LibreOffice-Suite-Impress/C3/Custom-Animation/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 13:06, 29 March 2013 by Udaya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00.00 లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ లో Custom Animation పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతము.
00.07 ఈ ట్యుటోరియల్ లో మనము Custom Animation in Impress గురించి నేర్చుకుంటాము.
00.12 ఇక్కడ మనము Ubuntu Linux version 10.04 మరియు లిబ్రేఆఫీస్ సూట్ 3.3.4. ను వాడుతున్నాము.
00.21 ముందుగా, Sample-Impress.odp ప్రెసెంటేషన్ ను ఓపెన్ చేయండి.
00.26 మనము Slides పేన్ నుండి Potential Alternatives థంబ్ నెయిల్ పై క్లిక్ చేద్దాము.
00.32 ఇప్పుడు ఈ స్లైడ్ Main పేన్ పై కనిపిస్తుంది.
00.36 మన ప్రెసెంటేషన్ ను మరింత ఆకర్షణీయంగా చేయుటకు కస్టం యానిమేషన్ ను ఎలా ఉపయోగించాలో మనము నేర్చుకుందాము.
00.43 స్లైడ్ లో ఎడమ వైపున ఉన్న మొదటి టెక్స్ట్ బాక్స్ ను ఎంచుకోండి.
00.47 ఈ పని చేయుటకు, టెక్స్ట్ పై క్లిక్ చేయండి మరియు ఆ తరువాత కనిపించే బార్డర్ పై క్లిక్ చేయండి.
00.54 Impress విండో యొక్క కుడివైపు నుండి, Tasks పేన్ లో, Custom Animation పై క్లిక్ చేయండి.
01.01 Add పై క్లిక్ చేయండి.
01.03 Custom Animation డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
01.07 Entrance ట్యాబ్ ఓపెన్ గానే ఉందని గమనించండి.
01.10 Entrance ట్యాబ్ స్క్రీన్ పై ఐటం కనిపించే విధానమును కంట్రోల్ చేస్తుంది.
01.15 మిగతా ట్యాబ్స్ గురించి మనము ఈ సీరీస్ లోని తరువాతి ట్యుటోరియల్స్ లో నేర్చుకుందాము.
01.21 Basic క్రింద Diagonal Squares ఎంచుకోండి.
01.25 మీ యానిమేషన్ కనిపించే స్పీడ్ ను కూడా మీరు కంట్రోల్ చేయవచ్చు.
01.30 Speed field లో, డ్రాప్ డౌన్ బాక్స్ పై క్లిక్ చేయండి మరియు Slow ను ఎంచుకోండి మరియు OK క్లిక్ చేయండి.
01.37 మీరు యానిమేషన్స్ ఆప్షన్లను ఏర్పాటు చేసుకొనుటకు Effect ఫీల్డ్ అనుమతిస్తుంది.
01.43 ప్రెసెంటేషన్ కు చేర్చబడిన యానిమేషన్లను Effect ఫీల్డ్ కు దిగువన ఉన్న బాక్స్ డిస్ప్లే చేస్తుంది.
01.51 యానిమేషన్ ల జాబితాకు మొదటి యానిమేషన్ చేర్చబడిందని గమనించండి.
01.56 క్రిందికి స్క్రోల్ అవండి మరియు Play క్లిక్ చేయండి.
02.00 మీరు ఎంచుకున్న అన్ని యానిమేషన్ల ప్రివ్యూ ఇప్పుడు Main పేన్ పై ప్లే అవుతుంది. <<Pause>>
02.08 ఇప్పుడు, స్లైడ్ లో రెండవ టెక్స్ట్ బాక్స్ ను ఎంచుకోండి. కస్టం యానిమేషన్ క్రింద, Add క్లిక్ చేయండి.
02.18 కనిపించే Custom Animation డైలాగ్ బాక్స్ లో, Basic Animation క్రింద, Wedge ఎంచుకోండి.
02.25 స్పీడ్ ను Medium గా ఏర్పాటు చేయండి. OK క్లిక్ చేయండి.
02.31 యానిమేషన్ బాక్స్ లోకి చేర్చబడిందని గమనించండి.
02.36 జాబితాలో యానిమేషన్లు మీరు సృష్టించిన క్రమములోనే ఉన్నాయని గమనించండి.
02.42 రెండవ యానిమేషన్ ను ఎంచుకోండి. Play బటన్ పై క్లిక్ చేయండి. <<pause>>
02.47 ప్రి వ్యూ కోసం మీరు ఒకటి కంటే ఎక్కువ యానిమేషన్స్ ఎంచుకోవచ్చు.
02.51 ఇలా చేయుటకు, యానిమేషన్ ఎంచుకునేటప్పుడు Shift కీ ని పట్టుకోండి.
02.57 Play క్లిక్ చేయండి. మీరు ఎంచుకున్న అన్ని యానిమేషన్ల ప్రివ్యూ ప్లే చేయబడుతుంది. <<pause>>
03.05 ఇప్పుడు, మూడవ టెక్స్ట్ బాక్స్ ఎంచుకోండి. లే అవుట్లలో, Add క్లిక్ చేయండి.
03.10 Entrance ట్యాబ్ లో, Basic క్రింద, Diamond ఎంచుకోండి.
03.17 స్పీడ్ ను Slow కు ఏర్పాటు చేయండి. OK క్లిక్ చేయండి.
03.22 ప్రతి యానిమేషన్ కొన్ని డీఫాల్ట్ ధర్మాలతో వస్తుంది.
03.26 Change Order బటన్ లను ఉపయోగించి మీరు యానిమేషన్ యొక్క క్రమమును మార్చవచ్చు.
03.32 ప్రతి యానిమేషన్ యొక్క డీఫాల్ట్ ధర్మాలను చూద్దాము మరియు వాటిని మార్చడము ఎలాగో నేర్చుకుందాము.
03.40 జాబితాలో ఉన్న మొదటి యానిమేషన్ పై డబల్-క్లిక్ చేయండి. ఇది Diagonal Squares ఆప్షన్.
03.46 Effects ఆప్షన్స్ డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
03.50 డీఫాల్ట్ గా Effects ట్యాబ్ డిస్ప్లే చేయబడుతుంది.
03.54 Settings క్రింద, Direction డ్రాప్-డౌన్ పై క్లిక్ చేయండి మరియు కుడి నుండి పైకి ఎంచుకోండి.
04.01 దీనివలన యానిమేషన్ ముందుకు సాగినకొద్దీ అది కుడి నుండి మొదలుపెట్టి పైకి కదులుతుంది
04.08 డైలాగ్ బాక్స్ క్లోస్ చేయుటకు OK క్లిక్ చేయండి.
04.12 మీరు చేర్చిన యానిమేషన్ ను పరిశీలించుటకు Play బటన్ పై క్లిక్ చేయండి.
04.17 ఈ యానిమేషన్ పై తిరిగి డబల్-క్లిక్ చేయండి. Effect ఆప్షన్స్ డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
04.24 Timing ట్యాబ్ పై క్లిక్ చేయండి.
04.26 Delay ఫీల్డ్ లో, డిలే ను 1.0 సె. లకు పెంచండి. దీని వలన యానిమేషన్ ఒక క్షణము తరువాత మొదలవుతుంది. OK క్లిక్ చేయండి.
04.39 ఇప్పుడు మనము మొదటి యానిమేషన్ ను ఎంచుకుందాము.
04.43 Play బటన్ పై క్లిక్ చేయండి.
04.45 మీరు యానిమేషన్ పై చేసిన మార్పు ప్రభావమును గమనించవచ్చు.
04.50 జాబితాలో ఉన్న రెండవ యానిమేషన్ పై డబల్ క్లిక్ చేయండి. ఇది మనము ఏర్పాటు చేసిన Wedges ఆప్షన్.
04.54 Effects ఆప్షన్స్ డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
05.02 Text Animation ట్యాబ్ పై క్లిక్ చేయండి.
05.05 టెక్స్ట్ ను యానిమేట్ చేయుటకు Text Animation ట్యాబ్ వివిధ ఆప్షన్లను అందిస్తుంది.
05.12 Group text ఫీల్డ్ లో, 1st లెవెల్ పారాగ్రాఫ్స్ ద్వారా ఎంచుకోండి.
05.16 ఈ ఎంపిక ప్రతి బులెట్ పాయింట్ ను విడిగా డిస్ప్లే చేస్తుంది.
05.20 తరువాత దానికి వెళ్ళేముందు, మీరు ఒక పాయింట్ గురించి చర్చించాలని అనుకున్నప్పుడు మీరు ఈ ఆప్షన్ ను ఉపయోగించవచ్చు.
05.28 OK క్లిక్ చేయండి.
05.29 Play క్లిక్ చేయండి.
05.32 ఈ ట్యుటోరియల్ లో విరామము తీసుకోండి మరియు ఈ assignment చేయండి.
05.36 వేరువేరు యానిమేషన్స్ సృష్టించండి మరియు ప్రతి యానిమేషన్ కు Effect ఆప్షన్స్ చెక్ చేయండి.
05.43 ఇప్పుడు మనము చేసిన యానిమేషన్ ఎఫెక్ట్స్ ను చూడడము నేర్చుకుందాము.
05.48 Slide Show బటన్ పై క్లిక్ చేయండి. తరువాత స్క్రీన్ పై ఎక్కడైనా క్లిక్ చేసి యానిమేషన్ ను చూడండి.
05.59 ఒక ప్రదర్శన యొక్క ఏకరూపకతను పోగొట్టుటకు యానిమేషన్ ఒక మంచి మార్గము మరియు ఇది వేరే విధంగా వివరించుటకు కష్టంగా ఉన్న విషయాలను చిత్రముల ద్వారా చూపుటకు సహాయపడుతుంది.
06.09 అయినప్పటికీ, దానిని ఎక్కువగా చేయకుండా జాగ్రత్తగా ఉండండి!
06.13 ఎక్కువగా యానిమేషన్ చేయడము వలన మనము చర్చిస్తున్న విషయము నుండి ప్రేక్షకుల దృష్టి పక్కకు పోయే అవకాశము ఉంది.
06.20 దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
06.23 ఈ ట్యుటోరియల్ లో మనము Custom animation, Effect ఆప్షన్ గురించి నేర్చుకున్నాము.
06.30 ఇక్కడ మీ కొరకు ఒక అభ్యాసము ఇవ్వబడింది.
06.33 మూడు బులెట్ పాయింట్లతో ఒక టెక్స్ట్ బాక్స్ సృష్టించండి.
06.36 టెక్స్ట్ ఒకదాని తరువాత ఒకటిగా వరుసలో కనిపించే విధంగా టెక్స్ట్ ను యానిమేట్ చేయండి.
06.41 ఈ యానిమేషన్ ను ప్లే చేయండి.
06.44 ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశమును అందిస్తుంది.
06.51 ఒకవేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకుంటే, మీరు దానిని డౌన్ లోడ్ చేసుకొని చూడవచ్చు.
06.55 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి సర్టిఫికేట్స్ ఇస్తుంది
07.04 మరిన్ని వివరముల కొరకు, దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి.
07.11 స్పొకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము. దీనికి ఐసీటీ, యం హెచ్ ఆర్ డీ, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారము అందిస్తోంది.
07.22 ఈ మిషన్ గురించి మరింత సమాచారము spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro వద్ద అందుబాటులో ఉంది
07.33 ఈ ట్యుటోరియల్ దేశీ క్రూ సొల్యూషన్స్ ప్రై. లి. వారిచే అందించబడింది
07.38 పాల్గొన్నందుకు ధన్యవాదములు
ఈ స్క్రిప్ట్ ను అనువదించినవారు భరద్వాజ్ మరియు నిఖిల

Contributors and Content Editors

Madhurig, Pratik kamble, Simhadriudaya, Udaya