాసము ఇవ్వబడింది. |
08.40 | ఒక కొత్త ప్రెసెంటేషన్ సృష్టించండి. |
08.42 | క్లాక్ వైస్ గా ఒక వీల్ ను చేర్చండి, |
08.46 | మీడియం స్పీడ్ వద్ద 2 స్పోక్ ట్రాన్సిషన్, 2వ మరియు 3వ స్లైడ్ల కొరకు, గాంగ్ సౌండ్ తో |
08.54 | ఒక ఆటోమాటిక్ షో ను సృష్టించండి. |
08.58 | ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశమును అందిస్తుంది. |
09.04 | ఒకవేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకుంటే, మీరు దానిని డౌన్ లోడ్ చేసుకొని చూడవచ్చు. |
09.09 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి సర్టిఫికేట్స్ ఇస్తుంది |
09.18 | మరిన్ని వివరముల కొరకు, దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి. |
09.25 | స్పొకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము. దీనికి ఐసీటీ, యం హెచ్ ఆర్ డీ, భారత ప్రభుత్వము వారిచే నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారము అందిస్తోంది . |
09.37 | ఈ మిషన్ గురించి మరింత సమాచారము spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro వద్ద అందుబాటులో ఉంది |
09.48 | ఈ ట్యుటోరియల్ దేశీ క్రూ సొల్యూషన్స్ ప్రై. లి. వారిచే అందించబడింది. పాల్గొన్నందుకు ధన్యవాదములు. |
ఈ స్క్రిప్ట్ ను అనువదించినవారు భరద్వాజ్ మరియు నిఖిల |